తే.గీ:దేవగురువు శక్రున కిట్లు దెలిపె బరమ శివుని లీల లేమియొ! పెండ్లి జేయ బూను మారునిం జంపె శక్ర!కుమారుఁ డెసఁగి” దేవతల గాచి విజయమ్ము దెచ్చు లెమ్ము! (ఈ శివుని పనులు విచిత్రం.అతను పెళ్లి జేయ బూనిన మన్మథుణ్ని చంపాడు.కానీ అతని కుమారుడు మనకు విజయం తెస్తాడు లే! అని బృహస్పతి ఇంద్రుని తో అన్నాడు.)
ఉ.
రిప్లయితొలగించండితూరుపు బిడ్డ క్రుంగెనని తూపులు వీడి ప్రతిజ్ఞ నిప్డు నే
దీరుగ నిల్ప లేదనుచు తెల్లపు బాధను మున్గ జక్రముం
దేఱును సాకు వాడు వడి దీయగ వింటిని బట్టి దుశ్శలా
మారుని జంపె శక్రుని కుమారుడు మాధవుడంప నుద్ధతిన్ !
తేటగీతి
రిప్లయితొలగించండివెన్నుపోటున పుత్రుని వికృత రీతి
చిదిమి వైచియు నేటి దుస్థితిని గాంచి
వీడమన్నను యుద్ధాన విడక రవి కు
మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి
ఉత్పలమాల
తీరిచి తమ్మిమొగ్గరము దిట్టగ రా నభిమన్యుగూల్చ నే
మారిచి ధర్మమున్ విడిచి మార్కొని దుష్టచతుష్టయమ్మహో!
కారణమైన వాడనుచుఁ గ్రమ్మగ చీకటి దుస్సలమ్మకున్
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్
శ్రీమాన్ నరాల రామారెడ్డి గారు సూచనతో సవరించిన వృత్తము:
తొలగించండిఉత్పలమాల
తొలగించండితీరిచి తమ్మిమొగ్గరము దిట్టగ రా నభిమన్యుగూల్చ నే
మారిచి ధర్మమున్ విడిచి మార్కొని దుష్టచతుష్టయమ్మహో!
కారణమైన వాడనుచుఁ గ్రమ్మగ చీకటి దుస్సలామనో
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్
పాండవుల గెల్చి రాజుకు బహుమతి నిడు
రిప్లయితొలగించండిలక్ష్యముండినను పరశురాముడిడిన
యస్త్రమును మరువగ నాజియందు రవి కు
మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండితనయుడవనుచు వచ్చిన తరుణి కుంతి
కభయ మొసగిన యంగరాజావహమున
యర్జునుడెశత్రువనిన యా యంశుపతి కు
మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి.
వీరుడు తారకా సురుని పీకమడంచెడి యీశపుత్రుడా
కారణజన్మునుద్గరముకై గద యింద్రుడు పంపినంత నా
మారుని గూల్చె నీశుడను మాటయె వాస్తవమైన నింక యే
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్?
సంగరంబునన్ బోరాడు సమయమందు
రిప్లయితొలగించండినంగరాజు శతాంగమే క్రుంగి యున్న
వేళ తగిన తరుణమని వేవెలుగు కు
మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి
ఔరసపుత్రుడే మరణమంద కిరీటి ప్రతిజ్ఞబూనెగా
సైరిభమందునన్ గనగ శాశ్వతుడేగనరాని వైళమున్
సారస నేత్ర దంభమున సైంధవు డేమరి పాటునుండ నే
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధారుణమైన సంగరము ధారుణి యందున సాగుచుండ యా
రిప్లయితొలగించండికౌరవ నందివర్ధనుడు కర్ణు రథంబది క్రుంగిపోవగన్
నేరుగ సాయకంబులను నేర్పుగ వేయుచు సుప్రియా మనో
మారుని జంపె శక్రుని కుమారుడు మాధవు డంప నుద్ధతిన్
సుప్రియ కర్ణుని రెండవ భార్య
యుద్ధ రంగము నందున యో ధు డైన
రిప్లయితొలగించండిక్రీడి పోరుచు సాయమై కృష్ణుడు o డ
రాజ రాజుని చెలికాని రణ ము న రవి
మారుని o జంపె శక్రకు మారు డెస గి
క్రమాలంకారమండి
రిప్లయితొలగించండిఉ॥ ఓరిమి వీడి యీశ్వరుఁడు నూగుచుఁ గాల్చెనె కోపమందునన్
వారిజ నేత్రుకున్ సఖుఁడు పాండవ మధ్యముఁ డెవ్వరందువో
నేరుగఁ బ్రోచి ద్రౌపదిని నెమ్మినిఁ గాచిన వైనమెట్టిదో
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంపనుద్ధతిన్
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
తే॥ మారునిం జంపె నీశుఁడు మన్యువందుఁ
తొలగించండిగర్ణునిం జంపె విజయుఁడు కదన మందు
ననచు చదువుకొంటిమి కాద యరియ నెపుడు
మారునిం జంపె శక్రకుమారుఁడెసఁగి
మన్యువు క్రోధము
తే.గీ:దేవగురువు శక్రున కిట్లు దెలిపె బరమ
రిప్లయితొలగించండిశివుని లీల లేమియొ! పెండ్లి జేయ బూను
మారునిం జంపె శక్ర!కుమారుఁ డెసఁగి”
దేవతల గాచి విజయమ్ము దెచ్చు లెమ్ము!
(ఈ శివుని పనులు విచిత్రం.అతను పెళ్లి జేయ బూనిన మన్మథుణ్ని చంపాడు.కానీ అతని కుమారుడు మనకు విజయం తెస్తాడు లే! అని బృహస్పతి ఇంద్రుని తో అన్నాడు.)
ఉ:తీరని ప్రశ్న యై నిలచు దేనికి శంభుడు పెండ్లి గూర్చు నా
రిప్లయితొలగించండిమారునిఁ జంపె? శక్రుని కుమారుఁ డు మాధవుఁ డంప నుద్ధతిన్”
ధీరత బ్రోచె నేత యయి దేవగణమ్ముల కెల్ల దైత్యసం
హారము జేసె? నీ కథల యందలి మర్మము లెంచ శక్యమే!
( కుమారుడు ఉమాధవు డంపగా దేవసేనాపతి యై ఇంద్రుణ్ని రక్షించాడు.)
సూర్యుని కుమారుఁ డార్తినిఁ జూచి యేఁగ
రిప్లయితొలగించండిరక్తముం గని నన్న మరణము నెంచి
పెను గుహాంతరమ్మునఁ బెద్ద బెనఁగి మయు కు
మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి
ఆ రథ చక్ర మంకమున నద్భుత రీతిని నేలఁ గ్రుంగఁగా
భారత సంగరమ్మునను బార్థుఁడు శల్యుఁడు సూచుచుండఁగాఁ
గారణ జన్ము నంగ పతిఁ గర్ణు నరాతి నతీత సర్వ కౌ
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తమ్మి మొగ్గర మందున తన కొమరుడు
మరణమొందగ నాగ్రహ మందినట్టి
యర్జునుడు రణమున శత్రువైన రవి కు
మారునిం జంపె శక్ర కుమారు డెసగి.
వ్యూహమును పన్న కౌరవుల్ యుద్ధ మందు
రిప్లయితొలగించండిసవ్యసాచి సుపుత్రుని సంహరించ
నాగ్రహమున ప్రతినబూని యా యినుని కు
మారునిం జంపె శక్రకుమారు డెసగి
భారత సంగరమ్మునను పార్థుని సూనుని జంప వేగమే
నారని యాగ్రహమ్మునను నస్త్రము పట్టి ప్రతిజ్ఞ చేయుచున్
శౌరియనుగ్రహమ్మునను జాలము చేయక పార్థు బుత్రుడౌ
*మారుని జంపె శక్రుని కుమారుడు మాధవుడంప నుద్ధతిన్.*