4-6-2024 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె”(లేదా...)“సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్”(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
తేటగీతిజయ విజయులు శాప నివృత్తి శౌరిఁ జేరమూడురాక్షస జన్మల వేడుకొనఁగవారికై యవతారాల వైరిగఁ గొనసురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె!మత్తేభవిక్రీడితముపరమాత్మున్ హరి వేగ చేరు వరమున్ వాంఛించి దౌవారికుల్ధరపై నెంచఁగ మూడుజన్మలరులౌ దైతేయ దౌర్భాగ్యమున్దురితుల్ బంట్లను రాగమై తొడిగె సంతోషాన రూపాంతరాల్సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
అరయన్దైత్యకులంబుశోభిలగతామూఢుండుమూడడ్గులన్తిరిపెంబీయగచక్రవర్తిబలితాతెచ్చెంగభృత్యుండునైఅరికిన్పుత్రుడుదాపుజేరగనితానాలించిరక్షించెగాసురలోకైకశరణ్యుడైనహరిదాసుండయ్యెదైత్యాళికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'తెచ్చెంగ' అనడం సాధువు కాదు.
సామజము మొరవిని చనె సాకుటకయిసురశరణ్యుఁడు ; దనుజదాసుఁడుగ నయ్యెభక్త సులభుడగు శివుడు వరమునొసగిఎడరు నీగ మేలు వరములిడుటకఃటె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సురల శ్రేయము లక్ష్యమై స్మరగురుండువామనుండయి దీనతన్ బలిని జేరెదానమిమ్మని కోరుచు దనుజపతినిసురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె
శరణుకోరవిభీషణుశాంతుఁజేసికాచిరక్షించినాడుగాకాంతకొఱకుదారినీరీతిదెలిపెగాతరుణమెంచిసురశరణ్యుడుదనుజదాసుడుగనయ్యె
తే॥ హరియే లోకపాలకుఁడు రజనీచరులఁ దునిమి ధర్మము నిలిపి ప్రోచు చుండు సురశరణ్యుఁడు, దనుజదాసుఁడుగ నయ్యెహరుఁడు భక్తి నిలిపి కోర వరము లొసఁగిమ॥ ధరలో ధర్మము నిల్పు సజ్జనులకున్ ద్రాణంబు నావెన్నుఁడేసురలోకంబున కాపదల్ పొడవఁగన్ శూరుండుగన్ ద్రుంచడాసురలోకైకశరణ్యుఁడైన హరి, దాసుండయ్యె దైత్యాళికిన్హరుఁడే భక్కినిఁ గోరఁ గోర్కెలను సౌహార్ద్యమ్ముతోఁ దీర్చుచున్
అసుర సుతుడైన ప్రహ్లాదు డనవరతముతనదు నామమున్ జపియింప కినుక బూనితండ్రి సంహరింపగ బూను తరుణమందు సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె.అరియే విష్ణువు, వానినామమును ప్రహ్లాదుండు నిత్యమ్ము తాస్మరియింపంగ హిరణ్య కశ్యపుడె యామర్షమ్ము దండింపగానిరతమ్మాతని రక్షజేయుటొకటే నేమమ్ముగా దాల్చుచున్ సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్.
బ్రహ్మ మానస పుత్రుల రాకనరసియడ్డ గించిరి ద్వారకుల్ హరిని చేరశాప హతులైన వారిని సంహరింపసురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యెహరికైవచ్చిరి బ్రహ్మమానస సుతుల్ హర్షాతిరేకంబునన్దరికేతెంచిన వారినడ్డుకొనిరే దౌవారికుల్ చూడగామరి శాపంబును గొన్న పాలసులనే మ్రందించు వ్యావృత్తితోసురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్
ధన్యవాదాలు గురూజీ 🙏
అసుర గణముల పరిమార్ప నవ త రించి ధర్మము ను నెల. కొల్పెను ధరణి యందు సురల పక్షము గా నుండు హరి యెటు లగు సుర శ ర ణ్యు డు ద నుజ దాసు డు గ నగు?
హరియే వామనమూర్తియై యమరులందాసక్తితో చెచ్చెరన్తిరిపమ్మెత్తెగ దానవేంద్రు కడకేతేరెన్ గదా దీనుడైసురలన్గావఁగ కూర్మరూపుఁడయితా సొక్కెన్ గదా వార్ధిలోసురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సమస్య : సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యెధర్మ ఘాతకుల్ చేసిన తప్పిదమునదనుజ సదృశులైనట్టి నేతలకు నేడుసిరుల దేవాలయమ్ములు జిక్కె గానసురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యెనేడు దేవాలయాలు మరియు నిర్ణయాధికారం దనుజ సన్నిభులైన పాలకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ...."సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె"
చక్కని పూరణ. అభినందనలు.
తే.గీ:తపమునకు లొంగు పరమేష్టి దైత్యు నైనకనికరించు గజాసురు గర్భ మందెతాను బంధితుం డయ్యెను తపము మెచ్చిసురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె”
Thank you sir!
మ:కరకౌ పల్కుల నింద్రజిత్తనియె,"లంకారాజ్య నిర్మాత సో దరుడై,యద్భుత వీరుడై,యమిత మేధాశక్తితో దేవతాసురలోకైకశరణ్యుఁడైన, హరి దాసుండయ్యె దైత్యాళికిన్ పరువే దీయుచు పిన్నతండ్రి తలచన్ పాపమ్ము గా ఆతనిన్. ("మా నాయన ఐన రావణాసురుడే దేవతలకి, రాక్షసులకీ కూడా శరణ్యం. అలాంటి అన్నని వదిలి మా బాబాయి విభీషణుడు హరిదాసు లాగా తయారై రాక్షసుల పరువు తీసాడు. అతణ్ని తలుచుకొంటే పాపం"అని ఇంద్రజిత్ అన్నట్లు. )
కాతు రమరులు మర్త్య నికాయము నసుర గణ తర్జనముల నుండి రమ్య రీతి వేఁడ శరణమ్ము సద్భక్తి తోడ వీతసుర శరణ్యుఁడు దనుజ దాసుఁడుగ నయ్యెఅరి వీరోగ్రుఁడు మేఘనాదుఁడు దశాస్యాత్మోద్భవుం డుగ్ర సంగరమం దింద్రు జయింప వీర్యమున దుఃఖం బంది దైన్యమ్మునన్ ధర లంకాపురి నిర్జరేశ్వరుఁడు సంతప్తాత్ముఁడై యక్కటా సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుం డయ్యె దైత్యాళికిన్ [హరి = ఇంద్రుఁడు]
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. హరిని జపియించ ప్రహ్లాదు డనవరతముతనదు నామము జపియించ మనుచు తండ్రి యెన్నొ యిడుముల పాల్జేయ వెన్నుడపుడుకాచి రక్షించ ప్రహ్లాదు కరుణ జూపిసురశరణ్యుడు దనుజ దాసుడుగ నయ్యె.
తేటగీతి
రిప్లయితొలగించండిజయ విజయులు శాప నివృత్తి శౌరిఁ జేర
మూడురాక్షస జన్మల వేడుకొనఁగ
వారికై యవతారాల వైరిగఁ గొన
సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె!
మత్తేభవిక్రీడితము
పరమాత్మున్ హరి వేగ చేరు వరమున్ వాంఛించి దౌవారికుల్
ధరపై నెంచఁగ మూడుజన్మలరులౌ దైతేయ దౌర్భాగ్యమున్
దురితుల్ బంట్లను రాగమై తొడిగె సంతోషాన రూపాంతరాల్
సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఅరయన్దైత్యకులంబుశోభిలగతామూఢుండుమూడడ్గులన్
రిప్లయితొలగించండితిరిపెంబీయగచక్రవర్తిబలితాతెచ్చెంగభృత్యుండునై
అరికిన్పుత్రుడుదాపుజేరగనితానాలించిరక్షించెగా
సురలోకైకశరణ్యుడైనహరిదాసుండయ్యెదైత్యాళికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తెచ్చెంగ' అనడం సాధువు కాదు.
సామజము మొరవిని చనె సాకుటకయి
రిప్లయితొలగించండిసురశరణ్యుఁడు ; దనుజదాసుఁడుగ నయ్యె
భక్త సులభుడగు శివుడు వరమునొసగి
ఎడరు నీగ మేలు వరములిడుటకఃటె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసురల శ్రేయము లక్ష్యమై స్మరగురుండు
రిప్లయితొలగించండివామనుండయి దీనతన్ బలిని జేరె
దానమిమ్మని కోరుచు దనుజపతిని
సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశరణుకోరవిభీషణుశాంతుఁజేసి
రిప్లయితొలగించండికాచిరక్షించినాడుగాకాంతకొఱకు
దారినీరీతిదెలిపెగాతరుణమెంచి
సురశరణ్యుడుదనుజదాసుడుగనయ్యె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥ హరియే లోకపాలకుఁడు రజనీచ
రిప్లయితొలగించండిరులఁ దునిమి ధర్మము నిలిపి ప్రోచు చుండు
సురశరణ్యుఁడు, దనుజదాసుఁడుగ నయ్యె
హరుఁడు భక్తి నిలిపి కోర వరము లొసఁగి
మ॥ ధరలో ధర్మము నిల్పు సజ్జనులకున్ ద్రాణంబు నావెన్నుఁడే
సురలోకంబున కాపదల్ పొడవఁగన్ శూరుండుగన్ ద్రుంచడా
సురలోకైకశరణ్యుఁడైన హరి, దాసుండయ్యె దైత్యాళికిన్
హరుఁడే భక్కినిఁ గోరఁ గోర్కెలను సౌహార్ద్యమ్ముతోఁ దీర్చుచున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅసుర సుతుడైన ప్రహ్లాదు డనవరతము
తనదు నామమున్ జపియింప కినుక బూని
తండ్రి సంహరింపగ బూను తరుణమందు
సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె.
అరియే విష్ణువు, వానినామమును ప్రహ్లాదుండు నిత్యమ్ము తా
స్మరియింపంగ హిరణ్య కశ్యపుడె యామర్షమ్ము దండింపగా
నిరతమ్మాతని రక్షజేయుటొకటే నేమమ్ముగా దాల్చుచున్
సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిబ్రహ్మ మానస పుత్రుల రాకనరసి
రిప్లయితొలగించండియడ్డ గించిరి ద్వారకుల్ హరిని చేర
శాప హతులైన వారిని సంహరింప
సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె
హరికైవచ్చిరి బ్రహ్మమానస సుతుల్ హర్షాతిరేకంబునన్
దరికేతెంచిన వారినడ్డుకొనిరే దౌవారికుల్ చూడగా
మరి శాపంబును గొన్న పాలసులనే మ్రందించు వ్యావృత్తితో
సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఅసుర గణముల పరిమార్ప నవ త రించి
రిప్లయితొలగించండిధర్మము ను నెల. కొల్పెను ధరణి యందు
సురల పక్షము గా నుండు హరి యెటు లగు
సుర శ ర ణ్యు డు ద నుజ దాసు డు గ నగు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరియే వామనమూర్తియై యమరులందాసక్తితో చెచ్చెరన్
రిప్లయితొలగించండితిరిపమ్మెత్తెగ దానవేంద్రు కడకేతేరెన్ గదా దీనుడై
సురలన్గావఁగ కూర్మరూపుఁడయితా సొక్కెన్ గదా వార్ధిలో
సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య : సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె
రిప్లయితొలగించండిధర్మ ఘాతకుల్ చేసిన తప్పిదమున
దనుజ సదృశులైనట్టి నేతలకు నేడు
సిరుల దేవాలయమ్ములు జిక్కె గాన
సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె
నేడు దేవాలయాలు మరియు నిర్ణయాధికారం దనుజ సన్నిభులైన పాలకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ...."సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె"
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండితే.గీ:తపమునకు లొంగు పరమేష్టి దైత్యు నైన
రిప్లయితొలగించండికనికరించు గజాసురు గర్భ మందె
తాను బంధితుం డయ్యెను తపము మెచ్చి
సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిThank you sir!
తొలగించండిమ:కరకౌ పల్కుల నింద్రజిత్తనియె,"లంకారాజ్య నిర్మాత సో
రిప్లయితొలగించండిదరుడై,యద్భుత వీరుడై,యమిత మేధాశక్తితో దేవతా
సురలోకైకశరణ్యుఁడైన, హరి దాసుండయ్యె దైత్యాళికిన్
పరువే దీయుచు పిన్నతండ్రి తలచన్ పాపమ్ము గా ఆతనిన్.
("మా నాయన ఐన రావణాసురుడే దేవతలకి, రాక్షసులకీ కూడా శరణ్యం. అలాంటి అన్నని వదిలి మా బాబాయి విభీషణుడు హరిదాసు లాగా తయారై రాక్షసుల పరువు తీసాడు. అతణ్ని తలుచుకొంటే పాపం"అని ఇంద్రజిత్ అన్నట్లు. )
కాతు రమరులు మర్త్య నికాయము నసు
రిప్లయితొలగించండిర గణ తర్జనముల నుండి రమ్య రీతి
వేఁడ శరణమ్ము సద్భక్తి తోడ వీత
సుర శరణ్యుఁడు దనుజ దాసుఁడుగ నయ్యె
అరి వీరోగ్రుఁడు మేఘనాదుఁడు దశాస్యాత్మోద్భవుం డుగ్ర సం
గరమం దింద్రు జయింప వీర్యమున దుఃఖం బంది దైన్యమ్మునన్
ధర లంకాపురి నిర్జరేశ్వరుఁడు సంతప్తాత్ముఁడై యక్కటా
సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుం డయ్యె దైత్యాళికిన్
[హరి = ఇంద్రుఁడు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
హరిని జపియించ ప్రహ్లాదు డనవరతము
తనదు నామము జపియించ మనుచు తండ్రి
యెన్నొ యిడుముల పాల్జేయ వెన్నుడపుడు
కాచి రక్షించ ప్రహ్లాదు కరుణ జూపి
సురశరణ్యుడు దనుజ దాసుడుగ నయ్యె.