కవుల మనస్సుకందనివి కల్పన చేయని గాథలున్నవా ధవునకు సత్యభామ పద తాడనమే రసరమ్యమైనదే శివుడు క్రియాత్మకంబయిన చిన్మయ శక్తినుపాశ్రయించులే శివుఁడు నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్
తే.గీ:అంగజుడు గౌరి తో నిట్టు లనియె "నాది భిక్షువును బొంద తప మేల బేల! పుష్ప బాణమును వేతు నది పైన బడిన యంత శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు” (ఆ భిక్షుకుని కోసం తపస్సు అవసరమా? ఒక్క బాణం వేస్తే చాలు. అతను నీ పాదసేవకు డౌతాడు అని మన్మథుడు శివుని ఎగతాళి చేసాడు.)
చం:శివునిది యొక్క పాదమును, చెందు మరొక్క పదమ్ము గౌరికిన్, నవగతి జేయ దల్చి యొక నర్తన నంబకు గజ్జె గట్టె గా! సవినయుడౌచు బాదహతి సైపగ నా హిమశైల వేదికిన్ శివుఁడు నమస్కరించెఁ , బదసేవకుఁడై తన భార్య గౌరికిన్. (శివుని అర్థభాగం పార్వతి.ఒక క్రొత్త రకం నర్తన కోసం కాళ్లకి గజ్జెలు కట్టాడు అంటే భార్యకి గజ్జె కట్టి సేవ చేసినట్లే. అలా గజ్జె కట్టి పాదహతి కి క్షమించ మని మానవులు భూమిని వేడినట్లు శివుడు పర్వత వేదికను వేడుకున్నాడు. )
శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు ,
రిప్లయితొలగించండిసాగు నటుల నిత్యము పతి సతుల జంట
నొకరి పాదము లొకరుగ నొత్తు కొనుట ,
పాటి యగు కార్యమది యిహపరములందు
రిప్లయితొలగించండిహస్తి కక్ష్యమా! నా మాట నాల కించు
మంబ కిక నీవె గాదె వాహన మనంగ
చేసె వందనమప్పుడు చెప్పి నంత
శివుఁడు, గిరిరాట్సుతాపాదసేవకుండు.
దవమున కెల్ల రాజునను దర్పము మానుము వాహనమ్ము వై
యవిరత మందు నీవు మలయమ్మను కొల్వు మటంచు జెప్ప దృం
భువు గళ మందు దాల్చు శశిభూషణుడైన పురంధరండె యౌ
శివుఁడు, నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్.
చక్కనైన మైత్రి పతికి సతికి నడుమ
రిప్లయితొలగించండికవుల కల్పన కందని గాథ లుండ
వంచు శివ తత్వమెరిగి వచించెనతడు
శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు
కవుల మనస్సుకందనివి కల్పన చేయని గాథలున్నవా
ధవునకు సత్యభామ పద తాడనమే రసరమ్యమైనదే
శివుడు క్రియాత్మకంబయిన చిన్మయ శక్తినుపాశ్రయించులే
శివుఁడు నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్
తే॥గీ
రిప్లయితొలగించండిశివుడు గిరిరాట్సుతా పాద సేవకుండ
ని,హరి సిరితో సరసమాడెనేమొ గాని,
సత్యభామ చరణమంటె స్వయము గాను!
సురసమె సతిపాదసెసలు సరసమందు!!
సెసలు: సేవలు
సరస సల్లాప ముల యందు సాగు వేళ
రిప్లయితొలగించండిపాదములు దాకు టగు నంద్రు ప్రము ఖ వరులు వింత యే కా దు సహజ మై వెలుగు గనుక
శివుడు గిరి రా ట్సు తా పాద సే వ కుండు
దుష్ట దనుజుల దురమునఁ దునిమి గౌరి
రిప్లయితొలగించండిభీకరాకృతితో నిల్చె విధుని మ్రోల
క్రోధమును బాపి తాలిమి గూర్చ నయ్యె
శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు
తే.గీ:అంగజుడు గౌరి తో నిట్టు లనియె "నాది
రిప్లయితొలగించండిభిక్షువును బొంద తప మేల బేల! పుష్ప
బాణమును వేతు నది పైన బడిన యంత
శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు”
(ఆ భిక్షుకుని కోసం తపస్సు అవసరమా? ఒక్క బాణం వేస్తే చాలు. అతను నీ పాదసేవకు డౌతాడు అని మన్మథుడు శివుని ఎగతాళి చేసాడు.)
చం:శివునిది యొక్క పాదమును, చెందు మరొక్క పదమ్ము గౌరికిన్,
రిప్లయితొలగించండినవగతి జేయ దల్చి యొక నర్తన నంబకు గజ్జె గట్టె గా!
సవినయుడౌచు బాదహతి సైపగ నా హిమశైల వేదికిన్
శివుఁడు నమస్కరించెఁ , బదసేవకుఁడై తన భార్య గౌరికిన్.
(శివుని అర్థభాగం పార్వతి.ఒక క్రొత్త రకం నర్తన కోసం కాళ్లకి గజ్జెలు కట్టాడు అంటే భార్యకి గజ్జె కట్టి సేవ చేసినట్లే. అలా గజ్జె కట్టి పాదహతి కి క్షమించ మని మానవులు భూమిని వేడినట్లు శివుడు పర్వత వేదికను వేడుకున్నాడు. )
చం॥ భవునట నడ్డగించఁ దన బాధ్యతఁ దెల్పి గణేశుఁ డట్లు కో
రిప్లయితొలగించండిప వివశమొంది చంపఁగను బార్వతి శోకముఁ గాంచి బాధతో
శివుడు నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్
సవినయమొప్ప జీవితునిఁ జక్కగఁ జేసె గణేశునప్పుడే!
భవును+అట భవునట అండి
భవహరుడైన శంకరుని భావన జేయుచు భక్తితో మదిన్
రిప్లయితొలగించండిశివశివ శంకరా యనుచు జేయగ నామజపంబు దీక్షతో
శివమును గూర్చ భక్తునకు శీఘ్రమె దర్శనమీయ గౌరితో
శివుఁడు, నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్
ధరణి శివ నామధేయు లెందఱు వసింప
రిప్లయితొలగించండిరందు నిందు నిశ్చయముగ నెందు నైన
నంచితమ్ముగ వివరింప నందు నొకఁడు
శివుఁడు గిరిరాట్సుతా పాద సేవకుండు
ఉవిదల కున్న యస్త్ర మది యుగ్రపు టల్కయె యన్న సత్యమే
యవును ద్రిమూర్తు లైన సతు లల్గిన దాసులు కాక యుందురే
తివిరి నిశార్థ వేళను సతిం గరుణింపు మటంచు వేఁడుచున్
శివుఁడు నమస్కరించెఁ బద సేవకుఁడై తన భార్య గౌరికిన్
తేటగీతి
రిప్లయితొలగించండిఆది దంపతులు జగతినాదుకొంద్రు
గౌరి యనుమతిఁ ద్ర్య క్షుడు గరళము గొనె
లోక రక్షణార్థమొలుక రోయడెపుడు
శివుఁడు గిరిరాట్సుతా 'పాద' సేవకుండు
పాదము = పద్యములో ఒక చరణము
చంపకమాల
స్తవముల కర్హులై జగతి సర్వ విధంబులఁ గాచు వారనన్
జవమున గౌరి యానతిని సాంబుడు క్ష్వేళము గ్రోలెఁ బూనికన్
వివశత ముగ్ధుడై గిరిజ పిల్పును మెచ్చగ లోకరక్షకై
శివుఁడు నమస్కరించెఁ 'బద' సేవకుఁడై తన భార్య గౌరికిన్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గౌరి సమ్మతించ శివుడు గరళము గొన
ఖేదపడక సురాసురుల్ మోదమందె
లక్షణముగ లోకాలను రక్ష చేయు
శివుడు గిరిరాట్సుతా పాద సేవకుండు.