వనమెల్లా తా జేరి దహనమున్ సల్పిన తరుణము, అరుదెంచగ రా వణ, వనమే పళ్ళెముగా హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్
నచికేత్ గారూ,మీ పూరణ చూసి నేనూ, మా మిత్రులు హాయిగా నవ్వుకున్నాం. ధన్యవాదాలు.
శంకరయ్య గారూ, ధన్యవాదాలు.
నా పూరణ -అనిలాత్మజుఁ డెవ్వఁడు? మేఘనాథుఁ డెవ్వనికి సుతుఁడు? కదనంబున గెల్చిన పతి కే మిచ్చెను సతి?హనుమంతుఁడు; రావణునకు; హారతి పట్టెన్.
చని కాల్చెను లంకాపురి హనుమంతుఁడు;.రావణునకు హారతి పట్టెన్ఘనముగ నా మండోదరివినకయె తన భర్త చనగ వేగమె రణమున్
కం.చని లంకానగరమ్మునఘనశోభనుగాంచిమురిసి కైమోడ్పులతోమనమున నాతని శక్తికిహనుమంతుడు రావణునకు హారతిపట్టెన్
కం.జననాథా! రామాయణ జననాదములో పలికెడు చర్చలు జూడన్వినుటకు వింతయె హతవిధి*హనుమంతుడు రావణునకు హారతి పట్టెన్*
వనమెల్లా తా జేరి ద
రిప్లయితొలగించండిహనమున్ సల్పిన తరుణము, అరుదెంచగ రా
వణ, వనమే పళ్ళెముగా
హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్
నచికేత్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చూసి నేనూ, మా మిత్రులు హాయిగా నవ్వుకున్నాం. ధన్యవాదాలు.
శంకరయ్య గారూ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినా పూరణ -
రిప్లయితొలగించండిఅనిలాత్మజుఁ డెవ్వఁడు? మే
ఘనాథుఁ డెవ్వనికి సుతుఁడు? కదనంబున గె
ల్చిన పతి కే మిచ్చెను సతి?
హనుమంతుఁడు; రావణునకు; హారతి పట్టెన్.
చని కాల్చెను లంకాపురి
రిప్లయితొలగించండిహనుమంతుఁడు;.రావణునకు హారతి పట్టెన్
ఘనముగ నా మండోదరి
వినకయె తన భర్త చనగ వేగమె రణమున్
కం.
రిప్లయితొలగించండిచని లంకానగరమ్మున
ఘనశోభనుగాంచిమురిసి కైమోడ్పులతో
మనమున నాతని శక్తికి
హనుమంతుడు రావణునకు హారతిపట్టెన్
రిప్లయితొలగించండికం.
జననాథా! రామాయణ
జననాదములో పలికెడు చర్చలు జూడన్
వినుటకు వింతయె హతవిధి
*హనుమంతుడు రావణునకు హారతి పట్టెన్*