(1)ఆ.వె: ప్రేమ లోన బడిన పిన్న వయస్సు లో ఫ్రియకు దలను వంచు ప్రియుడు సతము నాలు మగలు కాగ నా యిర్వు రయ్యారె! భర్త భార్యకుఁ దల వంచునెపుడు?
(2)ఉ:భర్తయె కాంత దాసుడయి భార్యకు లొంగుట లోకరీతి యౌ వర్తన మైన యౌను, పరిపాలన తో బ్రజ గాచ నున్న భూ భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో హర్తగ మారు నాత, డిక నంతిపురమ్ముల కుట్ర లెన్నియౌ!
(సామాన్య భర్తలు భార్యావిధేయు లవటం లోకరీతే కానీ రాజు భార్యావిధేయు డైతే ఆ రాజు హర్త అవుతాడు. అంతఃపురాలు కుట్ర రాజకీయాల తో నిండిపోతాయి.అంతఃపుర రాజకీయాలు చరిత్ర లో ఒక ముఖ్యాంశమే. )
ధనములేకనగలు తానమ్మినప్పుడు
రిప్లయితొలగించండికల్లలాడికన్నుగప్పినపుడు
పరులముందుయింటి పరువుబోయినపుడు
గౌరవమ్ముమంటగలసినపుడు
తగనిపనులుజేసి తానుపట్టుబడంగ
భర్త భార్యకుతలవంచునెపుడు
బాగుంది. కాని ఆటవెలదిని నాలుగు పాదాల్లోనే వ్రాయాలి.
తొలగించండిఇంటి సంగతులపయి తమిని జూపని
రిప్లయితొలగించండిభర్త , భార్యకుఁ దల వంచునెపుడు ,
జరుగు బాటు సలుపు జాణత సుంతయు
తనకు దెలియనట్టి తలమువలన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండితప్పు పనులఁ జేసి దారకున్ జిక్కియు
పాపభీతి మదిని బరితపించి
మేలుఁ గోరు నట్టి యాలు ముందరఁ గాక
భర్త భార్యకుఁ దల వంచునెపుడు?
ఉత్పలమాల
ఆర్తిని వీడకే వ్యసన మన్నది సల్పగ చిక్కి దారకున్
బూర్తిగ పాపభీతి మదిఁ బొంగగ నేరమునొప్పు జీవుఁడై
స్ఫూర్తిని బంచెడున్ సతిగ బుద్ధిని నమ్మెడు వేళఁ గాక యే
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో?
ఆటవెలది
తొలగించండికడలిఁ బుట్టి విషము కల్లోలమొందించ
నాదిదేవు నమ్మి యాలి కోర
స్వీకరించె! జగతి సేమమునకుఁ గాక
భర్త భార్యకుఁ దల వంచునెపుడు?
ఉత్పలమాల
ఆర్తిగ దేవ దానవులు నందగ నా సుధ పాలసంద్రమున్
స్ఫూర్తిగ జిల్కఁగన్ విషము బొంగగ, మేలని లోకరక్షకున్
గర్తగఁ జేసి శంకరుని గైకొన గౌరియె యొప్పుఁ గాక యే
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో?
మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపనిని చేయడతడు భార్యయే పిల్లల
రిప్లయితొలగించండిసాకు గష్టపడుచు సతము తానే
భార్య కష్టముపయి బ్రతుకెడు సోమరి
భర్త భార్యకుతలవంచునెపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితగని పనులు జేసి తంటాలు పెట్టుచు
రిప్లయితొలగించండిఛీ యనుచు జనతతి చీదరించ
విధియు లేక తాను వినయము నటియించి
భర్త భార్య కు తల వంచు నెపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(ఆటవెలది సమస్యాపాదము ద్విపదలో..)
రిప్లయితొలగించండిద్వి.
గుర్తింపతనదుష్టగోప్యవర్తనము
*భర్త భార్యకుతలవంచునెపుడు* ను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె.
రిప్లయితొలగించండిభర్తనన్న మిడిసిపాటు పోనాడడు
చిన్న చూపు మదిని చెలువలన్న
తప్పుఁ దెలియజెప్ప తన తీరు మారునా!
భర్త భార్యకుఁ దల వంచునెపుడు! !
ఉత్పలమాల:
వర్తనమందుపేక్ష పరివర్తన కానగరాదు సుంతయున్
భర్తలదే యఖర్వమను భ్రాంతి చెలంగి యహంకరించుటల్
ధూర్తుల తీరుతెన్నులివి దుస్సహమైనవి, మారి పోకడల్
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమాన వతుల కిల సమాన హక్కులనుచు
పోరు చేయు చున్న పొలతి పలికె
గర్వ మదియె యుడిగి కాంతా విధేయుడై
భర్త భార్యకుఁ దల వంచునెపుడు.
భర్తకు కట్టు బానిసలు భార్యలటంచు దలంచు టయ్యదే
తుర్తిగ నెంచు చుందురిల దుర్మతు లంచు పడంతి పల్కెనే
గర్తల కాధిపత్యమది కల్పము నందున వచ్చు టెప్పుడో
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమనసు విప్పిచెప్పి మగువ మదిని గెల్చి
రిప్లయితొలగించండితలను వంచి నిలుచు తలపులేల?
పొట్టిదైన సతిని ముద్దాడు సమయాన
భర్త భార్యకుఁ దల వంచునెపుడు!
ధూర్తులు దుష్టకర్మలకు దూరముగా చరియించు చుందురా
నర్తన శాలలో విటుడు నాశన మవ్వక హాయినుండునా
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో
పూర్తిగ నుగ్గడింపగల పుణ్యచరిత్రునిఁ జూడనైతినే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఆ॥ నగలు చీరలడిగి వగలు పోయినపుడుఁ
రిప్లయితొలగించండిగోప భరముచేతఁ గుమిలి నపుడు
దార సాయమడుగఁ దనకు తప్పనపుడు
భర్త భార్యకు తల వంచు నెపుడు
ఉ॥ భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో
పూర్తిగ నిద్ది హా తెలిసె భూరిగఁ గోర్కెల పద్దు విప్పగా
నార్తినిఁ బొంద ద్రవ్యమటు లందక నప్పుడుఁ గోప మొందుచున్
ధూర్తుఁడ వీవటంచు కడు దూషణఁ జేయుచు నుండ నప్పుడున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి(1)ఆ.వె: ప్రేమ లోన బడిన పిన్న వయస్సు లో
రిప్లయితొలగించండిఫ్రియకు దలను వంచు ప్రియుడు సతము
నాలు మగలు కాగ నా యిర్వు రయ్యారె!
భర్త భార్యకుఁ దల వంచునెపుడు?
(2)ఉ:భర్తయె కాంత దాసుడయి భార్యకు లొంగుట లోకరీతి యౌ
వర్తన మైన యౌను, పరిపాలన తో బ్రజ గాచ నున్న భూ
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో
హర్తగ మారు నాత, డిక నంతిపురమ్ముల కుట్ర లెన్నియౌ!
(సామాన్య భర్తలు భార్యావిధేయు లవటం లోకరీతే కానీ రాజు భార్యావిధేయు డైతే ఆ రాజు హర్త అవుతాడు. అంతఃపురాలు కుట్ర రాజకీయాల తో నిండిపోతాయి.అంతఃపుర రాజకీయాలు చరిత్ర లో ఒక ముఖ్యాంశమే. )
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికీర్తి ఘటిల్లజేయుచును క్లేశము నీయక నత్తమామకున్
రిప్లయితొలగించండికర్తగ సంసృతిన్ నడిపి కమ్మని భోజన మిచ్చి నిత్యమున్
వర్తనమందు మిన్నయయి భర్తకు గౌరవ మిచ్చుటెన్నడో?
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో?