9-11-2025 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్”(లేదా...)“దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా”
కందంనైపుణ్యము పెంపొందఁగఁజూపెను కృత్రిమపు మేధ చోద్యమనంగన్చేప ముఖాగ్రము నేనుగు! దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్! ఉత్పలమాలనైపుణి మీరె లోకమున నమ్మగ లేనివి నమ్ము నట్లుగన్జూపెను గృత్రిమంబనెడు చోద్యముఁ గొల్పెడు మేధ వింతలన్చేప ముఖాగ్ర భాగమున చిత్రమనంగను నిల్చె నేనుగే!దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా!
దీపము వెలిగెడి తరి కా సేపటి పిదపను గన కొడి చిక్కగ గట్టన్ దీపిక కొడి గన నగుపడె దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్.పాపహరంబు పూజలని భక్తుడొకండట చిత్తశుద్ధి తో నా పరమాత్ము గోల్వదివియన్ వెలిగించగ దీపకమ్ము కా సేపది వెల్గి వత్తి కొడి చిక్కగ కట్టిన వేళ కాంచగా దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా.
బాపడు తావినిడు పువుల దీపను పోషించ వెట్ట దివసము నందున్ మాపటి సమయము లో , నా దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్
ఆపురముల దేవళములుచూపుచునుండుగద శిల్పశోభ విభవమున్గోపురమును గమనింపగదీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్ఆపురమందునాలయము లన్నిట శోభిలు శిల్ప సంపదేదాపుననున్న కోవెల నిదర్శనమౌగద వైభవంబుకున్గోపురమేమనోహరము గొప్పకళానిపుణత్వమొప్పగాదీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మాపటి ప్రొద్దున కాంతులు ఏపుగ పెరిగిన వనమున నింపుగ చెలగన్చూపరులాహాయనఁ వనదీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్వనదీపము : సంపెంగ
కం॥ ప్రాపుగ విద్యుద్దీపము లేపార ధరను విరియుచు నెల్లెడలఁ గనన్రాపాడి వర్షమాఁగఁగదీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలచెన్ఉ॥ ప్రాపుగ విద్యుదీకరణ భవ్యత విచ్చఁగ వాడ వాడలన్ దీపము లన్ని నేఁడవియె తేజము నొందుచుఁ బ్రజ్వరిల్లఁగానాపగిదిన్ ధరాతలము నందున వర్షము వచ్చి యాఁగఁగన్దీపశిఖాగ్ర భాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమామామూలుగా దీపము పురుగులు తుమ్మెద లాగ ఉండే నల్లని పురుగులు వస్తాయండి. అదే తుమ్మెద అని ఊహ
బాపు వలె చిత్ర కారుడు దాపున కుడ్యమ్ము మీద తనదగు శైలిన్ మాపటి వేళను గీచగదీప శిఖ రాగ్ర మున దేటి స్థి రముగ నిలిచెన్
సమస్య: దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమాకోపము పెచ్చుమీరగను కోమలి కాంతుడు వాదులాడినన్ దాపగలేనిదౌ విరహతాపమెసంగగ నొక్కటైన నారూపము గానవచ్చెనట రూఢిగ వారలు ముద్దులాడగన్దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
నైపుణ్యం బధిక మళికినాపద యెబ్భంగిఁ గల్గు నావంతైనం దాపము దాఁకని యట్టుల దీప శిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్ దాపుల సంచరించుచు రొదల్ కడుఁ జేయుచు గెంతు చుండి సంతాప మొకింత లేకయె ముదమ్మున రమ్య వనాంతరమ్ములోనేపుగఁ బెర్గి నట్టి విరు లింపగఁ బూసిన మొక్క గన్పడన్ దీప శిఖాగ్ర భాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా [దీపము = మయూరశిఖి యను మొక్క]
కందం
రిప్లయితొలగించండినైపుణ్యము పెంపొందఁగఁ
జూపెను కృత్రిమపు మేధ చోద్యమనంగన్
చేప ముఖాగ్రము నేనుగు!
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్!
ఉత్పలమాల
నైపుణి మీరె లోకమున నమ్మగ లేనివి నమ్ము నట్లుగన్
జూపెను గృత్రిమంబనెడు చోద్యముఁ గొల్పెడు మేధ వింతలన్
చేప ముఖాగ్ర భాగమున చిత్రమనంగను నిల్చె నేనుగే!
దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా!
రిప్లయితొలగించండిదీపము వెలిగెడి తరి కా
సేపటి పిదపను గన కొడి చిక్కగ గట్టన్
దీపిక కొడి గన నగుపడె
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్.
పాపహరంబు పూజలని భక్తుడొకండట చిత్తశుద్ధి తో
నా పరమాత్ము గోల్వదివియన్ వెలిగించగ దీపకమ్ము కా
సేపది వెల్గి వత్తి కొడి చిక్కగ కట్టిన వేళ కాంచగా
దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా.
బాపడు తావినిడు పువుల
రిప్లయితొలగించండిదీపను పోషించ వెట్ట దివసము నందున్
మాపటి సమయము లో , నా
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్
ఆపురముల దేవళములు
రిప్లయితొలగించండిచూపుచునుండుగద శిల్పశోభ విభవమున్
గోపురమును గమనింపగ
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్
ఆపురమందునాలయము లన్నిట శోభిలు శిల్ప సంపదే
దాపుననున్న కోవెల నిదర్శనమౌగద వైభవంబుకున్
గోపురమేమనోహరము గొప్పకళానిపుణత్వమొప్పగా
దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాపటి ప్రొద్దున కాంతులు
రిప్లయితొలగించండిఏపుగ పెరిగిన వనమున నింపుగ చెలగన్
చూపరులాహాయనఁ వన
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్
వనదీపము : సంపెంగ
కం॥ ప్రాపుగ విద్యుద్దీపము
రిప్లయితొలగించండిలేపార ధరను విరియుచు నెల్లెడలఁ గనన్
రాపాడి వర్షమాఁగఁగ
దీపశిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలచెన్
ఉ॥ ప్రాపుగ విద్యుదీకరణ భవ్యత విచ్చఁగ వాడ వాడలన్
దీపము లన్ని నేఁడవియె తేజము నొందుచుఁ బ్రజ్వరిల్లఁగా
నాపగిదిన్ ధరాతలము నందున వర్షము వచ్చి యాఁగఁగన్
దీపశిఖాగ్ర భాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
మామూలుగా దీపము పురుగులు తుమ్మెద లాగ ఉండే నల్లని పురుగులు వస్తాయండి. అదే తుమ్మెద అని ఊహ
బాపు వలె చిత్ర కారుడు
రిప్లయితొలగించండిదాపున కుడ్యమ్ము మీద తనదగు శైలిన్
మాపటి వేళను గీచగ
దీప శిఖ రాగ్ర మున దేటి స్థి రముగ నిలిచెన్
సమస్య: దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
రిప్లయితొలగించండికోపము పెచ్చుమీరగను కోమలి కాంతుడు వాదులాడినన్
దాపగలేనిదౌ విరహతాపమెసంగగ నొక్కటైన నా
రూపము గానవచ్చెనట రూఢిగ వారలు ముద్దులాడగన్
దీపశిఖాగ్రభాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
నైపుణ్యం బధిక మళికి
రిప్లయితొలగించండినాపద యెబ్భంగిఁ గల్గు నావంతైనం
దాపము దాఁకని యట్టుల
దీప శిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్
దాపుల సంచరించుచు రొదల్ కడుఁ జేయుచు గెంతు చుండి సం
తాప మొకింత లేకయె ముదమ్మున రమ్య వనాంతరమ్ములో
నేపుగఁ బెర్గి నట్టి విరు లింపగఁ బూసిన మొక్క గన్పడన్
దీప శిఖాగ్ర భాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా
[దీపము = మయూరశిఖి యను మొక్క]