కోమలి వాయు పుత్రునట కోరిన కోరిక తీర్చె నెట్లనన్ రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్ భామను రాము జేర్చుటది పాడి యటంచు వచించి నట్టి యా రాముని వైరి సోదరుడు రాక్షసు డైన విభీషణుండె గా
ఘస్రము దినము (రామాయణములో ప్రక్షిప్తాలెక్కువ కదండి. పంప రామాయణము లాంటి వాటిలో చాలా వ్యత్యాసములు కూడా ఉన్నాయి. అలాగే ఒక చోట విభీషణుని రాజు చేసి వెను దిరిగే వరకు తానే రాజైనాడని అండి)
కం:ఏమిది! నిమ్నకులజుడౌ రాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదా! యీ మా బొబ్బర్లంకకు రామా! సర్పంచి జేసె రాజ్య మితనినిన్!
(బొబ్బర్లంక, నాగాయ లంక ఇలా కృష్ణాతీరం లో కొన్ని లంక గ్రామా లున్నాయి.రిజర్వేషన్ లో రాము డనే ఒక నిమ్నకులస్తుడు బొబ్బర్లంక కి సర్పంచి అయ్యాడు.దానికి కొందరి బాధ.)
కందం
రిప్లయితొలగించండినీమము దప్ప దశాస్యుడు,
'సేమమునెంచి విభీషణుండు చేర',సమరమునన్
భీమ బలమ్మున దునుమన్
రాముఁడు, 'లంకానగరికి రాజయ్యెఁ గదా!'
ఉత్పలమాల
నీమమునొప్ప జానకిని నీరజనేత్రునకందఁ జేసినన్
సేమమనన్ విభీషణునిఁ జేయగ నిందను,జేరవచ్చినన్
సౌమనసమ్మునందభయశాలిగఁ గూరిమి నప్పగించగన్
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
Nice sir!
తొలగించండి
రిప్లయితొలగించండిభూమిజ విముక్తికి వెడలె
రాముఁడు లంకానగరికి ; రాజయ్యెఁ గదా
యా మండోదరి మరదియె ,
రాముడు నిష్ఠించినటుల లభ్యపు రీతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం:
రిప్లయితొలగించండినామమడచె దశకంఠుని
రాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదా
ధీమతి విభీషణుఁడు శ్రీ
రాముని యామంత్రణమున రాజ్యమునేలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాలిక.
రిప్లయితొలగించండిశ్రీమహిజాతనాథుడు వశీకృతచిత్తుడు లోకపాలుడున్
శ్యామలకోమలాంగుడు దయాగుణ శీలుడు ధర్మరూపుడున్
సోమహృదాంతరస్థితవిశుద్ధవినిర్మలవేదవేద్యుడున్
ధీమతిదుష్టభంజనుడు దిగ్విజయంబుగగెల్చెధాత్రినే
భూమినినేకఛత్రమున పుణ్యచరిత్రుడెనేలెనే పరం
ధాముడు రాక్షసోత్తముని ధన్యునిజేసెనదెట్టులన్న? శ్రీ
రాముడురావణుందునిమి రాజుగనయ్యెను స్వర్ణలంకకున్
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఏమరిచిన నిద్దురలో
రిప్లయితొలగించండిధీమంతుడు గోచరించె త్రిజటకు కలలో!
భీమరమందు విజయుడై
రాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదా
నీమములన్ గణింపుము ప్రణీతములైనవి ధర్మ సూత్రముల్
భీమర మందునెగ్గగనె వీరునిదౌనట శత్రు రాజ్యమే
ఏమఱు పాటునన్ ద్రిజట కీవిధి కల్గెను స్వప్నమేలనో
రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిరాముండాశ్రయ మిచ్చుచు
ప్రేమించిన వాడయిన విభీషణుడనిలో
నామమడంచగ రావణు
రాముఁడు, లంకానగరికి రాజయ్యెఁ గదా.
కోమలి వాయు పుత్రునట కోరిన కోరిక తీర్చె నెట్లనన్
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
భామను రాము జేర్చుటది పాడి యటంచు వచించి నట్టి యా
రాముని వైరి సోదరుడు రాక్షసు డైన విభీషణుండె గా
ఉ॥ ఏమని తెల్పఁగన్ వలయు నెన్నియొ రీతుల రామ గాథనున్
రిప్లయితొలగించండిబ్రేమగ వ్రాసి రెందరొ యభీష్టము మేరకుఁ గూర్చి వింతగన్
ధీమతి యొక్కఁడీవిధిగఁ దెల్లము చేసెను గొన్ని ఘస్రముల్
రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
ఘస్రము దినము
(రామాయణములో ప్రక్షిప్తాలెక్కువ కదండి. పంప రామాయణము లాంటి వాటిలో చాలా వ్యత్యాసములు కూడా ఉన్నాయి. అలాగే ఒక చోట విభీషణుని రాజు చేసి వెను దిరిగే వరకు తానే రాజైనాడని అండి)
రాముడు సీత జాడెరిఁగి లంకను డాసి జగమ్ము మెచ్చగా
రిప్లయితొలగించండిభామిని సీత శోకమును బాయగజేసె దురంబునందునన్
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్
ధీమతియౌ విభీషణుడు తీరుగ రాముని ప్రేరణమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం:ఏమిది! నిమ్నకులజుడౌ
రిప్లయితొలగించండిరాముఁడు లంకానగరికి రాజయ్యెఁ గదా!
యీ మా బొబ్బర్లంకకు
రామా! సర్పంచి జేసె రాజ్య మితనినిన్!
(బొబ్బర్లంక, నాగాయ లంక ఇలా కృష్ణాతీరం లో కొన్ని లంక గ్రామా లున్నాయి.రిజర్వేషన్ లో రాము డనే ఒక నిమ్నకులస్తుడు బొబ్బర్లంక కి సర్పంచి అయ్యాడు.దానికి కొందరి బాధ.)
ఉ:రాముని దిట్టి యుత్తముగ రావణు నెంచెడు నొక్క డిట్లనెన్
రిప్లయితొలగించండి"రాముడు శత్రువయ్యె మన ద్రావిడ జాతికి, సింహళమ్ము లో
రామున కే గుడుల్ వెలసె, రావణుకున్ గుడి కట్ట రేలనో!
రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్”
(రాముడు ఆర్యుడని, ద్రావిడు డైన రావణుణ్ని అన్యాయంగా చంపాడని అనే ద్రావిడవాది శ్రీలంకలో రాముడి గుడి ఏమిటి? ఇక్కడ రాముడే రాజయ్యాడు కదా! అని బాధ పడ్డాడు.)
పామరుడు కలగనియెను గద
రిప్లయితొలగించండిరాముడు రావణుని వధించి రమ్యము గాగన్
కామితు డై వెడలి యు నా
రాముడు లంకా నగరికి రాజ య్యె గదా!
భీమబలమ్మునన్ గపులు భీకరమౌ గతి చెంగలించుచున్
రిప్లయితొలగించండిభీమరమున్ బొనర్చగను, ఫేరవ సైన్యము పాఱుచుండగా
భూమిజ పక్షమౌ త్రిజట మోదముతోగనె నొక్క స్వప్నమున్
“ రాముఁడు రావణుం దునిమి రాజుగ నయ్యెను స్వర్ణలంకకున్”
క్షేమం బడర వివాసిత
రిప్లయితొలగించండిధాముండు విభీషణుండు ధర్మాత్ముం డా
రాముని దయతో లం కా
రాముఁడు లంకా నగరికి రాజయ్యెఁ గదా
[లంకా + ఆరాముఁడు = లం కారాముఁడు]
రాముని కార్య మవ్విధము రమ్య తరమ్ముగ సిద్ధి నంద భా
ర్యామణి బంధ మాఱఁగను హర్ష మెడందఁ జెలంగ సద్గుణ
స్తోముఁడు నా విభీషణుఁడు శూర వరేణ్యుఁడు, రాజ్య మీయఁగా
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణ లంకకున్
క్షేమముతో నయోధ్యకును జేరెను
రిప్లయితొలగించండికోమల సీతతోడ శ్రీ
"రాముడు రావణున్ దునిమి; రాజుగ
నయ్యెను స్వర్ణలంకకున్"
ఆ మహితాత్ముడున్ సుగుణు డైన
విభీషణు రాము మిత్రుడున్
ప్రేమముతోడ రాజ్యమును బెక్కురు
మెచ్చగ నేలెజక్కగాన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నామమడచె రావణునిన్
రాముడు;లంకానగరికి రాజయ్యెఁ గదా
ధీమతి విభీషణుడు, శ్రీ
రాముని గని సంతసింప రాక్షసులెల్లన్.
ధీమతితోకరుణించగ
రిప్లయితొలగించండిరాముడు, లంకానగరికి రాజయ్యెఁ గదా
సామమున విభూషణుడా
స్వామి కరుణ జూపనెల్ల సాధ్యంబయ్యెన్
డా బల్లూరి ఉమాదేవి
కామము తోహరించ నట కాంతను కోపము తోడ సాగుచున్
ధీమతితోడ దాటుచునుతేకువచూపుచు లంక చేరియా
*రాముడు రావణున్ దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణ లంకకున్*
నేమము తోడ పాలనము నిష్టగ జేయుచు వాసిగాంచెతా