ముచ్చట తోడఁ వచ్చిరని ముందుగ నెర్గని వారు పిల్వగా పచ్చిగ పారితోషకపు పైకము గూర్చి వచింపకుంటినే కచ్చితమైన రొక్కమును కమ్మన దెల్పని కార్యదర్శి తా నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో
[ క్రొత్తదైన సంస్థ అవధానము నిర్వహించ దలచి నపుడు ఆ సంస్థ కార్యదర్శి అవధాని దగ్గరకొచ్చి అతడు సమ్మతింపగా తామిచ్చే సంభావన వివరాలు చెప్పక నిష్క్రమించిన తదుపరి అవధాని యొక్క అంతరంగము ]
ఉత్పలమాల
రిప్లయితొలగించండిమెచ్చగ పృచ్ఛకుల్ మరియు మేదిని ప్రేక్షకులెల్లముగ్ధులై
కచ్చితమైన భావమును కమ్మగనప్పటి కప్పుడున్ దగన్
నచ్చిన రీతి పాటవము నల్గురు భేషనఁ దేటతెల్లమౌ
నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో!
ఇచ్చు సమస్య తానెరిఁగి యింపుగ పూరణ జేసి పద్యమున్
రిప్లయితొలగించండిమెచ్చగ పండితాళి యటుమీదట ధారణజేసి చెప్పినన్
నచ్చి ప్రశంస జేసెదరు నల్వురు, యట్టులగాక ప్రాశ్నికుం
డిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో
రిప్లయితొలగించండివచ్చును కాదె పిల్చిరని పండితు లాడెడి క్రీడ యంచు తా
వచ్చిన పండితోత్తముల ప్రశ్నల కెల్లను పద్య మాలలన్
గ్రుచ్చు వధాని వర్యునకు కూరిమి తో నట పారి తోషకం
బిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో?
మెచ్చెడి కైపదంబులను మేలగురీతిని పూర్తి చేయకన్
రిప్లయితొలగించండిపిచ్చిగ మాటలాడగనె పృచ్ఛకునెన్నడు మారుమా టగన్
నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో !
వచ్చిన వారలందరికి వచ్చును సందియమివ్విధం బుగన్
ముచ్చట తోడఁ వచ్చిరని ముందుగ నెర్గని వారు పిల్వగా
రిప్లయితొలగించండిపచ్చిగ పారితోషకపు పైకము గూర్చి వచింపకుంటినే
కచ్చితమైన రొక్కమును కమ్మన దెల్పని కార్యదర్శి తా
నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో
[ క్రొత్తదైన సంస్థ అవధానము నిర్వహించ దలచి నపుడు ఆ సంస్థ కార్యదర్శి అవధాని దగ్గరకొచ్చి అతడు సమ్మతింపగా తామిచ్చే సంభావన వివరాలు చెప్పక నిష్క్రమించిన తదుపరి అవధాని యొక్క అంతరంగము ]
నచ్చె డు రీతి పృచ్చకులు నవ్య పథంబుల ద్రొ క్క కుండగన్
రిప్లయితొలగించండిమెచ్చు సమస్య లన్బుధులు మేలను భంగి నొసంగు టా ప్ప గున్
ముచ్చట దీర 0ప్రేక్షకులు మోదము లన్ బ్రకటింప లేని దై
యిచ్చిన దేమిటో తెలియ నీయని దైన వధా న మెందు కో?
ఉ:వచ్చుట కెంత ఖర్చగును? వ్రాయ సమస్య యదెంత కష్టమో!
రిప్లయితొలగించండియిచ్చట గూర్చొనన్ సమయ మెంతగునో!యిక నాకు పారితోషిక
మ్మిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో!
వచ్చితి మెప్పు బొంద, నది వచ్చిన జాలని పృచ్ఛకుం డనెన్.
(తమాషాకి)
ఉ॥ నచ్చిన రీతిఁ బూరణల నవ్యమటంచు ఘటించ వింతగన్
రిప్లయితొలగించండిద్రచ్చిన భావమేమనుట తట్టక మూర్ఛిలఁ బృచ్ఛకాళియే
వచ్చిన ప్రేక్షకాళి తగు ప్రార్థన సేయ నటుల్ ముగింపుకై
ఇచ్చిన దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో
(అవధాని ఇచ్చిన పూరణలు అయోమయములో ముంచేసిన అనే భావముతో నండి)
ఉ:ఇచ్చెద నచ్చ తెల్గుననె యెంతటి క్లిష్టసమస్య నైన, నే
రిప్లయితొలగించండినిచ్చిన లిప్త లోన నత డెంచు సుదీర్ఘసమాస మేదియో
చచ్చిన గాని యర్థ మయి చావదు నాకిక పూరణమ్ము దా
నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో”
ఇచ్చ వహించి వేగ మరుదెంచిన యీ యవధాని కింకనున్
రిప్లయితొలగించండివిచ్చిన బుద్ధిఁ బాల్గొనిన పృచ్ఛక కోటికి నాలకింపఁగా
వచ్చి భరింప నోర్పు గల వారికి మేలొనగూడ నింపుగా
నిచ్చెడి దేమిటో తెలియనీయని దైన వధాన మెందుకో
వచ్చె కరమ్ము నెయ్యమున ప్రజ్ఞను జూప వధానమందునన్
రిప్లయితొలగించండిమెచ్చి సభాసదుల్ తనకు మేలగు కానుక లిత్తురంచు, నే
మిచ్చుట లేదటంచు నెఱిగించ వధాని వచించె నేడు నా
కిచ్చెడి దేమిటో తెలియనీయని దైన వధాన మెందుకో?
వచ్చెను పెద్దపండితుడు పద్యము లూరెడి బావితానెనన్
రిప్లయితొలగించండిపృచ్ఛకులందరిప్రశ్నలు వెర్రితనంబుగ విప్పెనాతడున్
ఖచ్చితభావమున్ వదలి గందరగోళము చేసెనే సభన్
నిచ్చెడి దేమిటో తెలియనీయనిదైన వధాన మెందుకో?