23-7-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు”
(లేదా...)
“శివుఁడు నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో క్రొవ్విడి వెంకట రాజారావు గారి సమస్య)
శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు ,సాగు నటుల నిత్యము పతి సతుల జంట నొకరి పాదము లొకరుగ నొత్తు కొనుట ,పాటి యగు కార్యమది యిహపరములందు
శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు ,
రిప్లయితొలగించండిసాగు నటుల నిత్యము పతి సతుల జంట
నొకరి పాదము లొకరుగ నొత్తు కొనుట ,
పాటి యగు కార్యమది యిహపరములందు