చదివిన చదువు భుక్తికి జాడ తెల్పి ఆదుకొనని కారణమున, ఆప్తు లనుచు సంఘ విద్రోహులు పిలువ, సంతసముగ వారి తోచేరి దేశము వదలి, యువత భరత భూమిని సతతము బాధ పెట్టు నడక హాని కారకము మానవులకెపుడు
గురువుగారికి నమస్కారములు నిన్నటి ఈ పూరణము ఒక్కసారి సమీక్షిoచి తప్పులు సూచించిన సరిదిద్దుకుంటాను ధన్యవాదములు
అధికార మిచ్చు నహంకారము, నమస్కా రము తోడ నీ ప్రకారము నడచును. తిరస్కారము ల్లేక ధిక్కారములకోర్చి సహకార మిచ్చును సంతసముగ, ఆకారమునకు నలంకారములు చేసి ఛీత్కారములు లేక చెలిమి తోడ స్వీకారము తెలిపి,ఘీంకారమునుచేయు, ప్రాకారమున నీదు పదవి ముగియ
సాకారములు లేక శ్రీకారమును చుట్టు మరణ పుస్తకమున మనసు విరిగి, గుణకారములు, నీదు కూడికల్ తప్పగా నీ చమత్కారము నీల్గి వికారమై అంధకారము కాగ, వ్యధను పొంది మమకా రములు తగ్గ నుడికారములు వన్నె తగ్గి ఝoకారము తడబడి కుసుమము పైన తిరుగు చుండు భ్రమరకము
వోలె బ్రతుకు నీడ్చ, జాలి పడక, ఇంటిలో వెటకారము, ఈర్ష్య పెరుగ, ముఖ్యులెల్ల హాహాకారములు సలుపగ, నీ ఉనికి నిరాకారమై నెత్తురోడ,
కోరుము సాక్షాత్కారము మారక సమయమున నీవు భగవంతుని, నో రారగ పలికెడి ఆ ఓం కారమ్మును మించి తీపి కలదే పుడమిన్
రామకృష్ణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మంచిన నున్న' అనండి. అక్కడ యడాగమం రాదు. పద్యం మధ్యలో అచ్ఫ్హులు రాకుండా చూడండి. అవసరమైన యడాగమ, నుగాగమాలతో వ్రాయడానికి ప్రయత్నించండి.
చదివిన చదువు భుక్తికి జాడ తెల్పి
రిప్లయితొలగించండిఆదుకొనని కారణమున, ఆప్తు లనుచు
సంఘ విద్రోహులు పిలువ, సంతసముగ
వారి తోచేరి దేశము వదలి, యువత
భరత భూమిని సతతము బాధ పెట్టు
నడక హాని కారకము మానవులకెపుడు
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ సమకాలీనాంశంతో చక్కగా ఉంది. అభినందనలు.
గురువుగారికి నమస్కారములు నిన్నటి ఈ పూరణము ఒక్కసారి సమీక్షిoచి తప్పులు సూచించిన సరిదిద్దుకుంటాను ధన్యవాదములు
రిప్లయితొలగించండిఅధికార మిచ్చు నహంకారము, నమస్కా
రము తోడ నీ ప్రకారము నడచును.
తిరస్కారము ల్లేక ధిక్కారములకోర్చి
సహకార మిచ్చును సంతసముగ,
ఆకారమునకు నలంకారములు చేసి
ఛీత్కారములు లేక చెలిమి తోడ
స్వీకారము తెలిపి,ఘీంకారమునుచేయు,
ప్రాకారమున నీదు పదవి ముగియ
సాకారములు లేక శ్రీకారమును చుట్టు
మరణ పుస్తకమున మనసు విరిగి,
గుణకారములు, నీదు కూడికల్ తప్పగా
నీ చమత్కారము నీల్గి వికారమై
అంధకారము కాగ, వ్యధను పొంది మమకా
రములు తగ్గ నుడికారములు వన్నె
తగ్గి ఝoకారము తడబడి కుసుమము
పైన తిరుగు చుండు భ్రమరకము
వోలె బ్రతుకు నీడ్చ, జాలి పడక,
ఇంటిలో వెటకారము, ఈర్ష్య పెరుగ,
ముఖ్యులెల్ల హాహాకారములు సలుపగ,
నీ ఉనికి నిరాకారమై నెత్తురోడ,
కోరుము సాక్షాత్కారము
మారక సమయమున నీవు భగవంతుని, నో
రారగ పలికెడి ఆ ఓం
కారమ్మును మించి తీపి కలదే పుడమిన్
అయ్యా, నమస్కారము, తిరస్కారము లలో స్కా ముందున్న అక్షరం గురువౌతుంది.
తొలగించండినిన్నటి పోస్ట్ కి నా సవరణ పెట్టేను.
ధన్యవాదములు సోమ్ నేమని గారు తప్పు సరి దిద్దుకుంటాను
తొలగించండిపూసపాటి వారూ,
తొలగించండిమీ సుదీర్ఘ ప్రస్తావనా పూర్వక పూరణ బాగున్నది. అభినందనలు.
'నమస్కా..., తిరస్కారము..., వికారమై..., వోలె బ్రతుకు నీడ్చ...' గణదోషాలు. కందం రెండవ పాదంలో యతి తప్పింది.
మారక భగవంతుని రెంటికి యతి గలదని వ్రాశాను నాకు సలహా ఇవ్వగలరు
తొలగించండిక్షమించండి తప్పు వ్రాశాను. సరి దిద్తుకుంటాను.
వేద మంత్రాల సాక్షిగ మోద మొప్పి
రిప్లయితొలగించండిముచ్చ టగమూడు ముడులేసి ముదితనంత
వదలి మోహము ననితర పడతి వెంట
"నడక హానికారకము మానవుల కెపుడు"
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విడువక దుష్టసంగతులు విజ్ఞుల బోధలనన్ని వీడుచున్
రిప్లయితొలగించండికడు చిలువాయనమ్మయిన కర్మల చేయుచు సజ్జనాళికిన్
చెడు తలపెట్టి ఘోరమగు శిక్షలకున్ గురిచేసి గట్టిగా
నడచుట హానికారక మనాగర కంబగు మానవాళికిన్
(చిలువాయనము = నీచము; గట్టిగాన్ + అడచుట = గట్టిగా నడచుట)
నేమాని వారూ,
తొలగించండివిలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరు అంకెల జీతమ్ము హాయి నొసగ,
రిప్లయితొలగించండిలక్షణముగ జీవించక, లంచములను
స్వీకరించు ఉద్యోగుల శీల రహిత
నడక హాని కారకము మానవులకెపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆరు+అంకెల' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'శీలరహిత నడక' అని సమాసం చేయరాదు. అక్కడ "శీలము విడు నడక" అనండి.
ధన్యవాదములు సరిదిద్దుకుంటాను.
తొలగించండివాలి చంప బడెను చెట్టు మూల నుంచి
రిప్లయితొలగించండికర్ణుడంతరించెను దాన ఘనుడు కాగ
సత్య మిదియె నాడును నేడు సతము! సబబు
నడక హానికారకము మానవుల కెపుడు
నడక = ప్రవర్తన
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బొజ్జ నిండుగ తినితిని పొట్ట పెంచి
రిప్లయితొలగించండి'నడక హాని కరము మానవుల కెపుడు'
ననుచు నిష్క్రియా లోలురై యాదమఱచి
నిద్రలో జారు వారల నిద్ర లేపు.
బొగ్గరం ప్రసాద రావు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వాస్థ్యమును గోరుచుండెడి జనులకిలను
రిప్లయితొలగించండినుభయ వేళల నడచుట యొప్పు నండ్రు
భోజనము మీద శతపథ మోజ మొసగు
నడక, హానికారకము మానవుల కెపుడు?
మూర్తి గారూ,
తొలగించండిసమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. '...యొప్పటండ్రు' అనండి.
రిప్లయితొలగించండిపడతుల మానభంగములు, పాగెములేకజనావళిన్ని పో
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళకిన్
విడదగునయ్య విప్లవము వీకొనుమా!హజరత్ సలామతౌ !
జడతల భారతమ్మునకు జాగృత!యుత్తిగ మేలుకోవయా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జడియక ధర్మమన్న, ఘన సంస్కృతి నందక, స్వార్ధబుద్ధితో
రిప్లయితొలగించండినుడువుచు బొంకు లెల్లెడల, నూతన తేజము తోడ కల్మషం
బొడబడి చేయుటల్ సతత మొప్పని యెంచి ధరాతలంబునన్
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండితెగ ప్రగల్భాల రాయితీల్(తాయిలాల్) తీర్చి దిద్ది
ఎన్నికల గెల్చి ప్రతినల నెల్ల మరచి
పాలనను బహు చతికిల బడిన నత్త
నడక హాని కారకము మానవుల కెపుడు!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిపడిపడి క్రొత్త పుంతలని బారి విదేశపు రీతి నీతులన్
వడివడి నాశ్రయించగదె వాసిని బాసెను సంప్రదాయమే!
మిడిసిన హంస కాకి గతి మేల్మి యటంచును వెర్రి చేష్టలన్(చేష్టనున్)
నడచుట హాని కారక మనాగరకంబగు మానవాళికిన్!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టానుండి,ఆర్యా,నిన్నటి "కాకా"గల నాపూరణకు వివరణను ద.చే సమీక్షించండి.కృతజ్ఞతలు.
తొలగించండిడా.పిట్టానుండి,ఆర్యా,నిన్నటి "కాకా"గల నాపూరణకు వివరణను ద.చే సమీక్షించండి.కృతజ్ఞతలు.
తొలగించండికష్ట సుఖములు కలతలు నిష్టురముల
రిప్లయితొలగించండివీడ బోవకు తోడును నీడ నెపుడు
పుడమి నందరి తోడుత పొసగ లేని
నడక హాని కారకము మానవుల కెపుడు!
నిష్ఠురముల...అని చదుగలరు.
తొలగించండిశిష్ట్లా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినిదుర విడిచిన వెనువెంటనే గభాలున లేవ గూడదని డాక్టర్ల ఉవాచ - కొంత వ్యవధి అవసరమట !
(అని విన్నా)
పడకను విడ నిదురయటు పక్క తొలగ
గడగడ యనుచు వడివడి గనటు నడచు
నడక హానికారకము మానవుల కెపుడు
యెడరు విడవలె యించుక యెవ్వరైన !
జిలేబి
యెడరువిడవలెనించుకనెవ్వరైన అనండి
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రసాదరావు గారి సూచనను గమనించండి.
సత్య మెపుడును గెలువదు సత్వరముగ
రిప్లయితొలగించండితలచి గెలుపుల నన్నిట ధర్మ మెదుక
తప్పు జేసిన వారలె ధరణిన, చెడు
నడక హానికారకము మానవుల కెపుడు
వెంకటప్పయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎదుక'...?
అడుగిడి ధర్మమార్గము, నహర్నిశలున్ హితదృక్పథంబునన్
రిప్లయితొలగించండినడుచుచు నాడిదప్పక వినమ్రత జూపుచు గౌరవించుచున్
గడుపుముకోరుచు శుభము,కాదని దుష్ట పథమ్ము వీడకన్
నడచుట హానికారకమనాగరికంబగు మానవాళికిన్
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోరుచున్...'
ఎసగలోకమునందున నెల్లవారు
రిప్లయితొలగించండిమంచి నడతను వర్తించి మనగవలయు
చెడ్డత్రోవను పయనించి చెరువుతెచ్చు
నడక హానికారకము మానవులకెపుడు
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బడుగుల జీవితమ్ములవి పచ్చగనుండెడిరీతి వారికిన్
రిప్లయితొలగించండిమడులును మాన్యముల్ యొసగి మంచిగవారినిచూడగావలెన్
ఇడుమలపాలుచేసి చరియింపుచు వారికికీడుచేయుచున్
నడచుట హానికారకమనాగరికమ్మగు మానవాళికిన్
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మాన్యముల్+ఒసగి' అన్నపుడు యడాగమం రాదు. 'మాన్య మిచ్చియును..." అందామా?
తెల్లవారినది మొదలు కల్లు గిల్లు
రిప్లయితొలగించండితాగి తందనా లాడుచు తలకు బోసి
వంకరలు బోవు మాటల వాగి తూలు
నడక హానికారకము మానవుల కెపుడు
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇతరులను బాధబెట్టుచు హితముమరచి
రిప్లయితొలగించండిధర్మమార్గమ్ము వీడుచు ధరణిలోన
పాపకర్మలతో నడుపాడు దుడుకు
నడక హానికారకముమానవుల కెపుడు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒంటరిగ జంటగను ముందు వెంట నైన
రిప్లయితొలగించండిఎడమ వైపు కుడిన తూర్పు పడమ రైన
పగలు రాత్రి మధ్యాహ్నపు సెగల నైన
హైదరాబాదు రోడ్లపై హాయి గాను
నడక హానికారకము మానవుల కెపుడు
శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి సవరణ:
తొలగించండి* ఎడమ కుడి తూర్పు లందును పడమరైన
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొడుపు కొండన వెలుగు పుప్పొడులు మెరియు
రిప్లయితొలగించండివేళ నడచిన నరులకు మేలుఁగాని
మాడు పగుల గొట్టెడు మండుటెండ లోన
నడక హానికారకము మానవుల కెపుడు
బడులను బాల్యమందు విను పాఠములందున నేర్వ వచ్చు,నే
తొలగించండిబడికిని పోనిచో తెలియ వచ్చును పెద్దల మాటలందునన్
చెడి,పిడివాదులై వినక చిత్తపు రీతిన రోడ్డు మధ్యలో
నడచుట హానికారకమనాగరికమ్మగు మానవాళికిన్
రాజ్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సమయము నెపుడు వ్యర్థంబు సలుప రాదు
రిప్లయితొలగించండిఆలసించు వారలవృద్ధి సన్నగిల్లు
సజ్జు తోడ కార్య మొనరించవలె, పిల్లి
నడక హానికారకము మానవుల కెపుడు
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విడచి యహింస న్యాయమును వీడియు సజ్జన సంగతిన్ సదా
రిప్లయితొలగించండివిడచియు సద్గుణంబులను వీడియు నిర్మల ప్రేమ భావముల్
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్
నడచిన ధర్మ మార్గమున నాక సుఖంబులు దక్కు మానవా!
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నడక హానికారకము మానవుల కెపుడు
రిప్లయితొలగించండికాదు ,నడక కలుగ జేయు గాయమునకు
మంచి యారోగ్య మటులనె నంచిత మగు
బుధ్ది కుశలత యేర్పడు బుణ్య పురుష !
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడుగులు వేయు నేడు తన కంతయు నాతడటంచు నమ్ముచున్
రిప్లయితొలగించండితడబడనీదు జీవితపథానను తోడయి దాసి మంత్రియై
విడువని తల్లియై, సతిని వేదన బెట్టుచు నింటి నుండి పో
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నడత వోలె నగత్యమె నడక కూడ!
రిప్లయితొలగించండినడక వీడని మనుజుడె నాగరికుడు
నడకకు మితి గలదు! యోజనములు సాగు
నడక హానికరకము మానవుల కెపుడు!
గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణను పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
కూరిమి జూపుచు పెద్దలు
తీరుగ ప్రేమికుల నరసి దీవన లిడగన్
వారలు దెలిపిన యంగీ
కారమ్మును మించి తీపి కలదే పుడమిన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్యులు శంకరయ్య గారికి ఆరోగ్యము ఎటులుoడెనో ఏ పద్యము సమీక్షించ లేదు.
రిప్లయితొలగించండిపూసవాటి వారూ,
తొలగించండిఆరోగ్యం బాగానే ఉంది. నిన్న హైదరాబాదు వెళ్ళి ఈరోజు తిరిగి వచ్చాను. ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించడం ఆలస్యమయింది.
ధన్యోస్మి గురువుగారు
తొలగించండిమంచివాసన మల్లెలు బంచినట్లు
రిప్లయితొలగించండిచదువు సంస్కారమందగ సంఘసేవ
జేయగలిగిన మనసున్న?చేయలేని
నడక హానికారకము మానవుల కెపుడు|
2.మందు,సిగరెట్టు,విందు పసందుగూర్చ
దొంగతనమబ్బ?వ్యభిచారదోషమందు
జూద మోదాన నిష్టూర వాదమిడెడి
నడక హానికారకముమానవులకెపుడు.
3.తడబడు మానసంబునకు తత్తరపాటున మూఢనమ్మకాల్
విడువని సమ్మతంబు”కడువిద్యవివేకుల మంచిమార్గముల్
గడిపెడిసూత్రముల్ దెలుప?గర్వమునందున లెక్కజేయకన్
నడచుట హానికారక మనాగరకంబగు మానవాళికిన్.
4.బడి,గుడి బాధ్యతాయుతపు భావన భక్తియు మానసంబుకున్
తడబడ నట్టి యూహల వితండములేకను మంచి మార్గమౌ|
“చెడుగుడు లాడుమాయ మనచెంతన చింతను జూపగానె?తా
నడచుట హానికారక మనాగరకంబగుమానవాళికిన్”.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
వీడుచు ధర్మము నీతియు భీతి మరియు
రిప్లయితొలగించండిమానమభిమాన మమతలు మానుషంబు
ధనమదొక్కటె చాలను ధాష్టికయుత
నడక హానికారకము మానవుల కెపుడు
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీడుచు' అంటే గణదోషం. 'విడుచు' అనండి. 'ధాష్టికయుత నడక' అంటే దుష్టసమాసం. "ధాష్టికమగు నడక' అనండి.
వీడి ధర్మము నీతియు భీతి మరియు
తొలగించండిమానమభిమాన మమతలు మానుషంబు
ధనమదొక్కటె చాలను ధాష్టికమగు
నడక హానికారకము మానవుల కెపుడు
అడకువతోడ దేవునకు నర్చన చేయుచు సర్వకాలమున్
రిప్లయితొలగించండిచెడు పథమందు పైనమును చేయక పేదలనిచ్చఁ బ్రోచుచున్
కడువడి విష్ణులోకమునుఁ గాంచుడు మూఢత చెడ్డమార్గమున్
నడచుట హాని కారక మనాగరకంబగు మానవాళికిన్
సంఘపున్ కట్లుబాట్ల యాచరణమెప్డు
రిప్లయితొలగించండిమంచియొనరించునిలలోన నెంచిచూడ
చపలచిత్తముతోడుత సలిపెడి చెడు
నడక హాని కారకము మానవుల కెపుడు
అన్నపరెడ్డి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సత్యము గెలుచు నన్నిట నిత్యము నిలఁ
రిప్లయితొలగించండిగపటము గెలుచు టెల్ల తాత్కాలికంబ
నిష్ఠురంబని యెంచి పనిగొని నిజము
నడక హానికారకము మానవుల కెపుడు
[నిజమును+అడక = నిజము నడక; అడకు = దాఁచు]
పడయరె పుణ్య ధామములు భాగవతోత్తము లెల్ల కొల్చిన
న్నడరి మనంబు నందుఁ బరమాత్ముని నిల్పి నిరంతరం బిలం
దడయక మూఢ భక్తి నికఁ దంత్రము సేకొని గుండ మందుఁ దా
నడచుట హానికారక మనాగరికం బగు మానవాళికిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండి👉తేదిః 03-05-2017
👉సమస్య
నడక హానికారకము మానవుల కెపుడు
వాస్తుశాస్త్రరీత్యవచింతువాస్తవంబు
వక్రగమనమె వాకిళ్ళువరుసఁదప్ప
చెడునుశీలమందురుసరిచేయకున్న
నడక హానికారకము మానవుల కెపుడు
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురు మూర్తి ఆచారి
రిప్లయితొలగించండివచ్చి తగులు "నాపద" లను వాహనములు
"జీవితం" బను దారిలో | నీవు, మిగుల
జాగరూకతన్ మెల్లగా జనుము| దుడుకు*
నడక హానికారకము మానవుల కెపుడు*
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంటకములు నిండిన ఘోర కానలందు
రిప్లయితొలగించండిఖగుడు నిప్పులు గురిపించు కాల మందు
పాదరక్షలు మరియాతపత్రము విడి
నడక హానికారకము మానవుల కెపుడు
నడతను గాంచి క్షుణ్ణముగ నాతని సద్గుణమున్నెఱంగి నా
తడి వెనుదన్నుగా నిలువ ధారుణి యందున కీర్తిమూలమౌ
గడసరి వాడు స్వార్థుడును కాముకుడైన ఖలుండి జంటగా
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రూర మృగములు చరియించు దారులందు
రిప్లయితొలగించండికంటకావృత విపినమ్ము,కాళరాత్రి,
వెలుగుదివ్వెలు,పాద రక్షలును లేని
నడక హాని కారకము మానవుల కెపుడు
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
9493846984 Dr.B.Umadevi
రిప్లయితొలగించండితే.గీ:పరుల కెప్పుడు దురితము బంచునటుల
నాచరించుచునుండగ ననవరతము
నేను నాదని యహముతో నిలను నడచు
నడక హానికారకము మానవులకెపుడు.
తే.గీ:మేలు చేకూర్చు సతతము మేదినందు
నడక,హానికారకము మానవుల కెపుడు
కాదు గనుడు దాన తనువు గట్టిపడును
కాన నడువవలె జనులు కాళ్ళతోడ.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మేదిని+అందు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
నడక మానవాళికిమేలు నడచుటఇల
రిప్లయితొలగించండినడక దారి మంచిగయున్న నడక ఎపుడు
నడక పాదరక్ష లు లేక నడచినమరి
నడక హానికారకము మానవుల కెపుడు
రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మంచిన నున్న' అనండి. అక్కడ యడాగమం రాదు.
పద్యం మధ్యలో అచ్ఫ్హులు రాకుండా చూడండి. అవసరమైన యడాగమ, నుగాగమాలతో వ్రాయడానికి ప్రయత్నించండి.
మీ సవరణకు ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రాణకోటికి నష్టము బరుగు నటుల
రిప్లయితొలగించండిస్వార్థ చింతనమే పరమార్థ మనుచు
మృగము రీతిన జీవించు తెగువజూపు
నడక హానికారకము మానవులకెపుడు
అరాశ
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వడివడి భాగ్యనగ్రమున వాకబు జేయుచు రోడ్డు దాటుచున్,...
రిప్లయితొలగించండిపడతుల జూచి మెచ్చుచును భారపు లారిల చూడకుండగన్,...
పడుచును లేచు చుండునిట పండుగ పూటను రమ్ము గ్రోలియున్,...
నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్