17-11-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ”
(లేదా...)
“పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్”
(ఈనాటి చేపూరి శ్రీరామ్ గారి అష్టావధానంలో జీడికంటి శ్రీనివాస మూర్తి గారి సమస్య... కొద్ది మార్పుతో)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ”
(లేదా...)
“పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్”
(ఈనాటి చేపూరి శ్రీరామ్ గారి అష్టావధానంలో జీడికంటి శ్రీనివాస మూర్తి గారి సమస్య... కొద్ది మార్పుతో)
ఏకారణమున నిప్పుడు
రిప్లయితొలగించండిపాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ ?
జోకగ నటుల దెలిపిరా!
ఏకార్యమునందు వారు హెచ్చుగ నుండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారు (బ.వ)... ఉండెన్ (ఏ.వ) కుదరదు కదా.. *వారు హెచ్చందు మికన్* అందామా?
🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిఏకును మేకుగ జేసెడు
రాకాసియనఁగ నమెరిక, రక్కెడు చైనా
దూకుడు లేనంత దనుక
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ
శార్దూలవిక్రీడితము
ఏకున్ మేకుగ జేయు రాజ్యములె యూరింపంగ వెన్నంటుచున్
గోకుల్లూతమటంచు నెంచి పగతో క్రూరాత్మయై దూకెడున్
లేకే, కుక్కిన పేనురీతిగఁ బ్రవర్తింపంగ ముందుండుచున్
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
రిప్లయితొలగించండిచీకటి లో ద్రావిన మా
ర్ద్వీకపు మత్తది వదలక విజ్ఞత చెడెనో
నీకెవ్వడు చెప్పె నెపుడు
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ?
లోకంబంత యెఱుంగు శత్రువని యాలోచించుమా మిత్రమా
యేకాలంబునచూచినన్ మనను తా నేకాకిగా చేయగన్
సంకోచించని దేశమయ్యదియె గాంచన్ సోదరా యె వ్విధిన్
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ , వాక్రుచ్చె మోడీ సభన్.
ప్రాకటముగఁ బ్రజలకలలు
రిప్లయితొలగించండిసాకారంబై చివరకు స్వాతంత్ర్యమ్మే
చేకూరిన సమయంబున
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ
ఆకాలంబున నాంగ్లజాతి దొరలల్లాడంగ గొంతెత్తుచున్
మాకొద్దీ దొరలంచు నుద్యమముతో మార్మ్రోగె లేదిక్కులే
చీకట్లే తొలగంగ స్వేచ్ఛ మనకున్ సిద్దించు కాలంబులో
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచీకటి మూకల సాకుచు
రిప్లయితొలగించండిప్రాకటముగ తీవ్రవాద ప్రతినామంబై
పైకొను నాఖలులెట్టుల
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:"ఆ కాశ్మీరము లో తమ
రిప్లయితొలగించండిలౌకిక వాదమ్ము జూపి లబ లబ యనగా
నీ కాంగ్రెస్ తో బోల్చిన
పాకిస్తాన్ మంచి" దనుచుఁ బలికెన్ మోడీ
శా:ఈ కోవిడ్ సమరమ్ము నందున జగమ్మే నాశ మౌచుండగా
రిప్లయితొలగించండిపాకిస్తాన్ మన శత్రుదేశ మని నే భావింప హిందుత్వమే?
టీకాల్ బంపెద వారికిన్ కుటిల దృష్టిన్ వీడి తా నున్నచో
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్”
(కోవిడ్ సమయం లో మోడీ పాకిస్తాన్ కి టీకాలు పంపాడు. ప్రపంచమే కోవిడ్ తో యుద్ధం లో ఉండగా పాకిస్తాన్ ని శత్రువు గా భావించటం హిందూ తత్త్వం కాదని,వాళ్లకి కుటిలదృష్టి లేనంత వరకు మనకు మిత్ర దేశమే అన్నట్లు.)
మోడీ గారు UN general assembly లో నొక్కి వక్కాణించుట
రిప్లయితొలగించండిశా॥ సాకారంబుగ వృద్ధిఁ గాంచఁగను సంస్కారమ్మె సౌభాగ్యమౌ
దూకంగా నిటు లుగ్ర కార్యములనున్ దుర్భాగ్యమే తప్పదౌ
నాకాంక్షించఁగ స్నేహ భావమటు లాహ్లాదమ్ము నేఁ బల్కనే
పాకిస్థాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
ఆకర మయ్యె ను గదరా
రిప్లయితొలగించండిభీకర మౌ యుగ్ర వాడ వెధవ ల కెల్లన్
ప్రాకట మౌ నిల యమ్ము గ
పాకిస్తాన్ మంచి ధనుచు పలి కెన్ మోడీ
లోకైక విచారం బిది
రిప్లయితొలగించండివీఁక నిజోగ్రత్వ మందు విస్తార మిలం
గాకుండుటకై దండిత
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ
ఏకాకిత్వము చేష్టలం దుడిగి నప్డే యుగ్ర వాదమ్ము దా
నే కాలమ్మున సమ్మతం బవనిఁ గాదేన్ మానవత్వం బటన్
సాకారం బయి నిల్వ సంతతము హింసానందమున్ వీడినం
బాకిస్తాన్ మన మిత్రదేశ మనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
కం॥
రిప్లయితొలగించండిపాకిస్తానునజేరిన
మూకలపనిపట్టనెంచు ముఖ్యులు చర్చన్,
కాకగు చర్యలవేల తు
పాకిస్తాన్ మంచిదనుచుఁ బలికెను మోడీ!!
ఉగ్రదాడి తరువాత సైన్యంతో "ఆపరేషన్ సింధూర్" మోడీ ప్రభుత్వము విజయవంతముగా నడిపిన నేపథ్యము.
(తుపాకి ఇస్తాను: సైనిక చర్యకు మద్దతు)
"ముఖ్యుల" అని రెండవ పాదంలో సవరణ🙏
తొలగించండి
రిప్లయితొలగించండిశా!!
ఛీకొట్టన్ వినబోక ముష్కరులనున్ జేకూర్చు నిత్యంబుగా
జీకాకుల్ కలిగించ జాచదు కదా స్నేహంపు హస్తంబునే
ఆకించున్ జగమందు శాంతి , జెడు జేయన్ జూచు,గాదెప్పుడున్
పాకిస్తాన్ మన మిత్రదేశమనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఏకీకృత భావనతో
సాకారము జేయనెంచి సకల జగత్తున్
శ్రీకారము జుట్టెదనని
పాకిస్థాన్ మంచిదనుచుఁ బలికెన్ మోడీ!
శ్రీ కారముతా చుట్టుచు
రిప్లయితొలగించండి*"పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ”*
సాకారమ్మునుచేయగ
నేకత్వపుభావనలను నెంచుచు మదిలో