1, మార్చి 2013, శుక్రవారం

పద్య రచన – 267 (ఇల్లు-ఇల్లాలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఇల్లు - ఇల్లాలు"
ఈ అంశాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:


  1. ఇల్లు పోయె ఇల్లాలు పోయె
    అన్నీ మహిళా బాంకు లాయె
    వచ్చే వచ్చే భారతావని లో
    'భామ'కు బాంకు ఇదియే నిజమాయె !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. పంచ భూతాత్మకమ్మయి పరగుచుండు
    నీ మహావిశ్వ మందమౌ యిల్లు నాకు
    స్పర్శ శబ్దాది విషయ సంచయ మయమగు
    నతుల సుఖదాయి ప్రకృతి యిల్లాలు నాకు

    రిప్లయితొలగించండి
  3. చెల్లిగ ప్రేమను గూర్చి చెలువము పెంచున్ సతతము
    చల్లని యక్కగ నుండి చక్కదిద్దును సహోదరుల
    తల్లిగ పిల్లల సాకి యున్నతులుగ తీర్చి దిద్దు
    ఇల్లాలు వెల్గుచు నుండు ఇంటికి దీపమై యెపుడు.

    రిప్లయితొలగించండి
  4. ఇల్లాలు ముఖ్య మింటికి
    యిల్లాలే యిచ్చు మనకు నే సుఖ మైనన్
    ఇల్లాలును హింసించిన
    అల్లా మఱి యూరు కొనక యాపద లిచ్చున్ .


    కాంచ , మూలము గనుపాప కైవ డిలను
    ఇంటి దీ పము నిల్లాలు నెచట నైన
    ఇల్లు లేనిది యిల్లాలు గల్ల యేను
    మంచి యనుబంధ మేయది యెంచి చూడ .

    రిప్లయితొలగించండి
  5. శ్రీపండితులవారి సూచనానంతరం ధన్యవాదములతో సవరించుచూ

    చెల్లిగ ప్రేమను గూర్చి చెలువము పెంచున్ సతతము
    చల్లని యక్కగ నుండి చక్కదిద్దును సహోదరుల
    తల్లిగ సకలము సాకి తనయులలొప్పగ తీర్చి దిద్దు
    ఇల్లాలు వెల్గుచు నుండు ఇంటికి దీపమై యెపుడు.

    రిప్లయితొలగించండి
  6. సమాదరించు ప్రేమతోడ స్వాంతనమ్మునిచ్చు, దా
    శ్రమమ్ముఁజూడకుండ నిల్లు చక్కదిద్దుచుండు,న
    త్తమామ యింటి గౌరవమ్ము తగ్గకుండ నుంచు,న
    ట్టి మీన లోచనిన్ స్తుతించు టెక్కు వీడుమియ్యెడన్.

    రిప్లయితొలగించండి
  7. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము మంచి ధారతో పరువులెత్తినది. అభినందనలు, మీనలోచన అనేదే సరియైన ప్రయోగము. మీనలోచని అని ఇత్వము చివరలో వద్దు. అంగి కంఠి గాత్రి వంటి కొన్ని పదములకే చివరన ఇత్వము చేర్చాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా, ధన్యవాదములు.

    సమాదరించు ప్రేమతోడ స్వాంతనమ్మునిచ్చు, దా
    శ్రమమ్ముఁజూడకుండ నిల్లు చక్కదిద్దుచుండు,న
    త్తమామ యింటి గౌరవమ్ము తగ్గకుండ నుంచు,న
    ట్టి మీన లోచనన్ స్తుతించు టెక్కు వీడుమియ్యెడన్.

    ఇల్లన నిల్లాలనగను
    చల్లని దనునర్థమిప్డు సరితూగగ మే
    మొల్లమనువారె నేడిక
    కొల్లలుగా నున్నవారు కొమ్మలలోనన్.

    రిప్లయితొలగించండి
  9. ఇంటినిగన నిల్లాలినిఁ
    గంటఁ గన నవసర మా? సకలమున్ దెలియున్
    గంటన కన్నీరెరుగక
    నింటిని దీర్చి సిరి నిల్పు యిల్లాలామే!

    రిప్లయితొలగించండి
  10. gODalu chakkaga nuMDina
    mEDanu taa kappu nilachi mElunu goorchun
    kOdalu chakkaga nuMDina
    veDuka taa kappu ninTa vetalanu deerchun.

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ :

    గోడలు చక్కగ నుండిన
    మేడను తా కప్పు నిలచి మేలును గూర్చున్
    కోడలు చక్కగ నుండిన
    వేడుక తా కప్పు నింట వెతలను దీర్చున్.

    రిప్లయితొలగించండి
  12. రవీందర్ గారూ ! 'సిస్టం' ఇబ్బంది వలన వెంటనే తెనిగించలేకపోయాను.
    తెనుగున తేట పరచిన మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    విస్తృత పరిధి గల ఇంటిని ఇల్లాలిని సమకూర్చుకున్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ఇల్లాలి వివిధరూపాలను చెప్పారు.. కానీ ఇంటిని మరిచారు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో .. "ఇంటికి నిల్లాలే"... అనండి.
    రెండవ పద్యంలో "కైవడి + ఇలను" అన్నప్పుడు సంధి లేదు. "కైవడి యిల" అందాం. రెండవ పాదంలో .. ఇల్లాలె యెచటనైన.. అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    పద్యం చివర "నిల్పు నిల్లాలుగదా" అంటే ఇంకా బాగుంటుందనుకుంటాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పిల్ల పాపల చిన్ని యల్లరితో నొప్పు
    ..........చల్లని యిల్లెగా స్వర్గ సీమ!
    పతిని చతుర్విధ గతులను సేవించు
    ..........సతియెగా భాగ్యమ్ము భర్త కిలను!
    అతిథి యభ్యాగతు లాదర మొందెడి
    ..........యిల్లు లక్ష్మికి వాస మెంచి జూడ!
    అత్తమామల పట్ల ననురాగమును జూపు
    ..........యిల్లాలితో వెల్గు నింటి శోభ!

    ఇల్లు నిల్లాలు వరము లీ యిలను వినుము
    పురుషునకు, గౌరవము తోడ నరయ వలయు
    వాని నాతడు గేస్తుగా, లేని యెడల
    ధర్మ కామార్థ మోక్షముల్ దరికి రావు.

    రిప్లయితొలగించండి
  15. ఉల్లము రంజిల్లు నటుల
    చల్లగ సేదను దీర్చు సతిగల యింటన్ 1
    యిల్లే కాదది నాకము
    కల్లయె గాదంచు నిలను కాలుని గెలువన్ !

    రిప్లయితొలగించండి
  16. వంటికి కావలె వస్త్రము
    లింటికి నిల్లాలు యిచ్చు నిహపర సుఖముల్
    మింటికి వెల్గిడు తారలు
    పంటికి కావలె సిరియన పడతియె వండన్.

    రిప్లయితొలగించండి
  17. భూతలంబున రూపములన్ పూబోడి ధరించి చరించుగా
    కూతుగా ననుజాగ్రజగా చేకూరుచు నాలిగ నందినై
    మాతగా వరవత్సలగా సమ్మాన చతుర్విధరీతి, భూ
    మాత సైపున, దాసిగ మంత్రిన్ మాతగ రంభగ వర్తిలన్.

    వ్యవధానమేలేని నిత్య యవధానముంజేయు నింట
    జవసత్త్వముడిగిన యత్త జవదాట రాదాయె మాట
    భవిత బండిని లాగ నెరపు భర్తతో నుద్యోగమంత
    నవవిధముల నల్గు చుండనవరత వ్రతముగ వనిత.

    రిప్లయితొలగించండి




  18. ఇల్లు చూడు,మందు నిల్లాలు జూడుమా
    యనెడి మాట చాటు నామె ఘనత,
    తీరు,తెన్ను,పలుకు. తెచ్చు సౌభాగ్యమ్ము
    నింటిదీప మామె,యింటి సిరియు.

    రిప్లయితొలగించండి
  19. వందనములు,
    తోకలు కేకలు వేయగ
    కూకలు వేయకనె చెప్పు కూరిమి తోడన్
    పాకములెన్నియొ చేసియు
    ఆకలి తీరంగ బెట్టు నాప్యాయతతో.

    శ్లోక పాకములొకసారి చోద్యమలర
    చేయునేరుపునిచ్చెగా చేటికపుడు
    నలువ చేసిన మేలిది నయము గాను
    కానిచో కాలు మగవాని కరములెంతొ.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ!
    మీ కంద పద్యము ప్రారంభములో "వంటికి" అన్నారు. ఒడలు + కి = ఒంటికి అని అవుతుంది కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్న గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    సందర్భశుద్ధితో చక్కని పద్యాన్ని గుర్తు చేసారు. ధన్యవాదాలు.
    చివరిపాదంలో యతిగణదోషాలున్నాయి. నా సవరణ....
    ..... ఘటియించుచుండు నా
    లికి నవధాన తత్వమగులే సహజాతము జన్మసిద్ధమై !
    *
    డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ పండితులవారికి నమస్సులతో దోషము సవరించుచూ
    ఒంటికి కావలె వస్త్రము
    లింటికి నిల్లాలు యిచ్చు నిహపర సుఖముల్
    మింటికి వెల్గిడు తారలు
    పంటికి కావలె సిరియన పడతియె వండన్.

    రిప్లయితొలగించండి