నడిరేయి సరదా పూరణ: తనువున్ మానస ముజ్వలిం పగనయో తాంబూలమున్ కోరుచున్వినగన్ వైరసు లాక్రమించగనహో విడ్డూరమౌ రీతినిన్కనగన్ మూల్యము చేరగా తముల మాకాశమ్మునన్ భీతినిన్ మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
మరి మఱ్ఱాకులు మంచివేనా!?🤔😄🙏🏻🙏🏻
వంగలు నమిలి ఉమ్మివేయుటకు మంచివే 😊
ఆకు ఏదైతేనేం? సున్నం, కాచు, వక్కలు, రత్నా జర్దా ఉంటే చాలు!మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏😊
😀😀🙏🏻
నిద్రపట్టని సరదాపూరణ..బుఱ్ఱయుఁ జిక్కెనె ఘనమౌతొఱ్ఱను, తెలవాఱె తెలివి తొయ్యలి నాకున్జుఱ్ఱితి నన్ని రసమ్ముల"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
మీ తెలివికి అర్ధరాత్రే తెలవారిందా?బాగుంది మీ పూరణ. అభినందనలు.
🤣🤣ధన్యవాదాలు గురువుగారూ🙏🏻🙏🏻
అందరికీ నమస్సులు 🙏🙏సరదా పూరణ 😄*కం||*వెర్రా పిచ్చా నీకును బుర్రే పని జేయ మానె బుద్దే లేదా?కర్రీ వలె నడిగితి విల *"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"**కళ్యణ్ చక్రవర్తి, ముంబాయి*🙏😄🙏😄🙏
అందరికీ నమస్సులు 🙏🙏మరో ప్రయత్నo😄 (భర్త భార్యతో)*కం||*సర్రున లేవ వలదు నిక వెర్రని తేలెగద నాకు వేయింతలుగన్ బుర్రనె లేక పలికె నిల *"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.రెండవ పూరణలో "లేవగ వలదిక । వెర్రిగ (వెర్రి+అని... సంధి లేదు)...బుర్రయె..." అనండి.
ధన్యోస్మి శంకరార్యా 🙏🙏🙇
కుఱ్ఱాళ్ళకు మదము పెరిగి వెఱ్ఱిగ గెంతుచు ముదముగ వేడుక మీరన్ గొఱ్ఱెలు బఱ్ఱెలు నొకదరి మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ
అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanya vaadamulu
చర్రున చేయందుకొనన్కుర్రతనపు జ్ఞాపకాలు కూతలిడెనిదేగుర్రనకుమా జిలేబీమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) తినుచున్ మ్యాగిని పూటపూట కరువై తీరొందు బిర్యాని హా కనుచున్ టీవిని వైరసే మనమహో గాఢంపు బోరొందగాపనియున్ పాటను గానకే రసన తా వైవిధ్యమున్ కోరగా మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
జిహ్వచాపల్యంపై మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
చనుమా యిప్పుడె యేటివార దళముల్ సాధించి తెమ్మా జిలేబి! నసాళమ్మున కెక్కి కిక్కు తనరన్ పీయూషమై నెక్కొనన్!మునిమాణిక్యపు ధర్మపత్ని ! లలనా ముద్దార రమ్మా దరిన్మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్జిలేబి
👌మునిమాణిక్యపు ధర్మ పత్నులు ఇద్దరట: కాంతం; రాజ్యలక్ష్మిగూగులమ్మ చెప్పినది. వారి "కాంతం కథలు" మా చిన్నప్పుడు ఆంధ్ర పత్రికలో కనిపించేవి...మా నాన్నగారు మా అమ్మకు చదివి వినిపిస్తుండే వారు.
మునిమాణిక్యం వారి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భలే... జిలేబీగారూ..😃👌🏻👏🏻
(ఒక కవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రు నంతటికవి కావాలనుకొని మఱ్ఱిచెట్టు క్రింద కూర్చుని మఱ్ఱియాకు విస్తరిలో భుజించబోతూ భార్య దేవితో...)ఘనుడౌ నా పినవీరభద్రునకు పొం గారంగ మున్నామమై ;కన గంభీరత కాలవాలమగు బం గారంబు నిచ్చోటనే మనసాయెన్ గద భామినీ! తినుటకై మర్రాకునన్ ; వీడ్యమున్ఘనసారంబు జవాది కుంకుమ సుధా కస్తూరితో తేగదే !!(మున్నామము -ఇంటిపేరు ;ఘనసారము -పచ్చకర్పూరము ;సుధ -సున్నము )
విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. మీ పద్యాలలో అఖండయతిని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాను (మొదటి పాదంలో)'ముందు+నామము=మున్నామము' సందేహమే!
సమస్య :-"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"*కందం*గుఱ్ఱము పై దుష్యంతుడుతుఱ్ఱు మని శకుంతల కడ దొరకొని పోయెన్మఱ్ఱాకుల భోజనమునుమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ! .............✍చక్రి
కం//వెఱ్ఱిగ దిరుగుచు నీడనకొఱ్ఱల బువ్వను గుడుచుచు కోనలనుండే !బఱ్ఱెలు గాయుచు నత్తఱిమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."నీడను... కోనలలోనన్" అనండి. (ఉండే... వ్యావహారికం)
కుర్రాటలాడబోకుము వెర్రామనసేడబోయె వేవేవిధముల్జుర్రితిమాంసాహారముమఱ్ఱాకునవిడెముదినగ మనసాయెసఖీ——————————-రావెలపురుషోత్తమరావు
చర్రున బ్రాకె జనాళినిబర్రున నింట పడవేసె పడతి జిలేబీవర్రీ కరోన వేళనిమఱ్ఱాకున విడెముఁదినఁగ మనసాయె సఖీ!జిలేబి
అర్రులు చాచిరి సుమ్మీచిర్రావూరి విదురులు, బుచికియు, జిలేబీజుర్రుకొనంగరసములామఱ్ఱాకున విడె ముఁదినఁగ మనసాయె సఖీ!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'బుచికి' ఎన్నాళ్ళకు కనబడింది!
జుఱ్ఱితి పాయసమంతనుమఱ్ఱాకున , విడెముఁ దినఁగ మనసాయె సఖీ !గుఱ్ఱు పడక నీవిచ్చిన ,నెఱ్ఱనగును నాదు జిహ్వ యెంతయొ రహిగన్
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపం! లాక్ డౌన్ మహాత్యం బిది సుమా...!☺️☺️☺️ 😊😊😊మత్తేభము**** ******పనియున్ పాటయు లేక రే బవలు గొంపన్ నిల్చి యున్నందుకున్!మనసే ఖాళిగ నుండి క్రుళ్ళి మిగులన్ మారెన్ కదా యయ్యయో!వినవే కల్గెను బిచ్చి పట్టి మదికిన్ వేయౌ వికారమ్ములేమనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్" -- ఆకుల శాంతి భూషణ్ వనపర్తి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ కనులా చూడగ తింత్రిణీదళములై కన్పట్టునెంతెంతయో!చనులా ఎండిన రేగుపండ్లన రసస్యందుల్., కరమ్ముల్ గనన్నునుపౌ మెత్తని మఱ్ఱియాకులు., నినున్ పొందంగ నా భాగ్యమే!మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమున్"(మఱ్ఱాకునన్... నీ చేతితో) మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోరంజకంగా, ప్రశస్తంగా ఉన్నది.
బాగున్నది.అభినందనలు !💐💐
పరమాశ్చర్యకరప్రతాపభయదప్రజ్వల్యమానోల్లసత్ఖరఫాలాక్షము పుష్పబాణహననోద్గారోష్ణసంపూరమై పరమేశుండగు శూలికిం గలదు పో, వాలంబు చర్చింపఁగన్మరుదంగోద్భవవీర్యసంగతహనూమద్ధీరుకున్ శోభిలెన్.కంజర్ల రామాచార్యవనస్థలిపురము
విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. 'ధీరునకున్' అనడం సాధువు కదా?
కం//దర్రాలో దిరుగు నపుడువెర్రిగ నాకలి గలుగగ వేచితి వక్కన్ !సుర్రన మండే సున్నముమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!
సరిజేసితిని గురూజీ 🙏కం//వెఱ్ఱిగ దిరుగుచు నీడనుకొఱ్ఱల బువ్వను గుడుచుచు కోనలలోనన్ !బఱ్ఱెలు గాయుచు నత్తఱిమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!
మర్రాకునవడ్డించుమువెర్రిగనావైపుజూచివేదనబడకేకుర్రతనమదెగుర్తొచ్చెనుమర్రాకునవిడెముజేయ మనసాయెసఖీ+++++++++++++++
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బుఱ్ఱకు నీ బుద్ధి యొదవజుఱ్ఱుచు నెఱిఁ బాయసమును సుష్టుగు రీతిన్కొఱ్ఱల బువ్వ భుజించితిమఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
ముఱ్ఱావు నేతి, పెరుగునుకొఱ్ఱన్నము కొసరి కొసరి కోమలి ప్రేమన్బొఱ్ఱను నింపెను నేడిటుమఱ్ఱాకున; విడెముఁ దినఁగ మనసాయె సఖీ
సుందరః
చిఱ్ఱెత్తించెనుబంధనఎఱ్ఱగబండించునాకుఇలలోకరువై,మఱ్ఱాకేభోజనమనమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"కొరుప్రోలు రాధాకృష్ణారావు
అర్ధరాత్రి 12 కు సమస్య schedule అయితే.....అర్ధరాత్రి 12.15 నుండే పూరణలు మొదలు !ఈ కవులు నిద్ర పోరా ?జనులే నిద్దుర బోవువేళ బిగితో జాలంబునన్ పద్యముల్,ఘనమౌ రీతిన పోస్టుజేసి,నలయంగా పండితశ్రేష్ఠుడున్గని,తా నిద్దుర లేపి భార్య నడుగంగా దల్చెనే! శూరుడే!"మనసాయెన్ గద!భామినీ!తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమే!"
బిఱ్ఱుగ రైకన్ గట్టిన వెఱ్ఱి మరదలా తినుమిది ప్రేమగ నీకై కొఱ్ఱీనె జున్ను దెచ్చితిమఱ్ఱాకున, విడముఁ దినఁగ మనసాయె సఖీ!
చిర్రావూరిం టల్లుడు చర్రున సైకిలు నడుపుచు సతి యిలు చేరెన్ కొర్రల బువ్వ తిని యడిగె "మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
కొఱ్ఱలు తమిదలుపచ్చివిమఱ్ఱాకులుతిన్న చాలుమగధీ రుడవౌకుఱ్ఱకు చెప్పగ వైద్యుడుమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
గుఱ్ఱున దే న్చె భుజించియు మ ర్రా కున : విడెము ది న గ మనసా యె సఖీ సర్రున నందించు మనుచు న ర్రు లు చాచుచు నడిగె న మాంత ముగను దాన్
కుఱ్ఱదనమ్మున విడెమునవఱ్ఱగ జర్దాను గలిపి బావకు నిడగాబుఱ్ఱ దిరిగె నది దిని యనెమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ
శ్రీకృష్ణ తులాభారం తర్వాత పరమాత్మ సత్యా దేవతో... మత్తేభవిక్రీడితమునను నీ వానిగఁ గూర్చె నీ తులసి నందంబంద సత్యా! సతీ!ప్రణుతుల్ పొందెడు రీతి విందునిడి నే రంజిల్లగా జేసితేతనరన్ మఱ్ఱి దళమ్ము మాతయొడి శ్రాంతంబంద, నీవీయఁగన్మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్, వీడ్యమున్
సర్రున లేచెను ప్రియసతి బుర్రయె లేకను పలుకగ పురుషుడు కేళిన్ వెర్రికి వేల తలలనన్ |"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"(సమస్య)కం:జుర్రితిపాయసమిప్పుడుమఱ్ఱాకున; విడెముఁ దినఁగ మనసాయె సఖీ!ఎర్రగపెదవులుపండఁగజుర్రెదనీయధరములను సుతిమెత్తంగా!
చిన్నతనములో సెలవులలో గేదెలను కాసేటప్పుడు, దానిమీద స్వారి చేస్తూ సాయంత్రం గుళ్ళో మఱ్ఱాకున తిన్న ప్రసాదము గుర్తుకు వచ్చింది. ఇఱ్ఱి వలె పరుగు లెత్తెడుబఱ్ఱెలపై స్వారి సలిపి వనముల లోనన్కొఱ్ఱల పొంగలిఁ గుడిచితి మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
గురువు గారికి నమస్సులు. తొర్రన్ రసాధి మధువున్వెర్రిగ దొరకన్ జిహ్వాశ వెంకటనారీపుర్రెకు తోచెను, గలదీ!మర్రాకున, విడెము దినగ మనసాయ సఖీ.
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్,తినుబండారము లన్నమున్ పెరుగు చద్దిన్ తాటియాకున్, సలక్షణ పైక ప్పరిటాకుచే, జలుబు కోసం బెంగిలాకున్, సనాతన ధర్మంబిది కాదె? తీర్చు మిలఁ ఛందంబున్ నిరాటంకమై౹౹
వెఱ్ఱా యేమనిబలికెదుమఱ్ఱాకునవిడెముదినగమనసాయెసఖీ!మఱ్ఱాకునుదిందురె విడెముగ?బుఱ్ఱుందా నీకుచెపుమభూతపిశాచీ!
కుఱ్ఱుచు కొఱ్ఱుల మందనుకుఱ్ఱఁడు గాచె మఱలించె; కునుకును దీసెన్సఱ్ఱున మేల్కొని పల్కెనుమఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
మిత్రులందఱకు నమస్సులు![ప్రేయసీ ప్రియుల సరస సంభాషణము]"ఘనురాలా! యిటు రమ్ము! లోక మిటులన్ గణ్యంబుగా నీ గరోనను మున్గెన్! దగులమ్ము వద్దు! కనఁగన్ నాకిప్పు డీ వియ్యెడన్దినఁగా నన్నియు మఱ్ఱియాకున నిడన్, దిందుం గదే! యట్టులేమనసాయెన్ గద, భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్."
కొఱ్ఱన్నము, పప్పు పులుసునెఱ్ఱెఱ్ఱని యావకాయ యింపేపారన్జుఱ్ఱు కొనుచు తింటి కదా !మఱ్ఱాకున ; విడెముఁ దినఁగ మనసాయె సఖీ! ****సాధారణంగా విస్తరి మోదుగాకులతో కుట్టుతారు.కాని యీ విస్తరి మఱ్ఱాకులతో కుట్టినది.
పూజ్యులకు ప్రణామాలు🙏నా పూరణ....కం" కుర్రతన మున మగడనియెవెర్రిగ సరసంబులాడి వేడుక పొందన్జుర్రెద పాయసము, పిదపమర్రాకున విడెము దినగ మనసాయె సఖీ!వాణిశ్రీ నైనాల
కొర్రల బువ్వను తినియెద మర్రాకున, విడియము దిన మనసాయె సఖీసర్రున తెమ్మిక నేనామర్రాకులవిస్తరందు మరువక తిందున్.
కుర్రతనపుచేష్టితముగకర్రాబిళ్ళాటలాడుకాలము మదిలోవెర్రిగకదలాడెనిపుఁడుమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
వినయంబుందున వేడుచుంటి వినవే విద్యాధికుండన్ గదా నను నీ భర్తగ స్వీకరించ యనుమానంబేల, నీపైననే మనసాయెన్ గద భామినీ, తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమున్ కనలేదెప్పుడు పిచ్చిదాన, యదినాకందింపగా నేలనే.
మనసాయెన్గదభామినీ!తినుటకైమఱ్ఱాకునన్వీడ్యమున్ మనసాయేననిపల్కగాదగదునీమానంబునేమాయెనే?కొనగాశక్యముగాదుగానిపుడయేకోశానదాంబూలమున్ వినుమాతమ్మునునాహరించుటనునేవేళంవిసర్జించుమా
ఎఱ్ఱఁగఁ బండ వలెఁ జుమీ గిఱ్ఱునఁ దే తములపాకు క్రిందం గలదా యఱ్ఱనఁ బొడవున మించును మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ! [మఱ్ఱాకును +అ = మఱ్ఱాకున ; మఱ్ఱాకునే; అఱ్ఱ = పెట్టె యఱ]కనకభ్రాజిత కుండలా సరస శృంగారోజ్జ్వ లాస్యా సఖీ నినదప్రస్ఫుట కింకిణీ గురుకుచా నీరేజ పత్రేక్షణా వనజాస్యా మద మత్త నాగ గమనాభా పెట్టుమా సున్నమున్ మనసాయెన్ గద భామినీ! తినుటకై, మఱ్ఱా కునన్, వీడ్యమున్
అనయంబీరజతంపు పళ్ళెరమునందన్నంబు భోంచేయగాకనలెన్ నామది మార్పుగోరినది నాకన్నంబు నీవేళలోమనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్, వీడ్యమున్కొనితెమ్మిప్పుడు మర్రియాకుననునాకోసంబు బింబాననా
జుర్రితి జీకుల రసమునుగుర్రును కొట్టుటకు కొంత గుట్కాతింటిన్ వెర్రినిగానులె క్రొత్తగమర్రాకున విడెముదినగ మనసాయె సఖీ!వినగా నేడిట వ్యాధిబాపుటకు బ్రావీణ్యంపు వైద్యంబహో తినుటే శాకపుభోజనంబు నదియున్ దివ్యంపు పర్ణంబునన్ మనసాయన్గద భామీనీ!తినుటకై మర్రాకునన్;వీడ్యమున్ గొనిరావే నవనాగవల్లికలతో కొంగ్రొత్త చూర్ణంబుతో
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
తనలో రేగిన భావముల్ మనసు నందాకంగ రంజిల్ల జే సిన పద్మాక్షిని జూడగన్ భయముగా శ్రీఘ్రంబె గేహంబుకున్జని రమ్మంటును బిల్వగన్ వెడల భోజ్యంబివ్వ నూహిం చెనో మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
కం: గొఱ్ఱెల మేపుచు గడుసరిఅఱ్ఱులు జాచుచు గుసగుస యభిరతి దెలుపన్చిఱ్ఱన, నాసతికి దెలుపెమఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీవై. చంద్రశేఖర్
అనయమ్మున్ తిరుగాడుచున్ మనసునన్ ధ్యానించుచున్ తృప్తిగాఘనమౌ నీదగు సన్నిధానమున నేకన్గొంటి స్వర్గమ్మిలన్గొననారోగ్యము వెజ్జుపంపునను నీకోర్కెన్, నిరూఢమ్ముగా మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
తనువున్ మానస ముజ్వలిం పగనయో తాంబూలమున్ కోరుచున్
వినగన్ వైరసు లాక్రమించగనహో విడ్డూరమౌ రీతినిన్
కనగన్ మూల్యము చేరగా తముల మాకాశమ్మునన్ భీతినిన్
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
మరి మఱ్ఱాకులు మంచివేనా!?
తొలగించండి🤔😄🙏🏻🙏🏻
తొలగించండివంగలు నమిలి ఉమ్మివేయుటకు మంచివే
😊
ఆకు ఏదైతేనేం? సున్నం, కాచు, వక్కలు, రత్నా జర్దా ఉంటే చాలు!
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏😊
😀😀🙏🏻
తొలగించండినిద్రపట్టని సరదాపూరణ..
రిప్లయితొలగించండిబుఱ్ఱయుఁ జిక్కెనె ఘనమౌ
తొఱ్ఱను, తెలవాఱె తెలివి తొయ్యలి నాకున్
జుఱ్ఱితి నన్ని రసమ్ముల
"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
మీ తెలివికి అర్ధరాత్రే తెలవారిందా?
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
🤣🤣
తొలగించండిధన్యవాదాలు గురువుగారూ
🙏🏻🙏🏻
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండిసరదా పూరణ 😄
*కం||*
వెర్రా పిచ్చా నీకును
బుర్రే పని జేయ మానె బుద్దే లేదా?
కర్రీ వలె నడిగితి విల
*"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"*
*కళ్యణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😄🙏😄🙏
అందరికీ నమస్సులు 🙏🙏
తొలగించండిమరో ప్రయత్నo😄 (భర్త భార్యతో)
*కం||*
సర్రున లేవ వలదు నిక
వెర్రని తేలెగద నాకు వేయింతలుగన్
బుర్రనె లేక పలికె నిల
*"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణలో "లేవగ వలదిక । వెర్రిగ (వెర్రి+అని... సంధి లేదు)...బుర్రయె..." అనండి.
ధన్యోస్మి శంకరార్యా 🙏🙏🙇
తొలగించండికుఱ్ఱాళ్ళకు మదము పెరిగి
రిప్లయితొలగించండివెఱ్ఱిగ గెంతుచు ముదముగ వేడుక మీరన్
గొఱ్ఱెలు బఱ్ఱెలు నొకదరి
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండి
రిప్లయితొలగించండిచర్రున చేయందుకొనన్
కుర్రతనపు జ్ఞాపకాలు కూతలిడెనిదే
గుర్రనకుమా జిలేబీ
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
తినుచున్ మ్యాగిని పూటపూట కరువై తీరొందు బిర్యాని హా
కనుచున్ టీవిని వైరసే మనమహో గాఢంపు బోరొందగా
పనియున్ పాటను గానకే రసన తా వైవిధ్యమున్ కోరగా
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
జిహ్వచాపల్యంపై మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిచనుమా యిప్పుడె యేటివార దళముల్ సాధించి తెమ్మా జిలే
బి! నసాళమ్మున కెక్కి కిక్కు తనరన్ పీయూషమై నెక్కొనన్!
మునిమాణిక్యపు ధర్మపత్ని ! లలనా ముద్దార రమ్మా దరిన్
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
జిలేబి
తొలగించండి👌
మునిమాణిక్యపు ధర్మ పత్నులు ఇద్దరట:
కాంతం; రాజ్యలక్ష్మి
గూగులమ్మ చెప్పినది.
వారి "కాంతం కథలు" మా చిన్నప్పుడు ఆంధ్ర పత్రికలో కనిపించేవి...మా నాన్నగారు మా అమ్మకు చదివి వినిపిస్తుండే వారు.
మునిమాణిక్యం వారి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభలే... జిలేబీగారూ..
తొలగించండి😃👌🏻👏🏻
(ఒక కవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రు నంతటికవి కావాలనుకొని మఱ్ఱిచెట్టు
రిప్లయితొలగించండిక్రింద కూర్చుని మఱ్ఱియాకు విస్తరిలో భుజించబోతూ భార్య దేవితో...)
ఘనుడౌ నా పినవీరభద్రునకు పొం
గారంగ మున్నామమై ;
కన గంభీరత కాలవాలమగు బం
గారంబు నిచ్చోటనే
మనసాయెన్ గద భామినీ! తినుటకై
మర్రాకునన్ ; వీడ్యమున్
ఘనసారంబు జవాది కుంకుమ సుధా
కస్తూరితో తేగదే !!
(మున్నామము -ఇంటిపేరు ;ఘనసారము -పచ్చకర్పూరము ;సుధ -సున్నము )
విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమీ పద్యాలలో అఖండయతిని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాను (మొదటి పాదంలో)
'ముందు+నామము=మున్నామము' సందేహమే!
సమస్య :-
రిప్లయితొలగించండి"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
*కందం*
గుఱ్ఱము పై దుష్యంతుడు
తుఱ్ఱు మని శకుంతల కడ దొరకొని పోయెన్
మఱ్ఱాకుల భోజనమును
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
.............✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం//
రిప్లయితొలగించండివెఱ్ఱిగ దిరుగుచు నీడన
కొఱ్ఱల బువ్వను గుడుచుచు కోనలనుండే !
బఱ్ఱెలు గాయుచు నత్తఱి
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నీడను... కోనలలోనన్" అనండి. (ఉండే... వ్యావహారికం)
కుర్రాటలాడబోకుము
రిప్లయితొలగించండివెర్రామనసేడబోయె వేవేవిధముల్
జుర్రితిమాంసాహారము
మఱ్ఱాకునవిడెముదినగ మనసాయెసఖీ
——————————-
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచర్రున బ్రాకె జనాళిని
బర్రున నింట పడవేసె పడతి జిలేబీ
వర్రీ కరోన వేళని
మఱ్ఱాకున విడెముఁదినఁగ మనసాయె సఖీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅర్రులు చాచిరి సుమ్మీ
చిర్రావూరి విదురులు, బుచికియు, జిలేబీ
జుర్రుకొనంగరసములా
మఱ్ఱాకున విడె ముఁదినఁగ మనసాయె సఖీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బుచికి' ఎన్నాళ్ళకు కనబడింది!
జుఱ్ఱితి పాయసమంతను
రిప్లయితొలగించండిమఱ్ఱాకున , విడెముఁ దినఁగ మనసాయె సఖీ !
గుఱ్ఱు పడక నీవిచ్చిన ,
నెఱ్ఱనగును నాదు జిహ్వ యెంతయొ రహిగన్
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపాపం! లాక్ డౌన్ మహాత్యం బిది సుమా...!
☺️☺️☺️ 😊😊😊
మత్తేభము
**** ******
పనియున్ పాటయు లేక రే బవలు గొంపన్ నిల్చి యున్నందుకున్!
మనసే ఖాళిగ నుండి క్రుళ్ళి మిగులన్ మారెన్ కదా యయ్యయో!
వినవే కల్గెను బిచ్చి పట్టి మదికిన్ వేయౌ వికారమ్ములే
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్"
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికనులా చూడగ తింత్రిణీదళములై కన్పట్టునెంతెంతయో!
చనులా ఎండిన రేగుపండ్లన రసస్యందుల్., కరమ్ముల్ గనన్
నునుపౌ మెత్తని మఱ్ఱియాకులు., నినున్ పొందంగ నా భాగ్యమే!
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమున్"
(మఱ్ఱాకునన్... నీ చేతితో)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోరంజకంగా, ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిబాగున్నది.అభినందనలు !💐💐
తొలగించండిపరమాశ్చర్యకరప్రతాపభయదప్రజ్వల్యమానోల్లస
రిప్లయితొలగించండిత్ఖరఫాలాక్షము పుష్పబాణహననోద్గారోష్ణసంపూరమై
పరమేశుండగు శూలికిం గలదు పో, వాలంబు చర్చింపఁగన్
మరుదంగోద్భవవీర్యసంగతహనూమద్ధీరుకున్ శోభిలెన్.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము
విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండి'ధీరునకున్' అనడం సాధువు కదా?
కం//
రిప్లయితొలగించండిదర్రాలో దిరుగు నపుడు
వెర్రిగ నాకలి గలుగగ వేచితి వక్కన్ !
సుర్రన మండే సున్నము
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరిజేసితిని గురూజీ 🙏
రిప్లయితొలగించండికం//
వెఱ్ఱిగ దిరుగుచు నీడను
కొఱ్ఱల బువ్వను గుడుచుచు కోనలలోనన్ !
బఱ్ఱెలు గాయుచు నత్తఱి
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!
మర్రాకునవడ్డించుము
రిప్లయితొలగించండివెర్రిగనావైపుజూచివేదనబడకే
కుర్రతనమదెగుర్తొచ్చెను
మర్రాకునవిడెముజేయ మనసాయెసఖీ
+++++++++++++++
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబుఱ్ఱకు నీ బుద్ధి యొదవ
రిప్లయితొలగించండిజుఱ్ఱుచు నెఱిఁ బాయసమును సుష్టుగు రీతిన్
కొఱ్ఱల బువ్వ భుజించితి
మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
ముఱ్ఱావు నేతి, పెరుగును
రిప్లయితొలగించండికొఱ్ఱన్నము కొసరి కొసరి కోమలి ప్రేమన్
బొఱ్ఱను నింపెను నేడిటు
మఱ్ఱాకున; విడెముఁ దినఁగ మనసాయె సఖీ
సుందరః
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిఱ్ఱెత్తించెనుబంధన
రిప్లయితొలగించండిఎఱ్ఱగబండించునాకుఇలలోకరువై,
మఱ్ఱాకేభోజనమన
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅర్ధరాత్రి 12 కు సమస్య schedule అయితే.....
రిప్లయితొలగించండిఅర్ధరాత్రి 12.15 నుండే పూరణలు మొదలు !
ఈ కవులు నిద్ర పోరా ?
జనులే నిద్దుర బోవువేళ బిగితో జాలంబునన్ పద్యముల్,
ఘనమౌ రీతిన పోస్టుజేసి,నలయంగా పండితశ్రేష్ఠుడున్
గని,తా నిద్దుర లేపి భార్య నడుగంగా దల్చెనే! శూరుడే!
"మనసాయెన్ గద!భామినీ!తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమే!"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబిఱ్ఱుగ రైకన్ గట్టిన
రిప్లయితొలగించండివెఱ్ఱి మరదలా తినుమిది ప్రేమగ నీకై
కొఱ్ఱీనె జున్ను దెచ్చితి
మఱ్ఱాకున, విడముఁ దినఁగ మనసాయె సఖీ!
చిర్రావూరిం టల్లుడు
రిప్లయితొలగించండిచర్రున సైకిలు నడుపుచు సతి యిలు చేరెన్
కొర్రల బువ్వ తిని యడిగె
"మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
కొఱ్ఱలు తమిదలుపచ్చివి
రిప్లయితొలగించండిమఱ్ఱాకులుతిన్న చాలుమగధీ రుడవౌ
కుఱ్ఱకు చెప్పగ వైద్యుడు
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికొఱ్ఱలు తమిదలుపచ్చివి
తొలగించండిమఱ్ఱాకులుతిన్న చాలుమగధీ రుడవౌ
కుఱ్ఱకు చెప్పగ వైద్యుడు
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
గుఱ్ఱున దే న్చె భుజించియు
రిప్లయితొలగించండిమ ర్రా కున : విడెము ది న గ మనసా యె సఖీ
సర్రున నందించు మనుచు
న ర్రు లు చాచుచు నడిగె న మాంత ముగను దాన్
కుఱ్ఱదనమ్మున విడెమున
రిప్లయితొలగించండివఱ్ఱగ జర్దాను గలిపి బావకు నిడగా
బుఱ్ఱ దిరిగె నది దిని యనె
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీకృష్ణ తులాభారం తర్వాత పరమాత్మ సత్యా దేవతో...
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
నను నీ వానిగఁ గూర్చె నీ తులసి నందంబంద సత్యా! సతీ!
ప్రణుతుల్ పొందెడు రీతి విందునిడి నే రంజిల్లగా జేసితే
తనరన్ మఱ్ఱి దళమ్ము మాతయొడి శ్రాంతంబంద, నీవీయఁగన్
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్, వీడ్యమున్
సర్రున లేచెను ప్రియసతి
రిప్లయితొలగించండిబుర్రయె లేకను పలుకగ పురుషుడు కేళిన్
వెర్రికి వేల తలలనన్ |
"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
రిప్లయితొలగించండి(సమస్య)
కం:
జుర్రితిపాయసమిప్పుడు
మఱ్ఱాకున; విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
ఎర్రగపెదవులుపండఁగ
జుర్రెదనీయధరములను సుతిమెత్తంగా!
చిన్నతనములో సెలవులలో గేదెలను కాసేటప్పుడు, దానిమీద స్వారి చేస్తూ సాయంత్రం గుళ్ళో మఱ్ఱాకున తిన్న ప్రసాదము గుర్తుకు వచ్చింది.
రిప్లయితొలగించండిఇఱ్ఱి వలె పరుగు లెత్తెడు
బఱ్ఱెలపై స్వారి సలిపి వనముల లోనన్
కొఱ్ఱల పొంగలిఁ గుడిచితి
మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండితొర్రన్ రసాధి మధువున్
వెర్రిగ దొరకన్ జిహ్వాశ వెంకటనారీ
పుర్రెకు తోచెను, గలదీ!
మర్రాకున, విడెము దినగ మనసాయ సఖీ.
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్,
రిప్లయితొలగించండితినుబండారము లన్నమున్ పెరుగు చద్దిన్ తాటియాకున్, సల
క్షణ పైక ప్పరిటాకుచే, జలుబు కోసం బెంగిలాకున్, సనా
తన ధర్మంబిది కాదె? తీర్చు మిలఁ ఛందంబున్ నిరాటంకమై౹౹
వెఱ్ఱా యేమనిబలికెదు
రిప్లయితొలగించండిమఱ్ఱాకునవిడెముదినగమనసాయెసఖీ!
మఱ్ఱాకునుదిందురె విడెముగ?
బుఱ్ఱుందా నీకుచెపుమభూతపిశాచీ!
కుఱ్ఱుచు కొఱ్ఱుల మందను
రిప్లయితొలగించండికుఱ్ఱఁడు గాచె మఱలించె; కునుకును దీసెన్
సఱ్ఱున మేల్కొని పల్కెను
మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ప్రేయసీ ప్రియుల సరస సంభాషణము]
"ఘనురాలా! యిటు రమ్ము! లోక మిటులన్ గణ్యంబుగా నీ గరో
నను మున్గెన్! దగులమ్ము వద్దు! కనఁగన్ నాకిప్పు డీ వియ్యెడన్
దినఁగా నన్నియు మఱ్ఱియాకున నిడన్, దిందుం గదే! యట్టులే
మనసాయెన్ గద, భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్."
కొఱ్ఱన్నము, పప్పు పులుసు
రిప్లయితొలగించండినెఱ్ఱెఱ్ఱని యావకాయ యింపేపారన్
జుఱ్ఱు కొనుచు తింటి కదా !
మఱ్ఱాకున ; విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
****
సాధారణంగా విస్తరి మోదుగాకులతో కుట్టుతారు.
కాని యీ విస్తరి మఱ్ఱాకులతో కుట్టినది.
పూజ్యులకు ప్రణామాలు🙏
రిప్లయితొలగించండినా పూరణ....
కం"
కుర్రతన మున మగడనియె
వెర్రిగ సరసంబులాడి వేడుక పొందన్
జుర్రెద పాయసము, పిదప
మర్రాకున విడెము దినగ మనసాయె సఖీ!
వాణిశ్రీ నైనాల
రిప్లయితొలగించండికొర్రల బువ్వను తినియెద
మర్రాకున, విడియము దిన మనసాయె సఖీ
సర్రున తెమ్మిక నేనా
మర్రాకులవిస్తరందు మరువక తిందున్.
కుర్రతనపుచేష్టితముగ
రిప్లయితొలగించండికర్రాబిళ్ళాటలాడుకాలము మదిలో
వెర్రిగకదలాడెనిపుఁడు
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
వినయంబుందున వేడుచుంటి వినవే విద్యాధికుండన్ గదా
రిప్లయితొలగించండినను నీ భర్తగ స్వీకరించ యనుమానంబేల, నీపైననే
మనసాయెన్ గద భామినీ, తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమున్
కనలేదెప్పుడు పిచ్చిదాన, యదినాకందింపగా నేలనే.
మనసాయెన్గదభామినీ!తినుటకైమఱ్ఱాకునన్వీడ్యమున్
రిప్లయితొలగించండిమనసాయేననిపల్కగాదగదునీమానంబునేమాయెనే?
కొనగాశక్యముగాదుగానిపుడయేకోశానదాంబూలమున్
వినుమాతమ్మునునాహరించుటనునేవేళంవిసర్జించుమా
ఎఱ్ఱఁగఁ బండ వలెఁ జుమీ
రిప్లయితొలగించండిగిఱ్ఱునఁ దే తములపాకు క్రిందం గలదా
యఱ్ఱనఁ బొడవున మించును
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
[మఱ్ఱాకును +అ = మఱ్ఱాకున ; మఱ్ఱాకునే; అఱ్ఱ = పెట్టె యఱ]
కనకభ్రాజిత కుండలా సరస శృంగారోజ్జ్వ లాస్యా సఖీ
నినదప్రస్ఫుట కింకిణీ గురుకుచా నీరేజ పత్రేక్షణా
వనజాస్యా మద మత్త నాగ గమనాభా పెట్టుమా సున్నమున్
మనసాయెన్ గద భామినీ! తినుటకై, మఱ్ఱా కునన్, వీడ్యమున్
అనయంబీరజతంపు పళ్ళెరమునందన్నంబు భోంచేయగా
రిప్లయితొలగించండికనలెన్ నామది మార్పుగోరినది నాకన్నంబు నీవేళలో
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్, వీడ్యమున్
కొనితెమ్మిప్పుడు మర్రియాకుననునాకోసంబు బింబాననా
జుర్రితి జీకుల రసమును
రిప్లయితొలగించండిగుర్రును కొట్టుటకు కొంత గుట్కాతింటిన్
వెర్రినిగానులె క్రొత్తగ
మర్రాకున విడెముదినగ మనసాయె సఖీ!
వినగా నేడిట వ్యాధిబాపుటకు బ్రావీణ్యంపు వైద్యంబహో
తినుటే శాకపుభోజనంబు నదియున్ దివ్యంపు పర్ణంబునన్
మనసాయన్గద భామీనీ!తినుటకై మర్రాకునన్;వీడ్యమున్
గొనిరావే నవనాగవల్లికలతో కొంగ్రొత్త చూర్ణంబుతో
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండితనలో రేగిన భావముల్ మనసు నందాకంగ రంజిల్ల జే
రిప్లయితొలగించండిసిన పద్మాక్షిని జూడగన్ భయముగా శ్రీఘ్రంబె గేహంబుకున్
జని రమ్మంటును బిల్వగన్ వెడల భోజ్యంబివ్వ నూహిం చెనో
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్
కం:
రిప్లయితొలగించండిగొఱ్ఱెల మేపుచు గడుసరి
అఱ్ఱులు జాచుచు గుసగుస యభిరతి దెలుపన్
చిఱ్ఱన, నాసతికి దెలుపె
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ
వై. చంద్రశేఖర్
అనయమ్మున్ తిరుగాడుచున్ మనసునన్ ధ్యానించుచున్ తృప్తిగా
రిప్లయితొలగించండిఘనమౌ నీదగు సన్నిధానమున నేకన్గొంటి స్వర్గమ్మిలన్
గొననారోగ్యము వెజ్జుపంపునను నీకోర్కెన్, నిరూఢమ్ముగా
మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్