ఈ పాఠములో కంద పద్యమును ఎన్ని రకముల పద్యముల గర్భములలో వ్రాయవచ్చునో చూచెదము:
 
 
కంద గర్భిత శార్దూలము:
(రామా! ధారుణి నాయక) ప్రముఖ ! సుత్రామార్చితా! లోకనా
థా! (మా మానసమందిరాల మనుమా తండ్రీ!) మముం బ్రోవుమా
(నీ మంత్రంబె జపింతును) ల్లమున నే నీ పూజ గావింతు న
య్యా! (మా మేలొనగూర్చు దేవమణి వీవంచున్) కృపాంబోనిధీ!
(4 పాదములలో కుండలములలోగల పాదములు కంద పద్యమునకు సరిపోవును కదా). 
కంద గర్భిత సీసము:
కైలాసవాస! శంకర! బాల శశిధర!
    సురవినుత వరద సుజనపా(ల)
శూలాయుధా! మునిస్తుత శీల! దలతును
    త్రిపురహర! జితరతిపతి నిన్ (ను) 
సీసము
 2 పాదాలలో కందపద్యమును వ్రాసేము కదా.  (ఆఖరి లఘువు తీసివేస్తే కందము 
అవుతోంది కదా).  ఇలాగ సీసపద్యములో 2 కందములు క్రిందన గీతలో 1 కందపద్యము 
మొత్తము 3 కందపద్యములను వ్రాయవచ్చును. 
కంద గర్భిత చంపకమాల/ఉత్పలమాలల గురించి ఇంతకు ముందే చెప్పుకొన్నాము.
మరికొన్ని విషయములను 5వ పాథములో చెప్పుకొనెదము.  స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు 
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి