31, మార్చి 2018, శనివారం

సమస్య - 2637 (కాలికి కాటుక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"
(లేదా...)
"కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

30, మార్చి 2018, శుక్రవారం

దత్తపది - 136 (అమ్మ-అయ్య-అన్న-అక్క)

అమ్మ - అయ్య - అన్న - అక్క
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

29, మార్చి 2018, గురువారం

ఆహ్వానము (అష్టావధానము)


సమస్య - 2636 (గ్రీష్మమునఁ బైటఁ దీసి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె"
(లేదా...)
"గ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ గోడలు గన్నుగీటెరా"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

28, మార్చి 2018, బుధవారం

సమస్య - 2635 (పతి గళమునఁ దాళిఁ గట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్"
(లేదా...)
"పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

27, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2634 (అంగదుఁ డనిలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్"
(లేదా...)
"అశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్"
(శ్రీ అష్టకాల  నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

26, మార్చి 2018, సోమవారం

న్యస్తాక్షరి - 52 (భ-ద్ర-గి-రి)


అంశము - సీతారాముల కళ్యాణం
ఛందస్సు- చంపకమాల
న్యస్తాక్షరములు... 
మొదటిపాదం 4వ అక్షరం - భ.
రెండవపాదం 12వ అక్షరం - ద్ర.
మూడవపాదం 15వ అక్షరం - గి.
నాల్గవపాదం 20వ అక్షరం - రి.

(లేదా...)

ఛందస్సు - ఆటవెలది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా భ - ద్ర - గి - రి ఉండాలి.

పుష్పక విమాన బంధ సీసము

శ్రీరామ స్తుతి 

పద్యము చిత్రములో చదువు విధానము 
          పైన 'శ్రీ'తో మొదలు బెట్టాలి. 'శ్రీ దశరథ సుత' అని చదువుకొని తిరిగి 'శ్రీ'తో ఎడమ ప్రక్క ఏనుగు దగ్గిర గల 'రా' తో కలిపి 'తాటకాoతక ఘన రఘురామ'తో కొనసాగించి ప్రక్కన 'శ' దాని తర్వాత 'మ' దాని తర్వాత 'దాత' తో  కొనసాగించాలి.  క్రింద 'మే' కలిపి పై దాకా వెళ్లి 'చోరా' చదివి ప్రక్కన 'సంహార' ఆపి ప్రక్కన 'రా'తో మొదలిడి  మధ్య గడిలో  'వణ'తో చదివి 'వహ' అని పక్షి కన్ను దగ్గిర ఉన్న 'తి' తో కలిపి  ఎడమ ప్రక్క మొదటి రెక్కలో 'హరా' అని క్రింద రెక్కలోకి దిగి 'హర్ష' చివర ఉన్న 'నిర్వ' అన్న పదము తోటి   మరల కన్ను దగ్గిర 'తి' కలుపుకొని కుడి రెక్కలో 'వితరణ' అని కొనసాగించాలి. క్రిందకు దిగి 'విహారా' అని ప్రక్కన 'స' కలిపి పైన కన్నుదగ్గిర 'తి' కలిపి క్రిందకు దిగి 'సహిత మహిపాలక రామ వందనము నీకు' అని ముగించాలలి.
దీనిలో విశేషము 'శ్రీ రామ రామ రామేతి' అన్న శ్లోకం మొదటి పాదము బంధించ బడినది.   

సీ :
శ్రీ దశరథ సుత! శ్రీరామ! తాటకాం 
          తక! ఘన రఘురామ! తాపసి వర!
సతి యహల్యా శాప శమదాత! పిత వాక్య 
          పాలకా!  జానకీ ప్రాణ నాధ!
మేరు మహీధర సార వీరా! హను
          మ మది చోరా!  క్రూర మర్కట మద
సంహార! రావణ సహిత దానవ గణ
          వహతి   హరా!  రఘువర! మహీజ
తే :
హర్ష కారక! లక్షణ, హనుమ, నిర్వృ
తి వితరణ! విభీషణ సుమతి పచరిత వ
రా! అనంజ శకట విహారా! సతిసహి
త మహి పాలక రామ! వందనము నీకు.

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

25, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2633 (వృశ్చికపుచ్ఛంబుమీఁద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్"
(లేదా...)
"వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి 'అవధాన సరస్వతి' గ్రంథం నుండి)

ఒక విన్నపం... కవిమిత్రులు తమ పూరణ పద్యాలలో కందంలో శకార చకార సంయుక్తాక్షరాన్ని, వృత్తంలో షకారాన్ని మాత్రమే ప్రాసాక్షరాలుగా ప్రయోగించండి. విశేష ప్రాసలను ప్రయోగించకండి.

శివ బంధ సర్వలఘు సీస చిత్రమాలిక


సీ.
గరళము గళమున కఱకఱి గలుగక,
          ముదముగ గడిగొని యదితిజుల న
రసిన సుబలుడగు పసుపతికి శిరము
          మడచుచు నమసము నడపు వలయు,
బెడిదపు పొడమిని నిడుకొని సురనది
          బిరబిర  పరుగిడ శిరమున పెన
సి, మహిని సతము పసిడి ససిగ నమరు
          నటుల ననుగలము నడపిన విధు
తే.గీ.
నకు కయి కవ కలిపి ఘన నమసు నిడగ
వలయు, నొలికిలిని శవపు జెలిమి కలిగి
మసిని కలిలమున పులిమి మలగెడు నజు
నకు ఘనముగ నపచితి పొనరగ వలయు.       

          కఱకఱి = బాధ,  కడిగొని= మ్రింగి,  ఆరసిన   = కాపాడిన,  మడచు= వంచు, పొనరు = చేయు ,బెడిదము=  భయంకరమైన , పొడమి= రూపము,  పెన= బంధనము , అనుగలము = సాయము,కయి=   చేయి,  కవ = జంట ,ఒలికిలి=స్మశానము,కలిలము = దేహము,  మలగెడు= తిరుగెడు, అపచితి= పూజ,పొనరు = చేయు.

          విషమును కంఠమున బాధ పడక  సంతోషముగా  మ్రింగి  దేవతలను  కాపాడిన   ఘనమైన బలము గల శివునకు  శిరము వంచుచు నమస్కారము పెట్టవలయును.  భయంకరమైన   ఉగ్రరూపము  దాల్చి గంగమ్మ బిరబిర పరుగులేట్టు చుండ  తలపైన శిగలో చుట్టి  భూమిలో  పసిడి పంటలు పండునట్లు  సాయము చేసిన శివునకు చేయి చేతుల ద్వయము కలిపి ఘనముగా నమస్కారము చేయవలయును  స్మశానములో  శవముల చెల్మి గలిగి  దేహమునకు బూడిద పూసుకొని  తిరుగాడు  శివునకు ఘనముగా పూజలు చేయవలయును.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

24, మార్చి 2018, శనివారం

ఆహ్వానం!

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో...  
తేది 25-03-2018 న ఆదివారం ఉదయం 10:15ని॥నుండి
నిర్వహించే విళంబి ఉగాది వేడుకలకు మీకిదే ఆహ్వానం. ఇందులో భాగంగా 
కవిసమ్మేళనం,
మహ్మద్ షరీఫ్ రచించిన 'సుజనశతకం' 
అవుసుల భానుప్రకాశ్ రచించిన 'మానవభారతం' వచన కావ్యం 
ఆవిష్కరణోత్సవ కార్యక్రమాలుంటాయి.

వేదిక: భారతీయ విద్యామందిర్ ఉన్నత పాఠశాల,(BVM హైస్కూల్) సంగారెడ్డి.

సభాధ్యక్షులు
శ్రీ పూసల లింగాగౌడ్ గారు, అధ్యక్షులు మెతుకుసీమ సంస్థ.

ముఖ్య అతిథి
శ్రీ నందిని సిధారెడ్డి గారు, చైర్మన్, సాహిత్య అకాడమీ తెలంగాణ

విశిష్ఠ అతిథులు
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు.
శ్రీ పట్లోళ్ళ నరహరి రెడ్డిగారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు

ఆత్మీయ అతిథులు
శ్రీ ఆర్. సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ, ఆరెస్సెన్ ఛానల్ అధినేత.
శ్రీ సువర్ణవినాయక్ గారు, పాఠ్య పుస్తకాల కో ఆర్డినేటర్, తెలంగాణ.
శ్రీ దోరవేటి చెన్నయ్య గారు, ప్రముఖ కవి, నవలారచయిత
శ్రీ కంది శంకరయ్య గారు, ప్రముఖ పద్య కవి, 
శ్రీ బోర్పట్ల హన్మంతాచార్యులు గారు, సలహాదారులు, మెతుకుసీమ సంస్థ.
శ్రీ తల్లోజు యాదవాచార్యులు గారు, ప్రముఖ పద్య కవి. సలహాదారులు మెతుకుసీమ.

సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆహ్వానిస్తున్నాం.
కార్యక్రమానంతరం భోజనం స్వీకరించి నిష్క్రమిద్దాం.

నిర్వహణ
మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ
సంగారెడ్డి.

సమస్య - 2632 (చంద్రునిం గాంచి యేడ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు"
(లేదా...)
"చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై"

23, మార్చి 2018, శుక్రవారం

సమస్య - 2631 (నా నీ పత్నికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"
(లేదా...)
"నా నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయుతోన్"
(ఒక అవధానంలో నరాల రామారెడ్డి గారు పూరించిన సమస్య)

'హన్మంతుఁడు' శబ్దం అసాధువని జరిగిన చర్చను క్రింది వీడియోలో చూడండి. 
https://www.youtube.com/watch?v=9IY5cI8UiFM

ధనుర్లతికా బంధ తేటగీతి - దేవీ ప్రార్థన


శరణు గౌరి! మారి! గిరిజ! శరణు తల్లి!
కాల! బాల! కాలక! కాచు కరుణతోడ,
వందనమ్ములు లోకపావని! సతతము
రక్ష నిడు కర్వరీ! లంభ! రంభ! శాంభ
వి! మరువ వలదు, ఉమ! రామ! అమల! దేవి!

పూసపాటి కృష్ణ సూర్య కుమార్

22, మార్చి 2018, గురువారం

సమస్య - 2630 (దుగ్ధపయోధి మధ్యమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ"
(లేదా...)
"దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో"
(గతంలో ఎన్నో అవధానాలలో అడిగిన ప్రసిద్ధ సమస్య)

21, మార్చి 2018, బుధవారం

సమస్య - 2629 (కోడిని నొక బాపనయ్య...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోడిని నొక బాపనయ్య కోరి భుజించెన్"
(లేదా...)
"కోడిని బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

అష్టదళ పద్మ అష్ట దిగ్బంధ చంపకము


(శివ పరివార స్తుతి)

శరణు పినాకపాణి సుత! శక్తిధరాగ్రజ! ఎల్క వాహనా!
శరణు కరాళి! కాళి! శివ! శక్తి! శివప్రియ! సింహ వాహనా!
శరణ ముమాపతీ! శివుడ! శక్రుడ! గోపతి! నంది వాహనా! 
శరణు విశాఖుడా! గుహుడ! శక్తి సుతా! ఫణిభుక్కు వాహనా!

(శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి గారి చిత్ర మాలిక స్పూర్తితో)
కవి :
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

20, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2628 (దేవుఁడు చనుదెంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"
(లేదా...)
"దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

19, మార్చి 2018, సోమవారం

వరంగల్ సన్మానపత్రము


కోకిలా చిత్ర సర్వ లఘు బంధ తేటగీతి మాలిక

అనిముకము  తనివి తొడరి ఘన  కరకపు
              పతన నయపు విటపములను కతికి కుతిక
              తెరచి మధుర పదములును తెలచి   వనజ
              హితునకు ఘనముగ పలికె నుతులు మహిని
 అర్ధములు
అనిముకము =కోకిల ,తనివి =తృప్తిగా,    తొడరి =పొంది ,   కరకపు = మామిడి,  పతన =    ఆకులు,
నయపు =సుకుమారపు  , విటపము=   చిగురు ,  కతికి = తిని,  కుతిక =   గొంతు,    పదములను =        పాటలను,  తెలచి =  వర్ణింఛి  ,వనజ హితునకు =  సూర్యునకు   నుతులు = స్తోత్రములు  పలికే

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

సమస్య - 2627 (పతినే మనసార నమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతినే మనసార నమ్మి బాధల నొందెన్"
(లేదా...)
"పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

18, మార్చి 2018, ఆదివారం


దత్తపది - 135 (మార్చి-మే-జులై-డిసెంబరు)

మార్చి - మే - జులై - డిసెంబరు
పై పదాలను అన్యార్థంలో వినియోగిస్తూ
విళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

17, మార్చి 2018, శనివారం

సమస్య - 2626 (గగనమ్మున నొక్క చేఁప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్"
(లేదా...)
"గగనమునందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

16, మార్చి 2018, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 41

కవిమిత్రులారా,
అంశము - తెలుఁగు పద్యకవితా వైభవము.
నిషిద్ధాక్షరములు - వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు. (ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భ)
ఛందస్సు - మీ ఇష్టము.

15, మార్చి 2018, గురువారం

సమస్య - 2626 (రంభను బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్"
(లేదా...)
"రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

14, మార్చి 2018, బుధవారం

సమస్య - 2625 (అందము చెడిపోయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అందము చెడిపోయె ననుచు నతివయె మురిసెన్"
(లేదా...)
"అందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

13, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2624 (రాల వండి పెట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాల వండి పెట్టె రమణి రుచిగ"
(లేదా...)
"రాలను వండి పెట్టె రుచి రంజిలుచుండఁగఁ గాంత ముద్దుగన్"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

12, మార్చి 2018, సోమవారం

సమస్య - 2623 (రావణుఁడే రాముఁ డగుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్"
(లేదా...)
"రావణుఁ డంత రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్"
(డా॥ జి.యం. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

11, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2622 (...దుష్ట కురుసార్వభౌముఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"...దుష్టుఁ డా కురురాజు భీకరముగఁ జంపె భీమసేను" (ఛందోగోపనం)
(లేదా...)
"...దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్" (ఛందోగోపనం)
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

10, మార్చి 2018, శనివారం

సమస్య - 2621 (జూద మాడువారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జూద మాడువారు సుజనవరులు"
(లేదా...)
"జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్"
ఈ సమస్యను పంపిన BVVHB ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

9, మార్చి 2018, శుక్రవారం

సమస్య - 2620 (రవి చెప్పెన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్"
(లేదా...)
"రవి చెప్పెన్ కమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్"
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

8, మార్చి 2018, గురువారం

సమస్య - 2619 (హనుమంతుఁడు లంక కేగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హనుమంతుఁడు లంక కేగి యసువులఁ బాసెన్"
(లేదా...)
"హనుమంతుం డదె లంక కేగి విడిచెన్ హా  సోదరా ప్రాణమున్"

7, మార్చి 2018, బుధవారం

సమస్య - 2618 (చీమ ముద్దాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను"
(లేదా...)
"చీమయె ముద్దులాడె నల  శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్"

6, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2617 (గౌరి కాత్మజుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గౌరి కాత్మజుండు కమలభవుఁడు"
(లేదా...)
"వాసిగ గౌరి కాత్మజుఁడు బ్రహ్మ యనంగుఁడు శౌరి కల్లుఁడౌ"

5, మార్చి 2018, సోమవారం

సమస్య - 2616 (కాలు కడు యాతన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలు కష్టపెట్టె గ్రామజనుల"
(లేదా...)
"....కాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్" (ఛందోగోపనం)
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

4, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2615 (భారత యుద్ధరంగమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
(లేదా...)
"భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై"

3, మార్చి 2018, శనివారం

సమస్య - 2614 (రామా నీ వలనన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"
(లేదా...)
"రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్"
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

2, మార్చి 2018, శుక్రవారం

సమస్య - 2613 (అల్లుఁడు మగఁడయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే"
(లేదా...)
"అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే"

1, మార్చి 2018, గురువారం

సమస్య - 2612 (మసి యొనర్చెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు"
(లేదా)
"మసిఁ జేసెన్ దన పుష్పబాణములతో మారుండు ముక్కంటినే"