అంశం- దుర్గాదేవీస్తుతి.
ఛందస్సు- తేటగీతి.
ప్రథమపాదం ద్వితీయగణాద్యక్షరం ‘దు’,
ఛందస్సు- తేటగీతి.
ప్రథమపాదం ద్వితీయగణాద్యక్షరం ‘దు’,
ద్వితీయపాదం తృతీయగణాద్యక్షరం ‘ర్గ’,(కావాలనే హ్రస్వంగా ఇచ్చాను)
తృతీయపాదం చతుర్థగణాద్యక్షరం ‘దే’,
చతుర్థపాదం పంచమగణాద్యక్షరం ‘వి’.
అంబ దుర్గాభవానీ జయంతి గిరిజ
రిప్లయితొలగించండిచండి గౌరి భార్గవి కాళి శైలపుత్రి
త్రిపురసుందరి పార్వతీదేవి యనుచు
నేస్మరించుచు జేసెద నీకు వినతి
దనుజ దుష్టులఁ దునిమెడు తల్లివీవు
రిప్లయితొలగించండిపడును దైవ వర్గము నీదు పదములందు
తీరుగ నిను గొలిచిన సందేహమడయు
లేదు జననమిక తెలియ నీదు విద్య!!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ స్తుతిపద్యం బాగున్నది. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిభవానీవిద్య జన్మరాహిత్య మిస్తుందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సూర్యనారాయణ గారు!
రిప్లయితొలగించండిభార్గవి అంటే లక్ష్మీదేవి అనిగదా!
దుర్గా దేవిని ముగురమ్మల మూలపుటమ్మగా భావిస్తే భార్గవి అన్నా సరిపోతుందేమో
అమ్మ !దుర్గమ్మ !కాపాడు మమ్మ , నన్ను
రిప్లయితొలగించండిన లమి యున్న దు ర్గములను దొలగ జేయ
దీ ను నై నట్టి యీ నేను దేవి ! నిన్ను
మఱువ కుండగ బూజింతు మాత ! వినుము
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
దుర్గాదేవి స్తుతి :
01)
______________________________
అంబ ! దుగ్గమ్మ ! చండిక ! - అన్నపూర్ణ !
అగజ ! గౌరి ! దుర్గ ! హిమజ ! - ఆర్య ! చండి !
ధిషణ ! ఆనందభైరవి - దేవి ! సురస !
సావిత్రి ! సురసుందరి ! సౌమ్య - శాంతి ! విజయ !
పాదపూజల జేతుమో - పద్మనేత్రి !
భద్రముగ మమ్ము గరుణించు - భద్రకాళి !
స్తుతులు జేతుము వేనోళ్ళ - సుద్యుపాస్య !
విశ్వశాంతిని నెలకొల్పు - వీరమాత !
______________________________
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దుర్గము’ అంటే కోట అని అర్థం. ‘అలము పాపవర్గమ్మును దొలగజేయ’ అనండి.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో ‘సావిత్రి’ అన్నచోట గణభంగం. ‘సతి! త్రిపురసుందరీ! సౌమ్య! శాంతి! విజయ!’ అందామా?
చేరి దుష్టుల జంపగ గౌరి నీవు
రిప్లయితొలగించండిమారి నావంట దుర్గగ, మాకు వరము
లీయ గొల్చెద దల్చెద దేవి నిన్ను
కనక దుర్గవు మమ్ముల గావ వినుము.
,
మిత్రులకు నమస్కారములు,
రిప్లయితొలగించండిమిత్రులు జిగురు సత్యనారాయణగారికి ప్రత్యేక ధన్యవాదములు.
పనుల యొత్తిడిచే నేను నిన్న బ్లాగును చూచుట వీలుపడలేదు. జిగురు వారి కిటుకును మిత్రులందఱు నాచరించిచూచి యవగతముఁ జేసికొనుట నాకు సంతోషమునుం గూర్చినది. స్వస్తి.
భవదీయుఁడు
గుండు మధుసూదన్
madhurakavanam.blogspot.in
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికనకదుర్గమ్మవై నిల్చి కరుణ జూపి
నిగమ మోక్ష మార్గమ్ములు నీవొసంగి
దివ్యతేజమ్ముతో వెల్గు దేవి వమ్మ
హితము గూర్చగ గొల్చెద హృదయవిమల
మిత్రులకు నమస్సులు!
రిప్లయితొలగించండిమాత! దుర్గ! దాక్షాయణి! మంగళ! శివ!
పార్వతి! సతి! భార్గవి! శక్తి! భద్రకాళి!
దేవసంస్తుత! ప్రవిచలదేణనేత్రి!
షష్ఠి! హిండి! నమోఽస్తుతే సమరవిజయ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజిగురు సత్యనారాయణ గారూ! భార్గవి అంటే లక్ష్మి , పార్వతి , గఱిక అనే అర్ధాలు ఉన్నవి
రిప్లయితొలగించండిఏదైనా పదము ప్రస్ఫుటంగా కనుపించాలంటే లేఖినిలో నుండి గాని, బరాహా నుండి గాని "ఎమ్.ఎస్. వరల్డులో" కాపీ చేసి సెలక్టు చేసి బోల్డు చేయటం తేలిక.
రిప్లయితొలగించండిమల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండిలోకదుర్నీతి యెంతయు లుప్త మవగ
మాత తాను దుర్గయునౌను మానితముగ
దివ్యమైనట్టి నవవిధ దేవి రూపు
యింద్ర కీలాద్రి వెలుగొందు నెల్ల విధుల
2.ఇలను దుర్గతి దీర్పగానింద్రకీల
పర్వతాన దుర్గగ జన పాలనమున
తివిరి మహిషుని గూల్చిన దేవి యగుచు
కలుష హారిణి చేయును కనుల విందు
పూజ్య గురుదేవులు శకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండి"నీవె దుష్ట రాక్షసుల మ్రందించ గలవు,
యవతరించి దుర్గగ"నన యమరులెల్ల
దివ్య శస్త్రాస్త్ర ధారియై దేవి వెడలె
సింహ యానయై నాజిని సేయ విధిగ
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
రిప్లయితొలగించండిఈవె దుష్ట దైత్యతతి శిక్షించితివిగ
యఖిల దివ్యవర్గమును కాపాడు కొరకు
నింక షడ్రిపు వర్గమిదే నడంచి
ముదముతో బ్రోవు మమ్మ చేసెదను వినుతి
గౌరి! దుగ్గమ్మ! కాలిక! గట్టుపట్టి!
రిప్లయితొలగించండిచండి! ఛాయ! దుర్గ! భవాని! శక్తిశాక్రి!
త్రిపురసుందరి! సతి! మహాదేవి! సురస!
ప్రాంజలింతును భక్తితో బ్రహ్మ విద్య!
మహిని దుష్టుల దునుమాడ మాత సతియె
రిప్లయితొలగించండినవతరించె దుర్గతి దీర్చి నవని గావ
దీరుకోర్కెలు గొలువంగదేవి నిన్ను
శరణు గోరెద సర్వదా జనని వినుమ!
పలుకుదును నీదు దయతోడ పార్వతమ్మ!
రిప్లయితొలగించండికనుల నిండ దుర్గ, మమత కంటినమ్మ!
తీయనైన మాటల గొల్వ దేవి వరము
నిమ్ము. వందనమ్ములఁ గొనుమిదియె వినతి.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిచేరు దు ను నిన్ను మాయమ్మ! చిర యశమిడి,
నన్నిఁక నపవ ర్గ ము నొంద ననువుఁ జూపి,
నిత్యమును జ్ఞానసరణినిం దే లఁజేసి,
మనఁగ దీవించుమా దుర్గమ! మన వి యిదె!
చండి! దుర్వార తేజస్వి శర్వు, పత్ని!
రిప్లయితొలగించండిదక్షపుత్రి! దుర్గ!శివ!రుద్రాణి! గౌరి!
ధేనుక! మృడాని! ఈశ్వరి! దేవి! కాళి!
పార్వతి! భవాని! అంబిక! భార్గవి! జయ!
శివుని ప్రియపత్ని నిను సదా చేరికొలుతు
ముగ్గురమ్మలకును నీవు మూలమమ్మ
నిన్ను నమ్మి మనుచునుంటి నియతితోడ
సర్వ కొర్కెలఁ దీర్చుము సత్వరముగ
కవి మిత్రు లందరకూ వందనములు... తెలుగు లిపి కంప్యూటర్ లో సౌకర్యం గా రావాలంటే aponline నుండి ileap download చేసుకుని వాడుకోవడం చాలా సులభమని నా అనుభవం. .
రిప్లయితొలగించండికె.ఈశ్వరప్ప గారిపూరణలు
రిప్లయితొలగించండి1.అంబ దుష్టత్వమే మాన్ప నాది శక్తి
వాణి రచన వర్గమ్ము కే ప్రాణ శక్తి
దివ్య లౌక్యంబె నిల లక్ష్మి దేవి రక్తి
శక్తి యుక్తుల రక్తి ఆసక్తి నిలువ
2.కనకదుర్గమ్మ,శ్రీ,వాణి,కవనమందు
శక్తి భక్తి వర్గమ్ము లాసక్తిచేత
దివ్య నామమ్ము తలచ నాదేశములుగ
తేట గీతిని వ్రాయంగ తెలుపు విధిగ
Windows వాడకందార్లు తెలుగులోనేరుగా Type చేసేందుకు నా దృష్టిలో ఫ్రముఖ్ ఉత్తమమైనది. దానితో phonotic టైపింగ్ చెసి తెలుగులో వ్రాయవచ్చును. కావలసిన వారు http://www.vishalon.net/PramukhIME/Windows.aspx అనే సైట్ నుండి దిగిమతి చేసుకోవచ్చును. ఇది పూర్తిగా ఉచితం. తెలుగే కాదు మొత్తం 20 భాషలకు ఈ సాధనం పనుకొస్తుంది.
రిప్లయితొలగించండిగుండువారి పద్యభావం బాగుంది. మూడవపాదం:
రిప్లయితొలగించండినిత్యమును జ్ఞానసరణినిం దేలఁజేసి
దీనిలో యతిభగం కలిగింది. గమనించగలరు.
శ్యామలీయంవారూ, తమరి యభినందనలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండినా ద్వితీయపూరణమందలి తృతీయపాదమున యతిభంగము కలుగలేదు. "ని" కిని, "oదే = అనఁగా (న్దే)" కిని యతిమైత్రి కుదురునుకదా! బాగుగాఁ బరిశీలింపుఁడు. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా పిన్ని ఈ ఉదయం మరణించడం వల్ల నేను నల్లబెల్లి అనే గ్రామానికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అందువల్ల మీ పూరణలపై వెంటవెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ మొదటి పూరణలో ‘దేవి రూప/ మింద్రకీలాద్రి...’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వర్గమిదే యడంచి’ అనండి.
*
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘సతియె యవతరించె.... దీర్చి యవని గావ’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘వర్గమునకే.... లౌక్యంబె యిల...’ అనండి.
*
శ్యామలీయం గారూ,
గుండు వారి పద్యంలో యతిదోషం లేదు.
బిందుయతి (అనుస్వారయతి) గురించి మీకు తెలియంది కాదు. బిందుపూర్వకాలైన వర్గాక్షరాలు ఆయా వర్గాల పంచమ (అనునాసిక) అక్షరాలతో యతి చెల్లుతుంది కదా!
కనక దుర్గమ్మవై భూరి కరుణ తోడ
రిప్లయితొలగించండిమహిషు పాలి దుర్గమ శక్తి భాతి చెలగి
నీ విభూతుల జంపిన దేవి నీకు
వినమిత శిరస్కమును దాల్చి వినుతి వినుతి.
దైత్యదుష్టుల దునుమాడి తపసిజనుల
రిప్లయితొలగించండికెల్ల మోక్షమార్గమ్ములనెఱుకపరచి
దివ్యతేజోనిధానమై దేవతలకు
నభయమొసగిననీకిత్తునమ్మ వినుతి
కనక దుర్గను గనలేని కనులు యేల?
రిప్లయితొలగించండికదిలి శత్రు వర్గము నంత ప్రిదిలె నమ్మ ,
దినది నంబొక యవతార దేవి గాగ ,
త్రిగుణ ధాత్రి గ నిల్చిన దేవి "విజయ".
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
శంకరార్యా !
రిప్లయితొలగించండిఈ పాదములలో యతి కుదిరెనా యని సందేహం !
లీయ గొల్చెద దల్చెద దేవి నిన్ను
****
నింక షడ్రిపు వర్గమిదే నడంచి
కనక దుర్గమ్మ కావుమా కరుణ జూపి
రిప్లయితొలగించండిసజ్జనులకు దుర్గమ్ముగ! సన్నుతింప
తేజ మీయవే నిను దల్తు దేవి నీవు
మహిని రక్షింప వినవమ్మ మాదు వినతి