1, నవంబర్ 2026, ఆదివారం

సమస్య - 5638

2-11-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అర్థము లేనట్టివి గద యాంధ్రపదమ్ముల్”

(లేదా...)

“అర్థము లేనివౌ పదము లాంధ్రమునందున నుండెఁ బెక్కులై”

18 కామెంట్‌లు:

  1. (ఉత్పలమాల సమస్యా పాదము కందంలో)

    కం.
    కుమతీ! కావ్యములుచదివి
    సముచితముగపలుకవలెను సత్యమెఱిగి; *అ*
    *ర్థము లేనివౌ పదములాం*
    *ధ్రమునందున నుండెఁ* *బెక్కులై”** యననేలా?

    రిప్లయితొలగించండి
  2. వ్యర్థ ము గా పలికిన యెడ
    నర్థ ము లేనట్టివి గద :: యాంద్ర పదమ్ముల్
    సార్థ కమై వెలు గొందుచు
    వ్యర్థము లేనట్టి వగును వసుధను సుకవీ!

    రిప్లయితొలగించండి

  3. వ్యర్థముగ వచింపడు గూ
    డార్థము లండతని మాట లందున గాంచన్
    బార్థా! పరికింప నొకే
    యర్థము లేనట్టివి గద యాంధ్రపదమ్ముల్.


    వ్యర్థపు మాటలన్ బలుక డయ్యెను కాంచిన వాటి యందు గూ
    డార్థములుండు సత్యమిది, యాతడు పాటవ మున్న సూరి నా
    నార్థములెల్ల వాడి యతడద్భుత రీతి వచించెనే యొకే
    యర్థము లేనివౌ పదము లాంధ్రమునందున నుండెఁ బెక్కులై.

    రిప్లయితొలగించండి
  4. అర్థకరము కాకుండి ని
    రర్థకముగ వేరు భాషల దరచి చూడన్
    స్పర్ధపడుచుండి నొకటే
    యర్థము లేనట్టివి గద యాంధ్రపదమ్ముల్

    రిప్లయితొలగించండి
  5. వ్యర్థములౌ పల్కులును ని
    రర్థక మననొప్పు పదము లాంధ్రము నందా!
    సార్థక మైనట్టివి య
    న్యార్థము లేనట్టివి గద యాంధ్ర పదమ్ముల్

    స్వార్థము లేని సత్కవులు చక్కఁగ పల్కిరి దేశమందునన్
    సార్థకమైన భాషయనఁ జాను తెలుంగని కచ్చితంబుగా
    వ్యర్థము కాని పల్కులఁ బ్రవర్ధిలు భాషను గూర్చి తెల్పి ర
    న్యార్థము లేనివౌ పదము లాంధ్రమునందున నుండెఁ బెక్కులై

    రిప్లయితొలగించండి
  6. కం.
    స్పర్థాళువు లిట్లందురు
    "అర్థము లేనట్టివి గద యాంధ్రపదమ్ముల్"
    వ్యర్థఁపు బల్కులు చాలు ని
    రర్థకమగు వాదనలివి హానిని గూర్చున్

    ఉ.
    "అర్థము లేనివౌ పదములాంధ్రమునందున నుండెఁబెక్కులై"
    స్పర్థను బూని యిట్టులన బాడియె నేస్తమ యన్య దేశ్యముల్
    సార్థకమైనవే గలిసె నాంధ్రమునందు ననుక్రమమ్ముగన్
    వ్యర్థ పదంబు లెట్టులగు వ్యాపనమొందు పదంబులే కదా

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ సార్థకమొందె రమ్య పద సాగర మాంధ్రము నందు శ్రేష్ఠమై
    వ్యర్థమనంగఁ గాంచని యపార నిధానము నారయంగ నే
    కార్థము నొంది రాజిలఁగ నౌచితి తోడను మిక్కటమ్ము నే
    కార్థము లేనివౌ పదము లాంధ్రమునందున నుండెఁ బెక్కులై

    (తెలుగులో ఒక పదానికి ఒకే అర్థము అలాగే ఏకార్థము కాకుండా ఒకటికి మించిన అర్థములు ఉన్న పదములు కలవని అండి)

    రిప్లయితొలగించండి
  8. అర్థి ఘటిల్లగా ధనమునందు తెలుంగును వీడి పోవుచున్
    స్వార్థము తోడ నేర్చుకొని యాంగ్లము, చేరి పరాయి దేశమున్
    వ్యర్థపు వాదనల్ సలుపు బాలిశులే వచియింతు రివ్విధిన్
    ‘అర్థము లేనివౌ పదము లాంధ్రమునందున నుండెఁ బెక్కులై’

    రిప్లయితొలగించండి
  9. అర్థానర్థ వివేక స
    మర్థములు గభీరము లసమానమ్ములు కృ
    త్స్నార్థ సమున్నతములు వ్యం
    గ్యార్థము లేనట్టివి గద యాంధ్ర పదమ్ముల్


    స్వార్థము తోఁచు చున్న దిట వ్యర్థ గిరా నిచయమ్ము సంత తా
    నర్థ చయప్రదం బగు నయాచిత వార్తలు దుఃఖ దాయముల్
    వ్యర్థ వివాద భాషణము లౌ నివి జ్ఞాన విహీను లందు రి
    ట్లర్థము లేనివౌ పదము లాంధ్రము నందున నుండెఁ బెక్కులై

    రిప్లయితొలగించండి
  10. వ్యర్థపు మాటలాడెదరు ప్రజ్ఞ ర
    సజ్ఞత లేనివారు శ
    భ్దార్థపులోతులన్ గనని వారలు
    బల్కుచు నుందురిట్టులన్
    "అర్థములేనివౌ పదము లాంధ్రము
    నందున నుండె బెక్కులై"
    అర్థము భావముప్పతిల నద్భుత
    మైవెలుగొందు నాంధ్రమున్.

    రిప్లయితొలగించండి
  11. కందం
    సార్థకమాయెను గదె ది
    వ్యార్థములందన్నమయ్య! పదకవిత విశా
    లార్థములఁ బొదిగి, కన శూ
    న్యార్థము లేనట్టివి గద యాంధ్రపదమ్ముల్!


    ఉత్పలమాల
    సార్థకమయ్యె నన్నమయ చాలఁగఁ గూర్చిన భావమూల ది
    వ్యార్థసమంచితంపు పదబంధములన్ హరి గొల్వఁగన్! విశా
    లార్థములెన్నియో బొదిగి నచ్యుత కీర్తనలందఁజేయ శూ
    న్యార్థము లేనివౌ పదము లాంధ్రమునందున నుండెఁ బెక్కులై!

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వ్యర్థపు మాటలు పలుక న
    నర్థములున్ జరుగునందు రార్యులు మహిలో
    సార్థక మైనట్టివి కుటి
    లార్థము లేనట్టివి గద యాంధ్ర పదమ్ముల్.

    రిప్లయితొలగించండి
  13. సార్థకమగుపదములతో
    పార్థులచరితముతెలుగున వ్రాసిరి కవులున్
    సార్థకమగునటు లేకుటి
    లార్థము లేనట్టివి గద యాంధ్ర పదమ్ముల్

    రిప్లయితొలగించండి