అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం ‘వి’, రెండవ పాదం 3వ అక్షరం ‘నా’, మూడవ పాదం 10వ అక్షరం ‘య’, నాలుగవ పాదం 12వ అక్షరం ‘క’.
విశ్వ మంత నేడు వినిపించు నీపేరు
రిప్లయితొలగించండినీదు నామ జపము నేదు నఘము
తల్లి భార్గవి ప్రియ తనయ వినాయక
చరణములను విడువ చండిక సుత
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
విఘ్ననాయకా-వినాయకా
కష్టాలు తీరేలా - కనకమిడుమయ్యా :
01)
__________________________________
"వి"ఘ్నహారి ! సుముఖ !- విఘ్నేశ ! హేరంభ !
విఘ్న"నా"యక ! మన - విని విని నను
వేగ బ్రోవుమయ్య ! - వెనక"య్య "! హరిహయ !
కరివదన ! గణపతి ! - కన"క" మిడుమ !
__________________________________
మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిఅందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !!
రిప్లయితొలగించండికంది వారు,
జి, లే, బి న్యస్తాక్షరి గా జిలేబి వర్ణన చేయ వీలగునా !!
జేకే
జిలేబి
విశ్వ మాత గన్న విశ్వేశు ప్రియ పుత్ర
రిప్లయితొలగించండినిన్ను నాదు మదిని నిలుపుకుంటి
తపముఁ జలుపు చుంటి దయను కోరి, నియతి
ననవరతముఁ దలతు నంబికసుత
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘చండికాసుత, అంబికాసుత’ అని సమాసం చేయాలి కదా!
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘య్య’ అని ద్విత్వాక్షరాన్ని ప్రయోగించరాదు కదా! అక్కడ ‘య’ మాత్రమే ఉండాలి.
*
జిలేబీ గారూ,
తప్పకుండా ఇవ్వవచ్చు. అయితే నాలుగు పాదాలకు నాలుగక్షరాలు ఇవ్వాలి కనుక ‘జి-లే-బీ-లు’ అని ఇవ్వవలసి ఉంటుంది.
ఆ. వె. వినయ సంపదొసగు విద్యల మహరాజు
రిప్లయితొలగించండివిఘ్న నాయకుండు వేద మూర్తి,
నమ్మకంబు గలిగి నారాయణ పదము
సిద్ది బొంది నాడు సిరులు జిలుక
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
'వి'ఘ్న రాజ నిన్ను వినుతింతు గణపయ్య
భక్తి 'నా'దు బుద్ధి బాగ పెరుగ
శూర్పకర్ణ మాకు చూడరా 'య'పనింద
కల్గనట్లు నీదు కరుణ చిలు'క'
పూజ్య గురువుగారికి, కవిమిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండివిశ్వ నాధ సుతుడ విఘ్నేశ జేజేలు
విఘ్న నాయకునకు వేల నతులు
విద్య లొసగు మయ్య విజయమ్ము లీయుచు
శుభము గలుగ నెపుడు శూర్ప కర్ణ
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచనననుసరించి నాలుగవ పాదాన్ని మార్చి రెండవ పద్యమును మళ్ళీ పంపుచున్నాను.
రిప్లయితొలగించండివిశ్వ మాత గన్న విశ్వేశు ప్రియ పుత్ర
నిన్ను నాదు మదిని నిలుపుకుంటి
తపముఁ జలుపు చుంటి దయను కోరి, నియతి
సుఖమునిడుము సతము శుభకరుండ
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచన ననుసరించి మొదటి పద్యము నాలుగవ పాదాన్ని ఈక్రిందివిదంగా మార్చాను.
రిప్లయితొలగించండిప్రణతు లిడుదు సతము బ్రతుక తృప్తి
లేక
యెదను కొలిచెదనయ యెలుక వాహ్య
గురుదేవులకు బ్లాగు కవి మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివిజయ మంద మేము వేడుకగా నీ పూజ
విఘ్న నాయకుడని విన్నపముగ
భక్తి తోడఁ జేయ వరదాయకా మేము
వరము లొసగ నడుగ పలుక రార!
విశ్వనాధ తనయవిఘ్నేశ్వరా దేవ
రిప్లయితొలగించండివందనాలు నీకు వక్రతుండ
దయను జూపుమేకదంతాయ మామీద
ధరణిఁ శాంతి వెల్లివిరియు గాక !
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండివిపుల భక్తి తోడ వేడెడి మమ్మిల
విఘ్న నాయకుండ! వేగ కావు
నాకు ముక్తి నిమ్ము జ్ఞాన నాయక నీవు
కుడుము లాది నిడచు కొలుతు కరము
విఘ్నములవి కలుగు వేనవేలు నిలను
అవ్వి నాకు కల్గ కడ్డగించి
నాగ ముఖుడ యిల వినాయకుండని మేము
కుడుము లవియు నిత్తు కొనుమ కరుణ
పూజ్యులు గుఉదేవులు శంకరయ్య గారికి వందనములు విభవమొప్పనిన్ను విధిగ బూజింతును
రిప్లయితొలగించండివిఘ్ననాయకుండ విజయ మొసగు
సర్వకార్య సిద్ధి సాధించి యశమిమ్ము
ఫలిత మొండ భరత ప్రజల కలలు
విన్నపాలు వినవొ వేడెద నియ్యెడ
రిప్లయితొలగించండివిఘ్ననాయకా వివేక మిచ్చి
పూజ చేసి నీకు పొంగెడి యద్భుత
వరము నిడవె యిడుదు గరిక భక్తి.
విశ్వవిభుడ వంద్య విమల వినాయక
రిప్లయితొలగించండినాక నాద మోద నాదబిందు
అభయ మీయవయ్య సదయ హృదయ వ్యాస
భారత లిపికార భాగ్యజనక
గణనాథుండయి దుష్టశిక్షణమహాకార్యంబులన్ సల్పి స
రిప్లయితొలగించండిద్గుణవిభ్రాజిత మూర్తిమంతుఁడయి నైర్గుణ్యప్రతీకాత్మవై
ప్రణవాదిస్వరమంత్రశక్తియుతుఁడై భాసింతువెల్లపుడున్ !!
ప్రణతుల్ జేతు వినాయకప్రభునకున్ భక్తిప్రపత్తిన్ సదా.
విఘ్నములను బాపి విజయంబుచేకూర్చి
దేవనాయకులకు తేజమొసఁగె
బ్రోవతమరె కాదె యోవినాయక జేతు
వంద వందనములఁ భక్తి విడక.
'వి'ద్య నేర్చు వేళ వియ్యమందెడివేళ
రిప్లయితొలగించండియుద్ధ 'నా'దపు మొన యుబ్బు వేళ
సర్వ కార్యములకు సరి 'య'త్నములు జేయ
కాదె పని గణపతి కరుణ 'క'లుగ!!
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండివిధు రుచి నిభ గాత్ర! విష్ణు! ద్విమాత్రుక!
ప్రార్థనాద్య మంత్ర! పర్శుపాణి!
విశ్వనేత! ఢుంఠి! విఘ్ననాయక! శూర్ప
కర్ణ! తే నమోsస్తు ఖనక రథిక!
కొరుప్రోలు రాధాకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వినయసంపద నిడు’ అనండి. సంపద + ఒసగు అన్నప్పుడు సంధి లేదు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విజయమ్ము లిచ్చుచు/ విజయమ్ము లొసగుచు’ అనండి.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ సవరణలు బాగున్నవి. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వేడుకగా’ అన్నచోట గణదోషం. ‘వేడ్కగా/ వేడుక నీపూజ’ అనండి.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఏకదంతాయ’ సంస్కృత ప్రత్యయాన్ని ప్రయోగించారు. దానికి అన్వయం లేదు. సవరించండి.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘వేనవేలుగ నిల/ నవ్వి...’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. పూరణకంటె మాకు బోనస్‍గా అందించిన మత్తేభం మరింత బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విఘ్న వారణమున విఖ్యాతిగన్నట్టి
రిప్లయితొలగించండివిఘ్న నాధునకును విమల భక్తి
మోదకముల నిడగ మోయలేక దిరిగి
భక్త జనుల కొసగు ముక్తి వాఁక*(ప్రవాహము)*
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండివిజయ మంద మేము వేడ్కగా నీ పూజ
విఘ్న నాయకుడని విన్నపముగ
భక్తి తోడఁ జేయ వరదాయకా మేము
వరము లొసగనడుగ పలుక రార!
ఆ. వె . వినయ సంపదనిడు విద్యల మహరాజు
రిప్లయితొలగించండివిఘ్న నాయకుండు వేద మూర్తి,
నమ్మకంబు గలిగి నారాయణ పదము
సిద్దిబొంది నాడు సిరులు జిలుక
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మీ సూచన కు ధన్య వాదములు
ధన్యవాదములు మాష్టారు ! సవరించిన పద్యం :-
రిప్లయితొలగించండివిశ్వనాధ తనయవిఘ్నేశ్వరా దేవ
వందనాలు నీకు వక్రతుండ
కాయుమోయి మము వినాయక నీదయన్
ధరణిఁ శాంతి వెల్లివిరియు గాక !
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివిజయ గీతికలను వీనులవిందుగా
విఘ్ననాయకునకు వినతి జేతు
స్తుతుల నుతుల గొలచి తోయములర్పింతు
ముదము కలిగి నిడుదు మోదుకములు