8, నవంబర్ 2026, ఆదివారం

సమస్య - 5645

9-11-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భరతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా”

(లేదా...)

“భరతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్”

(ఉప్పలధడియం భరతశర్మ గారి అష్టావధానం సమస్య)

14 కామెంట్‌లు:

  1. ఆ రాముని యడవి కనుపు
    టెరిగి జనని యయిన కైక నేచిన కూడా ,
    సరికాదు యీ విధంబుగ
    భరతుఁడు దుష్టాత్ముఁ డనుట ! వాస్తవమె కదా

    రిప్లయితొలగించండి

  2. అరయగ పావలు విడి ప్రాం
    తరమున నడచుట యది కడు ధారుణ మని తా
    నెరిగియు వాగె లు గోరిన
    భరతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా.



    బురకడు కాదు వాడు కన మూర్ఖుడతండును కాదు కాదె ప్రాం
    తరమున యోగవాగుములు త్యాగము చేయుచు సంచరింప దె
    ప్పరమని యాక ళించియును పాదుక లిమ్మని కోరి నట్టి యా
    భరతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్.

    రిప్లయితొలగించండి

  3. అరయగ పావలు విడి ప్రాం
    తరమున నడచుట యది కడు ధారుణ మని తా
    నెరిగియు వాగె లు గోరిన
    భరతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా.



    బురకడు కాదు వాడు కన మూర్ఖుడతండును కాదు కాదె ప్రాం
    తరమున యోగవాగుములు త్యాగము చేయుచు సంచరింప దె
    ప్పరమని యాక ళించియును పాదుక లిమ్మని కోరి నట్టి యా
    భరతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్.

    రిప్లయితొలగించండి
  4. పరిపాలింపఁ బదవికై
    నిరతము తపియించి కడకు నెగ్గిన వాడౌ
    దురితంపుటార్జనారం
    భ రతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా

    [ ఎన్నికైన వెంటనే అక్రమార్జనే ధ్యేయంగా కలవాడి గురించి ]


    భరతుని పాలనమ్ము తమభాగ్యమటంచు జనుల్ వచింపనౌ
    సరియగు రీతి నేలుబడి సల్పక చెప్పుల నుంచె గద్దెపై
    మురియుచు కీర్తిఁ సౌఖ్యములు పొందక రెంటికి చెడ్డవానిగా
    భరతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్

    [ రెంటికి చెడ్డ రేవడు అనే నానుడి ననుసరించి ]

    రిప్లయితొలగించండి
  5. చం॥ హరి, పదినాల్గు వర్షములు నాజ్ఞను పాలనఁ జేసి బద్ధుఁడై
    తరుణము నందు వచ్చునని ధర్మము వీడక యన్న రాకకై
    నిరతము వేచి చూచెఁగద నిష్ఠగ మూర్ఖుఁడు పల్కెనో యిటుల్
    భరతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్

    (భరతుడు పాలించినది అన్న ఆజ్ఞను ఆ ఆజ్ఞతో రాజ్యాన్ని)

    రిప్లయితొలగించండి
  6. కం:సరసత జూపెడు భార్యను
    పరి పరి దూషణ నొనర్చు,పరనారులకై
    సిరు లిడు ,వేశ్యా కుచ కుం
    భరతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా”

    రిప్లయితొలగించండి
  7. భరతులు పెక్కురు గలరిల
    భరతుని పేరిట వెలసియు భారత మయ్యె న్
    తిరము గ పలుక గ మరి యే
    భరతుడు దుష్టా త్ము డ ను ట వాస్తవము కదా?

    రిప్లయితొలగించండి
  8. నిరతము ధనార్జనమునకు
    విరతిని గోరక తపించు పెఱవారల యె
    త్తరవుకు నోర్వని కడు లో
    భ రతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా

    రిప్లయితొలగించండి
  9. పరులకు మేలొనర్చ మది పల్లటమొందును స్వార్థచింతనా
    పరుఁడు నిరంతరమ్ము పెఱవారల యున్నతిఁగాంచి యేడ్చు తా
    విరతి నపేక్ష సేయ డతివేల ధనార్జనమందునన్ స్వలా
    భ రతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్

    రిప్లయితొలగించండి
  10. భరతుఁ డటు లేల సేయును
    మరులుకొని మనమ్ము నందు మాతవి యగు నా
    గిరలను నామోదించిన
    భరతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా


    నరులకు నెల్ల మే లగును నాశము కా నరి వర్గ మాత్మలోఁ
    బరఁగిన నందు నొక్కటియుఁ బన్నుగ శిక్షకు నర్హుఁ డౌను దో
    మరమునఁ గ్రోధ కామ మద మత్సర మోహ నిరంత రోగ్ర లో
    భ రతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్

    రిప్లయితొలగించండి
  11. పరధనమన్యాయముగా
    కరముగ నార్జించి తినక గట్టడిచేయున్
    నొరలకు దానమిడని లో
    భ రతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా

    రిప్లయితొలగించండి
  12. పరధనమన్యాయముగా
    కరముగ నార్జించి తినక గట్టడిచేయున్
    నొరలకు దానమిడని లో
    భ రతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నిరతము సంపాదనకై
    బరిలో నక్రమముగ గెలువగ నెన్నికలన్
    పరమ దరిద్రుడతడు లో
    భ..రతుడు దుష్టాత్ముడనుట వాస్తవమె కదా!

    రిప్లయితొలగించండి