31, మే 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1689 (నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్.
(‘తెలుగుకవిత్వము - సమస్యాపూరణము’ సమూహంనుండి కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదలతో)

పద్య రచన - 922

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, మే 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1687 (బండపైన జొన్నపైరు పండె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
బండపైన జొన్నపైరు పండె.
నా పూరణ....

బండ ప్రక్క నున్న పైరుపై దొంగలు
పడుచునుంద్రు, వారి భయము మెండు, 
కొడుక! కావలికయి కూరుచుండవలెను
బండపైన; జొన్నపైరు పండె. 



పద్య రచన - 920

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28, మే 2015, గురువారం

26, మే 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1684 (రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!
(గరికిపాటివారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

పద్య రచన - 917

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, మే 2015, సోమవారం

24, మే 2015, ఆదివారం

దత్తపది - 78 ((తీపు-కారము-పులుపు-చేదు)

కవిమిత్రులారా,
తీపు - కారము - పులుపు - చేదు.
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

పద్య రచన - 915

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23, మే 2015, శనివారం

సమస్యా పూరణము - 1683 (కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము.
(సాయంత్రంనుండి కిడ్నీలో రాయివల్ల భరింపరాని కడుపునొప్పి. ఏ సమస్య ఇవ్వాలో ఆలోచించలేక కడుపునొప్పినే సమస్యగా ఇస్తున్నాను. రేపటికెలా ఉంటుందో?)

పద్య రచన - 914

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10, మే 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1670 (గంగానది యుప్పునీరు గలదై పాఱెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్.
(మూలము- गङ्गानदी लवणवारिमयी बभूव |
కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో)

పద్య రచన - 901

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(వ్యంగ్య చిత్రకారిణి ‘శాంత’ గారికి ధన్యవాదాలతో)
నా పద్యము...
పనులలోన మున్గి వ్యస్తురాలైన యి
ల్లాలిని విసిగించ మేలు గాదు,
కంద పేరు ప్రాస కందగ నీబొంద
యనిన పతికి గాయ మాయె నహహ!

9, మే 2015, శనివారం

దత్తపది - 77 (పూరి-వడ-దోస-గారె)

కవిమిత్రులారా,
పూరి - వడ - దోస - గారె.
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

నా పూరణ.... (ఉత్తరుని ప్రగల్భములు)

పూరిఁ గఱపించెదను శత్రువులను నా ప
రాక్రమము జూపి వడకింతు రణమునందు
దోసకారులు కౌరవుల్ దొలఁగి చనిన
క్షితిపతులు పౌరులు నను మెచ్చెదరు గారె.

పద్య రచన - 900

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, మే 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1669 (సీతను రాముండె దాచి చిరయశ మందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సీతను రాముండె దాచి చిరయశ  మందెన్.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.
నా పూరణ....
హేతిన్ ఖరదూషణ వి
ఖ్యాతాసురులను వధించు కదనముఁ జూడన్
భీతిల్లు ననుచు గుహలో
సీతను రాముండు దాచి చిరయశ మందెన్.

పద్య రచన - 899

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, మే 2015, శనివారం

సమస్యా పూరణము - 1663 (నాగశయనుఁడు విహరించు నంది నెక్కి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
నాగశయనుఁడు విహరించు నంది నెక్కి.

(కవిమిత్రులకు మనవి... మా మేనల్లుని కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. మూడు నాలుగు రోజులు అటే ఉంటాను. ఎందుకైనా మంచిదని ఐదురోజుల సమస్యలను షెడ్యూల్ చేసాను. ఈ అయిదురోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సెల్‍ఫోన్‍లో ఎప్పటికప్పుడు మీ పూరణలను చూస్తూ ఉంటాను కాని సమీక్షించలేను. కావున దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.)

1, మే 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1662 (భారత రామాయణములు వ్యర్థములు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భారత రామాయణములు వ్యర్థములు గదా!
నా పూరణ...
ఆ రంగనాయకమ్మయె
భారత రామాయణములు వ్యర్థములుగ దా
నారోపించుచు వ్రాసెను
ఘోరమ్ముగ; నాస్తికజనకూటమి మెచ్చన్.

పద్య రచన - 896

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.