కామేశ్వర రావు గారికి నమస్కారములు, ఇరుపతులు అన్న సమాసము దోషము కాదనుకుంట. కేవల సంస్కృత పదము మీది తెలుగు పదము చేర్చుట దోషమగును. ఇక్కడ తెలుగు పదము మీద సంస్కృత సమమును చేర్చినాను. కాన ఇది మిశ్రమ సమాసము అవుతుంది కాని దోషము కాదు. "ఇరు వర్గములు", "ఇరు పక్షములు" మొదలగు ఉదాహరణలు చూడ వచ్చు. సమస్యా పూరణం -344 (బిడ్డఁ గన్న తల్లి) లో "డా.ఆచార్య ఫణీంద్ర" గారు "ఇరు సతులు" అని ప్రయోగించారు.
డా.ఆచార్య ఫణీంద్రమే 22, 2011 9:45 [ఆం] "నా సుతు"డన, "కాదు - నా సుతుం" డని, ఇరు సతులు పోర; రాజు " సమ విభజన సలుపు" దనగ - తేలె సతుల నెవ్వ రెవరు ’బిడ్డ గన్న తల్లి’; ’గొడ్డురాలు’!
సుబ్బారావు గారు పంపింది ‘జీవించియుండ’ అనే. నిన్న రాత్రి షెడ్యూల్ చేస్తున్నపుడు పొరపాటున ‘డ’ .. ‘డు’ అని టైపయింది. ఉదయం ఆ పొరపాటును గమనించేసరికే ఐదారు పూరణలు వచ్చాయి. అందుకని సవరించలేదు. ధన్యవాదాలు.
కవిమిత్రులకు నమస్కృతులు. నా ఆరోగ్యం మరింత దిగజారింది. నడుము, వెన్ను నొప్పితో పాటు నిన్నటినుండి జ్వరం ఉంది. మీ పూరణలపై స్పందించలేక పోతున్నందుకు మన్నించండి. నా ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందుతున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
తాళి కట్టిన మొగుడిని తరిమి వేసి
రిప్లయితొలగించండిమారు పెండ్లిజేసుకొనెను చారుశీల
ఇరుపతులలోన నొక్కండు మరణమొంద
విధవ యననొప్పు భర్త జీవించియుండు!!
సత్యనారాయణ గారు “ఇరుపతుల” సమాసము దోషము. “పతులిరువరు” అనవచ్చు. తదనుగుణముగ సవరణ చేయండి.
తొలగించండికామేశ్వర రావు గారికి నమస్కారములు,
తొలగించండిఇరుపతులు అన్న సమాసము దోషము కాదనుకుంట.
కేవల సంస్కృత పదము మీది తెలుగు పదము చేర్చుట దోషమగును. ఇక్కడ తెలుగు పదము మీద సంస్కృత సమమును చేర్చినాను. కాన ఇది మిశ్రమ సమాసము అవుతుంది కాని దోషము కాదు. "ఇరు వర్గములు", "ఇరు పక్షములు" మొదలగు ఉదాహరణలు చూడ వచ్చు.
సమస్యా పూరణం -344 (బిడ్డఁ గన్న తల్లి) లో "డా.ఆచార్య ఫణీంద్ర" గారు "ఇరు సతులు" అని ప్రయోగించారు.
డా.ఆచార్య ఫణీంద్రమే 22, 2011 9:45 [ఆం]
"నా సుతు"డన, "కాదు - నా సుతుం" డని, ఇరు
సతులు పోర; రాజు " సమ విభజన
సలుపు" దనగ - తేలె సతుల నెవ్వ రెవరు
’బిడ్డ గన్న తల్లి’; ’గొడ్డురాలు’!
జిగురు సత్యనారాయణ గారు. మీరు చెప్పినది నిజమే. నేను పొరబడ్డాను. మన్నించండి.
తొలగించండిమన్నిచటం అనే అంత పెద్ద మాట వద్దండి
తొలగించండిగురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు
రిప్లయితొలగించండినేటి నా పూరణలు
కలియుగమ్మున వింతల గాంచు మిదియె
యలిగిన పతి యిల్లు విడిచి యాగ్రహమున
బారి పుష్కరమ్ముయె దాట భార్యనపుడు
విధవ యననొప్పు భర్త జీవించి యుండు
విధవ రాండ్రకు సర్కారు విరివిగాను
ధనము నిచ్చుననితెలిసి తరుణి యొకతె
కుటిలతంత్రమ్ము లనెరిపి పటిమతొడ
వలయు పత్రమ్ములనొసగి ప్రభువులకును
పెన్షనందుకొనియె నెంత వింత యౌర
విధవ యననొప్పు భర్తజీవించి యుండు
పతియె పరమపదించిన పడతి నికను
రిప్లయితొలగించండివిధవ యనగ నొప్పు, భర్త జీవించి యుండు
స్త్రీలను సుమంగళు లని వచింతు రనుచు
నెరుగ నట్టి వాడెవ్వడీ ధరణి యందు
రిప్లయితొలగించండిఓయి ! కవివర ! యిదియెట్లు ఒనరు? నెటుల
విధవ యన నొప్పు భర్త జీవించి యుండు
నపుడు? తప్పుకాయవలెను నన్ను యెగ్గు!
పదము లనువేసి తిగదవె ప్రాస కొరకు :)
మొదట పరిణయ మాడిన మోద మనక
రిప్లయితొలగించండివీడి పోవుట నేడది వేడు కనుచు
మారు మనువాడి నంతనె మగడు జచ్చె
విధవ యననొప్పు భర్త జీవించి యుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండికనఁగ వీరేశలింగము ఘనతఁ బూన్కి
స్త్రీపునర్వివాహంపు వర్తింపు కతన;
ముసలి పెనిమిటి మృతిఁ, బెండ్లి పొసఁగ, బాల
విధవ యననొప్పు! భర్త జీవించియుండు!!
రిప్లయితొలగించండిసుతులనొసఁగిన నమరులున్ బతులు గాదె?
పతిగఁ గుంతిని మనువాడి పాండురాజు
శాపవశమున మరణించ శాస్త్రవిధిని
విధవ యననొప్పు,భర్త జీవించియుండు.
భర్త జీవించియుండ...అని ఉంటే ఇంకా బాగుండేదేమో కదండీ.....
రిప్లయితొలగించండిసుబ్బారావు గారు పంపింది ‘జీవించియుండ’ అనే. నిన్న రాత్రి షెడ్యూల్ చేస్తున్నపుడు పొరపాటున ‘డ’ .. ‘డు’ అని టైపయింది. ఉదయం ఆ పొరపాటును గమనించేసరికే ఐదారు పూరణలు వచ్చాయి. అందుకని సవరించలేదు. ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభర్తమరణించినప్పుడుభార్యభువిని విధవయననొప్పు,భర్తజీవించియుండు
శివునిగుడులకునేగుచుశివశివయని
భక్తిశ్రధ్ధలబూజించపరమశివుని
ఇంటిపేరది చూడగా ' విశ్వనాథ '
రిప్లయితొలగించండిపరగ ' ధనలక్ష్మి వర్ధని ' వనిత పేరు
మిత్రులైనట్టి వారలు మేలమాడ
' విధవ ' యననొప్పు భర్త జీవించియుండు.
భళీ!
తొలగించండిసహదేవుడు గారికీ..జిలేబి గారికీ...ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిగోలి వారు నమో నమః ! సూపర్ !
జిలేబి
సహదేవుడు గారికీ..జిలేబి గారికీ...ధన్యవాదములు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మాసాదిని నమంగళ మెందు కని యా మాటను రాజభావము తో ప్రతి హతము చేశాను.
రిప్లయితొలగించండిసాధ్వి సావిత్రి ప్రార్థింప శమను డంత
భర్త ప్రాణముల నొసంగె పడతి కతని
వరమునన్ సాళ్వ భావి ధవ యననొప్పు
భర్త జీవించి యుండు సువర్తనమున
భర్త యాయు ముగియ వాని భార్య నిలను
రిప్లయితొలగించండివిధవ యననొప్పు;భర్త జీవించి యుండు
నట్టి మహిళలముత్తైదు వంద్రు గాదె
మహిని కాదన లేనట్టి మాట యిదియె/యిదియు.
మొదటి భర్తను విడిపించి ముదిత కపుడు
రిప్లయితొలగించండిమారు మనువును జరుపగన్ మగడు జచ్చె
ఇతను పోయిన నేమయ్యెనతను యున్న
విధవ యననొప్పు భర్తజీవించి యుండు.
నేటి అర్ధాంగి కంటికి కాటుకేది?
రిప్లయితొలగించండిపూలు,గాజులు,నుదిటికి బొట్టులేక
తాళి,మెట్టెలు, కనరానితరుణి జూడ?
విధవ యననొప్పు|”భర్తజీవించి యుండు”|
శభాష్
తొలగించండిశభాష్
తొలగించండిఈశ్వరప్ప గారూ ! చక్కటి పూరణ.
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ధవు డటన్న కనీస గౌరవము లేక ,
సతము మానసికమ్ముగ చ౦పు చు౦డు ---
నట్టి > పరమ సాధ్వీమణి < యవని లోన
" విధవ " యన నొప్పు | భర్త జీవి౦చుచు౦డు -
ఫలము లేకు౦డ , జీవఛ్ఛవ౦బు పగిది |
పురుష రక్షణకై చట్టము లెవి లే వె ? ? ?
[ ఎవి = ఎవ్వి , ఏవి ]
* గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇ౦ట ధరియి౦చి , షూ టి౦గు నెదుట తీయ
వలయు | నె౦దుకు వచ్చిన బాధ యనుచు
టీ.వి. - చలనచిత్ర౦పు నటీ మణి " రమ "
ప్రక్క విసిరె మా౦గళ్య సూత్ర౦బు నౌర !
యామె బ౦దుగు లారసి యనుకొని రిటు ె
" విధవ యన నొప్పు , భర్త జీవి౦చి యు౦డ "
* గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇ౦ట ధరియి౦చి , షూ టి౦గు నెదుట తీయ
వలయు | నె౦దుకు వచ్చిన బాధ యనుచు
టీ.వి. - చలనచిత్ర౦పు నటీ మణి " రమ "
ప్రక్క విసిరె మా౦గళ్య సూత్ర౦బు నౌర !
యామె బ౦దుగు లారసి యనుకొని రిటు ె
" విధవ యన నొప్పు , భర్త జీవి౦చి యు౦డ "
సంసరణమును జేయక సంతతమ్ము
రిప్లయితొలగించండిగడనకోసమె పతికిచ్చి గౌరవమును
రాచిరంపాన బెట్టెడు లలన నెపుడు
విధవ యన నొప్పు భర్త జీవించియుండు
భర్తకు విడాకులిచ్చి వివాహమాడ
రిప్లయితొలగించండికాలవశమున నాతడు నేల రాల
నామె నేమనవలెనార్య? యనగననియె
విధవ యననొప్పు భర్త జీవించియుండ.
నిన్నటి పూరణలు
ఒరుల కంటబడక మరుగున నిడునదే
దానగుణము; మిగుల హీనగుణము
తృణము రాల్చ నదియె గణనీయమని జూప
దూర దర్శనులను కోరు గుణము
కూడు లేని వారు కోటాను కోట్లుండ
తృణము నైన రాల్చు గుణము లేక
లక్షలిచ్చి స్టార్ల లంచిలో పాల్గొను
దానగుణము మిగుల హీనగుణము.
తలను పూలులేక మెడను తాళిలేక
రిప్లయితొలగించండిగాజులను తన సుందర కరము లందు
దాల్చక తిరుగు చున్నట్టి తరుణిమణిని
"విధవ"యననొప్పు :భర్త జీవించి యుండ.
రిప్లయితొలగించండికంది వారు
కుశల మేనా ?
జిలేబి
గురుదేవులకు ప్రణామములు.మీ ఆరోగ్యం ఎలాయుందండీ?
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! మీ ఆరోగ్యము లా ఉన్నది....అవసరమైతే తగిన విశ్రాంతి తీసుకోండి.
రిప్లయితొలగించండిప్రణామములు గురువుగారు..మీ ఆరోగ్యం ఎలావుంది?
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినా ఆరోగ్యం మరింత దిగజారింది. నడుము, వెన్ను నొప్పితో పాటు నిన్నటినుండి జ్వరం ఉంది. మీ పూరణలపై స్పందించలేక పోతున్నందుకు మన్నించండి.
నా ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందుతున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
గాంధి వంశపు భర్తలు కాటి కేగ
రిప్లయితొలగించండిచావు లేదుగ వారికి చక్క గాను
రంగు రంగుల నేర్పోర్ట్లు రింగు రోడ్లు
హెల్తు స్కీములు గృహములు హీనులకును
పేరు పేరున వర్ధిల్లి మారు మ్రోగ
నట్టి భర్తను కోల్పోవ నతని భార్య
విధవ యననొప్పు,...భర్త జీవించియుండు!