26, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4984

27-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము”
(లేదా...)
“హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

25, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4983

26-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె”
(లేదా...)
“నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే”

24, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4982

25-12-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ”
(లేదా...)
“చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ”

23, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4981

24-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు”
(లేదా...)
“భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్”

22, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4980

23-12-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”
(లేదా...)
“కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్”

21, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4979

22-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్”
(లేదా...)
“శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్”

20, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4978

21-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్”
(లేదా...)
“పెన్షను వచ్చెనంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా”
(అన్యదేశ్యాలు ప్రయోగింపవచ్చు)

19, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4977

20-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు”
(లేదా...)
“హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ”
(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

18, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4976

19-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్”
(లేదా...)
“వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్”

17, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4975

18-12-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్”
(లేదా...)
“హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

16, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4974

17-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్”
(లేదా...)
“స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్”

15, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4973

16-12-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాయుసుతుఁడు గొట్టె భానుమతిని”
(లేదా...)
“కొట్టెను భీమసేనుఁడు సఖుల్ గన భానుమతీసతిన్ సభన్”

14, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4972

15-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగును దక్షిణకాశి భద్రాచలమ్మె”
(లేదా...)
“దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్రశైలమే”

13, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4971

14-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీవిచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ”
(లేదా...)
“నీవిడినట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్”

12, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4970

13-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్ని హిమమును వెదజల్లె నాకసమున”
(లేదా...)
“అనలమునుండి లేచి హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్”

11, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4969

12-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాండుసుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్”
(లేదా...)
“పాండవు లెంచినారు శిశుపాలునిఁ బొందఁగ నగ్రపూజకున్”

10, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4968

11-12-2024 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె”
(లేదా...)
“కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా”

9, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4967

10-12-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా”
(లేదా...)
“జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్”

8, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4966

9-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె”
(లేదా...)
“శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్”

7, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4965

8-12-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గండపెండెరముం దాల్పఁ గలరె కవులు”
(లేదా...)
“తలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్”

6, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4964

7-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్”
(లేదా...)
“కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్”

5, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4963

6-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్”
(లేదా...)
“స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై”

4, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4962

5-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానం బనెడు విద్య యాంగ్లేయులదే”
(లేదా...)
“అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే”

3, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4961

4-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్”
(లేదా...)
“దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్”
(ఆశావాది ప్రకాశరావు గారి అష్టావధాన సమస్య)

2, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4960

3-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నన్నయ గార మ్మొలుకగ నాట్యముఁ జేసెన్”
(లేదా...)
“నన్నయ గార మొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

1, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4959

2-12-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాసకృతము గాదందురు భారతమును”
(లేదా...)
“వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్”