‘హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే’
ఇది మొన్న (26-2-2015 నాడు) ఇచ్చిన సమస్య.
దీనికి ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారి పూరణ.....
వరరామాయణకావ్యకారణము గువ్వన్జంపుటౌనందురే
ధరణిన్ బాండవపత్నిబాధకు నిమిత్తమ్మౌనుగా జూదమే
అరవిందాక్షుని లీల చౌర్యమగుచో నాలింప నాగాధలన్
హరియించున్ ఘన పాతకమ్ములను హత్యాద్యూత చౌర్యమ్ములే.
నా (కంది శంకరయ్య) పూరణ.....
సురవైరిన్ దశకంఠుఁ జంపెనఁట సుశ్లోకుండు రాముండు, చి
చ్చు రగిల్చెన్ గద ద్యూత మా భరతవంశ్యుల్ పోరు సేయంగ, మో
హ రహస్యమ్ములఁ దెల్పె గోపికల దేహభ్రాంతిఁ బోఁద్రోచి శ్రీ
హరియే చీరల దొంగిలించె, కథ లత్యంతమ్ము శ్రావ్యంబులై
హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే.
పై రెండు పూరణలకు క్రింది సంస్కృత చాటుశ్లోకం ఆధారం.
ప్రాతర్ద్యూత ప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన
కాలో గచ్ఛతి ధీమతామ్ ॥
(బుద్ధిమంతులు ఉదయం ద్యూతప్రసంగంతో, మధ్యాహ్నం స్త్రీప్రసంగంతో, రాత్రి చోరప్రసంగంతో కాలం గడుపుతారు. అనగా ద్రూతప్రసంగం ఉన్న మహాభారతాన్ని, స్త్రీప్రసంగంతో ఉన్న రామాయణాన్ని, వెన్నదొంగ ప్రసంగంతో ఉన్న భాగవతాన్ని పఠిస్తారు అని భావం.)
దీనికి నా తెనుఁగుసేత...
ఉదయము ద్యూతాసక్తిని
పదపడి మధ్యాహ్నమందు భామాసక్తిన్
తుది రాత్రిఁ చౌర్యకృత్యం
బిదె కాలము గడిపెడి విధమే యగును బుధుల్. (అనువాదం అంత తృప్తికరంగా లేదు)
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి, శ్రీ డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలతో....