14-1-2025 (మంగళవారం)కవిమిత్రులారా,సంక్రాంతి శుభాకాంక్షలు!ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చాంద్రమానమున మకర సంక్రమణము”(లేదా...)“కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిసూర్య చంద్ర గమనముల చూచివంతకాలమానమా పేర్లను కలిగియుండెమనకు పర్వమగుచు పుష్యమాసయుక్తచాంద్రమానమున మకర సంక్రమణము
మత్తేభవిక్రీడితముమనకామోదము చాంద్రమానము గనన్ మాసమ్ములారీతి వచ్చును సాగున్ గద చైత్రమందు మొదలౌచున్ ఫాల్గుణమ్మందునన్వనముల్ గోల్పడ నాకులున్ ముగియుచున్ బంటల్ గొనన్ బుష్యమైకనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
తనరన్ కాలము సౌరమానము గనన్ తారీకులన్ దప్పునేఘనమౌ మానము చంద్ర మానమధికంగంజేర్చి మాసంబులన్వెనువెంటన్ సరియౌను దానటతిథుల్ వేర్వేరు కాగా జనుల్కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్!!
సూర్యమానమున గణించి చూచి నంతసాలునకొకమారు మకర సంక్రమణముప్రతినెల కొకమారు జరుగు వాసి గానుచాంద్రమానమున మకర సంక్రమణము.ధనురాశిన్ విడి పౌష్యమాసమున దీప్తాంశుండు తర్వాతి రాశినిజేరంగదలంచుచున్ మకరరాశిన్ జేరు నవ్వేళలోఘనమౌ పర్వము నుత్తరాయణమదే కల్పంబు బ్రారంభమౌ కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్.
సూర్య చంద్రుల గమనము నార్యు లరసి కాల మానము లంచు ను గల్ప నముగదెలుప జరుగు చుండు ను గదా దేశ మందు చాంద్ర మానము న మకర సంక్రమణము
కాలగణనకు మూలము గౌరుని గతిచాంద్రమానమున ; మకర సంక్రమణముసూరి మకర రాశిని చొచ్చు సూచనయేనువరుణ, శశుల మానములందు వాసిమెండు
మును పాటించిరి కాలమానములు సోముండున్ దినేంద్రుండు భ్రామణముల్సేయుట లక్ష్యమౌచు, నయినన్ మాన్యంబులున్ బండఁ బ్రీ తిని క్షేత్రంకరులాచరించుటను వే దేశంబులన్ జేరుటన్ గనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
పూర్వకాలాన భారత భూమి పైనచాంద్రమానము వెలుగొందె సాధనముగభారతావనిని గణింత్రు ప్రాజ్ఞులెపుడుచాంద్రమానమున మకర సంక్రమణముతనరారున్ గద సౌరమానమిటఁ బ్రాధాన్యంబు సంప్రాప్తమైమన పూర్వీకులు లెక్కబెట్టుటకు ప్రామాణ్యంబు శీతాంసుడేమన సమ్మానము చాంద్రమానమయినన్ మాసాలు లెక్కింపగాకనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
పూజచేయుచు పలుకునే పూర్వులంతచాంద్రమానమున మకర సంక్రమణముమకరరాశిన జేరు ప్రభాకరుండు సంచరించెడి భువినది సంభవించె
తే॥ భూమి సూర్యుని కక్షలోఁ బూని తిరుగవర్షమొకటి నడచుఁ గద భ్రమణమునకుదక్షిణము దాటి యుత్తర కక్షఁ జనఁగఁజాంద్ర మానమున మకర సంక్రమణముమ॥ వినుమా భూభ్రమణమ్ముఁ జూడ నినుఁడే పృథ్విన్ గనన్ దేటియైఘనతన్ గాంచుచుఁ జుట్టు నట్లు తలపంగా వచ్చు నీరీతిగన్మనకున్ దగ్గర దూరమౌను కపి యేమానంబు నైనన్ గదాకనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్కపి సూర్యుడు నిఘంటువు సహాయమండి
చంద్ర సూర్యుల గమనమ్ముసాగు చుండుకాల గమన మనుసరించి గగనమందువచ్చుపుష్యమాసమునందువాసిగాను*“చాంద్రమానమున మకర సంక్రమణము*ఘనమౌ పర్వము నియ్యదే గనుమికన్ కన్విం దుచేయించగాజనులాత్రమ్ముగచూచుచుండగనిలన్సంతోషమున్పంచగన్నినుడీరాశిని వీడుచున్ మకరిలోనెక్కంగ సాగన్ వడిన్కనగావచ్చునుచాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్
సౌరమానమున మకర సంక్రమణపు దినము వీక్షింపఁ బ్రతి యేఁడు స్థిర మయి చన మారు చుండు నేఁటేఁటను మానవేంద్ర! చాంద్రమానమున మకర సంక్రమణము జన సంఘాతము సంతసింప వఱలన్ సౌభాగ్య సందోహముల్ తనరం బుణ్యపు టుత్తరాయణము వింతన్ ధాత్రి సూర్యుండు సొచ్చిన నానందము తోడ నా మకర రాశిం బుష్య మాసమ్ములోఁ గనఁగా వచ్చును జాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిసూర్య చంద్ర గమనముల చూచివంత
కాలమానమా పేర్లను కలిగియుండె
మనకు పర్వమగుచు పుష్యమాసయుక్త
చాంద్రమానమున మకర సంక్రమణము
మత్తేభవిక్రీడితము
తొలగించండిమనకామోదము చాంద్రమానము గనన్ మాసమ్ములారీతి వ
చ్చును సాగున్ గద చైత్రమందు మొదలౌచున్ ఫాల్గుణమ్మందునన్
వనముల్ గోల్పడ నాకులున్ ముగియుచున్ బంటల్ గొనన్ బుష్యమై
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
తనరన్ కాలము సౌరమానము గనన్ తారీకులన్ దప్పునే
రిప్లయితొలగించండిఘనమౌ మానము చంద్ర మానమధికంగంజేర్చి మాసంబులన్
వెనువెంటన్ సరియౌను దానట
తిథుల్ వేర్వేరు కాగా జనుల్
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్!!
రిప్లయితొలగించండిసూర్యమానమున గణించి చూచి నంత
సాలునకొకమారు మకర సంక్రమణము
ప్రతినెల కొకమారు జరుగు వాసి గాను
చాంద్రమానమున మకర సంక్రమణము.
ధనురాశిన్ విడి పౌష్యమాసమున దీప్తాంశుండు తర్వాతి రా
శినిజేరంగదలంచుచున్ మకరరాశిన్ జేరు నవ్వేళలో
ఘనమౌ పర్వము నుత్తరాయణమదే కల్పంబు బ్రారంభమౌ
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్.
సూర్య చంద్రుల గమనము నార్యు లరసి
రిప్లయితొలగించండికాల మానము లంచు ను గల్ప నముగ
దెలుప జరుగు చుండు ను గదా దేశ మందు
చాంద్ర మానము న మకర సంక్రమణము
కాలగణనకు మూలము గౌరుని గతి
రిప్లయితొలగించండిచాంద్రమానమున ; మకర సంక్రమణము
సూరి మకర రాశిని చొచ్చు సూచనయేను
వరుణ, శశుల మానములందు వాసిమెండు
మును పాటించిరి కాలమానములు సోముండున్ దినేంద్రుండు భ్రా
రిప్లయితొలగించండిమణముల్సేయుట లక్ష్యమౌచు, నయినన్ మాన్యంబులున్ బండఁ బ్రీ
తిని క్షేత్రంకరులాచరించుటను వే దేశంబులన్ జేరుటన్
గనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
పూర్వకాలాన భారత భూమి పైన
రిప్లయితొలగించండిచాంద్రమానము వెలుగొందె సాధనముగ
భారతావనిని గణింత్రు ప్రాజ్ఞులెపుడు
చాంద్రమానమున మకర సంక్రమణము
తనరారున్ గద సౌరమానమిటఁ బ్రాధాన్యంబు సంప్రాప్తమై
మన పూర్వీకులు లెక్కబెట్టుటకు ప్రామాణ్యంబు శీతాంసుడే
మన సమ్మానము చాంద్రమానమయినన్ మాసాలు లెక్కింపగా
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
పూజచేయుచు పలుకునే పూర్వులంత
రిప్లయితొలగించండిచాంద్రమానమున మకర సంక్రమణము
మకరరాశిన జేరు ప్రభాకరుండు
సంచరించెడి భువినది సంభవించె
తే॥ భూమి సూర్యుని కక్షలోఁ బూని తిరుగ
రిప్లయితొలగించండివర్షమొకటి నడచుఁ గద భ్రమణమునకు
దక్షిణము దాటి యుత్తర కక్షఁ జనఁగఁ
జాంద్ర మానమున మకర సంక్రమణము
మ॥ వినుమా భూభ్రమణమ్ముఁ జూడ నినుఁడే పృథ్విన్ గనన్ దేటియై
ఘనతన్ గాంచుచుఁ జుట్టు నట్లు తలపంగా వచ్చు నీరీతిగన్
మనకున్ దగ్గర దూరమౌను కపి యేమానంబు నైనన్ గదా
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
కపి సూర్యుడు నిఘంటువు సహాయమండి
చంద్ర సూర్యుల గమనమ్ముసాగు చుండు
రిప్లయితొలగించండికాల గమన మనుసరించి గగనమందు
వచ్చుపుష్యమాసమునందువాసిగాను
*“చాంద్రమానమున మకర సంక్రమణము*
ఘనమౌ పర్వము నియ్యదే గనుమికన్ కన్విం దుచేయించగా
జనులాత్రమ్ముగచూచుచుండగనిలన్సంతోషమున్పంచగన్
నినుడీరాశిని వీడుచున్ మకరిలోనెక్కంగ సాగన్ వడిన్
కనగావచ్చునుచాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్
సౌరమానమున మకర సంక్రమణపు
రిప్లయితొలగించండిదినము వీక్షింపఁ బ్రతి యేఁడు స్థిర మయి చన
మారు చుండు నేఁటేఁటను మానవేంద్ర!
చాంద్రమానమున మకర సంక్రమణము
జన సంఘాతము సంతసింప వఱలన్ సౌభాగ్య సందోహముల్
తనరం బుణ్యపు టుత్తరాయణము వింతన్ ధాత్రి సూర్యుండు సొ
చ్చిన నానందము తోడ నా మకర రాశిం బుష్య మాసమ్ములోఁ
గనఁగా వచ్చును జాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్