15, నవంబర్ 2021, సోమవారం

సమస్య - 3903

16-11-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్”
(లేదా...)
“చిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో”

60 కామెంట్‌లు:

  1. చిక్కడుదోరకడుగాదా
    చక్కనిపండితుడటనటజారడుకవితన్
    పక్తనుబెట్టగకుకవులు
    చిక్కడపల్లిసుజనులకుచింతన్గూర్చెన్

    రిప్లయితొలగించండి
  2. పక్కనబెట్టిరేగదరభాగ్యములేకనుపద్యకావ్యముల్
    టక్కరిదోంగలైరిగదఠావులుదప్పిరితెల్గుభాషలో
    కక్కనుమింగలేకనటకాదనలేకనుసభ్యులైరిగా
    చిక్కడపల్లియెల్లరకుఁజింతనుఁగూర్రెవధానిరాకతో

    రిప్లయితొలగించండి
  3. కందం
    మక్కువతో నవధానము
    నక్కడ తిలకింపఁబోవ నాంక్షలవలనన్
    దక్కని యవకాశమ్మునఁ
    జిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్

    ఉత్పలమాల
    చిక్కని ధారతో కవితఁ జెప్పెడు వారని వద్దిపర్తి, పె
    న్మక్కువతోవధానము సమంచితరీతిని గాంచవచ్చి నే
    డక్కడఁ గట్టుదిట్టముగ నాంక్షలఁ బెట్టు ప్రభుత్వపోకడన్
    జిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో!

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    చిక్కడపల్లి యెల్లరకు
    జింతను గూర్చె వధాని రాకతో

    ( చిక్కడపల్లి సభామందిరంలో అవధాని గారు అడుగుపెట్టగానే అనుకోని వర్షబీభత్సం -
    సభ్యుల విషాదపరిస్థితి )

    " అక్కట ! యేమి చిత్రమిది ?
    యంతనె మబ్బులు గ్రమ్మి పిడ్గులే
    మిక్కిలి కాగ వర్షమది
    మింటిని మంటిని నేకధారయై
    యిక్కడ గుర్య హేతువిక
    నీతడె " యంచును గంపమందగా
    చిక్కడపల్లి యెల్లరకు
    జింతను గూర్చె వధాని రాకతో .

    రిప్లయితొలగించండి
  5. చక్కనవధానమనగను
    పక్కకు బెట్టగ పనులను పరుగులె యనగన్
    దక్కదు బస్సుప్రయాణమె
    చిక్కడపల్లి సుజనులకు జింతం గూర్చెన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చక్కని+అవధాన' మన్నపుడు యడాగమం వస్తుంది. "చక్కని యవధాన మనగ.." అనండి.

      తొలగించండి


  6. మక్కువ మీరగన్ మదిని మాన్యుల జూడగ నాశతోడనే
    చిక్కడ పల్లికేగగను చింతన గూడగ మానసమ్మునన్
    పక్కన బెట్టగన్ పతిని బర్వులు బెట్టుచు నిల్లువీడగన్
    నిక్కము నొక్క వాహనము నిల్వదె నిచ్చట నెట్లుపోదునో
    చిక్కడపల్లి యెల్లరకు జింతను గూర్చెనవధాని రాకతో!!

    రిప్లయితొలగించండి

  7. క్రిక్కిరిసినజన వాహిని
    పెక్కుగ వాహనములచట విరివిగ తిరుగన్
    మిక్కిలి కాలుష్య మదియే
    చిక్కడపల్లి సుజనులకు జింతం గూర్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కాలుష్య మదియె" అని ఉండాలి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
  8. చిక్కేన వకాశ మనుకొని
    చక్కని యవ ధానమునకు సరగున వెళ్ల న్
    మిక్కిలి వర్షము గురియఁగ
    చిక్కడపల్లి సుజనులకు జిo తం గూర్చెన్

    రిప్లయితొలగించండి
  9. ఉ:

    తొక్కిసలాడు దారులట తోడుగ చిల్లర బేరసారముల్
    చక్కియె లేక సాగునట సందులు గొందులు యెల్ల వేళలన్
    మక్కువ జూపి పెక్కురగు మాన్యుల రాకశతావధానమున్
    చిక్కడపల్లి యెల్లరకు జింతను గూర్చె వధాని రాకతో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. అక్కింటికొచ్చి పిల్లడు
    చిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్
    నిక్కిన మేడల మధ్యన
    యెక్కెక్కేడ్చెన్, దినమణి యేడీ? యనుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చి'ని 'ఒచ్చి' అనరాదు. "అక్కింట జేరి పిల్లడు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు! సిరిదిద్దుకుంటాను.

      అక్కింట జేరి పిల్లడు
      చిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్
      నిక్కిన మేడల మధ్యన
      యెక్కెక్కేడ్చెన్, దినమణి యేడీ? యనుచున్.

      తొలగించండి
  11. ఉత్పలమాల:
    మక్కువ తో వధానమును మా పరివారము చూడ రాగ నెం
    చక్కగ నన్యులెవ్వరికి శాలప్రవేశము లేదనంగ వా
    రెక్కడి వారలక్కడకు నేగిరి యూట్యుబు లంకెచూడగా
    “చిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  12. ఎక్కడి వారో తెలియదు ,
    యక్కడి జనమంత వారి యభ్యా సములన్
    యిక్కడకు దెచ్చి మసలగ
    చిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్

    రిప్లయితొలగించండి


  13. అక్కడ నిర్వహించబడు నద్భుతమైన వధానమంచటన్
    మిక్కిలి పెద్ద సంఖ్యగ సుమేధులు జేరుచునుండ నచ్చటన్
    బెక్కుగ రద్ది యేర్పడగ పెట్టిరి యాంక్షలవెన్నొ కావునన్
    జిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చెవధాని రాకతో.

    రిప్లయితొలగించండి
  14. కందము:
    చక్కని శతావధానము
    మక్కువగా వద్దిపర్తి మహనీయునితో
    నిక్కడ జరుగగఁ జూడని
    “చిక్కడపల్లి సుజనులకుఁ జింతన్ గూర్చెన్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  15. చక్కని యవధానముగన
    చిక్కడపల్లికి రయమున చేరియు సభలో
    జిక్కని స్థానం బరయగ
    చిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. ఎక్కడ? నిజముగ నాతడు

      చిక్కడ, పల్లి సుజనులకు చింతంగూర్చెన్

      టక్కరి పలుకుల్‌ పలుకుచు

      మెక్కెను గా ధనమతoడు మిడిసి దనముతో

      తొలగించండి
    2. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  17. చిక్కుల వలయమునందున
    చిక్కెను చేరగ వధాని చిక్కడపల్లిన్
    మిక్కుటముగ వానకురిసి
    చిక్కడపల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్

    రిప్లయితొలగించండి
  18. మిక్కుటమైన వర్షములు మిత్తిని చూపుచు గుమ్మరించగా
    నక్కట! యేరులై నిలిచెనన్ని పథంబులు నివ్విధంబుగా
    చిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె, వధాని రాకతో
    చిక్కులుతీరె నిర్వహణజేయ వధానము సక్రమంబుగా

    రిప్లయితొలగించండి
  19. దక్కును తృప్తి కన్గొన వధానము నంచు తలంచు చుండగా
    పెక్కు నిషేధముల్ దొరలె, భీతి నొసంగ కరోన భూతమై
    చిక్కదు మాకటన్ జొరవ చేర వధాని నటంచు నెంచగా
    చిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో

    రిప్లయితొలగించండి
  20. పెక్కగు ధర్మ శాస్త్రముల పిన్నతనంబున వల్లె వేసె, దాఁ
    జిక్కడు పెక్కు పండితుల, జిత్తుల మారుల పృచ్ఛకాళికిన్,
    చక్కగ జూడ రాఁ స్థలము చాలక దారులు నిండిపోవగా,
    చిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో.

    రిప్లయితొలగించండి
  21. అక్కట యొక్క కుటుంబపు
    టక్కయు జెల్లెండ్రు నేగ యాయమపురికిన్
    మిక్కుటపు కరోన వలన
    చిక్కడపల్లి సుజనులకు జింతంగూర్చెన్

    రిప్లయితొలగించండి
  22. భాగ్యనగరపరిసరపల్లిరసజ్ఞులైన వారు కార్యక్రమాన్ని చూచుటకు వచ్చి చూచే అవకాశం లభించనందున వారిని గూర్చి ఒక పరిశీలకుని అంతరంగము.

    ఎక్కడ వద్దిపర్తిసుకవీంద్రు వధానము చూతమంచు పెం
    పెక్కిన మక్కువన్ గనగ నేగిన నక్కడ శ్రోతలెక్కువై
    చక్కి లభించదయ్యె యని సాగిరహో! యిట జూడ నైననున్
    చిక్కడ?,...పల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో

    కకంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  23. పెక్కగు ధర్మశాస్త్రముల పైవచియించుచు నుండ నచ్చటన్
    నక్కజమౌవిధంబుగను నార్యులు వృద్ధులు బాలబాలికల్
    యెక్కడికక్కడన్ జనమునిబ్బడి ముబ్బడి యౌటగావునన్
    చిక్కడపల్లి యెల్లరకు చింతనుగూర్చె వధానిరాకతో

    రిప్లయితొలగించండి
  24. అక్కట నగరమ్మున గా
    కెక్కడ వాని నరయంగ నెన్నఁడు తరమే
    మక్కువతోఁ గోరినఁ దా
    చిక్కడ? పల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్


    మిక్కిలి చేటు కల్గు నని మెత్తని వాఁ డవధాని కక్కటా
    యిక్కడ నంచు శంకను వహించి వధాన మొనర్పఁ బల్లెలో
    గ్రక్కున రిక్త భాషణుఁడు కన్గొని వచ్చెను రక్తి నుండ నీ
    చిక్కడ పల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో

    [నీచు +ఇక్కడ = నీ చిక్కడ; వధానిఁ జింతతోఁ గూర్చెను (దన) రాకతో (రిక్త భాషణుఁడు)]

    రిప్లయితొలగించండి
  25. నిక్కము తగ్గ లేదికను నిర్మమ కోవిడు
    బాధలన్నియున్
    అక్కట !యీ పరిస్థితు లంటగ
    జేయును రోగ బాధలున్
    అక్కడ సాహితీ సుసభ నాపగ
    జేసెను బోలిసప్పుడున్
    చిక్కడి పల్లి వాసులకు చింతలు గూర్చె
    వధాని రాకతో

    రిప్లయితొలగించండి
  26. చిక్కులవెట్టె పట్టణపు చీకిలిమాకిలి దారులయ్యయో
    మిక్కిలి కష్టమౌ నతి సమీపమునున్నను జేర వేదికన్
    చిక్కడపల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె; వధాని రాకతో
    దక్కెను తృప్తి యెల్లరకు దక్కినవన్నియు విస్మరించిరే

    రిప్లయితొలగించండి