29-5-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్”
(లేదా...)
“రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్”
(ఉప్పలధడియం భరత్ శర్మ ఏకదిన శతావధానం సమస్య)
కందంజేతగ దిక్పతులోడఁగప్రీతిన్ రావణుఁ బొగడుచు వేడుకఁ జేయన్జోతల నర్పించి సురారాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్ఉత్పలమాలజేతగనిల్చి దిక్పతులఁ జేయఁగ బానిసలట్లు నుద్ధతిన్ప్రీతిని రావణాసురుని వీరుడు శూరుడటంచు వేడుకన్జోతలనందఁజేసి పలు స్తోత్రములందున మ్రొక్కుచున్ సురారాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్!
లాతుగ గష్టము నొందుచు చాతుర్యము జూపుచుండి చక్కటి రీతిన్ యాతువు బొమ్మను చెక్కినరాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేతను డైన వృశాంకునిచేతను శూలమ్ము దాల్చు శ్రీ కంఠునిగా ఖ్యాతిని గడించిన పురా రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్.చేతను డైన భూరి శశిశేఖరు డైన వృశాంకునిన్ స్వయం భూతుని మృత్యువంచకుని బూచుల రాయుని జింక తాల్పు గా ఖ్యాతి గడించి నట్టి ధర కార్ముకు డైన నియంత యంధకా రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్.
సీతాపతి రావణునకుఁభ్రాత యగు విభీషణునకు లంకనొసగగాప్రీతిని గని దశకంఠారాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్సీతను మ్రుచ్చిలించెనని సేతువు గట్టెను లంకఁ జేరగాజేతగ నిల్చి యుద్ధమున జేసె విభీషణునే భురిక్కుగాప్రీతిని దైత్యులెల్లరును శ్రీరఘు రాముని మెచ్చి రావణారాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
-పాత గురువులే చెప్పగరాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్జోతల తోడై, పడిపడి కోతియొకటి గాంచి నవ్వె గువ్వల చెన్నా !!https://youtube.com/shorts/pgdtRYME8lk?si=mnX-q4GTstCYXGe-
జాతికి వన్నెలు దెఛ్చియు ఖ్యాతిని గడియించి నట్టి ఘనతరు లంకన్ ప్రీతిగ రావణు కు సురారాతికి బూమాల లిడిరి రాక్షసులెల్ల న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'రావణునకు' అనడం సాధువు.
ఉ॥ దాతగఁ బ్రోచు నీశ్వరుఁడు ధన్యతఁ గాంచఁగ దైత్యులెల్లరున్ద్రాతగ నిల్చి భారమిలఁ దాల్చుచు మ్రొక్కెదమంచుఁ జూడఁగన్జ్యోతులు నింపి కన్నులను శోభగఁ గన్పడ లింగరూపునన్రాతినిఁ గొల్వ రాక్షసులు రాసిగఁ బోసిరి స్వర్ణ పుష్పముల్పురారాతికి అని అందరూ వ్రాసి యుంటారని మార్చానండి
కం:నీతియె లేని ప్రభునకున్,సీత నపహరించు పాప చిత్తునకున్,కామాతురునకు,దయ నెరుగనిరాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్”(యథాతథంగా కూడా పూరించ వచ్చు.)
ఆతత భక్తి సెలఁగ నౌరా తగు నిలయమ్ము గాఁగ లంకేశున కా నేతకుఁ ద్రికూటపుం బ్రతి రాతికిఁ బూమాల లిడిరి రాక్షసు లెల్లన్ ఖ్యాతి గడింప మిక్కుటముగా నసురాలి మహా శరణ్యు సంపాతి సహోద రాంతకుని వైష్ణవ సంయమి యక్ష దేవతా జాతికి నెల్ల ఘోర తర శత్రువు స్త్రీగణ లోలు రాఘ వారాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్
ఘాతకుడై చరించుచును కైకసి పుత్రుడు సాధు సంఘమున్ యాతన బెట్టుచున్, విజయ మంది కుబేరుని పుష్పకమ్ము ప్రఖ్యాతి నెఱింగి సమ్మదముఁ గైకొన సంపద తోడ, రాఘవా రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సమస్యరాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్ "ఉ మా::సీతను దెచ్చె లంకకును, శీఘ్రము సోదరి శాంతమందగన్ ప్రీతిని బంది చేసి. తన పేర్ముడి చాటగ నెంచు రావణున్ఖ్యాతిని మేటిగా దలచి, కైకసి పుత్రుని రూపు నిల్పి యా రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్ "
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఖ్యాతి గడించిన రాక్షసనేతకు విగ్రహముఁ బెట్టి నియమముగ గుడిన్జ్యోతులు వెలిగించుచు నారాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్.
కందం
రిప్లయితొలగించండిజేతగ దిక్పతులోడఁగ
ప్రీతిన్ రావణుఁ బొగడుచు వేడుకఁ జేయన్
జోతల నర్పించి సురా
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్
ఉత్పలమాల
జేతగనిల్చి దిక్పతులఁ జేయఁగ బానిసలట్లు నుద్ధతిన్
ప్రీతిని రావణాసురుని వీరుడు శూరుడటంచు వేడుకన్
జోతలనందఁజేసి పలు స్తోత్రములందున మ్రొక్కుచున్ సురా
రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్!
లాతుగ గష్టము నొందుచు
రిప్లయితొలగించండిచాతుర్యము జూపుచుండి చక్కటి రీతిన్
యాతువు బొమ్మను చెక్కిన
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచేతను డైన వృశాంకుని
చేతను శూలమ్ము దాల్చు శ్రీ కంఠునిగా
ఖ్యాతిని గడించిన పురా
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్.
చేతను డైన భూరి శశిశేఖరు డైన వృశాంకునిన్ స్వయం
భూతుని మృత్యువంచకుని బూచుల రాయుని జింక తాల్పు గా
ఖ్యాతి గడించి నట్టి ధర కార్ముకు డైన నియంత యంధకా
రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్.
సీతాపతి రావణునకుఁ
రిప్లయితొలగించండిభ్రాత యగు విభీషణునకు లంకనొసగగా
ప్రీతిని గని దశకంఠా
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్
సీతను మ్రుచ్చిలించెనని సేతువు గట్టెను లంకఁ జేరగా
జేతగ నిల్చి యుద్ధమున జేసె విభీషణునే భురిక్కుగా
ప్రీతిని దైత్యులెల్లరును శ్రీరఘు రాముని మెచ్చి రావణా
రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి-
రిప్లయితొలగించండిపాత గురువులే చెప్పగ
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్
జోతల తోడై, పడిపడి
కోతియొకటి గాంచి నవ్వె గువ్వల చెన్నా !!
https://youtube.com/shorts/pgdtRYME8lk?si=mnX-q4GTstCYXGe-
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజాతికి వన్నెలు దెఛ్చియు
రిప్లయితొలగించండిఖ్యాతిని గడియించి నట్టి ఘనతరు లంకన్
ప్రీతిగ రావణు కు సురా
రాతికి బూమాల లిడిరి రాక్షసులెల్ల న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రావణునకు' అనడం సాధువు.
ఉ॥ దాతగఁ బ్రోచు నీశ్వరుఁడు ధన్యతఁ గాంచఁగ దైత్యులెల్లరున్
రిప్లయితొలగించండిద్రాతగ నిల్చి భారమిలఁ దాల్చుచు మ్రొక్కెదమంచుఁ జూడఁగన్
జ్యోతులు నింపి కన్నులను శోభగఁ గన్పడ లింగరూపునన్
రాతినిఁ గొల్వ రాక్షసులు రాసిగఁ బోసిరి స్వర్ణ పుష్పముల్
పురారాతికి అని అందరూ వ్రాసి యుంటారని మార్చానండి
కం:నీతియె లేని ప్రభునకున్,
రిప్లయితొలగించండిసీత నపహరించు పాప చిత్తునకున్,కా
మాతురునకు,దయ నెరుగని
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్”
(యథాతథంగా కూడా పూరించ వచ్చు.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆతత భక్తి సెలఁగ నౌ
రిప్లయితొలగించండిరా తగు నిలయమ్ము గాఁగ లంకేశున కా
నేతకుఁ ద్రికూటపుం బ్రతి
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసు లెల్లన్
ఖ్యాతి గడింప మిక్కుటముగా నసురాలి మహా శరణ్యు సం
పాతి సహోద రాంతకుని వైష్ణవ సంయమి యక్ష దేవతా
జాతికి నెల్ల ఘోర తర శత్రువు స్త్రీగణ లోలు రాఘ వా
రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్
ఘాతకుడై చరించుచును కైకసి పుత్రుడు సాధు సంఘమున్
రిప్లయితొలగించండియాతన బెట్టుచున్, విజయ మంది కుబేరుని పుష్పకమ్ము ప్ర
ఖ్యాతి నెఱింగి సమ్మదముఁ గైకొన సంపద తోడ, రాఘవా
రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య
రిప్లయితొలగించండిరాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్ "
ఉ మా::
సీతను దెచ్చె లంకకును, శీఘ్రము సోదరి శాంతమందగన్
ప్రీతిని బంది చేసి. తన పేర్ముడి చాటగ నెంచు రావణున్
ఖ్యాతిని మేటిగా దలచి, కైకసి పుత్రుని రూపు నిల్పి యా
రాతినిఁ గొల్వ రాక్షసులు రాశిగఁ బోసిరి స్వర్ణపుష్పముల్ "
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఖ్యాతి గడించిన రాక్షస
నేతకు విగ్రహముఁ బెట్టి నియమముగ గుడిన్
జ్యోతులు వెలిగించుచు నా
రాతికిఁ బూమాల లిడిరి రాక్షసులెల్లన్.