9-11-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్"(లేదా...)"కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్"(డా. వరలక్ష్మి హరవే గారికి ధన్యవాదాలతో...)
ఆర్తినిఁదీర్చగశుభసమవర్తినిఁగోరుచుమనసునభజనన్ఁజేయన్కర్తవ్యములనుమరచిరికార్తికపూజలుసతులకుఁగష్టములనిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్తిగ నీశ్వరార్చనల నద్భుతరీతిని జేయదల్చుచున్కీర్తిని గోరుచున్ కెఱలి గీములవీడుచు గుళ్ళుచుట్టగాభర్తల యన్నపానములు పట్టని రీతిని భక్తితత్పరన్కార్తికమాస పూజలను కాంతలొనర్చిన గల్గుకష్టముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూర్తిగ మోకాళ్ళ రిగిన,ఆర్తిగ దీపాలు బెట్టు యక్కర కలుగున్భర్తల సాయము కరువైకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
పూర్తిగచిత్తమందుననుపున్నమిచంద్రునిగాంచియాత్మలోఆర్తినిభోజనాదులనుహంగులులేకనుసేఁదఁదీరగానర్తనఁజేయుచున్ప్రజయునాధుడుకూల్చెదరింటికప్పునేకార్తికమాసపూజలనుగాంతలోనర్చినఁగల్గుకష్టముల్
ఆర్తిగ శివ జపము ను స ద్వర్తన గల్గియు ను జనులు పావన కారమౌ కర్తవ్యంబును మరచిన కార్తిక పూజలు సతులకు కష్టముల నిడున్
రెండవ పాదం చివర పావనకరమౌ అని సవరణ చేయడమైనది
కర్తృత్వము విడనాడుచుధూర్తుల సహవాసమదియె తోషణమనుచున్ ధౌర్తిక తో జేసెడి యాకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్.
ఉత్పలమాల:"కార్తిక దీప"మెట్లు కనగావలె ? 'మోనిక ' చేరగల్గునా భర్త ను? 'దీప' కష్టములభారము తీరి సుఖాంతమెన్నడో? వర్తులు వేసి దీపముల పట్టగ "సీరియ లె"ట్లు గాంచుటో?!"కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్"--కటకం వేంకటరామ శర్మ.
మోనితను కార్తిక్ కు భార్యను చేసేసారన్నమాట!... బాగుంది మీ పూరణ. అభినందనలు.
ధన్యవాదములార్యా! మహిళాజనవాక్యం 😂
కందము:కర్తయు కర్మయు తామై వర్తించెడి గృహిణులట్లు పాటుపడంగన్!భర్తలు స్థాణువు లగుచో "కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్"-కటకం వేంకటరామ శర్మ.
ధన్యవాదములార్యా
ధూర్తుల తోడ నెయ్యమది తోషణమంచు దలంచు గర్తలే భర్తను లెక్కజేయక సపక్షుల మెప్పును పొంద గోరుచున్ గార్తిక మాస పూజలను గాంతలొనర్చినఁ గల్గుఁ గష్టముల్ ధౌర్తిక తోడ చేసిన వ్రతంబు ఫలంబదె యాలకించుమా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఆర్తిగఁ గుటుంబమెల్లరుపూర్తిగ శుభమంద భక్తిపూర్వకమనకేగుర్తింపు బొందఁ జేసెడుగార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్ఉత్పలమాలఆర్తిఁ గుటుంబ మెల్లరకు నంద శుభమ్ములు భక్తియుక్తులైపూర్తిగ నిష్ఠలున్ గలిఁగి పూజలొనర్చుట భావ్యమయ్యెడిన్వర్తనమీఱి సోకులను వాసికినెక్కఁగఁ జూపు దర్పమైకార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కార్తిక మాస విశిష్టతకర్తవ్యము నెరుకపరచ కాంతలకింకన్నార్తిగ వ్రతమును జేయగకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్!
మార్తాండుడు రాక మునుపెపూర్తిగ చన్నీటిలోన మునకలు పూజల్పూర్తిగ నిద్రే దొరకకకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నిద్ర+ఏ' అన్నపుడు సంధి లేదు. "నిద్రయె దొరకక" అనండి.
సవరణతో.....మార్తాండుడు రాక మునుపెపూర్తిగ చన్నీటిలోన మునకలు పూజల్పూర్తిగ నిద్రయె దొరకకకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
ఆర్తిగ శంభునిగొలువగకార్తిక మాసమ్మునందు గలుగుశుభంబుల్భర్త సహకరించనిచోకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
కార్తికమాసమందు కులకాంతలొనర్చెడి పూజలందునన్భర్తలు బద్ధకస్తులయి భార్యలకెట్టి సహాయమీయకన్వర్తిల వారిగోడువినువారలు లేక యవస్థ లొందునాకార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
ఉ:ఆర్తిని దీర్చ శంకరుని యద్భుతరీతి నలంకరింపగన్ధూర్తుడు నర్ధ రాత్రి కడు తుంటరిచేష్టల పాడు చేయగన్మూర్తిని, తాకరాదనిరి ముప్పె గదా యని, వెల్వరించనైకార్తిక మాస పూజలను గాంత లొనర్చిన గల్గు కష్టముల్పాడుచేయు=భిన్నము చేటువై. చంద్రశేఖర్
శంకరుని నద్భుత../ ధన్యవాదములు
వర్తన మయ్యది గృహమునభర్తల పిల్లల దినదిన పాలన చూడన్నర్తన చేతురె! సల్పగకార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
🙏 ధన్యవాదములండి.
పూర్తిగ మాసము దినములకార్తిక పూజలు ; సతులకుఁ గష్టముల నిడున్వర్తనము జేయ ఋతు పరివర్తనము జరిగెడి వేళ పస్తుల తోడన్
వర్తన లింటిలో మరచి, వారిజ లోచన లెక్కి గోపురావర్తన శీర్ష భాగముల, వందల దివ్వెలు పేర్చి, వాటి సంవర్తన చేసి తైలముల, వత్తుల నారక జూచి, చేయు యీకార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్.
ఆర్తి శమించు శంకరుని కర్చనచేయ కరమ్ము నిష్ఠతోపూర్తిగ మాసమంతయును, పుణ్యము దక్కును నిశ్చయమ్ముగాభర్తల దూరి, శుద్ధమగు పద్ధతులన్ విడి సంచరించుచున్కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
ఆర్తినిదీర్చరా! హరుడశంకర శంభుడ నీలకంఠునేపూర్తిగనమ్మిరత్నమయపూరనపీఠమునేసినిష్టతోకార్తిక మాస పూజలను గాంత లొనర్చిన, గల్గుగష్టముల్తీర్తురు, గూర్తురేకరుణదీపపుకాంతికుటుంభమందునన్ ...తోకల...
మూర్తీ!శుభముల నిచ్చునుకార్తిక పూజలు సతులకు,గష్టములనిడున్ భర్తను గాదని జేసెడుకార్తిక పూజలు సహితము కాంతలకెపుడున్
గొర్తిప్ర భాకరా!వినుము గూర్చును సంపద లెన్నియో సుమాకార్తికమాస పూజలనుగాంతలొనర్చిన,గల్గునష్టముల్ భర్తల దూరుచున్ నిలను భక్తిని,నెమ్మిని నెన్నిజేసినన్ గార్తిక పూజలన్ మగువ కానలకాచినవెన్నెలన్ వలెన్
స్వార్తి నివారణ నిష్ఠా స్ఫూర్తిని నిత్యోపవాస సురుచిర దీక్షాకర్తృత్వమునఁ గృశింపఁగఁ గార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్ఆర్తినిఁ గాలుఁ డా నరక మారసి పాపి విహీనమున్ జగత్కర్తను వేఁడ నాతఁ డనెఁ గాంతల నోములు నోఁచఁ జేయుమా భర్తను విస్మరించుచును భక్తిని గొప్పగఁ జాట నెంచుచుం గార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
ఆర్తిగ వేడగన్ దలచినర్చన సేయగ నాలయమ్ము,నామూర్తిని గాంచగన్ గొలిచి మ్రొక్కి,నుపాసన జేయనెంచగన్భర్తను బిల్వ,రాననుచు భక్తియె లేకయె , కోపమందగాకార్తికమాస పూజలను గాంత లొనర్చిన గల్గు గష్టముల్ !!వార్తలు జూచుచున్ పతులు వాదన లాడగ భార్య తోడనేఆర్తిగ పిల్చెడిన్ సతుల నాదర వాక్కుల నెంచకే దయన్కార్తిక పూజ సేయగను గాంతయె బిల్వగ నల్కపూనగ,నాకార్తికమాస పూజలను గాంత లొనర్చిన గల్గు నష్టముల్!!కార్తిక శీతల వేళలభర్తల కౌగిలి విడివడ భరమది హృదినేఆర్తియె తీరని వయసునకార్తిక పూజలు సతులకుఁ గష్టములని నిడున్!!
పూర్తి శుభంబులందెదరు పుణ్యఫలప్రదమౌ వ్రతంబులున్కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ; గల్గుఁ గష్టముల్ధూర్తులకార్యకారులకు దూఱుచు ధార్మికులన్ మదాంధులైకార్తిక మాస నీమముల గాలను రాయగ జూచు వారికిన్
ఆర్తినిఁదీర్చగశుభసమ
రిప్లయితొలగించండివర్తినిఁగోరుచుమనసునభజనన్ఁజేయన్
కర్తవ్యములనుమరచిరి
కార్తికపూజలుసతులకుఁగష్టములనిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆర్తిగ నీశ్వరార్చనల నద్భుతరీతిని జేయదల్చుచున్
రిప్లయితొలగించండికీర్తిని గోరుచున్ కెఱలి గీములవీడుచు గుళ్ళుచుట్టగా
భర్తల యన్నపానములు పట్టని రీతిని భక్తితత్పరన్
కార్తికమాస పూజలను కాంతలొనర్చిన గల్గుకష్టముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూర్తిగ మోకాళ్ళ రిగిన,
రిప్లయితొలగించండిఆర్తిగ దీపాలు బెట్టు యక్కర కలుగున్
భర్తల సాయము కరువై
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూర్తిగచిత్తమందుననుపున్నమిచంద్రునిగాంచియాత్మలో
రిప్లయితొలగించండిఆర్తినిభోజనాదులనుహంగులులేకనుసేఁదఁదీరగా
నర్తనఁజేయుచున్ప్రజయునాధుడుకూల్చెదరింటికప్పునే
కార్తికమాసపూజలనుగాంతలోనర్చినఁగల్గుకష్టముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆర్తిగ శివ జపము ను స
రిప్లయితొలగించండిద్వర్తన గల్గియు ను జనులు పావన కారమౌ
కర్తవ్యంబును మరచిన
కార్తిక పూజలు సతులకు కష్టముల నిడున్
రెండవ పాదం చివర పావనకరమౌ అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికర్తృత్వము విడనాడుచు
ధూర్తుల సహవాసమదియె తోషణమనుచున్
ధౌర్తిక తో జేసెడి యా
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి"కార్తిక దీప"మెట్లు కనగావలె ? 'మోనిక ' చేరగల్గునా
భర్త ను? 'దీప' కష్టములభారము తీరి సుఖాంతమెన్నడో?
వర్తులు వేసి దీపముల పట్టగ "సీరియ లె"ట్లు గాంచుటో?!
"కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్"
--కటకం వేంకటరామ శర్మ.
మోనితను కార్తిక్ కు భార్యను చేసేసారన్నమాట!... బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా! మహిళాజనవాక్యం 😂
తొలగించండికందము:
రిప్లయితొలగించండికర్తయు కర్మయు తామై
వర్తించెడి గృహిణులట్లు పాటుపడంగన్!
భర్తలు స్థాణువు లగుచో
"కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్"
-కటకం వేంకటరామ శర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా
తొలగించండిధూర్తుల తోడ నెయ్యమది తోషణమంచు దలంచు గర్తలే
రిప్లయితొలగించండిభర్తను లెక్కజేయక సపక్షుల మెప్పును పొంద గోరుచున్
గార్తిక మాస పూజలను గాంతలొనర్చినఁ గల్గుఁ గష్టముల్
ధౌర్తిక తోడ చేసిన వ్రతంబు ఫలంబదె యాలకించుమా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిఆర్తిగఁ గుటుంబమెల్లరు
పూర్తిగ శుభమంద భక్తిపూర్వకమనకే
గుర్తింపు బొందఁ జేసెడు
గార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
ఉత్పలమాల
ఆర్తిఁ గుటుంబ మెల్లరకు నంద శుభమ్ములు భక్తియుక్తులై
పూర్తిగ నిష్ఠలున్ గలిఁగి పూజలొనర్చుట భావ్యమయ్యెడిన్
వర్తనమీఱి సోకులను వాసికినెక్కఁగఁ జూపు దర్పమై
కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికార్తిక మాస విశిష్టత
రిప్లయితొలగించండికర్తవ్యము నెరుకపరచ కాంతలకింకన్
నార్తిగ వ్రతమును జేయగ
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమార్తాండుడు రాక మునుపె
రిప్లయితొలగించండిపూర్తిగ చన్నీటిలోన మునకలు పూజల్
పూర్తిగ నిద్రే దొరకక
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిద్ర+ఏ' అన్నపుడు సంధి లేదు. "నిద్రయె దొరకక" అనండి.
సవరణతో.....
తొలగించండిమార్తాండుడు రాక మునుపె
పూర్తిగ చన్నీటిలోన మునకలు పూజల్
పూర్తిగ నిద్రయె దొరకక
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
ఆర్తిగ శంభునిగొలువగ
రిప్లయితొలగించండికార్తిక మాసమ్మునందు గలుగుశుభంబుల్
భర్త సహకరించనిచో
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికార్తికమాసమందు కులకాంతలొనర్చెడి పూజలందునన్
రిప్లయితొలగించండిభర్తలు బద్ధకస్తులయి భార్యలకెట్టి సహాయమీయకన్
వర్తిల వారిగోడువినువారలు లేక యవస్థ లొందునా
కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిఆర్తిని దీర్చ శంకరుని యద్భుతరీతి నలంకరింపగన్
ధూర్తుడు నర్ధ రాత్రి కడు తుంటరిచేష్టల పాడు చేయగన్
మూర్తిని, తాకరాదనిరి ముప్పె గదా యని, వెల్వరించనై
కార్తిక మాస పూజలను గాంత లొనర్చిన గల్గు కష్టముల్
పాడుచేయు=భిన్నము చేటు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరుని నద్భుత../ ధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివర్తన మయ్యది గృహమున
రిప్లయితొలగించండిభర్తల పిల్లల దినదిన పాలన చూడన్
నర్తన చేతురె! సల్పగ
కార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యవాదములండి.
తొలగించండిపూర్తిగ మాసము దినముల
రిప్లయితొలగించండికార్తిక పూజలు ; సతులకుఁ గష్టముల నిడున్
వర్తనము జేయ ఋతు పరి
వర్తనము జరిగెడి వేళ పస్తుల తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్తన లింటిలో మరచి, వారిజ లోచన లెక్కి గోపురా
రిప్లయితొలగించండివర్తన శీర్ష భాగముల, వందల దివ్వెలు పేర్చి, వాటి సం
వర్తన చేసి తైలముల, వత్తుల నారక జూచి, చేయు యీ
కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆర్తి శమించు శంకరుని కర్చనచేయ కరమ్ము నిష్ఠతో
రిప్లయితొలగించండిపూర్తిగ మాసమంతయును, పుణ్యము దక్కును నిశ్చయమ్ముగా
భర్తల దూరి, శుద్ధమగు పద్ధతులన్ విడి సంచరించుచున్
కార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆర్తినిదీర్చరా! హరుడ
రిప్లయితొలగించండిశంకర శంభుడ నీలకంఠునే
పూర్తిగనమ్మిరత్నమయ
పూరనపీఠమునేసినిష్టతో
కార్తిక మాస పూజలను
గాంత లొనర్చిన, గల్గుగష్టముల్
తీర్తురు, గూర్తురేకరుణ
దీపపుకాంతికుటుంభమందునన్
...తోకల...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూర్తీ!శుభముల నిచ్చును
రిప్లయితొలగించండికార్తిక పూజలు సతులకు,గష్టములనిడున్
భర్తను గాదని జేసెడు
కార్తిక పూజలు సహితము కాంతలకెపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగొర్తిప్ర భాకరా!వినుము గూర్చును సంపద లెన్నియో సుమా
రిప్లయితొలగించండికార్తికమాస పూజలనుగాంతలొనర్చిన,గల్గునష్టముల్
భర్తల దూరుచున్ నిలను భక్తిని,నెమ్మిని నెన్నిజేసినన్
గార్తిక పూజలన్ మగువ కానలకాచినవెన్నెలన్ వలెన్
స్వార్తి నివారణ నిష్ఠా
రిప్లయితొలగించండిస్ఫూర్తిని నిత్యోపవాస సురుచిర దీక్షా
కర్తృత్వమునఁ గృశింపఁగఁ
గార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్
ఆర్తినిఁ గాలుఁ డా నరక మారసి పాపి విహీనమున్ జగ
త్కర్తను వేఁడ నాతఁ డనెఁ గాంతల నోములు నోఁచఁ జేయుమా
భర్తను విస్మరించుచును భక్తిని గొప్పగఁ జాట నెంచుచుం
గార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్
ఆర్తిగ వేడగన్ దలచినర్చన సేయగ నాలయమ్ము,నా
రిప్లయితొలగించండిమూర్తిని గాంచగన్ గొలిచి మ్రొక్కి,నుపాసన జేయనెంచగన్
భర్తను బిల్వ,రాననుచు భక్తియె లేకయె , కోపమందగా
కార్తికమాస పూజలను గాంత లొనర్చిన గల్గు గష్టముల్ !!
వార్తలు జూచుచున్ పతులు వాదన లాడగ భార్య తోడనే
ఆర్తిగ పిల్చెడిన్ సతుల నాదర వాక్కుల నెంచకే దయన్
కార్తిక పూజ సేయగను గాంతయె బిల్వగ నల్కపూనగ,నా
కార్తికమాస పూజలను గాంత లొనర్చిన గల్గు నష్టముల్!!
కార్తిక శీతల వేళల
భర్తల కౌగిలి విడివడ భరమది హృదినే
ఆర్తియె తీరని వయసున
కార్తిక పూజలు సతులకుఁ గష్టములని నిడున్!!
పూర్తి శుభంబులందెదరు పుణ్యఫలప్రదమౌ వ్రతంబులున్
రిప్లయితొలగించండికార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ; గల్గుఁ గష్టముల్
ధూర్తులకార్యకారులకు దూఱుచు ధార్మికులన్ మదాంధులై
కార్తిక మాస నీమముల గాలను రాయగ జూచు వారికిన్