29, మే 2026, శుక్రవారం

సమస్య - 5482

30-5-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్”

(లేదా...)

“గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుండు హింసింపఁగన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ ఏకదిన శతావధానం సమస్య)


20 కామెంట్‌లు:

  1. కందం
    మదిలోఁ గలయువరాజును
    కుదిరించెను నాన్నయనుచు కూరిమి దలఁచన్
    వెధవ యని తెలియ పిదపన్
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్


    గది = గదను ధరించిన వాడు విష్ణువు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      మదిలో నెంచిన మన్మథుండు దొరికెన్ మామంచి వాడంచుఁ దా
      ముదమొందన్ మురిపెమ్ము దీరెననగన్ మూన్నాళ్లు మోహమ్మునన్
      ముదనష్టంపు మగండనన్ జెలఁగి ముప్పొద్దుల్ ధనంబెంచఁగన్
      గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుండు హింసింపఁగన్!

      తొలగించండి

  2. నిదురను విడి తా భక్తిని
    సదాగతి పటమ్ము జేరి సద్భక్తిని యా
    గది గోడకు తగిలించిన
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్.


    హృదయమ్మందున నిల్పి కొల్చెదను హే యిందీ వరా కావుమా
    వదలన్ లేనని వార కాంతలను వ్యాపారమ్ము లన్ మాన సం
    పదలెల్లన్ హరియించె కూడదనగా బాధించె నన్నంచు నా
    గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుండు హింసింపఁగన్.

    *(గదను ధరించు వాడు విష్ణువు=గద)*

    రిప్లయితొలగించండి
  3. గదయే యాయుధముగ గల
    ఎదచూలి సుతుడగు హనుమ యిమ్మగు రీతిన్
    మదిదలపు జేయగనె యా
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్”

    రిప్లయితొలగించండి
  4. మదనుడు సందడి సేయగ
    మదినిండెను వాంఛలనుచు మగఁడు పిలిచినన్
    జెదరదు నా భక్తి యనుచు
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్

    మదిలో వాంఛలు దీర్చరావె యనుచున్ మత్కాంతుడే పిల్చినన్
    హృదయంబంతయు నిండియున్న మగడే హేలాగతిన్ వేడినన్
    బదిలంబైన మనస్సులో నిలువుమా వాతాత్మజా యంచునా
    గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుండు హింసింపఁగన్

    [గది = గదను ధరించినవాఁడు (హనుమంతుడు)
    హింసింపఁగన్ = తొందరచేయగా]

    రిప్లయితొలగించండి
  5. మ॥ మదిరా పానపు మత్తు నావిధిగ సమ్మానించి సంసారమున్
    హృదిలోఁ దాల్చక విత్తమెల్ల నటులన్ హీనంపు రీతిన్ వృథా
    పొదపెట్టంగ సహించఁ జాలక నహో పూజించ నింపాదికై
    గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుఁడు హింసింపఁగన్

    పొదపెట్టు చేయు గది గదను ధరించిన వాడు విష్ణువు

    రిప్లయితొలగించండి
  6. కం॥
    పదినెలలుడుగక నడుగన్
    పెద పందిరి మంచము గొన పెనిమిటియొప్పన్-
    కుదురు కొలతలీయఁ బడక
    గదినిఁగొలిచె గాంత భర్త గదిలో నుండన్!

    రిప్లయితొలగించండి
  7. హృదయమ్మందున బ్రేమ ముప్పిరిగొనన్ హేరాలమౌ కాంక్షతో
    మధురమ్మైన తలంపులన్ మదిని సంభావించి సేవించినన్
    ముదమొక్కింతయు జూపకున్నఁబతితోఁ బోనాడ కష్టమ్ములన్
    గదికిన్ భక్తిని మ్రొక్కె, గాంత గదిలో గాంతుండు హింసింపగన్

    రిప్లయితొలగించండి
  8. ఎద సంతసింపఁ దన ప
    న్నిద మందు గెలువఁ దలంచి నిశ్శంక వెసం
    గదిసి తెలుపఁ బరిమాణము
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్


    సుదతీ రత్నము శాంత మానస మహో శోభిల్ల నిశ్చింతయై
    పదిలం బెంచి నిజాంతరంగమున సంపాదింప సౌభాగ్యమున్
    ముద మారంగఁ గుమారు నిమ్మనుచు నంభోజాక్షుఁ గౌమోదకీ
    గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుండు హింసింపఁగన్

    [గది = గదాధారి]

    రిప్లయితొలగించండి
  9. కం:మదికిన్ శాంతి నొసంగడు
    గదిలో హింసించు భర్త కష్టము దీర్చన్
    మదిలో శంఖిని, చక్రిని
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్”

    రిప్లయితొలగించండి
  10. మదిరము గ్రోలియు మత్తున
    నిదురించె డి వాని వోలె నిశ్చలు డైనన్
    మదిలో వేదన తో నా
    గదిని గొలిచె కాంత భర్త గదిలో నుండన్

    రిప్లయితొలగించండి
  11. 2)మ:పది యేం డ్లయ్యెను బెండ్లియై యుడుపులన్,బంగారమున్, గట్నమున్
    మదికిన్ దోచిన యంత గుంజి యును బ్రేమన్ జూప డేనాడు నా
    హృదయం బింతయులేని భర్త, కన లే కే దిక్కు నా చక్రికిన్
    గదికిన్ భక్తిగ మ్రొక్కె గాంత గది లో గాంతుండు హింసించగన్
    ( ఈ సమస్య నేను ఇచ్చినదే.గది అంటే శ్రీమహావిష్ణువు అనే అర్థం ఉన్నది. ఆ శ్లేషని గమనించి పూరణ రప్పించటానికే ఈ సమస్య ఇచ్చాను.పండితు లైన అవధాని గారు ఆ శ్లేష తోనే పూరించి సమస్యకి పూర్తి న్యాయం చేసారు.)

    రిప్లయితొలగించండి
  12. మ:"గది లో వాస్తున దోష ముండె, నది చక్కన్ జేసి యా దేవునిన్
    మది లో మ్రొక్కు" మటన్న సూచనల దా మన్నించి ,యా భర్తయే
    పది తిట్టన్ సహియించి, మార్పు లెవియో పాటించి శోభించ నా
    గదికిన్, భక్తిని మ్రొక్కెఁ గాంత గదిలోఁ గాంతుండు హింసింపఁగన్
    (ఇక్కడ గది అంటే రెండు చోట్లా రూం అనే అర్థం. ఆమె వాస్తుదోషం సవరించి దేవునికి మ్రొక్కింది. )

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వదలక యుండగ రోగము
    మదిలో దుఃఖించుచు సతి మాంగల్యమునే
    పదిలముగా నమ్ముచు నా
    గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్.

    రిప్లయితొలగించండి