15-11-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె”(లేదా...)“బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో”(అనంతచ్ఛందం సమూహం నుండి)
ఆటవెలదిసకల దేవతాళి శంకరు వేడగన్తారకుని దునిమెడుతనయునెంచియొప్పగా నపర్ణ, నుత్సాహమొంది త్ర్యంబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతెచంపకమాలవికటమొనర్చె జీవనము వేల్పులకంచును నాది దేవునిన్సకలురు, తారకాసురుని జంపెడు పుత్రునొసంగ వేడగన్ముకులిత హస్తయై గిరిజ ముందరనుండగ నొప్పినంత త్ర్యంబకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
పంచవదనుడనుచు వలపున యా త్రియం బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె ,పూర్వ జన్మమందు ముక్కంటి సతిగానయటుల జరిగెనేమొ నరసి జూడ
గరళ మదియె గళము శిరముపైనను గంగ కనువినికిలి గలిగి కంఠ మందు సౌరభేయమెక్కి సంచంరించెడి త్రియం బకుని బెండ్లియాడె బడతి యొకతె.సికనుకళానిధిన్ గలిగి జిహ్మగమున్ గళ మందు శీర్ష మం దు కలికి వేల్పు డిగ్గియయు ధుర్యము వాహనమై చరించెడిన్ సకలమెఱంగు వాడయిన సర్వకరుండగు సోముడా త్రియం బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో.
తారకుఁడను నొక్క దనుజుని దునుమాడుకొమరుఁ బడయగోరి కోకనదునికొఱకు తపమొనర్చి కోరికదీర త్ర్యంబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె
త్రికరణములతోడ ప్రేమించి కడకు త్ర్యంబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతెవాకతాల్పువేల్పు పైన వదలి పూలబాణములను మరుడు భస్మమాయెత్రికరణశుద్ధిగా వలచి దివ్యముగాతప మాచరించి త్ర్యంబకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతోసకలము దేవదేవుడని సారసలోచన భక్తి తోడుతన్ముకుళిత హస్తయై వ్రతతి మోదము నొందెను కొర్కెతీరగా
ఆ. చదువు కేరడించి చక్కర్లు గొట్టుచూ పొద్దుమాపు తిరుగు పోకిరీడుతానె శూరుడంచు తలచి ప్రేమించి చుంబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతెచుంబకుడు : పల్లవగ్రాహి విద్యార్థి - A superficial student.
వికలమొనర్చి వేలుపుల వేదన పాలొనరించునట్టి తారకుడను రక్కసున్ దునిమి రాజిలఁ జేయగ సాంత్వనమ్ము త్ర్యంబకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతోసకల ద్యులోకవాసులకు శాంతిని గూర్చు కుమారునిన్ గనన్
ఆ॥ విరియ సుఖము ధరను విత్తమె ముఖ్యమైచనఁగ నేఁడు జనులు ధనముఁ బడయనెగఁబడుటను గాంచి యెంచి ధరణినొక బకునిఁ బెండ్లియాడెఁ బడతి యొకతెచం॥ సకల జనాళి నేఁడు భువి స్వర్గముఁ గాంచుచు సౌఖ్యమొందఁగన్వికలము గాక మానసము విత్తమె ముఖ్యమటంచు నమ్మఁగన్బ్రకటిత సంతసమ్ము నటు పారఁగ వాహిని వోలె ధాత్రిలోబకుని వివాహ మాడె భామిని ముప్పిరి గొన్న ప్రేమతోబకుడు కుబేరుడు
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఆదిదేవుఁ వేడ నందరు దేవతల్తారకుని దునిమెడు తనయునెంచిసమ్మతించ గౌరి సంతసమొంది త్ర్యంబకునిఁ బెండ్లియాడెఁ బడతి యొకతె.
అసురు డైన వాని నబల పెళ్లాడుట వింత యగును గద ర విశ్వ మందు నబ్బురo బు వినగ నది యే విధంబు గా బకుని పెండ్లి యాడె పడతి యొక తె?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆ.వె:ఏక శిల పురమ్ము నెల్ల కాపాడగభీము డుగ్రు డౌచు విరచి వైచెబకునిఁ, బెండ్లియాడెఁ బడఁతి యొకతె భీమునసుర యయ్యు బ్రేమ యందు మునిగి
మోద మంద నెల్ల భూలోక వాసులు సంజనింపఁ బ్రేమ సద్య మంత సుంద రాంగుని మృదు సుమ నిచయ శిరస్స్తబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె ప్రకటము గాఁగఁ దారకుని ప్రాణ వినాశము నిశ్చయమ్ముగా సకల జనమ్ము లివ్వసుధ సంతస మందఁగ మిక్కుటమ్ముగన్ వికల మనస్వినీ నగజ భీకరపుం దప మాచరించి త్ర్యం బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
సమస్య:బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరి గొన్న ప్రేమతో.చం.మా : పకపక నవ్వె దక్షుడును పార్వతి యీశుని పెండ్లియాడగన్ చకచక మంచు నేగెనుగ జాబిలితాల్పుని గెల్వ తాపసై తకథిమి యాటగాని నెలదారిని చేయిని బట్టి సాగె త్ర్యం బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరి గొన్న ప్రేమతో.
ఆ॥వెపెద్ద గొంతు వాని పెండ్లి యాడగనెంచువాసి కోర్కెలుండె ప్రాయమందు!వరుడు దొరకకుండ వయసుమించంగ తుంబకునిఁబెండ్లియాడెఁబడతి యొకతె!!(తుంబకము: నంగి;ముక్కుతో మాట్లాడుట)
చం;చక చక బట్టి విల్లు నొక సాయకమున్ గొని మత్స్య యంత్రమున్బ్రకటము కాగ నైపుణి, చివాలున గొట్టగ సుంత సంశయింపక, యొక విప్రు డంచనక ,బార్థుని బ్రాహ్మణ వేషునిన్ ,ధృతాంబకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో(బ్రాహ్మణ వేషం లో ఉన్న పార్థుని,బాణములు ధరించిన వానిని ద్రౌపది వివాహ మాడింది. )
పర్ణములను గొనక వనము నందు తపము నాచరించి విడకనద్రిసుతయు మారునణచినట్టి మహరుద్రుడౌ త్ర్యయంబకుని పెండ్లి యాడెబడతియొకతెముకుళిత హస్తయై గిరిజ భూత పతిన్ తన కోరె భర్తగా సకలము వీడి వచ్చుచును సన్మతి తోడ తపమ్ము చేయుచున్ వికలము కాని చిత్తమున వేడుచు నొప్పుగ భక్తితోడ త్ర్యం *“బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో”*
ఆటవెలది
రిప్లయితొలగించండిసకల దేవతాళి శంకరు వేడగన్
తారకుని దునిమెడుతనయునెంచి
యొప్పగా నపర్ణ, నుత్సాహమొంది త్ర్యం
బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె
చంపకమాల
వికటమొనర్చె జీవనము వేల్పులకంచును నాది దేవునిన్
సకలురు, తారకాసురుని జంపెడు పుత్రునొసంగ వేడగన్
ముకులిత హస్తయై గిరిజ ముందరనుండగ నొప్పినంత త్ర్యం
బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
పంచవదనుడనుచు వలపున యా త్రియం
రిప్లయితొలగించండిబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె ,
పూర్వ జన్మమందు ముక్కంటి సతిగాన
యటుల జరిగెనేమొ నరసి జూడ
రిప్లయితొలగించండిగరళ మదియె గళము శిరముపైనను గంగ
కనువినికిలి గలిగి కంఠ మందు
సౌరభేయమెక్కి సంచంరించెడి త్రియం
బకుని బెండ్లియాడె బడతి యొకతె.
సికనుకళానిధిన్ గలిగి జిహ్మగమున్ గళ మందు శీర్ష మం
దు కలికి వేల్పు డిగ్గియయు ధుర్యము వాహనమై చరించెడిన్
సకలమెఱంగు వాడయిన సర్వకరుండగు సోముడా త్రియం
బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో.
తారకుఁడను నొక్క దనుజుని దునుమాడు
రిప్లయితొలగించండికొమరుఁ బడయగోరి కోకనదుని
కొఱకు తపమొనర్చి కోరికదీర త్ర్యం
బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె
త్రికరణములతోడ ప్రేమించి కడకు త్ర్యం
రిప్లయితొలగించండిబకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె
వాకతాల్పువేల్పు పైన వదలి పూల
బాణములను మరుడు భస్మమాయె
త్రికరణశుద్ధిగా వలచి దివ్యముగాతప మాచరించి త్ర్యం
బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
సకలము దేవదేవుడని సారసలోచన భక్తి తోడుతన్
ముకుళిత హస్తయై వ్రతతి మోదము నొందెను కొర్కెతీరగా
ఆ. చదువు కేరడించి చక్కర్లు గొట్టుచూ
రిప్లయితొలగించండిపొద్దుమాపు తిరుగు పోకిరీడు
తానె శూరుడంచు తలచి ప్రేమించి చుం
బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె
చుంబకుడు : పల్లవగ్రాహి విద్యార్థి - A superficial student.
వికలమొనర్చి వేలుపుల వేదన పాలొనరించునట్టి తా
రిప్లయితొలగించండిరకుడను రక్కసున్ దునిమి రాజిలఁ జేయగ సాంత్వనమ్ము త్ర్యం
బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
సకల ద్యులోకవాసులకు శాంతిని గూర్చు కుమారునిన్ గనన్
ఆ॥ విరియ సుఖము ధరను విత్తమె ముఖ్యమై
రిప్లయితొలగించండిచనఁగ నేఁడు జనులు ధనముఁ బడయ
నెగఁబడుటను గాంచి యెంచి ధరణినొక
బకునిఁ బెండ్లియాడెఁ బడతి యొకతె
చం॥ సకల జనాళి నేఁడు భువి స్వర్గముఁ గాంచుచు సౌఖ్యమొందఁగన్
వికలము గాక మానసము విత్తమె ముఖ్యమటంచు నమ్మఁగన్
బ్రకటిత సంతసమ్ము నటు పారఁగ వాహిని వోలె ధాత్రిలో
బకుని వివాహ మాడె భామిని ముప్పిరి గొన్న ప్రేమతో
బకుడు కుబేరుడు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఆదిదేవుఁ వేడ నందరు దేవతల్
తారకుని దునిమెడు తనయునెంచి
సమ్మతించ గౌరి సంతసమొంది త్ర్యం
బకునిఁ బెండ్లియాడెఁ బడతి యొకతె.
అసురు డైన వాని నబల పెళ్లాడుట
రిప్లయితొలగించండివింత యగును గద ర విశ్వ మందు
నబ్బురo బు వినగ నది యే విధంబు గా
బకుని పెండ్లి యాడె పడతి యొక తె?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ.వె:ఏక శిల పురమ్ము నెల్ల కాపాడగ
రిప్లయితొలగించండిభీము డుగ్రు డౌచు విరచి వైచె
బకునిఁ, బెండ్లియాడెఁ బడఁతి యొకతె భీము
నసుర యయ్యు బ్రేమ యందు మునిగి
మోద మంద నెల్ల భూలోక వాసులు
రిప్లయితొలగించండిసంజనింపఁ బ్రేమ సద్య మంత
సుంద రాంగుని మృదు సుమ నిచయ శిరస్స్త
బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె
ప్రకటము గాఁగఁ దారకుని ప్రాణ వినాశము నిశ్చయమ్ముగా
సకల జనమ్ము లివ్వసుధ సంతస మందఁగ మిక్కుటమ్ముగన్
వికల మనస్వినీ నగజ భీకరపుం దప మాచరించి త్ర్యం
బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
సమస్య:
రిప్లయితొలగించండిబకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరి గొన్న ప్రేమతో.
చం.మా :
పకపక నవ్వె దక్షుడును పార్వతి యీశుని పెండ్లియాడగన్
చకచక మంచు నేగెనుగ జాబిలితాల్పుని గెల్వ తాపసై
తకథిమి యాటగాని నెలదారిని చేయిని బట్టి సాగె త్ర్యం
బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరి గొన్న ప్రేమతో.
ఆ॥వె
రిప్లయితొలగించండిపెద్ద గొంతు వాని పెండ్లి యాడగనెంచు
వాసి కోర్కెలుండె ప్రాయమందు!
వరుడు దొరకకుండ వయసుమించంగ తుం
బకునిఁబెండ్లియాడెఁబడతి యొకతె!!
(తుంబకము: నంగి;ముక్కుతో మాట్లాడుట)
చం;చక చక బట్టి విల్లు నొక సాయకమున్ గొని మత్స్య యంత్రమున్
రిప్లయితొలగించండిబ్రకటము కాగ నైపుణి, చివాలున గొట్టగ సుంత సంశయిం
పక, యొక విప్రు డంచనక ,బార్థుని బ్రాహ్మణ వేషునిన్ ,ధృతాం
బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో
(బ్రాహ్మణ వేషం లో ఉన్న పార్థుని,బాణములు ధరించిన వానిని ద్రౌపది వివాహ మాడింది. )
పర్ణములను గొనక వనము నందు తపము
రిప్లయితొలగించండినాచరించి విడకనద్రిసుతయు
మారునణచినట్టి మహరుద్రుడౌ త్ర్యయం
బకుని పెండ్లి యాడెబడతియొకతె
ముకుళిత హస్తయై గిరిజ భూత పతిన్ తన కోరె భర్తగా
సకలము వీడి వచ్చుచును సన్మతి తోడ తపమ్ము చేయుచున్
వికలము కాని చిత్తమున వేడుచు నొప్పుగ భక్తితోడ త్ర్యం
*“బకుని వివాహమాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో”*