12, నవంబర్ 2025, బుధవారం

సమస్య - 5303

13-11-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాది కానిదేది నీది కాదు”
(లేదా...)
“నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా”

18 కామెంట్‌లు:

  1. మత్తకోకిలల.
    వేద తత్త్వము ద్రవ్వి చూడుము పెంచు యత్నము సత్యమౌ
    నీదు రూపము జెప్పు లోతుగ నేడు తర్కము సేయుమా
    యేది శాశ్వతమో వివేకము హెచ్చి తెల్పును జ్ఞానమున్
    నాది కానిది యేది నీదని, నమ్మబోకము జీవుడా !

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్రం లో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో...

    ఆటవెలది
    చంపువాడవీవె? చచ్చు వారలు వారె?
    జరుగు నా వలననె సర్వమిలను
    మానవుడు నిమిత్తమాత్రుడనఁగఁ బార్థ!
    నాది కానిదేది నీది కాదు!

    మత్తకోకిల
    కాదు చంపెడు వాడవీవయ! కాదు వారలు చచ్చుటే
    నాదధీనమునందు సర్వము నర్మగర్భముగా మనున్
    యోధ! ప్రాణి నిమిత్తమాత్రుడు నుర్వియందునఁ జూడగా!
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా!

    రిప్లయితొలగించండి
  3. ఏది శాశ్వతమ్మదేదియశాశ్వతం
    మిధ్యయే సకల మవిద్య చేత
    నాదినాదనియెడు వాదులాటేలరా
    నాది కానిదేది నీది కాదు

    రిప్లయితొలగించండి

  4. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ప్రియుడును ప్రియురాలు ప్రేమగ మాట్లాడు
    కొనెడు వేళను ప్రియు డనియె నిటుల
    నాది నీది యనుచు భేదమేల మనలో
    నాది కానిదేది నీది కాదు.

    రిప్లయితొలగించండి

  5. నాది నాది యనుచు నా యాస్తి నీదని
    చెప్పు కొనుచు మురియు చిన్న దాన
    యెన్ని చూప నేమి యన్నుల మిన్నరో
    నాది కానిదేది నీది కాదు.


    ఏది నీదని చెప్పుచుంటివి యిట్టి సృష్టిని గాంచగా
    నీది నీదని చెప్పు జన్మమదెప్పుడీ భువి వీడునో
    యాదరించిన వాడె నిన్నిక యప్యయమ్మును జేయడే
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా.

    రిప్లయితొలగించండి
  6. తనయుడు దన తండ్రి దరికేగి యిట్లనె
    "అమ్మ పేరున గల యాస్తి నిడుము "
    సుద్దులను దెలుపుచు సుతునితో పితయనె
    “నాది కానిదేది నీది కాదు”

    రిప్లయితొలగించండి
  7. నీదు వెంట వచ్చు నీసొంతమేదిరా
    నాది నాదటంచు వాద మేల
    నాది యన్న తలపు నాశన హేతువే
    నాది కానిదేది నీది కాదు

    ఏది నీదని వెంట బెట్టుకు నేగుచుందువు స్వర్గమే
    నాది నాదను తత్పరత్వము నాటకమ్ముర భూమిపై
    నాది నీదను భేదభావము నాశనమ్ముకు హేతువౌ
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా

    రిప్లయితొలగించండి
  8. సాదువర్తన మాచరించుచు సత్యవాక్కులె బల్కుమీ
    వేదవేద్యుల పాదసేవను వీతరాగత నొందుమీ
    నీదినాదని మోహముల్ విడ నిత్యసత్యము గన్గొనన్
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా

    రిప్లయితొలగించండి
  9. జగతి యందు యేది శాశ్వ తము ను గాదు
    నిత్య సత్య మగుచు నెగడు నేది?
    నాది కాని దేది నీది కాదని యెడు
    పలుకు లెల్ల నిజము వసుధ యందు

    రిప్లయితొలగించండి
  10. పేదసాదలయెడ భేదములెంచకు
    సాదరముగ గనుము సకల జనుల
    నీది నాదియనుచు వాదనలెందుకు
    నాది కానిదేది నీది కాదు

    రిప్లయితొలగించండి
  11. భేదమెంచకు శ్రీకరుండని పేదవాడని యెన్నడున్
    సాదరమ్ముగ జూడుమెల్లర సత్యముం గమనించుమా
    నీది నాదను వాదనెందుకు నీవియన్నియు నావెలే
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ సృష్టిఁ జేసి తెలిపె శ్రీశుఁడు జనులకు
    నాది కానిదేది నీదికాదు
    మనుజులిది గ్రహించి మనఁగ వ్యామోహముఁ
    దొలఁగు సుఖము విరియు వలసి నంత

    మత్త॥ ప్రోదిఁ జేసెడు వాఁడు దైవము బుద్ధి నేర్పుచుఁ దెల్పెనే
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా
    వేదమందున నుగ్గడించుచు విజ్ఞులందరుఁ జెప్పినా
    నాది నేనని మోహ మొందఁగ నాక మెప్పుడు దూరమే

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:కాళి దాస! నీదు కావ్యమ్ములన్నిట
    నార్షధర్మ దీప్తి యలరుచుండు
    వర్ణనముల నైన భాసించు నట్టి పు
    నాది,కానిదేది నీది కాదు”
    (కాళిదాసమహాకవి కావ్యాలు ఏ రసం ప్రథాన మైన వైనా అక్కద ఆర్షధర్మం యొక్క పునాది ఉంటుంది. అది కాని దేదీ ఆయనది కాదు.)

    రిప్లయితొలగించండి
  14. మ.కో:నాదియే స్మృతి,జ్ఞాన మెల్లయు నాది యర్జున,విస్మృతిన్
    నాది గా గ్రహియించు మెల్లయు నాదు మాయయె ధారుణిన్
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము , జీవుఁ డా”
    వేదనన్ బడు నిట్టి సత్యము వీడి యే యహ మేర్పడన్.
    (మత్తః స్మృతి ర్జాన ,మపోహనం చ అనేది గీతావాక్యం. జీవుడు అన్నీ తనవే అనుకొని వేదన పడుతుంటాడు.)

    రిప్లయితొలగించండి
  15. నీది నాదను స్వార్థబుద్ధియె నిశ్చయంబు ననాదిగా
    వేదనంబుకు కారణంబదె విస్మరించిరి మూలమే
    నాదె సృష్టి సమస్తమున్ విను నా స్వరూపమె నీవురా
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా

    రిప్లయితొలగించండి
  16. ఆ॥వె
    "నీది యన్నదెల్ల నాదికాకుండెట్లు-
    నాదికానిదేది నీదికాదు !"
    ప్రేమలందు మునుగ పేలాపనిట్లుండు-
    అర్థమించుకవని యరులుమరులు!!

    రిప్లయితొలగించండి
  17. మ.కో :
    వేదశాస్త్రములందు కర్మల వేవిధంబులఁ జెప్పిరే
    లేదుకాదని విశ్వసించక లేశమైనను మారదే
    వాదులాడక వేడి చూడుమ వాస్తవంబది తెల్లమే
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుడా!!
    2. ఈద జాలని సంద్రమాయెలె యీ రణంబును జూడగా
    బోధనంబున నేర్చుకుంటిని పోరు కూడదు జ్ఞాతులన్
    సాధనంబున నేర్చు విద్యల స్వార్ధమే గద జంపగా
    శోధనంబుగఁజూపు రూపము, శ్రోతయై విన గీతనే
    నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుడా!!

    రిప్లయితొలగించండి
  18. నాది నాదె యన్న దేది నిలనులేదు
    నంతయుహరిమాయ నరయు మనుచు
    గీత యందు తెలిపె కృష్ణుడు గ్రీడికి
    *"నాది కానిదేది నీది కాదు”*

    డా బల్లూరి ఉమాదేవి

    ఏదియైననుధాత్రియందుననెంచిచూడకు మెప్పుడున్
    నాది నేననిగొప్పచెప్పిననాశమౌదువు మిత్రమా
    నీదియన్నదిలేనెలేదనె నెమ్మితో హరి దెల్పెగా
    *“నాది కానిది యేది నీదని నమ్మబోకుము జీవుఁడా”*

    రిప్లయితొలగించండి