29, జూన్ 2013, శనివారం

28, జూన్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1096 (అవధానమ్మునఁ జేయకూడదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అవధానమ్మునఁ జేయకూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్.

పద్య రచన – 386 (పడక కుర్చీ)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పడకకుర్చీ”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

27, జూన్ 2013, గురువారం

గంగా దండకము


గంగా! విజ్ఝృంభత్తరంగా!

శ్రీ దివ్య గంగా! ప్రపుణ్యాంతరంగా! మహావిష్ణు పాదోద్భవా! శ్రీమహాదేవ రాజజ్జటాజూట సంస్థా! మహాపాప ప్రక్షాళినీ! దివ్యరూపా! కృపాశాలినీ! శీతలక్ష్మాధరాగ్రంబునందుండి యానంబు సాగించి వేవేల తీర్థమ్ములన్ దాకుచున్ భక్తులన్ బ్రోచుచున్ పంటలన్ వృద్ధి నొందించుచున్ జీవనాధారమై యొప్పుచున్ మమ్ము బోషించునో మాత! దీవ్యద్గుణోపేత! భాస్వన్మునివ్రాత సంసేవితా! విశ్వమాతా!
మహాదుఃఖ సంసార తాపంబులన్ బొంది శుష్కించు వారెల్ల నీ సన్నిధిన్ జేరి నీ యర్చనల్ సేసి నీలోన స్నానంబు గావించి యా దుఃఖముల్ తీరగా మోదమున్ బొంది నీ దివ్య తీర్థంబులన్ గ్రోలి పాపంబులన్ బాసి జ్ఞానమ్మునున్ బొంది వెల్గొందరే!
ఉద్ధృతాకారమున్ దాల్చి యుప్పొంగు నీ క్రోధ మేమందు నమ్మా? మహాభీల కల్లోల జృంభత్తరంగా! మహోగ్రాకృతిన్ దాల్చి భీభత్సముల్ చాల కల్పించి శైలమ్ములన్ గూల్చి గ్రామమ్ములన్ ముంచి వేవేలుగా మర్త్యులన్ జంతులన్ ముంచి నీలోన లీనమ్ము గావించినావమ్మ! శాంతించుమమ్మా!
నినున్ శాంతరూపా యటంచున్ దలంతున్ కృపావర్షిణీ! వేగ నీ యుగ్రరూపంబు చాలించి మా విన్నపమ్మెల్ల నాలించి పాలింపుమా మమ్ము భాగీరథీ! జాహ్నవీ! జ్ఞానతేజోమయీ! ప్రాణదాత్రీ! నమస్తే నమస్తే నమః
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం – 1095 (కుండలోనఁ బెట్టె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుండలోనఁ బెట్టెఁ గువలయమును.

పద్య రచన – 385 (దిన పత్రికలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
దిన పత్రికలు

25, జూన్ 2013, మంగళవారం

16, జూన్ 2013, ఆదివారం

నేమాని వారికి శుభాకాంక్షలు!

పండిత నేమాని వారికి పౌత్రోదయము

శ్రీమాన్ పండిత నేమాని వారు  తమ చిన్న కుమారుడు చి. నందకిశోర్ మరియు చి.సౌ. పావని దంపతులకు (అమెరికా - న్యూజెర్సిలో)  వంశోద్ధారకుడగు సుపుత్రుడు జననమొందినాడను శుభవార్తను తెలియజేసినారు. 

 పండిత నేమాని వారికి, నందకిశోర్, పావని దంపతులకు శుభాకాంక్షలు!
చి. పండిత నేమాని ‘చిన’ రామజోగి సన్యాసి రావుకు శుభాశీస్సులు. 

సమస్యాపూరణం – 1084 (మునిఁ గని దనుజాంగన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్.

పద్య రచన - 374(తాత, మనుమలు)

కవిమిత్రులారా,
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, జూన్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1082 (గొడ్రాలిన్ బ్రభవించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి,తా గోపాలకృష్ణుండిలన్.
(కొప్పరపు కవులు ఎదుర్కొన్న సమస్య)
చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో....

పద్య రచన - 372 (తీర్థయాత్రలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"తీర్థయాత్రలు"

13, జూన్ 2013, గురువారం

12, జూన్ 2013, బుధవారం

10, జూన్ 2013, సోమవారం

గన్నవరపు వారికి శుభాకాంక్షలు!

గన్నవరపు నరసింహ మూర్తి గారు తమ జ్యేష్టపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తికి, చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారిక ( శ్రీ పరిగె లక్ష్మీ నరసింహ సుధాకర్ ,శ్రీమతి లక్ష్మీ సుందరిల ఏకైక కుమార్తె )తో  వివాహ నిశ్చయము జరిగినదని. వివాహ ఉత్సవము అక్టోబరు 12 వ తేదీన శనివారము ఉదయము శాన్ హోసే ,కాలిఫోర్నియా రాష్ట్రములో జరుగుతుందని తెలియజేసారు. సంతోషం.
వారికి నా శుభాకాంక్షలు.

శ్రీరస్తని 'గన్నవరపు
నారాయణ మూర్తి'ని శుభనాముని మోదం
బారగ దీవింతు 'పరిగె
హారతిఁ' జేపట్టు వరుఁడునై శోభిల్లన్.


గన్నవరపు వంశమ్మున
నెన్నఁగ నరసింహ మూర్తి! హిత సద్గుణ సం
పన్నుఁడవు, నీ కుమారుని
చెన్నగు కళ్యాణ వార్త నిదె చెప్పితివే!


మంచి వార్తఁ దెలిపి మా మనంబులను రం
జింపఁ జేసినాఁడ వీ దినమున,
నయ సుగుణ నిధాన! నరసింహ మూర్తి! మీ
కెల్లరకు శుభంబు లీశుఁ డిడుత!


కంది శంకరయ్య

సమస్యాపూరణం – 1078 (నరసింహుని ప్రియసుతుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.

పద్య రచన - 368

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(కన్నడ బ్లాగు 'పద్యపాన' నుండి)

9, జూన్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1077 (ముగ్గురు పంచపాండవులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!
(‘శతావధాన ప్రబంధము’ నుండి)

పద్య రచన - 367 (వర్షము)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, జూన్ 2013, శనివారం

3, జూన్ 2013, సోమవారం