శా॥ వక్త్రంబుల్ తమ యూహ కందినటులన్ భావించరే మానవుల్ వక్త్రంబుల్ నిజ విశ్వరూపునకుఁ దెల్పంగాన సాధ్యంబిలన్ వక్త్రంబుల్ పది యంచు నీశునకు నాపాదించుచున్ బల్కెనో ”వక్త్రంబల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
విశ్వాకారుడు నిరాకారుడు నైన భగవంతునకు ఇన్ని ముఖములు అని అనగలమా! మనకు నచ్చినన్ని మనము పెట్టుకోవచ్చుకదండి, చతుర్ముఖుడు సహస్ర మూర్తయే సహస్ర పాదాక్ష ఇలాగ. అదే తెలిపినానండి
(1)తే.గీ:లంకకున్ రేడు, నసురకుల ప్రసూతి, వక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు తనను గరుణించ బ్రార్థించి తలలు పదిని నరకుకొనె తామసపు భక్తి బరవశించి. (రావణుడు శివుని ప్రార్థిస్తూ తలలు నరుకుకొన్న భక్తుడు. భక్తి లో కూడా సత్వ రజ స్తమో భేదా లుంటాయి. రావణునిది తామసభక్తి. )
(2)శా:వక్త్రమ్ముల్ పది యుండె నాకు, నని దుర్వారమ్ము నా శౌర్యమే, వక్త్ర మ్మొక్కటె యున్న మానవుడు నన్ బాధించ సాగెన్ గదా! ధిక్! త్రాణమ్మును జేయడే శివుడు? ప్రార్థింపన్ శివున్ నాకు నీ వక్త్రంబుల్ పది గల్గు, సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో” (పది తల లున్న,వీరుణ్నైన నన్ను ఈ రాముడు బాధిస్తుంటే శివుడు రక్షించడా? శివుణ్ని ప్రార్థించటానికి నాకు పది తల లున్నాయి అని రావణుడు అన్నట్లు. )
రిప్లయితొలగించండిదనుజు డైనను గాంచగా ధరణి యందు
భక్తు లందున మేటి రావణుడతండు
వక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు
వాని కిష్టదైవమటంచు వాసి గాదె.
వక్త్రంబొక్కటి కల్గినట్టి నరునిన్ బద్యంబు నేరీతిగా
నీ క్త్రా ప్రాసనుజేసి వ్రాయగలనో యే తల్లి దీవించునో
వక్త్రంబొక్కటె యున్న వాని కిలలో భక్తుండ కే కాంచగా
వక్త్రంబుల్ పది గల్గు, సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో.
తేటగీతి
రిప్లయితొలగించండిశివమునొసఁగు దైవమనుచు చేసితపము
కరుణగనలేక రజితాద్రి శిరమునెత్త,
గర్వమడచ నణగఁ ద్రొక్కె! ఘనులెవరన?
వక్త్రముల్ పది గల్గినవాఁడు! శివుఁడు!
శార్దూలవిక్రీడితము
ఈక్త్రా ప్రాసగ నిచ్చిపూరణలకై యెంచంగ భావ్యమ్మొకో!
వక్త్రంబెంతయొ తల్లడిల్లె గురువా! ప్రజ్ఞన్ ప్రసాదించెడున్
యక్త్రమ్మీయగ దిక్కులెన్మిదియు భూమ్యాకాశముల్ గూడుచున్
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలంక పురమున కధిపతి రావణుండు
రిప్లయితొలగించండిసకల శాస్త్రము లెరిగిన చంచురుండు
వక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు
వాని దైవము, రాముని పగతుఁడతఁడు
ఖరువుగ కుజ నపహరించు కతన దుష్టు
రిప్లయితొలగించండిడయ్యె , రావణుడనెడి వాడతని మయిన
వక్త్రముల్ పది గల్గినవాఁడు , శివుఁడు
మెచ్చె నాతని భక్తీ నమితపు రీతి
వక్త్రముల్ పది గల్గినవాఁడు శివుఁడు
రిప్లయితొలగించండిమెచ్చి వరముల నొసగంగ రెచ్చిపోయి
చెడ్డ పనులను సతతముఁ సేయు వాడు
రాముడు పరిమార్చినవాడు రావణుండు
వక్త్రంబుల్ పది గల్గియున్న యెడలన్ వాడౌను లంకేశుడే
వక్త్రంబుల్ మరి నాల్గుయున్న యెడలన్ వాడౌను వాగీశుడే
వక్త్రంబొక్కటి భద్రకాళి కిడినన్ భక్తుండకున్ శీఘ్రమే
వక్త్రంబుల్ పది గల్గు; సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
[వక్త్రము (1&2) = ముఖము; వక్త్రము (3&4) = వస్త్రము]
23-11-2025 (ఆదివారం)
రిప్లయితొలగించండిఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో”
శార్దూల విక్రీడితము
వక్త్రంబుల్ పది గల్గు వాని యరినే ప్రాజ్యమ్ము శ్లాఘించెదన్
వక్త్రంబుల్ దిశ లెన్మిదౌ జగములన్ బాలించు ముక్కంటికిన్
వక్త్రంబుల్ మరి రెండు క్ష్మా గగనముల్ భర్గుండుకే ; యట్టిదౌ
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
వక్త్రంబున్ తగవాల్చి మ్రొక్కెదను నిర్వ్యాజమ్ముగా నీశ్వరున్
రిప్లయితొలగించండిఅక్త్రంబై దనరారు నీశుని సదా ధ్యానింప సద్భక్తితో
వక్త్రంబందు పురారి చింతన సదా వ్యక్తంబుగా నిల్చునా
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
తే॥ విశ్వరూపుని ముఖములు విశదపఱచ
రిప్లయితొలగించండిదేహి కెటుల సాధ్యమగును తెలుపఁగాను
భక్తుఁడొకఁడు తలఁచి యిట్లు పలికె నేమొ
వక్త్రముల్ పది గల్గిన వాఁడు శివుఁడు
శా॥ వక్త్రంబుల్ తమ యూహ కందినటులన్ భావించరే మానవుల్
వక్త్రంబుల్ నిజ విశ్వరూపునకుఁ దెల్పంగాన సాధ్యంబిలన్
వక్త్రంబుల్ పది యంచు నీశునకు నాపాదించుచున్ బల్కెనో
”వక్త్రంబల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
విశ్వాకారుడు నిరాకారుడు నైన భగవంతునకు ఇన్ని ముఖములు అని అనగలమా! మనకు నచ్చినన్ని మనము పెట్టుకోవచ్చుకదండి, చతుర్ముఖుడు సహస్ర మూర్తయే సహస్ర పాదాక్ష ఇలాగ. అదే తెలిపినానండి
(1)తే.గీ:లంకకున్ రేడు, నసురకుల ప్రసూతి,
రిప్లయితొలగించండివక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు
తనను గరుణించ బ్రార్థించి తలలు పదిని
నరకుకొనె తామసపు భక్తి బరవశించి.
(రావణుడు శివుని ప్రార్థిస్తూ తలలు నరుకుకొన్న భక్తుడు. భక్తి లో కూడా సత్వ రజ స్తమో భేదా లుంటాయి. రావణునిది తామసభక్తి. )
(2)శా:వక్త్రమ్ముల్ పది యుండె నాకు, నని దుర్వారమ్ము నా శౌర్యమే,
వక్త్ర మ్మొక్కటె యున్న మానవుడు నన్ బాధించ సాగెన్ గదా!
ధిక్! త్రాణమ్మును జేయడే శివుడు? ప్రార్థింపన్ శివున్ నాకు నీ
వక్త్రంబుల్ పది గల్గు, సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో”
(పది తల లున్న,వీరుణ్నైన నన్ను ఈ రాముడు బాధిస్తుంటే శివుడు రక్షించడా? శివుణ్ని ప్రార్థించటానికి నాకు పది తల లున్నాయి అని రావణుడు అన్నట్లు. )
రమణి సీత న ప హరించె రావణుండు
రిప్లయితొలగించండివక్త్ర ంబు లు పది గల్గిన వాడు :: శివుడు
జగములను గావగా మ్రింగి జటిల మైన
విషము కంఠా న దాల్చె ను విశ్వ విభుడు
పడతినపహరించి యతిరూపమున వచ్చి
రిప్లయితొలగించండిమరణ మొందె దారుణముగ మహినినాడు
*“వక్త్రముల్ పది గల్గినవాఁడు; శివుఁడు”*
భక్తి తోడను మ్రొక్కిన వరములొసగు.
వక్త్రంబుల్ పదివేలు గల్గుయహిపైపాదమ్ము లొత్తన్ రమా
వక్త్రంబుల్ పలుగల్గువాడయినయా వైకుంఠుచేజచ్చెనే
*“వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో”*
వక్త్రంబొక్కటుయున్న చాలునుగదాఫాలాక్షయంచున్ సదా
వక్త్రంబేనుగు జ్యేష్ఠ పుత్రునికహా వంద్యంబుగా నారికన్
రిప్లయితొలగించండివక్త్రంబుల్ గద కార్తికేయునికి నాపై గంగయున్ గౌరియున్
వక్త్రంబుల్ మరి రెండు దాను నరయన్ భవ్యాజవంజంబునన్
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిన్ బ్రార్థింతు సద్భక్తితో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదర్ప మడరంగ దోర్బల దానవుండు
తొలగించండికొండ నెత్తంగ యత్నించి కూల నేల
వేగ సదయ రక్షించెను వేడ భక్తి
వక్త్రముల్ పది గల్గినవాఁడు, శివుఁడు
రుక్త్రైలోక భవాళి నాశకర నిర్మోహుండు ఫాలాక్షుఁడే
దిక్త్రాణార్థము విష్ణువే తనరఁ బ్రాక్దిఙ్నాథుఁ డయ్యెం దద
న్వక్త్రాతృప్రవరుండు పద్మజుఁడు వింతం గాంచ నర్ధమ్ములై
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిం బ్రార్థింతు సద్భక్తితో