29, సెప్టెంబర్ 2021, బుధవారం

సమస్య - 3857

30-9-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో”
(లేదా...)
“గణపతి కంటిమంటలకుఁ గాముఁడు బూడిద యయ్యె నయ్యయో”

42 కామెంట్‌లు:

  1. ఫణిభూషణు మతి మార్చగ
    గణమే దియువెంట రాక కాముండేతీ
    క్షణమౌ శరము విసర పశు
    గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో

    రిప్లయితొలగించండి
  2. కణదుజ్జ్వలకాంతులుగని
    నణగారెనుమన్మథుండునాగతివగతో
    వణకుచునుండగనాశివ
    గణపతినేత్రాగ్నిగాల్చెఁగామునినయ్యో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గని యణగారెను" అని ఉండాలి. దానివల్ల యతి తప్పుతుంది. ఆ పాదాన్ని సవరించండి.

      తొలగించండి
  3. సమస్య :
    గణపతి కంటి మంటలకు
    గాముడు బూడిద యయ్యె నయ్యయో

    ( చిలకమర్తి వారు అందించిన మూర్ఖుడు , ధూర్తుడు అయిన "గణపతి" కోపానికి “కాముడు " అనే విద్యార్థి గురియైనాడు. )

    చంపకమాల
    -------------

    అణకువ లేనివాడు ; తన
    కంతయు వచ్చను చచ్చుభావనే
    యణువణువందు నింపుకొని
    యాగ్రహధూర్తత మెల్గువాడునున్ ;
    దృణముగ నెంచి శిష్యులను
    దిక్కగ బ్రశ్నల వేయువాడు నౌ
    " గణపతి " కంటి మంటలకు
    గాముడు బూడిద యయ్యె నయ్యయో !!

    రిప్లయితొలగించండి
  4. అణచగ రాక్షస కృత్యము
    మునుకొని సురతతియు గోర పూల శరములన్
    వణకుచు గుప్పించ ప్రథమ
    గణపతి నేత్రాగ్ని గాల్చె గాముని నయ్యో !

    రిప్లయితొలగించండి

  5. ననవిలుతుడు విరి బాణము
    లను విసరగ వెట్టుకన్ను రట్టడి తోడన్
    మినుసిగ వేల్పు తెరవగనె
    గణపతి, నేత్రాగ్ని గాల్చెఁ గామునినయ్యో.

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనముగ నవరోధములను
    గణపతి నేత్రాగ్ని గాల్చె; గాముని నయ్యో
    త్రిణయనుడు కోప మొందుచు
    క్షణమున గాల్చెను తపమును క్షయమొనరించన్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    గుణవతి నపర్ణఁ గొను ప్రే
    రణకై సుమశరము వైచ రగులఁగ శివుడున్
    ప్రణవాత్ముని భూతాదుల
    గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో!

    చంపకమాల
    గుణవతి నయ్యపర్ణఁ గని గోపతి పెండిలి యాడఁజేయ ప్రే
    రణమన పుష్పబాణతతి లాఘవమొప్పగ వైచ నుగ్రుఁడై
    కణకణలాడుచున్ దెరువఁ గాల్చ త్రినేత్రుడు నీశు, భూతస
    ద్గణపతి కంటిమంటలకుఁ గాముఁడు బూడిద యయ్యె నయ్యయో!

    రిప్లయితొలగించండి
  8. ఫణిపతి భూషణుడాయెడ
    నణకువ సేవలను జేయు నగజాతగనన్
    వణకగ తనువెల్ల ప్రమథ
    గణపతి నేత్రాగ్నిగాల్చె గామునినయ్యో

    రిప్లయితొలగించండి
  9. రణముననిల్వగానచటిరాజులుశత్రులనేయుచుండగా
    కణకణమండెమానసముగాండివికచ్చటియోధులన్గనన్
    అణకువమీరిగోట్టెగదనాదరినుండినసైంధవున్వడిన్
    గణపతికంటిమంటలకుఁగాముడుబూడిదయయ్యెనయ్యయో

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గణములు గూర్చు సంకటపు కార్యములన్నియు నాహుతయ్యెనే
    గణపతి కంటి మంటలకు; గాముడు బూడిదయయ్యె నయ్యయో
    త్రిణయనుడెంచు ధ్యానమును త్రెంచి ప్రతుష్టిని జెందు చుండగా
    కినుక వహించి శంకరుడు కేరుచు నాగ్రహమొంది జూచి నంతటన్.

    రిప్లయితొలగించండి
  11. తునుమగ తారకాసురుని ధూర్జటి పుత్రుడవశ్యమంచు నా
    ననవిలు కానినంపగ ఘనాఘనునానతి తో శరమ్ములన్
    మినుసిగ వేల్పుపై విసర మేచక గ్రీవుడె యైన భూతస
    ద్గణయతి కంటిమంటలకుఁ గాముడు బూడిదయయ్యె నయ్యయో.

    రిప్లయితొలగించండి
  12. చం:

    చెణకులు పేల్చు మిత్రుడొక చిత్రము జెప్పెదనంచు నాత్రమున్
    గొణగొణ లాడ సాగెనట గుర్తుకు దెచ్చు కొనంగ వైనమున్
    కణతలు నొక్కి మొట్ట తల గట్టిగ బల్కెను తత్తఱింతగన్
    గణపతి కంటి మంటలకు గాముడు బూడిద నయ్యె నయ్యయో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. రణరణకుని సుమశరములు
    కనలించగ జేసెమూడు కన్నుల వేల్పున్
    ప్రణవము రూపైన ప్రమథ
    గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో

    రిప్లయితొలగించండి
  14. ఫణిభూషణుండు రక్షా
    గుణసంపన్నుడగు శివుడు క్రోధాకృతుడౌ
    క్షణకాలమందున ప్రమథ
    గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో

    రిప్లయితొలగించండి
  15. ప్రణయిని విరహమున సలుపు
    ఘనమౌ ధ్యానమును మాన్ప ఖచరులు. పంపన్
    మనసిజుడు పూనగ బ్రమథ
    గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో

    రిప్లయితొలగించండి
  16. ఫణిగిరి వాసుని దపమును
    నణువణువును భగ్నపఱచ యాగ్రహమొందన్
    వణకుచు నుండగ నాశివ
    గణపతి నేత్రాగ్ని గాల్చె గాముని నయ్యో

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. గుణమున్ సంధించి యమర
      గణార్థము సుమాస్త్ర మేయఁ గాముఁ డకట కా
      రణ కారణమ్ము ప్రమథుల
      గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో


      గణిత తపో నిరంతర వికాసు నుమా విర హాగ్ని తప్త ని
      ర్గుణ సగుణాత్మ చిన్మయుని రుద్ర గ ణాద్యుని నుల్లసత్ఫణా
      ఫణి వర హార సల్లస దపాంగుని, పుట్టక మున్న యమ్మహా
      గణపతి, కంటిమంటలకుఁ గాముఁడు బూడిద యయ్యె నయ్యయో

      తొలగించండి
  18. ఘనమగు మంచుకొండఁ గరకంఠుడు గాఢ తపమ్మునుండగా
    నణకువ తోడ సేవ లచలాత్మజ చేయగ ప్రీతి తోడ ప్రే
    రణనిడి మానసమ్మును మరల్చ శరమ్ముల వేసి యస్రపా
    గణపతి కంటిమంటలకుఁ గాముఁడు బూడిద యయ్యె నయ్యయో

    రిప్లయితొలగించండి
  19. తొణకక వాకిటన్ నిలుప ద్రుంచె శిరంబు గజాస్యుఁడాయెనా
    గణపతి; కంటిమంటలకుఁ గాముఁడు బూడిద యయ్యె నయ్యయో;
    వణఁకుచు గూలె రావణుఁడు పర్వతమెత్తుచు పాద ఘట్టనన్;
    మణఁగునహంబవిద్య మటుమాయమొనర్చు మహేశుఁడుగ్రతన్

    రిప్లయితొలగించండి
  20. ఫణులవి మేననుండగను బట్టున యోగపు ముద్రనుండగా
    బ్రణతుడు నాశశాంకుని భగ్నము జేయగ నంతభూతస
    ద్గణపతి కంటిమంటలకు గాముడు బూడిదయయ్యె నయ్యయో
    యణకువ తోడనుండిన నయాచిత సంపదలెన్నియోయిడున్

    రిప్లయితొలగించండి