31-5-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసికత లేనట్టివాఁడె రసరాజు గదా”
(లేదా...)
“రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ ఏకదిన శతావధానం సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంపసఁజూపెఁ జేమకూరయె!విసిగించిన నూర్వశిఁగొన విజయుడు పారెన్వసుధన్ నరుండనైతికరసికత లేనట్టివాఁడె రసరాజు గదా!చంపకమాలరసిక విలాసమున్ జనులు రంజిల వ్రాసెను జేమకూరయే!విసుగును జూపె నూర్వశికి వీరుఁడు శూరుఁడు సవ్యసాచియేవసుధ గణింపఁ బెక్కురిని వావిని వీడి యనైతికమ్ముగన్రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్!
ఇసుమంతయు శంక పడకు మెసగుచు నిన్నను జరిగిన యెన్నికలందున్ వసువును పంచి జయించగరసికత లేనట్టివాఁడె రసరాజు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసహాయ శూరు డనుచు మ నసు దోచె ననుచును జేర నరుడట యా యూ ర్వశి గాదనె యామె యనిన రసికత లేనట్టివాఁడె, రసరాజు గదా.అసురుల ద్రుంచి వృష్ణికి సహాయము చేసిన వీరుడంచు తా విసురుచు కామ దృక్కులను పేరిమి తో దరి జెరినట్టి యూ ర్వశి నట దూటిపుచ్చిన పురందర నందను డా పడంతి పై రసికత లేనివాఁడె, రసరాజ్యము నేలె మనోహరంబుగన్.
-ముసిముసి నగవుల నమ్మడురసికత లేనట్టివాఁడె; రసరాజు గదాపసిగట్టి కొంత ధైర్యమును సూపి రంగమ్మునదిగును షికారులకైhttps://youtube.com/shorts/la3BoZj4QjY?si=pCKaM8zqFzBrMH9a
రుసరుసలాడిన ప్రవరుడురసికత లేనట్టివాఁడె; రసరాజు గదారసరమ్యముగా కావ్యముపసరించిన పెద్దనకవి! పండితవరుడే!రసమయ కావ్యసృష్టి జనరంజక మన్నది నిక్కమేకదారసికుడు గానివాడు రసరమ్యముగా సృజియింప శక్యమేరసహృదయుండు పెద్దన విరాజితు డయ్యెను కీర్తితోడ నౌర! సికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్[సికత = మూత్రకృచ్ఛ్రము, a disease]
మీ పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
రుసరుస లాడుచు వెదలును రసికత లేనట్టి వాడె,::: రసరాజు గదా రసమును నాస్వా దించుచు పసదన మును దెలిసి కొనును పరి పరి విధముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వెడలును' టైపాటు.
చం॥ గుసగుసలాడి రెల్లరిలఁ గొంచము జ్ఞానము కూడ లేనిచోదెసఁగని రాజకీయమున ధీరుని రీతిఁ జెలంగు గొప్పగాఁబసగల వారు మూర్ఖులని భావనఁ జేసెడి లోకమందునన్రసికత లేని వాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్
పసగల కోడెకాడు మది ప్రాణసమన్ సతతమ్ము నెంచుచున్ వసనము నందునన్ మనుచు స్వర్గము జూపెడి వన్నెకాడు, ప్రేయసి పరిరంభమందుకొను హర్షము నాతడు, వేశ్య పొందుతోరసికత లేనివాఁడె, రసరాజ్యము నేలె మనోహరంబుగన్
పస లేకున్నను బండితుఁడు సుమీ ధన మూలము వినుఁడు జగత్తెల్లం బసిఁడి కలుగ నధికమ్ముగ రసికత లేనట్టి వాఁడె రసరాజు గదా బుస బుస పొంగు ప్రాయమును ముట్టని వానికిఁ బిల్ల వానికిన్ మిసి మిసి మోమునం దకట మీసము లింకను రాని వానికిం బసి హృదయుండు బాలునకుఁ బండితు లిట్టి సమస్య నిత్తురే రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్
కం:ఇసు మంతయు చదువని మానిసి రవ్వా సత్తిరాజు నే డాఖ్య గొనెన్రసరాజుగ క్లుప్తము గారసికత లేనట్టివాఁడె రసరాజు గదా”(వాడి పేరు రవ్వా సత్తి రాజు. వాణ్ని రసరాజు అంటారు.)
(2)చం:రసమయ కావ్యముల్ జదువ రాని యతండును వాని జూడగా విసుగు వహించు వాడు తలబెట్టెను పండ్లరసంపు బేరమున్వెస దన వర్తకమ్ముననె వెల్గెను సంఘపు నేత యౌచు నా రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్”(వాడికి రసికత లేదు.పండ్ల రసం వ్యాపారం చేసాడు.దానిలో సంఘనాయకు డయ్యాడు.అలా రసరాజ్యాన్ని ఏలాడు.)
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.విసవిస లాడును సతిపైరసికత లేనట్టి వాడె; రసరాజు గదాసరసము లాడుచు సతితోవిరసమునకు తావులేక విజ్ఞత మెలగున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిపసఁజూపెఁ జేమకూరయె!
విసిగించిన నూర్వశిఁగొన విజయుడు పారెన్
వసుధన్ నరుండనైతిక
రసికత లేనట్టివాఁడె రసరాజు గదా!
చంపకమాల
రసిక విలాసమున్ జనులు రంజిల వ్రాసెను జేమకూరయే!
విసుగును జూపె నూర్వశికి వీరుఁడు శూరుఁడు సవ్యసాచియే
వసుధ గణింపఁ బెక్కురిని వావిని వీడి యనైతికమ్ముగన్
రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్!
ఇసుమంతయు శంక పడకు
రిప్లయితొలగించండిమెసగుచు నిన్నను జరిగిన యెన్నికలందున్
వసువును పంచి జయించగ
రసికత లేనట్టివాఁడె రసరాజు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅసహాయ శూరు డనుచు మ
నసు దోచె ననుచును జేర నరుడట యా యూ
ర్వశి గాదనె యామె యనిన
రసికత లేనట్టివాఁడె, రసరాజు గదా.
అసురుల ద్రుంచి వృష్ణికి సహాయము చేసిన వీరుడంచు తా
విసురుచు కామ దృక్కులను పేరిమి తో దరి జెరినట్టి యూ
ర్వశి నట దూటిపుచ్చిన పురందర నందను డా పడంతి పై
రసికత లేనివాఁడె, రసరాజ్యము నేలె మనోహరంబుగన్.
-
రిప్లయితొలగించండిముసిముసి నగవుల నమ్మడు
రసికత లేనట్టివాఁడె; రసరాజు గదా
పసిగట్టి కొంత ధైర్యము
ను సూపి రంగమ్మునదిగును షికారులకై
https://youtube.com/shorts/la3BoZj4QjY?si=pCKaM8zqFzBrMH9a
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరుసరుసలాడిన ప్రవరుడు
రిప్లయితొలగించండిరసికత లేనట్టివాఁడె; రసరాజు గదా
రసరమ్యముగా కావ్యము
పసరించిన పెద్దనకవి! పండితవరుడే!
రసమయ కావ్యసృష్టి జనరంజక మన్నది నిక్కమేకదా
రసికుడు గానివాడు రసరమ్యముగా సృజియింప శక్యమే
రసహృదయుండు పెద్దన విరాజితు డయ్యెను కీర్తితోడ నౌ
ర! సికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్
[సికత = మూత్రకృచ్ఛ్రము, a disease]
మీ పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిరుసరుస లాడుచు వెదలును
రిప్లయితొలగించండిరసికత లేనట్టి వాడె,::: రసరాజు గదా
రసమును నాస్వా దించుచు
పసదన మును దెలిసి కొనును పరి పరి విధముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెడలును' టైపాటు.
చం॥ గుసగుసలాడి రెల్లరిలఁ గొంచము జ్ఞానము కూడ లేనిచో
రిప్లయితొలగించండిదెసఁగని రాజకీయమున ధీరుని రీతిఁ జెలంగు గొప్పగాఁ
బసగల వారు మూర్ఖులని భావనఁ జేసెడి లోకమందునన్
రసికత లేని వాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్
పసగల కోడెకాడు మది ప్రాణసమన్ సతతమ్ము నెంచుచున్
రిప్లయితొలగించండివసనము నందునన్ మనుచు స్వర్గము జూపెడి వన్నెకాడు, ప్రే
యసి పరిరంభమందుకొను హర్షము నాతడు, వేశ్య పొందుతో
రసికత లేనివాఁడె, రసరాజ్యము నేలె మనోహరంబుగన్
పస లేకున్నను బండితుఁ
రిప్లయితొలగించండిడు సుమీ ధన మూలము వినుఁడు జగత్తెల్లం
బసిఁడి కలుగ నధికమ్ముగ
రసికత లేనట్టి వాఁడె రసరాజు గదా
బుస బుస పొంగు ప్రాయమును ముట్టని వానికిఁ బిల్ల వానికిన్
మిసి మిసి మోమునం దకట మీసము లింకను రాని వానికిం
బసి హృదయుండు బాలునకుఁ బండితు లిట్టి సమస్య నిత్తురే
రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్
కం:ఇసు మంతయు చదువని మా
రిప్లయితొలగించండినిసి రవ్వా సత్తిరాజు నే డాఖ్య గొనెన్
రసరాజుగ క్లుప్తము గా
రసికత లేనట్టివాఁడె రసరాజు గదా”
(వాడి పేరు రవ్వా సత్తి రాజు. వాణ్ని రసరాజు అంటారు.)
(2)చం:రసమయ కావ్యముల్ జదువ రాని యతండును వాని జూడగా
రిప్లయితొలగించండివిసుగు వహించు వాడు తలబెట్టెను పండ్లరసంపు బేరమున్
వెస దన వర్తకమ్ముననె వెల్గెను సంఘపు నేత యౌచు నా
రసికత లేనివాఁడె రసరాజ్యము నేలె మనోహరంబుగన్”
(వాడికి రసికత లేదు.పండ్ల రసం వ్యాపారం చేసాడు.దానిలో సంఘనాయకు డయ్యాడు.అలా రసరాజ్యాన్ని ఏలాడు.)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
విసవిస లాడును సతిపై
రసికత లేనట్టి వాడె; రసరాజు గదా
సరసము లాడుచు సతితో
విరసమునకు తావులేక విజ్ఞత మెలగున్.