అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు. తెప్పోత్సవము అనే ప్రయోగము అందరూ చేయుచున్నారు కానీ అది పొరపాటు. తెప్ప + ఉత్సవము అని గుణ సంధి చేయకూడదు. 2 పదములు సంస్కృతము అయితేనే గుణ సంధి వర్తిస్తుంది. తెప్పకు బదులుగా నౌక, నావ, తరణి, పోత అనే ఏ సంస్కృత పదము వాడినా సంధి చేయుటకు వీలు ఉండేది. స్వస్తి.
ప్రమదం బొప్పగ శారదైందవ సుధారాజన్నదీ దివ్య తీ
రిప్లయితొలగించండిర్థములన్ హంసయుగాన్వితంబును సువర్ణభ్రాజితంబైన పో
తమునున్ జేరుచు నాదిదంపతులు వేదస్త్యుత్యు లాహా! విహా
రమునున్ జేయుచునుండు లీల గనుచో ప్రాప్తించు సద్యోగముల్
హంస వాహనా రూ డు డై యరుగు చుం డె
రిప్లయితొలగించండినీ టి మీ దన జూడుడు నీ ర జా క్షు
డైన ప్రమధ గ ణా ధి పు డాలి తోడ
సంద్య్హ కాలపు వాహ్యాళి జరుప కొఱకు .
సంబర పడుచు నందరు సరసు నందు
రిప్లయితొలగించండిరాత్రి పడవ నెక్కి విహారయాత్ర సలుప
గదిలె ముందుకు చల్లని గాలి వీచ
నలల నూగుచు హొయలుగ హంస నావ.
వెలుగు వెన్నెల నీడల యలల పైన
రిప్లయితొలగించండికులుకు రాయంచ నడిపించు వలపు నౌక
సిరుల జంటలు విహరించ విరియు సొగసు
చూడ చక్కని దృశ్యము వేడు కౌను !
హంస రూపగు తెప్పపై నాది దేవు
రిప్లయితొలగించండిడన్ని లోకాలు మెచ్చగా కన్నుగవకు
పండువై విహరించెడు పట్టు గన్న
వారి జన్మము ధన్యము భూరి ఫలము.
పంచ రంగుల మెరయు రాయంచ మీద
రిప్లయితొలగించండిత్రిప్పు చుండిరి దేవుని గొప్పగాను
పంచ పరవశ మును, చూపు భక్తులెల్ల
త్రిప్ప లేకను చూడనా రేయి నీట.
తెప్పోత్సవము ల్జరుపుట
రిప్లయితొలగించండికొప్పుగ రంగైన దీప గోళము లమరెన్
మెప్పుగ తెప్పను కప్పుచు
నప్పట వెంకని విహార యాత్రా సేవన్!
అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
తెప్పోత్సవము అనే ప్రయోగము అందరూ చేయుచున్నారు కానీ అది పొరపాటు. తెప్ప + ఉత్సవము అని గుణ సంధి చేయకూడదు. 2 పదములు సంస్కృతము అయితేనే గుణ సంధి వర్తిస్తుంది. తెప్పకు బదులుగా నౌక, నావ, తరణి, పోత అనే ఏ సంస్కృత పదము వాడినా సంధి చేయుటకు వీలు ఉండేది. స్వస్తి.
శ్రీనేమాని మహాశయులకు కృతజ్ఞతాంజలి. నేను చిన్నప్పటినుండీ వింటున్నమాటే అయినా యెప్పుడూ గమనించనేలేదు. తప్పక గుర్తుపెట్టుకొంటాను. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈనాటి ‘పద్యరచన’ శీర్షికకు అద్భుతమైన పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
మిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
చంద్రశేఖర్ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.