1-10-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వనమున సంతాన మందువాఁడె సుఖించున్”(లేదా...)“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”
ధనమెంత యున్న నేమిర?తనువున చేవయె యుడిగిన తరుణము నందున్ గనువారులేని తరి, యౌవనమున సంతానమందు వాడె సుఖించున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మనమున స్వఛ్చత గల్గియు జనహిత మగు కార్యములకు సహకారముతో ఘనుడై నుతు లందియు బా వనమున సంతానమందు వాడె సుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :వనమున సంతతిం బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్ ( యౌవనం లోనే సంతానం కలిగితే ఎన్ని ఉపయోగాలో ! )చంపకమాల ...................వనజదళాయతాక్షి యగు భార్యకు పెంచుట మోద మిచ్చెడున్ ;ఘనముగ విద్యలన్ మిగుల గణ్యుల జేయగవచ్చు శీఘ్రమే ;మనుమలతోడ నెంతయును మాలిమి మీర మెలంగ వచ్చు ; యౌ వనమున సంతతిం బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్ .
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధనమది యెంతయున్న పరితాపము నందిన వేళ ప్రేమతో ననునయ వాక్యముల్ పలుకెడాప్తులు చెంతన లేనిచో ప్రతాపనమను మాటసత్యమది, వాసుర మందున గాంచినంత యౌవనమున సంతతిన్ బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్.
కనగాసత్యంబైనదితనువునుతత్కాలమంచుతనియకమదిలోకనగనుసాధనపరమమువనమునసంతానమందువాడెసుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సాధనపరమము'?
పరమము-పరంధామముసాధన-సాధించుటపరంధామమునుసాధించుటకైవనముననివసించిసద్గతియనుసంతానమునుపోందవలెగదా
వినయవివేకసమపదలవిజ్ఞులునత్రిమహర్షిదంపతుల్అనయముదత్తుబోందిరటనాగతిరాగమువీడగామదిన్పనిగోనిపుణ్యభావనలఁబాయకభక్తినరణ్యమందునన్వనమునసంతిన్బడయువానికిగల్గునుసౌఖ్యముల్గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. టైపు దోషాలున్నవి. 'సమస్యలో 'వనమున' అని ఉన్నది కదా... మీరు 'అరణ్యమందునన్' అంటే పునరుక్తి కదా?
పనిగోనిపుణ్యభావనలఁబాయకభక్తిపరమాత్మన్గనన్
పాయకభక్తితదాత్మయందునన్
సంపదల
క్రొవ్విడి వెంకట రాజారావు: తనువును బిగువున నుంచుచు ననువగు నుత్తేజ మొసగి నడరి వెలుగుచున్ ననయము ఘనమై చను యౌ వనమున సంతానమందు వాడె సుఖించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. వాట్సపులో సవరణలు చూడండి.
తనువునొసంగిన పితరులఋణమును దీర్చుట యనునది రీతిగదెల్పన్మనమున ధార్మికమగు భావనమున సంతానమందు వాడె సుఖించున్ తనువు నొసంగినట్టి తనతాతలు తండ్రులు సద్గతుల్ గనన్ఋణమును దీర్చగాను తగురీతిని శాస్త్రవిధాన మెంచుచున్అనువగు పత్నితోడ మనమందున వంశము పెంపుజేయు భావనమున సంతతిం బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అనవిని "నిను జంపునతడుననుజకు కొమరునిగబుట్టు" నడలుచు చెఱలోనునుచిన, సతితో పరిదేవనమున సంతానమందు వాడె సుఖించున్
ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: తనువును బిగువున నుంచుచు ననువగు నుత్తేజ మొసగి నడరి వెలుగు తీ రనయము ఘనమై చను యౌ వనమున సంతానమందు వాడె సుఖించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "... మొసగి యడరి..." అనండి.
జి. ప్రభాకర శాస్త్రి గారి పూరణ.....దినమును రాత్రియున్ దవిలి దిక్కులు దోచక కానమ్మునన్ కనులను మూసి విప్పుచును గాభర నొందుచు కన్నె గాంచగన్ పనియును పాట వీడుచును ప్రక్కను జేరుచు కౌగిలించగన్ వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
శాస్త్రి గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మనలోకొందరు వ్యక్తులుమునుమున్ను వివాహమాడి బుట్టింతురు నందనులన్ యోచించగ యౌవనమున సంతాన మందువాఁడె సుఖించున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ధన మెంత కలిగిన , బతుకుకొన యందున సాయమిడగ కొమరుడయిననున్తనయయయిన గావలె , జీవనమున సంతాన మందువాఁడె సుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'బ్రతుకు' అనండి.
కని ప్రతిరూపములను, జీవనమున సంతాన మందువాఁడె సుఖించున్తన సంతు మేలు ముదిమినిజనులెవ్వరు రారు క్లేశ చయములు తీర్చన్
చం: అనుదిన మెల్ల వేళలను హాయిని గొల్పెడు పిల్ల గాలులున్మనసున నెమ్మదించు తమ మట్టుకు తా విహరింప వేడుకన్మనుగడ సాగ నెంచ నట మానుము మల్లెలు తొంగిలించనైవనమున సంతతిన్ బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
కందంమనువై దాల్చుచు గర్భమునినవంశోత్తమ తిలకుని నింపగు గాథల్విననొప్పు నాలి సహజీవనమున సంతాన మందువాఁడె సుఖించున్చంపకమాలమనువున నొద్దికౌ సతియె మానసవీణను మీటి గర్భమున్దనరుచు దాల్చి నిత్యమును తారకరాముని బాలకృష్ణులన్మనమున నింపు గాథలను మైమరువన్ దగ నాలకించు జీవనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తనువున జవసత్వముడిగికనులకు పొరలడ్డుపడిన కాలమునందున్కనిఫలమేమి సుతుని జవ్వనమున సంతాన మందువాఁడె సుఖించున్
చంపకమాల: ఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పేర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్ పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయక స్వగృహత్తపో“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'స్వగృహ' అన్నపుడు స్వ లఘువే. అందువల్ల గణభంగం. సవరించండి.
ధన్యవాదమలార్యా 🙏.మీ సూచనననుసరించి సరిచేసిన. చంపకమాల:ఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పేర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయకయే గృహ త్తపో“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”--కటకం వేంకటరామశర్మ.
మునుముందటి తరుణంబునపొనరగ నెఱుఁగమి నెఱిఁగినపో పురుష ప్రయోజనమొనరగ కృతవిధి భావనమున సంతాన మందువాఁడె సుఖించున్ ( పొనరు: సంభవించు; ఎఱుఁగమి : తెలియమి/ అవిద్య; పురుష ప్రయోజనము : ధర్మ-అర్థ-కామ మోక్షములు)
మనువది యేల నాకను కుమారుని జేరుచు పల్కె తల్లియేకనుమిది బంధుజాలమిల కడ్పున బుట్టిన వారి సాటిరారనునుడి వాస్తవమ్మని మహాత్ములు నాడె వచించిరంట యౌవనమున సంతతిన్ బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్.
అనయము దేవదేవునికి నర్చనఁ జేయుచుఁ జిత్తశుద్ధితో,కనుగొని మంచివంగడపుఁ గాంత వివాహము నాడి యిచ్చతో,ధనమును కూడబెట్టుకొని, తద్దయు ప్రీతిఁ బవిత్రమైన జీవనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
అనువుగ ప్రేమతో మెలగు నంగననాలిగ సంగ్రహించి జీవనమున తల్లిదండ్రులకు భక్తి సమన్వితసేవ జేయుచున్ ఘనతర ధర్మకామ్యములఖండ గతిన్ చెలువొందునట్లు యౌవనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మన నిజ వంశోద్ధారకుఁగనుమయ, కైకొనుము నింకఁ గరుణావార్ధీ!ఘన యశమున్ బొందుము, జీవనమున సంతాన మందువాఁడె సుఖించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కైకొనుము+ఇంక = కైకొనుమింక' అవుతుంది. నుగాగమం రాదు.
వినుమీ సత్యము శశి!యౌవనమున సంతానమందువాడె సుఖించున్ గనుకనె తొందర పడుమనియనునయముగ జెప్పుచుంటి నర్ధంబౌగదె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు. నాల్గవ పాదం చివర గణభంగం. సవరించండి.
అనయము చావు పుట్టుకలు నాగకసాగెడు జీవయానమందొనరగ నుప్పతిల్లు గద తోరపు ప్రేమము ప్రాణ కోటికిన్కనుగొని యోగ్య కన్నియను సకాలమునందున పెండ్లి యాడి యౌవనమున సంతతింబడయు వానికిగల్గను సౌఖ్యముల్ గడున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. "యోగ్య కన్యను సకాలమునందున..." అనండి. లేకుంటే గణభంగం.
అనుకూల సుతులఁ బడయుట మనుజ పురాకృత సుకృత మమానుషమే సేకొని యాలిని స్వీయ సుకృత వనమున సంతాన మందు వాఁడె సుఖించున్ (వనము = సమూహము )ఘనముగ నేర్చి విద్యలను గార్య సమర్ధతఁ బొంది నైపుణమ్మును దగ వృద్ధి సేసికొని పొందఁగ వృత్తిని నాయ వంతుఁడై వనితకు నింక మర్త్యునకుఁ బన్నుగ ముప్పది లోపు నిండు యౌవనమున సంతతిం బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
వినుమిది నిక్కపుంబలుకు వీనులవిందగు సుమ్ము శర్మ!యౌవనమున సంతతింబడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్ గనుకనె వేగిరంబుగను గన్యను,సద్గుణశీలి,నమ్రతన్ జనునది గానిపించగను సంతసమొప్పగ బెండ్లియాడుమా
కందంధనముండిన సంతానమును నిదానముగ బడయంగ నోర్చ దగున్, కాదనిన, తెలివి గల్గిన యవ్వనమున సంతానమందు వాడె సుఖించున్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
ధన్యవాదాలు
అనువగు చోటు జీవులకు, హాయిగ వన్య మృగంబులన్నియున్మను తమదైన బాణిని సమాగమమౌచు తరించు స్వేచ్ఛగాకన పెను పన్ను భారములు కత్తెర కోతలు ఖర్చులేనిదౌవనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
జనకజ బాలలిర్వురకు జన్మమొసంగెనదెట్టి సీమయోవినుమిల దుర్గతుల్ దొలగి విస్తృతమౌ గన వంశమేరికిన్జనహిత కార్యముల్ నెరపు సత్పురుషుండు గడించునేమియోవనమున; సంతతిం బడయువానికిఁ; గల్గును సౌఖ్యముల్ గడున్
రిప్లయితొలగించండిధనమెంత యున్న నేమిర?
తనువున చేవయె యుడిగిన తరుణము నందున్
గనువారులేని తరి, యౌ
వనమున సంతానమందు వాడె సుఖించున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమనమున స్వఛ్చత గల్గియు
రిప్లయితొలగించండిజనహిత మగు కార్యములకు సహకారముతో
ఘనుడై నుతు లందియు బా
వనమున సంతానమందు వాడె సుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండివనమున సంతతిం బడయు
వానికి గల్గును సౌఖ్యముల్ గడున్
( యౌవనం లోనే సంతానం కలిగితే ఎన్ని
ఉపయోగాలో ! )
చంపకమాల
...................
వనజదళాయతాక్షి యగు
భార్యకు పెంచుట మోద మిచ్చెడున్ ;
ఘనముగ విద్యలన్ మిగుల
గణ్యుల జేయగవచ్చు శీఘ్రమే ;
మనుమలతోడ నెంతయును
మాలిమి మీర మెలంగ వచ్చు ; యౌ
వనమున సంతతిం బడయు
వానికి గల్గును సౌఖ్యముల్ గడున్ .
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధనమది యెంతయున్న పరితాపము నందిన వేళ ప్రేమతో
ననునయ వాక్యముల్ పలుకెడాప్తులు చెంతన లేనిచో ప్రతా
పనమను మాటసత్యమది, వాసుర మందున గాంచినంత యౌ
వనమున సంతతిన్ బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికనగాసత్యంబైనది
రిప్లయితొలగించండితనువునుతత్కాలమంచుతనియకమదిలో
కనగనుసాధనపరమము
వనమునసంతానమందువాడెసుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సాధనపరమము'?
పరమము-పరంధామము
తొలగించండిసాధన-సాధించుట
పరంధామమునుసాధించుటకైవనముననివసించి
సద్గతియనుసంతానమునుపోందవలెగదా
వినయవివేకసమపదలవిజ్ఞులునత్రిమహర్షిదంపతుల్
రిప్లయితొలగించండిఅనయముదత్తుబోందిరటనాగతిరాగమువీడగామదిన్
పనిగోనిపుణ్యభావనలఁబాయకభక్తినరణ్యమందునన్
వనమునసంతిన్బడయువానికిగల్గునుసౌఖ్యముల్గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిటైపు దోషాలున్నవి. 'సమస్యలో 'వనమున' అని ఉన్నది కదా... మీరు 'అరణ్యమందునన్' అంటే పునరుక్తి కదా?
పనిగోనిపుణ్యభావనలఁబాయకభక్తిపరమాత్మన్గనన్
తొలగించండిపాయకభక్తితదాత్మయందునన్
తొలగించండిసంపదల
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితనువును బిగువున నుంచుచు
ననువగు నుత్తేజ మొసగి నడరి వెలుగుచున్
ననయము ఘనమై చను యౌ
వనమున సంతానమందు వాడె సుఖించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సపులో సవరణలు చూడండి.
తనువునొసంగిన పితరుల
రిప్లయితొలగించండిఋణమును దీర్చుట యనునది రీతిగదెల్పన్
మనమున ధార్మికమగు భా
వనమున సంతానమందు వాడె సుఖించున్
తనువు నొసంగినట్టి తనతాతలు తండ్రులు సద్గతుల్ గనన్
ఋణమును దీర్చగాను తగురీతిని శాస్త్రవిధాన మెంచుచున్
అనువగు పత్నితోడ మనమందున వంశము పెంపుజేయు భా
వనమున సంతతిం బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅనవిని "నిను జంపునతడు
తొలగించండిననుజకు కొమరునిగబుట్టు" నడలుచు చెఱలో
నునుచిన, సతితో పరిదే
వనమున సంతానమందు వాడె సుఖించున్
ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితనువును బిగువున నుంచుచు
ననువగు నుత్తేజ మొసగి నడరి వెలుగు తీ
రనయము ఘనమై చను యౌ
వనమున సంతానమందు వాడె సుఖించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... మొసగి యడరి..." అనండి.
జి. ప్రభాకర శాస్త్రి గారి పూరణ.....
రిప్లయితొలగించండిదినమును రాత్రియున్ దవిలి దిక్కులు దోచక కానమ్మునన్
కనులను మూసి విప్పుచును గాభర నొందుచు కన్నె గాంచగన్
పనియును పాట వీడుచును ప్రక్కను జేరుచు కౌగిలించగన్
వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
శాస్త్రి గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమనలోకొందరు వ్యక్తులు
రిప్లయితొలగించండిమునుమున్ను వివాహమాడి బుట్టింతురు నం
దనులన్ యోచించగ యౌ
వనమున సంతాన మందువాఁడె సుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధన మెంత కలిగిన , బతుకు
రిప్లయితొలగించండికొన యందున సాయమిడగ కొమరుడయిననున్
తనయయయిన గావలె , జీ
వనమున సంతాన మందువాఁడె సుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బ్రతుకు' అనండి.
కని ప్రతిరూపములను, జీ
రిప్లయితొలగించండివనమున సంతాన మందువాఁడె సుఖించున్
తన సంతు మేలు ముదిమిని
జనులెవ్వరు రారు క్లేశ చయములు తీర్చన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:
రిప్లయితొలగించండిఅనుదిన మెల్ల వేళలను హాయిని గొల్పెడు పిల్ల గాలులున్
మనసున నెమ్మదించు తమ మట్టుకు తా విహరింప వేడుకన్
మనుగడ సాగ నెంచ నట మానుము మల్లెలు తొంగిలించనై
వనమున సంతతిన్ బడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిమనువై దాల్చుచు గర్భము
నినవంశోత్తమ తిలకుని నింపగు గాథల్
విననొప్పు నాలి సహజీ
వనమున సంతాన మందువాఁడె సుఖించున్
చంపకమాల
మనువున నొద్దికౌ సతియె మానసవీణను మీటి గర్భమున్
దనరుచు దాల్చి నిత్యమును తారకరాముని బాలకృష్ణులన్
మనమున నింపు గాథలను మైమరువన్ దగ నాలకించు జీ
వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితనువున జవసత్వముడిగి
రిప్లయితొలగించండికనులకు పొరలడ్డుపడిన కాలమునందున్
కనిఫలమేమి సుతుని జ
వ్వనమున సంతాన మందువాఁడె సుఖించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండిఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పే
ర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్
పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయక స్వగృహత్తపో
“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'స్వగృహ' అన్నపుడు స్వ లఘువే. అందువల్ల గణభంగం. సవరించండి.
ధన్యవాదమలార్యా 🙏.
తొలగించండిమీ సూచనననుసరించి సరిచేసిన.
చంపకమాల:
ఘనమగు భారతావనికి గౌరవమిచ్చు వ్యవస్థ లందు పే
ర్కొనదగు గొప్పనైన యను కూల వివాహము జీవితాంతమున్
పెనగొని వీడకుండు.సతి ప్రేమను బాయకయే గృహ త్తపో
“వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్”
--కటకం వేంకటరామశర్మ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమునుముందటి తరుణంబున
రిప్లయితొలగించండిపొనరగ నెఱుఁగమి నెఱిఁగినపో పురుష ప్రయో
జనమొనరగ కృతవిధి భా
వనమున సంతాన మందువాఁడె సుఖించున్
( పొనరు: సంభవించు; ఎఱుఁగమి : తెలియమి/ అవిద్య; పురుష ప్రయోజనము : ధర్మ-అర్థ-కామ మోక్షములు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనువది యేల నాకను కుమారుని జేరుచు పల్కె తల్లియే
రిప్లయితొలగించండికనుమిది బంధుజాలమిల కడ్పున బుట్టిన వారి సాటిరా
రనునుడి వాస్తవమ్మని మహాత్ములు నాడె వచించిరంట యౌ
వనమున సంతతిన్ బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనయము దేవదేవునికి నర్చనఁ జేయుచుఁ జిత్తశుద్ధితో,
రిప్లయితొలగించండికనుగొని మంచివంగడపుఁ గాంత వివాహము నాడి యిచ్చతో,
ధనమును కూడబెట్టుకొని, తద్దయు ప్రీతిఁ బవిత్రమైన జీ
వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనువుగ ప్రేమతో మెలగు నంగననాలిగ సంగ్రహించి జీ
రిప్లయితొలగించండివనమున తల్లిదండ్రులకు భక్తి సమన్వితసేవ జేయుచున్
ఘనతర ధర్మకామ్యములఖండ గతిన్ చెలువొందునట్లు యౌ
వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమన నిజ వంశోద్ధారకుఁ
రిప్లయితొలగించండిగనుమయ, కైకొనుము నింకఁ గరుణావార్ధీ!
ఘన యశమున్ బొందుము, జీ
వనమున సంతాన మందువాఁడె సుఖించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కైకొనుము+ఇంక = కైకొనుమింక' అవుతుంది. నుగాగమం రాదు.
వినుమీ సత్యము శశి!యౌ
రిప్లయితొలగించండివనమున సంతానమందువాడె సుఖించున్
గనుకనె తొందర పడుమని
యనునయముగ జెప్పుచుంటి నర్ధంబౌగదె?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాల్గవ పాదం చివర గణభంగం. సవరించండి.
అనయము చావు పుట్టుకలు నాగక
రిప్లయితొలగించండిసాగెడు జీవయానమం
దొనరగ నుప్పతిల్లు గద తోరపు ప్రేమ
ము ప్రాణ కోటికిన్
కనుగొని యోగ్య కన్నియను సకాలము
నందున పెండ్లి యాడి యౌ
వనమున సంతతింబడయు వానికి
గల్గను సౌఖ్యముల్ గడున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"యోగ్య కన్యను సకాలమునందున..." అనండి. లేకుంటే గణభంగం.
అనుకూల సుతులఁ బడయుట
రిప్లయితొలగించండిమనుజ పురాకృత సుకృత మమానుషమే సే
కొని యాలిని స్వీయ సుకృత
వనమున సంతాన మందు వాఁడె సుఖించున్
(వనము = సమూహము )
ఘనముగ నేర్చి విద్యలను గార్య సమర్ధతఁ బొంది నైపుణ
మ్మును దగ వృద్ధి సేసికొని పొందఁగ వృత్తిని నాయ వంతుఁడై
వనితకు నింక మర్త్యునకుఁ బన్నుగ ముప్పది లోపు నిండు యౌ
వనమున సంతతిం బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివినుమిది నిక్కపుంబలుకు వీనులవిందగు సుమ్ము శర్మ!యౌ
రిప్లయితొలగించండివనమున సంతతింబడయు వానికి గల్గును సౌఖ్యముల్ గడున్
గనుకనె వేగిరంబుగను గన్యను,సద్గుణశీలి,నమ్రతన్
జనునది గానిపించగను సంతసమొప్పగ బెండ్లియాడుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిధనముండిన సంతానము
ను నిదానముగ బడయంగ నోర్చ దగున్, కా
దనిన, తెలివి గల్గిన య
వ్వనమున సంతానమందు వాడె సుఖించున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు
తొలగించండిఅనువగు చోటు జీవులకు, హాయిగ వన్య మృగంబులన్నియున్
రిప్లయితొలగించండిమను తమదైన బాణిని సమాగమమౌచు తరించు స్వేచ్ఛగా
కన పెను పన్ను భారములు కత్తెర కోతలు ఖర్చులేనిదౌ
వనమున సంతతిం బడయువానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజనకజ బాలలిర్వురకు జన్మమొసంగెనదెట్టి సీమయో
రిప్లయితొలగించండివినుమిల దుర్గతుల్ దొలగి విస్తృతమౌ గన వంశమేరికిన్
జనహిత కార్యముల్ నెరపు సత్పురుషుండు గడించునేమియో
వనమున; సంతతిం బడయువానికిఁ; గల్గును సౌఖ్యముల్ గడున్