15-11-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము”(లేదా...)“పరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్”(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)
రాత్రిమెలకువగలిగినరాఁడుదోంగనిద్రమత్తునువదలునునిక్కువంబుజాగరణమునశివరాత్రిజాతరందుపరుపునన్నల్లికుట్టినపరమసుఖము
ఎత్తి పొడుపు మాటలతోడ నెపుడు సతినికించపరచుచు దూరెడు గృహిణి గలుగుపురుషుడు తలచెనట దార పొందు కన్నపరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము.
ఎవరి కైనను నిద్దుర దెట్లు వచ్చుఁ పరుపునన్ నల్లి కుట్టిన : పరమ సుఖము కలత లెరుగని కమ్మని కలల తోడ నిదుర వోవుట మేలండ్రు నిపుణ మతులు
పరుషపు మాటలాడి తన భర్తను నిత్యము తూలనాడుచున్ నరకము చూపు భార్యగల నాథుడు మానసమందు తల్చెనే సరసమెఱుంగనట్టి సతి సన్నిహితమ్మున కన్న నిట్లు నీపరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లికుట్టగన్.
నిదుర రాదయ్యె కంటికి నిముసమైనపరుపునన్ నల్లి కుట్టిన;పరమ సుఖముకటిక నేలను పవళించు కష్టటజీవి,పేద, పొందును నిదురించు నాదమరచి
ఉత్పలమాల:మరదలి పేరులో "నళిని" మారెను "నల్లి"గ ముద్దు ముద్దు గా సరసముతోడ నాతనిని చానయు మన్నన సేయు ప్రేమతోవిరహమునోపలేనిపతి వేగిర మే గదిలోకి రమ్మనన్ “పరుపున వాలినంత సుఖభావన గల్గెను "నల్లి" కుట్టగన్”-కటకం వేంకటరామశర్మ.
తరుణిని పెండ్లియాడుకొని దారు విహార నిమిత్త మేగగన్బరవశ చిత్తులై మిగుల పంచశరమ్ముల ధాటి కేళినన్పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్త్వరితమె నిద్ర మేల్కొని యవారిత రీతిని సంగమించరే!
తేటగీతి గింజఁ దీసిన మృదువైన ముంజ ప్రత్తి నేకి యరడుగు చదునుగ నెత్తు వేసి పూల బొమ్మ ల గుడ్డలో పొదివి దానిఁపరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము”-కటకం వేంకటరామశర్మ.
చం: తిరుగని చోటు లేదు పలు తిప్పలు సైచి ప్రచండ తాపమున్దొరుకదె కూలి జేతునన దూరితి నేలిక కార్య స్థానముల్పరువును దీయురీతి పెను భారమటంచు తిరస్కరింపనైపరుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లికుట్టగన్ఏలిక కార్య స్థానములు: అనేక ఆఫీసులువై. చంద్రశేఖర్
నిదురపట్టదెవరికైన నిశనెరవుగపరుపునన్ నల్లి కుట్టిన ; పరమసుఖముగూరుచుండు పడక మార్చి కునుకు దీయశయ్య శుచిగనుండ గలుగు శయన సుఖము
జరుపగ తరమా రేతిరి జాగరణమెపరుపునన్ నల్లి కుట్టిన; పరమసుఖముక్రొత్త కుర్లాను పరుపును గొనిన,దానిలోన దొర్లిన నిదురకు లోటు లేదు
కొత్తగా పెండ్లయినజంట కొసరి వలపుకౌగిలింతల బిగువన్నఖక్షతమ్ములోని సుఖమునాస్వాదించ బూనుకొనగపరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము
పెరటిగులాబిచెట్లకునుపెక్కగువర్ణపుపూలుపూయగన్పరిసరప్రాంతమంత పరిపక్వసువాసనవిస్తరించగాసరగుణపూలుతెంపగనుచట్కునగ్రుచ్చెనుముండ్లు గట్లనేపరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్ ...తోకల...
గురుతరబాధ్యతన్ మునిగి కోర్కెలు కొల్లలు మిన్నుముట్టగన్విరతియె లేని కష్టమున విత్తసమార్జన జేసి డస్సి తాపరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్సరవిని శాతశూలశరజాలము మై వడి గ్రుచ్చ గాసిలెన్కంజర్ల రామాచార్య.
తేటగీతిపిల్లలు నిదురలో నుండు వేళ కనుకనర్ధరాత్రిఁ గూడెదమంచు నతివపలుకగురకఁ బెట్టు మగని మేలుకొలుపనెంచిపరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము! చంపకమాలమరునకుఁ జిక్కి వేడుకొన మానిని మన్నన నర్ధరాత్రికిన్బరువము విందుజేతునని పాపల నిద్దురఁ బుచ్చుమాయనన్!జిఱుతల జోలలన్ గురకఁ జిక్కిన భర్తకు మేలుకొల్పనన్బరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్!చిఱుతలు= చిన్నలు, పాపలు
గండు దోమల యారడి మెండుకాగనిదుర పట్టదు నడిరేయి నిముసమైనమశకములుపెట్టు బాధతో మనుటకన్నపరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము
పరుగులు తీసితీసి పని పాటులుజేయుచు పొట్టకోసమైనిరతము రోజు మొత్తమును నిశ్చయమొప్ప భుజించి రాత్రియున్పరుపున వాలినంత సుఖ భావనకల్గెను , నల్లి కుట్పినన్సరుగున లేచి నల్లులను జంపగజాగరణంబు జేసితిన్
నిరతము గిల్లుచుండు సతి నిందలు వేయుచు, పుట్టినింకిన్ సరగున చేరె, నేకతము సాగుచు నుంటి ప్రశాంతి తోడుతన్పరుగిడు చుండె కాలము నివాసమునందున, మత్తునిద్రలోపరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్
నిదుర రాదేరికినినిక నిజము గానుపరుపునన్ నల్లి కుట్టిన,పరమ సుఖముపండు కొనగనె నిద్దుర వచ్చు నెడలమేటి భోగము లుండిన సాటిరావు
చీమ కుట్టంగఁ జర్మమ్ము జివ్వు మనును దోమ కుట్టంగ రోగము తోడ బాధకంత ముండదు పరికింప నంత కన్నఁబఱుపునన్ నల్లి కుట్టినఁ బరమ సుఖముతఱ చగు కార్య భారమును దద్ద వహించి భుజద్వయమ్మునం వెఱవక చక్కఁ జేయఁగను బ్రీతిని నేరక కుట్టి నట్టులే యఱిముఱి నిద్ర వోవఁగను సాంతము వెచ్చటి నెత్తు రింపుగాఁ, బఱుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లి, కుట్టఁగన్ [నల్లికి +ఉట్టఁగన్ = నల్లి కుట్టఁగన్; ఉట్టు =కాఱు ]
చురచురలాడునెండ కడుశోషిలజేయగ దాళలేకనేపరుపున వాలినంత సుఖభావన గల్గెను,నల్లి కుట్టగన్ నరకము జూచితిన్ మిగుల ,నక్కాన నల్లుల జంప యత్నమున్ త్వరితమె జేయగానగును దాలిమి కష్టముగాన లక్ష్మణా!
పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్చురచురలాడి పుట్టినది చుయ్యని చీదఱ దేహమందునన్నరకము చూపు మంచమున నల్లులు కొల్లలు నల్ల ద్రావుచున్దురితపు పోకడల్ బెనఁగి దోమలు తూటులుపుచ్చు కాయమున్(నల్ల=నెత్తురు)
నల్లి కుట్టిన సాకుతో నతివ బిలిచికుట్టి నట్టిచోటును జూపి కోరి జూపపరవశమ్మది పెరుగగా పైట దొలగపరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము!!
నల్లి కుట్టిన సాకుతో నతివ బిలిచికుట్టినట్టి తావును జూపి గోకు మనగపరవశమ్మది పెరుగగా పైట జార్చపరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము !!
మక్కువకూర్చెడి ప్రాంతముచిక్కడపల్లి,సుజనులకుజింతంకూర్చెన్మిక్కుటమగువర్షముతోనక్కడికార్యక్రమమదియాగినయంతన్.
తిరిగెననేక తీర్థములు దేవళముల్ గని జేరెనింటికిన్ పరుపున వాలినంత సుఖభావన గల్గెను; నల్లి కుట్టగన్చురుకున మంట బుట్టెనిక సూదిని గుచ్చిన బాధ తాళకన్సరగున పారెనాతడటు శయ్యను వీడి పరుండె నేలపై
రాత్రిమెలకువగలిగినరాఁడుదోంగ
రిప్లయితొలగించండినిద్రమత్తునువదలునునిక్కువంబు
జాగరణమునశివరాత్రిజాతరందు
పరుపునన్నల్లికుట్టినపరమసుఖము
రిప్లయితొలగించండిఎత్తి పొడుపు మాటలతోడ నెపుడు సతిని
కించపరచుచు దూరెడు గృహిణి గలుగు
పురుషుడు తలచెనట దార పొందు కన్న
పరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము.
ఎవరి కైనను నిద్దుర దెట్లు వచ్చుఁ
రిప్లయితొలగించండిపరుపునన్ నల్లి కుట్టిన : పరమ సుఖము
కలత లెరుగని కమ్మని కలల తోడ
నిదుర వోవుట మేలండ్రు నిపుణ మతులు
రిప్లయితొలగించండిపరుషపు మాటలాడి తన భర్తను నిత్యము తూలనాడుచున్
నరకము చూపు భార్యగల నాథుడు మానసమందు తల్చెనే
సరసమెఱుంగనట్టి సతి సన్నిహితమ్మున కన్న నిట్లు నీ
పరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లికుట్టగన్.
నిదుర రాదయ్యె కంటికి నిముసమైన
రిప్లయితొలగించండిపరుపునన్ నల్లి కుట్టిన;పరమ సుఖము
కటిక నేలను పవళించు కష్టటజీవి,
పేద, పొందును నిదురించు నాదమరచి
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిమరదలి పేరులో "నళిని" మారెను "నల్లి"గ ముద్దు ముద్దు గా
సరసముతోడ నాతనిని చానయు మన్నన సేయు ప్రేమతో
విరహమునోపలేనిపతి వేగిర మే గదిలోకి రమ్మనన్
“పరుపున వాలినంత సుఖభావన గల్గెను "నల్లి" కుట్టగన్”
-కటకం వేంకటరామశర్మ.
రిప్లయితొలగించండితరుణిని పెండ్లియాడుకొని దారు విహార నిమిత్త మేగగన్
బరవశ చిత్తులై మిగుల పంచశరమ్ముల ధాటి కేళినన్
పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్
త్వరితమె నిద్ర మేల్కొని యవారిత రీతిని సంగమించరే!
తేటగీతి
రిప్లయితొలగించండిగింజఁ దీసిన మృదువైన ముంజ ప్రత్తి
నేకి యరడుగు చదునుగ నెత్తు వేసి
పూల బొమ్మ ల గుడ్డలో పొదివి దానిఁ
పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము”
-కటకం వేంకటరామశర్మ.
చం:
రిప్లయితొలగించండితిరుగని చోటు లేదు పలు తిప్పలు సైచి ప్రచండ తాపమున్
దొరుకదె కూలి జేతునన దూరితి నేలిక కార్య స్థానముల్
పరువును దీయురీతి పెను భారమటంచు తిరస్కరింపనై
పరుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లికుట్టగన్
ఏలిక కార్య స్థానములు: అనేక ఆఫీసులు
వై. చంద్రశేఖర్
నిదురపట్టదెవరికైన నిశనెరవుగ
రిప్లయితొలగించండిపరుపునన్ నల్లి కుట్టిన ; పరమసుఖము
గూరుచుండు పడక మార్చి కునుకు దీయ
శయ్య శుచిగనుండ గలుగు శయన సుఖము
జరుపగ తరమా రేతిరి జాగరణమె
రిప్లయితొలగించండిపరుపునన్ నల్లి కుట్టిన; పరమసుఖము
క్రొత్త కుర్లాను పరుపును గొనిన,దాని
లోన దొర్లిన నిదురకు లోటు లేదు
కొత్తగా పెండ్లయినజంట కొసరి వలపు
రిప్లయితొలగించండికౌగిలింతల బిగువన్నఖక్షతమ్ము
లోని సుఖమునాస్వాదించ బూనుకొనగ
పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము
పెరటిగులాబిచెట్లకును
రిప్లయితొలగించండిపెక్కగువర్ణపుపూలుపూయగన్
పరిసరప్రాంతమంత పరి
పక్వసువాసనవిస్తరించగా
సరగుణపూలుతెంపగను
చట్కునగ్రుచ్చెనుముండ్లు గట్లనే
పరుపున వాలినంత సుఖ
భావన గల్గెను నల్లి కుట్టగన్
...తోకల...
గురుతరబాధ్యతన్ మునిగి కోర్కెలు కొల్లలు మిన్నుముట్టగన్
రిప్లయితొలగించండివిరతియె లేని కష్టమున విత్తసమార్జన జేసి డస్సి తా
పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్
సరవిని శాతశూలశరజాలము మై వడి గ్రుచ్చ గాసిలెన్
కంజర్ల రామాచార్య.
తేటగీతి
రిప్లయితొలగించండిపిల్లలు నిదురలో నుండు వేళ కనుక
నర్ధరాత్రిఁ గూడెదమంచు నతివపలుక
గురకఁ బెట్టు మగని మేలుకొలుపనెంచి
పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము!
చంపకమాల
మరునకుఁ జిక్కి వేడుకొన మానిని మన్నన నర్ధరాత్రికిన్
బరువము విందుజేతునని పాపల నిద్దురఁ బుచ్చుమాయనన్!
జిఱుతల జోలలన్ గురకఁ జిక్కిన భర్తకు మేలుకొల్పనన్
బరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్!
చిఱుతలు= చిన్నలు, పాపలు
గండు దోమల యారడి మెండుకాగ
రిప్లయితొలగించండినిదుర పట్టదు నడిరేయి నిముసమైన
మశకములుపెట్టు బాధతో మనుటకన్న
పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము
పరుగులు తీసితీసి పని పాటులు
రిప్లయితొలగించండిజేయుచు పొట్టకోసమై
నిరతము రోజు మొత్తమును నిశ్చయ
మొప్ప భుజించి రాత్రియున్
పరుపున వాలినంత సుఖ భావన
కల్గెను , నల్లి కుట్పినన్
సరుగున లేచి నల్లులను జంపగ
జాగరణంబు జేసితిన్
నిరతము గిల్లుచుండు సతి నిందలు వేయుచు, పుట్టినింకిన్
రిప్లయితొలగించండిసరగున చేరె, నేకతము సాగుచు నుంటి ప్రశాంతి తోడుతన్
పరుగిడు చుండె కాలము నివాసమునందున, మత్తునిద్రలో
పరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్
నిదుర రాదేరికినినిక నిజము గాను
రిప్లయితొలగించండిపరుపునన్ నల్లి కుట్టిన,పరమ సుఖము
పండు కొనగనె నిద్దుర వచ్చు నెడల
మేటి భోగము లుండిన సాటిరావు
చీమ కుట్టంగఁ జర్మమ్ము జివ్వు మనును
రిప్లయితొలగించండిదోమ కుట్టంగ రోగము తోడ బాధ
కంత ముండదు పరికింప నంత కన్నఁ
బఱుపునన్ నల్లి కుట్టినఁ బరమ సుఖము
తఱ చగు కార్య భారమును దద్ద వహించి భుజద్వయమ్మునం
వెఱవక చక్కఁ జేయఁగను బ్రీతిని నేరక కుట్టి నట్టులే
యఱిముఱి నిద్ర వోవఁగను సాంతము వెచ్చటి నెత్తు రింపుగాఁ,
బఱుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లి, కుట్టఁగన్
[నల్లికి +ఉట్టఁగన్ = నల్లి కుట్టఁగన్; ఉట్టు =కాఱు ]
చురచురలాడునెండ కడుశోషిలజేయగ దాళలేకనే
రిప్లయితొలగించండిపరుపున వాలినంత సుఖభావన గల్గెను,నల్లి కుట్టగన్
నరకము జూచితిన్ మిగుల ,నక్కాన నల్లుల జంప యత్నమున్
త్వరితమె జేయగానగును దాలిమి కష్టముగాన లక్ష్మణా!
పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్
రిప్లయితొలగించండిచురచురలాడి పుట్టినది చుయ్యని చీదఱ దేహమందునన్
నరకము చూపు మంచమున నల్లులు కొల్లలు నల్ల ద్రావుచున్
దురితపు పోకడల్ బెనఁగి దోమలు తూటులుపుచ్చు కాయమున్
(నల్ల=నెత్తురు)
నల్లి కుట్టిన సాకుతో నతివ బిలిచి
రిప్లయితొలగించండికుట్టి నట్టిచోటును జూపి కోరి జూప
పరవశమ్మది పెరుగగా పైట దొలగ
పరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము!!
నల్లి కుట్టిన సాకుతో నతివ బిలిచి
రిప్లయితొలగించండికుట్టినట్టి తావును జూపి గోకు మనగ
పరవశమ్మది పెరుగగా పైట జార్చ
పరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము !!
మక్కువకూర్చెడి ప్రాంతము
రిప్లయితొలగించండిచిక్కడపల్లి,సుజనులకుజింతంకూర్చెన్
మిక్కుటమగువర్షముతో
నక్కడికార్యక్రమమదియాగినయంతన్.
తిరిగెననేక తీర్థములు దేవళముల్ గని జేరెనింటికిన్
రిప్లయితొలగించండిపరుపున వాలినంత సుఖభావన గల్గెను; నల్లి కుట్టగన్
చురుకున మంట బుట్టెనిక సూదిని గుచ్చిన బాధ తాళకన్
సరగున పారెనాతడటు శయ్యను వీడి పరుండె నేలపై