23-2-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హలము విడువఁ బంట లధికమగును”(లేదా...)“హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:వలపులు మీరగా మిగుల బంగరు భూముల సాగు చేయుటన్పలువురు రైతులాదటను పండుగ జేయుచు చేర్చి రూకలన్తెలివిగ ట్రాక్టరుల్ గొనుచు తేలిక తీరున పాతకాలపుం హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "పాతకాలపున్" అనండి. అక్కడ ద్రుతకార్యం జరుగలేదు కనుక ద్రుతం బిందురూపాన్ని పొందదు.
🙏
మెఱయుశాస్త్రమందుమీసంబుమెలిఁబెట్టిఅన్నరైతుగూడయందగించెసాగుభూమియందుసహకారిమిషనయ్యెహలమువిడువపంటలధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొలమున వేయు సారములు పుష్కలమీ కలియందు క్ష్వేళముల్ఫలితము నేటి పంటలవి పామువిషమ్ముల బోలి యుండగావలదని సేంద్రియమ్ములను వాడుచు క్షేమము కోరుచున్ *హలా**హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చిన్న కమతములను చేసి వేరు పడిరినీటి పంపకముల పోటి పడిరిపైరులెండవెట్టె భ్రాతలు కినుకనుహలము విడువఁ బంట లధికమగును...భారతీనాథ్ చెన్నంశెట్టి...(హలము= తగవు)
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు. 'హలము'నకు తగవు అన్న అర్థాన్ని కేవలం పర్యాయపద నిఘంటువు ఇచ్చింది. అది అంత ప్రామాణికం కాదు.
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్నా ప్రయత్నం:చం.సలసల కాల్చు టెండలను సైతము సైచుచు బైరు నాటుచున్జలజల వానలే కురియ సాంతము ముద్దయి నీరు దీయుచున్చలికిని పంచబాణుడటు సందడి జేయఁగ దాము, హర్షదోహలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.హర్షదోహలము-కామము
విలువల గౌరవింపక నవీన విధానములంచుఁ బెక్కు రీతులుగ జనాళి స్వాస్థ్యమును దూరమొనర్చు గుణంబు లెన్నియోకలిగిన పుర్వు మందులను గాఢముగా వెదజల్లఁ బూను దోహలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.
🙏🏽
జగతి మేలు గోరి శాస్త్ర వేత్తల కృషి వలన వచ్చె నూత్న పరికరములు వాటి విలువ దెలిసి వాడచు రైతన్న హలము విడువ బంట లధిక మగును
ఆధునిక యుగమ్ము నందున కలవుగాసేద్యమునకు వివిధ శీఘ్ర సాధనములు ట్రాక్టరువలె, నావిధమ్ముగనిలహలము విడువఁ బంట లధికమగును
ఆటవెలదిపదును వాన గురియ నదునుకు రైతన్నమడక దున్ని విత్తు పడినదాదిరీతి దప్పు సోమరితనమునన్ కుతూహలము విడువఁ బంట లధికమగునుచంపకమాలతొలకరి నాటి నుండి మడి దున్నుచు సిద్ధముఁ జేసి పంటకున్మెలకువ లెన్నొ నేర్చి విని మేలొన రించెడు సూచనాదులన్బొలముల ధాన్యలక్ష్మిఁ గని బొంగెడు దాక వినోదమన్ గుతూహలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
అలజడి రేపి రైతులట నందరి పావుల జేసి వారటన్ విలవిలలాడుచుండ గని వీగిరి శాంతిని గోరు ధీరులున్వలదిక రాజకీయమన పంతము వీడుచు పోరుటల్ కుతూహలముల మూల బెట్టిరట హాలికు లెక్కువ పంట దీయగన్
కలడిల పద్య హాలికుడు కైతల గూర్చెడి *కందిశంకరుల్*కలమిక నూత్నమౌ హలము గాగ విరించిగ పద్య సేద్యమున్బలువిధ నవ్య రీతులను పంచి వివేకము బెంచ; పాతవౌహలముల మూల బెట్టిరట హాలికు లెక్కువ పంట దీయగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నరుల బలము కన్న మరయంత్రముల శక్తియధిక మంచు నెరుగు మన్న దాత! భద్రములవి లాగు వ్యవసాయ మదియేల హలము విడువఁ బంట లధిక మగును.
పలువిధ మైన పద్ధతులు వాసిగ జేరెను సేద్యమందునన్ తొలకరి పల్కరింపగనె దుక్కిని దున్నగ గోరి కృంతమున్ బలదము గట్టకుండ బలవర్ధక యంత్రము వాడ నెంచుచున్ హలముల మూలబెట్టిరఁట హాలికి లెక్కువ పంటఁ దీయఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'హాలికు లెక్కువ..' టైపాటు.
మైలవరపు వారి పూరణ విలసదశేషపుణ్యఫలవిశ్రుతకర్షకవృత్తి జాతికేబలమని.,లాభనష్టముల భావన యుక్తము గాదటంచు., పు..ర్వులహరియించు మందు గొను పూర్వపుపద్ధతివీడి యా హలాహలముల మూల బెట్టిరట హాలికులెక్కువ పంటఁ దీయగన్!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
పూర్వకాలమందుపుడమిని దున్నంగపండెపంటకొంతె,బలము పెరిగెహలము విడువఁ బంట లధికమగునుగాని,యంత్రమందు పండి,వ్యాధి ప్రబలె
చక్కని పూరణ. అభినందనలు.
చెలువము చెంగలించ దమజీవనమున్ పెనుపొంద జేయుచున్హలముల జేత బట్టి రట యాతన నెంచక రైతు లత్తరిన్నలమిన శాస్త్రజ్ఞాన ఫలమందున నేడు కృషిన్వరించగన్హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్!("దుక్కి దున్ని మోటలాగుబక్క ఎడ్ల మొరవినెనోఅవతరించె ట్రాక్టర్లుఆయిలు యింజనులు")డా.జె.బాపురెడ్డిగారి అద్భుతగీతం ఉన్నది....
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'శాస్త్రజ్ఞాన' మన్నపుడు 'స్త్ర' గురువై గణభంగం. సవరించండి.
సమస్య :హలముల మూలబెట్టిరట హాలికు లెక్కువపంట దీయగన్ ( వ్యవసాయం వల్ల నష్టపోతున్నామనే తలంపుతో ఉన్న భూమి నమ్మి వ్యాపారం చేయదలచుకున్న రైతులు )" చలనముతోడ నెంతయును శ్రామికకష్టము సల్పుచుండినన్ ఫలమది చేరకున్నయది ; బానిసజీవిత మెన్నినాడులో ?నిలనిపు డమ్మి వర్తకము నింపుగ జేయుద " మంచు నెంచుచున్ హలముల మూలబెట్టిరట హాలికు ; లెక్కువపంట దీయగన్ .( పంట - ఫలితము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. "చేరకున్న నది... నాడులో యిల..." అని ఉండాలనుకుంటాను.
చం: కలమును బట్టి విద్యలను కాలము నెంచుచు నేర్వ హాలికుల్కొలువున జేర నార్జనము గొప్పగు రీతిని బొందుచుండగన్ ఫలములు హెచ్చుమీరగను పాతగు సేద్యము రోతయై కుతూహలముల మూల బెట్టిరట హాలికులెక్కువ పంట దీయగన్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
అందరు గలిసి సేద్యము నాచరించబూని , వలసిన సామగ్రి మొగ్గరముగగొనుచు, వాడుటకై పంచుకొనెడి వేళహలము విడువఁ బంట లధికమగునుమొగ్గరము = సమూహముహలము = కలహము
కలుముల నిచ్చునంచు వెనుకంజను వేయక దున్నుయంత్రముల్జెలిమిని జేయుచున్ మిగుల చెల్వము తోడుతసాగుబాటలోజెలగుచు సేంద్రియంపువిధి సేద్యము సేయగ నుద్యమించుచున్ హలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగన్
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
సులువుగ సాగు జేయుటకు జూపి విదేశపు యంత్ర రీతులన్దెలుపగ నూత్న పద్ధతుల తెల్లముగా మన పల్లెలందునన్ హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్వెలుగులు నిండె నిండ్లనిక పెంపెసలారెను భోగ భాగ్యముల్
పిలుపిదె యాప్యాయముగానలుపెరుగక మీరు నడుపు హలము విడువఁ బంట లధికమగును! పసిడి పంటలు రొయ్యలు! వేయుడీ కటకటలు తొలగున్జిలేబి
వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవసరముల కొరకై వినురవి! హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్! విడు వ్యవసాయము! రొయ్య పంట పసిడి మనకగున్జిలేబి
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కలములు లేక సత్కృతులు కాగితమందున వ్రాయజాలునా!ఉలు లవి లేక సుందరమహోన్నతశిల్పము చెక్క జాలునా!గళమది లేక గీతముల కమ్మగ పాడుదురే! అహా! ఒహో!హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
సమస్యా పూరణంహలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగానా పూరణ1చంపకమాలపొలములు దున్ను యంత్రముల పోడిమి హెచ్చిన సౌఖ్యముండగాజలముల పైకిదీసి కడు సక్రమ పద్ధతి నందజేయుచున్కలుపులఁ దీయుచున్ యెరువు కాలము మీరక వేయు చుండగాహలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగన్ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తీయుచున్+ఎరువు' అన్నపుడు యడాగమం రాదు. "కలుపుల దీసి తా మెరువు కాలము మీరక..." అందామా?
యంత్ర పరికరములు వ్యవసాయమందునవాడుకొనిన హెచ్చు ఫలమునిచ్చుపాత పద్ధతులకు భరతవాక్యముబల్కిహలము విడువఁ బంట లధికమగును
ఆ.వె.సంపదలను గూర్చు సహకార సేద్యముచిన్నకమతములను చేరదీసికష్టమైన పనులు కలబోసి జేసినహలము విడువఁ బంట లధికమగును
కలముపట్టినకవికంప్యూటరునుపట్టెపద్యపాదమునకు పదమువెదక,వ్యయము తగ్గియంత్రపరికరములతోటిహలము విడువఁ బంట లధికమగును
యంత్ర యుగము గాన వ్యవసాయము నకురైతు లంద రిపుడు హలము మానపాతపరికర మన బడునట్టి యాపాతహలము విడువ బంట లధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. "వ్యవసాయమునకును" అనండి.
కలమునుబట్టికావ్యమునుకావ్యులువ్రాయగసైరికుండునాహలమునుబట్టిక్షేత్రమునుహాయిగదున్నగబండెసస్యముల్తలువనిరీతివచ్చిపడెదయ్యపురోగముపాతవైనయా*హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
యంత్రములను వాడి యధునాతనంబగుపరికరములు వాడి పద్ధతి గనునన్నదాత లెల్ల రనయము వాడెడుహలము విడువ బంట లధిక మగును
లోక మందు వచ్చె వీఁకను మార్పులు కాలపు వృథ యింక నేల వినుమ నూతనంపు గతులఁ జూతము వడి పాత హలము విడువఁ బంట లధికమగును అలసట మేన లేదు మఱి హాయిగ నాసన మందు నిల్చియుం బొలమును వేగవంతముగ ముచ్చట లాడుచు దున్న వచ్చు నాఁ గులుకుచు యంత్ర రాజముల గొప్పగఁ బట్టిరి కర్షణార్థమై హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
సులువగు యంత్రముల్ గనుటచొప్పును జూచెను గారణంబుగాహలములుమూలబెట్టిరటహాలికులెక్కువ పంటదీయగన్ బలువిధయంత్రరాజములు బారులుదీరిచియుండె యంగడిన్ హలములు మానిసేద్యమును హాలికులిప్పుడు జేయువీటితోన్
~~~~~~~~~~~~~~~~~"హలముల మూల బెట్టిరటహాలికు లెక్కువ పంటదీయగన్." కాలము మారి పోయినది కర్షకు లెల్లరు పాతపద్ధతుల్మూలకు పెట్టి పంటలను ముచ్చటగా తగు క్రొత్త పద్ధతేమేలొన గూర్చుమాకనుచు మేదిని టాక్టరుతోడ దున్నుచున్హలముల మూల బెట్టిరటహాలికు లెక్కువ పంటదీయగన్.~~~~~~~~~~~~~~~~~
ఆ.వె//పైరు పెరుగకున్న నీరుపోసి తుదకుపొలముదున్ని మరల కలుపుబీకి !కమిలిన మొలకలకు క్రిములసంహర, హాలహలము విడువఁ బంట లధికమగును !!
కలవిల పెక్కు యంత్రములు కర్షక మిత్రులు నూత్నమైన రీతుల వ్యవసాయమున్ సలుప తోషముతోడుత శీఘ్రమౌ గతిన్కలుగును హెచ్చు పంటలును కాసులు హెచ్చుగ రాలు నందుచేహలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
వలపులు మీరగా మిగుల బంగరు భూముల సాగు చేయుటన్
పలువురు రైతులాదటను పండుగ జేయుచు చేర్చి రూకలన్
తెలివిగ ట్రాక్టరుల్ గొనుచు తేలిక తీరున పాతకాలపుం
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పాతకాలపున్" అనండి. అక్కడ ద్రుతకార్యం జరుగలేదు కనుక ద్రుతం బిందురూపాన్ని పొందదు.
🙏
తొలగించండిమెఱయుశాస్త్రమందుమీసంబుమెలిఁబెట్టి
రిప్లయితొలగించండిఅన్నరైతుగూడయందగించె
సాగుభూమియందుసహకారిమిషనయ్యె
హలమువిడువపంటలధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొలమున వేయు సారములు పుష్కలమీ కలియందు క్ష్వేళముల్
రిప్లయితొలగించండిఫలితము నేటి పంటలవి పామువిషమ్ముల బోలి యుండగా
వలదని సేంద్రియమ్ములను వాడుచు క్షేమము కోరుచున్ *హలా*
*హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిన్న కమతములను చేసి వేరు పడిరి
రిప్లయితొలగించండినీటి పంపకముల పోటి పడిరి
పైరులెండవెట్టె భ్రాతలు కినుకను
హలము విడువఁ బంట లధికమగును
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
(హలము= తగవు)
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'హలము'నకు తగవు అన్న అర్థాన్ని కేవలం పర్యాయపద నిఘంటువు ఇచ్చింది. అది అంత ప్రామాణికం కాదు.
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
రిప్లయితొలగించండినా ప్రయత్నం:
చం.
సలసల కాల్చు టెండలను సైతము సైచుచు బైరు నాటుచున్
జలజల వానలే కురియ సాంతము ముద్దయి నీరు దీయుచున్
చలికిని పంచబాణుడటు సందడి జేయఁగ దాము, హర్షదో
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.
హర్షదోహలము-కామము
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిలువల గౌరవింపక నవీన విధానములంచుఁ బెక్కు రీ
రిప్లయితొలగించండితులుగ జనాళి స్వాస్థ్యమును దూరమొనర్చు గుణంబు లెన్నియో
కలిగిన పుర్వు మందులను గాఢముగా వెదజల్లఁ బూను దో
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.
🙏🏽
తొలగించండిజగతి మేలు గోరి శాస్త్ర వేత్తల కృషి
రిప్లయితొలగించండివలన వచ్చె నూత్న పరికరములు
వాటి విలువ దెలిసి వాడచు రైతన్న
హలము విడువ బంట లధిక మగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆధునిక యుగమ్ము నందున కలవుగా
రిప్లయితొలగించండిసేద్యమునకు వివిధ శీఘ్ర సాధ
నములు ట్రాక్టరువలె, నావిధమ్ముగనిల
హలము విడువఁ బంట లధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిపదును వాన గురియ నదునుకు రైతన్న
మడక దున్ని విత్తు పడినదాది
రీతి దప్పు సోమరితనమునన్ కుతూ
హలము విడువఁ బంట లధికమగును
చంపకమాల
తొలకరి నాటి నుండి మడి దున్నుచు సిద్ధముఁ జేసి పంటకున్
మెలకువ లెన్నొ నేర్చి విని మేలొన రించెడు సూచనాదులన్
బొలముల ధాన్యలక్ష్మిఁ గని బొంగెడు దాక వినోదమన్ గుతూ
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఅలజడి రేపి రైతులట నందరి పావుల జేసి వారటన్
రిప్లయితొలగించండివిలవిలలాడుచుండ గని వీగిరి శాంతిని గోరు ధీరులున్
వలదిక రాజకీయమన పంతము వీడుచు పోరుటల్ కుతూ
హలముల మూల బెట్టిరట హాలికు లెక్కువ పంట దీయగన్
కలడిల పద్య హాలికుడు కైతల గూర్చెడి *కందిశంకరుల్*
తొలగించండికలమిక నూత్నమౌ హలము గాగ విరించిగ పద్య సేద్యమున్
బలువిధ నవ్య రీతులను పంచి వివేకము బెంచ; పాతవౌ
హలముల మూల బెట్టిరట హాలికు లెక్కువ పంట దీయగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండినరుల బలము కన్న మరయంత్రముల శక్తి
రిప్లయితొలగించండియధిక మంచు నెరుగు మన్న దాత!
భద్రములవి లాగు వ్యవసాయ మదియేల
హలము విడువఁ బంట లధిక మగును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలువిధ మైన పద్ధతులు వాసిగ జేరెను సేద్యమందునన్
రిప్లయితొలగించండితొలకరి పల్కరింపగనె దుక్కిని దున్నగ గోరి కృంతమున్
బలదము గట్టకుండ బలవర్ధక యంత్రము వాడ నెంచుచున్
హలముల మూలబెట్టిరఁట హాలికి లెక్కువ పంటఁ దీయఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హాలికు లెక్కువ..' టైపాటు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివిలసదశేషపుణ్యఫలవిశ్రుతకర్షకవృత్తి జాతికే
బలమని.,లాభనష్టముల భావన యుక్తము గాదటంచు., పు..
ర్వులహరియించు మందు గొను పూర్వపుపద్ధతివీడి యా హలా
హలముల మూల బెట్టిరట హాలికులెక్కువ పంటఁ దీయగన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిపూర్వకాలమందుపుడమిని దున్నంగ
రిప్లయితొలగించండిపండెపంటకొంతె,బలము పెరిగె
హలము విడువఁ బంట లధికమగునుగాని,
యంత్రమందు పండి,వ్యాధి ప్రబలె
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచెలువము చెంగలించ దమ
జీవనమున్ పెనుపొంద జేయుచున్
హలముల జేత బట్టి రట
యాతన నెంచక రైతు లత్తరి
న్నలమిన శాస్త్రజ్ఞాన ఫల
మందున నేడు కృషిన్వరించగన్
హలముల మూలఁ బెట్టిరఁట
హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్!
("దుక్కి దున్ని మోటలాగు
బక్క ఎడ్ల మొరవినెనో
అవతరించె ట్రాక్టర్లు
ఆయిలు యింజనులు")
డా.జె.బాపురెడ్డిగారి అద్భుతగీతం ఉన్నది....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శాస్త్రజ్ఞాన' మన్నపుడు 'స్త్ర' గురువై గణభంగం. సవరించండి.
సమస్య :
రిప్లయితొలగించండిహలముల మూలబెట్టిరట
హాలికు లెక్కువపంట దీయగన్
( వ్యవసాయం వల్ల నష్టపోతున్నామనే తలంపుతో ఉన్న భూమి నమ్మి వ్యాపారం చేయదలచుకున్న రైతులు )
" చలనముతోడ నెంతయును
శ్రామికకష్టము సల్పుచుండినన్
ఫలమది చేరకున్నయది ;
బానిసజీవిత మెన్నినాడులో ?
నిలనిపు డమ్మి వర్తకము
నింపుగ జేయుద " మంచు నెంచుచున్
హలముల మూలబెట్టిరట
హాలికు ; లెక్కువపంట దీయగన్ .
( పంట - ఫలితము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"చేరకున్న నది... నాడులో యిల..." అని ఉండాలనుకుంటాను.
చం:
రిప్లయితొలగించండికలమును బట్టి విద్యలను కాలము నెంచుచు నేర్వ హాలికుల్
కొలువున జేర నార్జనము గొప్పగు రీతిని బొందుచుండగన్
ఫలములు హెచ్చుమీరగను పాతగు సేద్యము రోతయై కుతూ
హలముల మూల బెట్టిరట హాలికులెక్కువ పంట దీయగన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఅందరు గలిసి సేద్యము నాచరించ
రిప్లయితొలగించండిబూని , వలసిన సామగ్రి మొగ్గరముగ
గొనుచు, వాడుటకై పంచుకొనెడి వేళ
హలము విడువఁ బంట లధికమగును
మొగ్గరము = సమూహము
హలము = కలహము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలుముల నిచ్చునంచు వెనుకంజను వేయక దున్ను
రిప్లయితొలగించండియంత్రముల్
జెలిమిని జేయుచున్ మిగుల చెల్వము తోడుత
సాగుబాటలో
జెలగుచు సేంద్రియంపువిధి సేద్యము సేయగ నుద్యమించుచున్
హలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిసులువుగ సాగు జేయుటకు జూపి విదేశపు యంత్ర రీతులన్
రిప్లయితొలగించండిదెలుపగ నూత్న పద్ధతుల తెల్లముగా మన పల్లెలందునన్
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
వెలుగులు నిండె నిండ్లనిక పెంపెసలారెను భోగ భాగ్యముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిలుపిదె యాప్యాయముగా
నలుపెరుగక మీరు నడుపు హలము విడువఁ బం
ట లధికమగును! పసిడి పం
టలు రొయ్యలు! వేయుడీ కటకటలు తొలగున్
జిలేబి
వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅవసరముల కొరకై విను
రవి! హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లె
క్కువ పంటఁ దీయఁగన్! విడు
వ్యవసాయము! రొయ్య పంట పసిడి మనకగున్
జిలేబి
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికలములు లేక సత్కృతులు కాగితమందున వ్రాయజాలునా!
రిప్లయితొలగించండిఉలు లవి లేక సుందరమహోన్నతశిల్పము చెక్క జాలునా!
గళమది లేక గీతముల కమ్మగ పాడుదురే! అహా! ఒహో!
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్యా పూరణం
రిప్లయితొలగించండిహలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగా
నా పూరణ
1చంపకమాల
పొలములు దున్ను యంత్రముల పోడిమి హెచ్చిన సౌఖ్యముండగా
జలముల పైకిదీసి కడు సక్రమ పద్ధతి నందజేయుచున్
కలుపులఁ దీయుచున్ యెరువు కాలము మీరక వేయు చుండగా
హలముల మూలబెట్టిరట హాలికులెక్కువ పంటదీయగన్
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తీయుచున్+ఎరువు' అన్నపుడు యడాగమం రాదు. "కలుపుల దీసి తా మెరువు కాలము మీరక..." అందామా?
యంత్ర పరికరములు వ్యవసాయమందున
రిప్లయితొలగించండివాడుకొనిన హెచ్చు ఫలమునిచ్చు
పాత పద్ధతులకు భరతవాక్యముబల్కి
హలము విడువఁ బంట లధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె.
రిప్లయితొలగించండిసంపదలను గూర్చు సహకార సేద్యము
చిన్నకమతములను చేరదీసి
కష్టమైన పనులు కలబోసి జేసిన
హలము విడువఁ బంట లధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలముపట్టినకవికంప్యూటరునుపట్టె
రిప్లయితొలగించండిపద్యపాదమునకు పదమువెదక,
వ్యయము తగ్గియంత్రపరికరములతోటి
హలము విడువఁ బంట లధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియంత్ర యుగము గాన వ్యవసాయము నకు
రిప్లయితొలగించండిరైతు లంద రిపుడు హలము మాన
పాతపరికర మన బడునట్టి యాపాత
హలము విడువ బంట లధికమగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "వ్యవసాయమునకును" అనండి.
కలమునుబట్టికావ్యమునుకావ్యులువ్రాయగసైరికుండునా
రిప్లయితొలగించండిహలమునుబట్టిక్షేత్రమునుహాయిగదున్నగబండెసస్యముల్
తలువనిరీతివచ్చిపడెదయ్యపురోగముపాతవైనయా
*హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియంత్రములను వాడి యధునాతనంబగు
రిప్లయితొలగించండిపరికరములు వాడి పద్ధతి గను
నన్నదాత లెల్ల రనయము వాడెడు
హలము విడువ బంట లధిక మగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిలోక మందు వచ్చె వీఁకను మార్పులు
రిప్లయితొలగించండికాలపు వృథ యింక నేల వినుమ
నూతనంపు గతులఁ జూతము వడి పాత
హలము విడువఁ బంట లధికమగును
అలసట మేన లేదు మఱి హాయిగ నాసన మందు నిల్చియుం
బొలమును వేగవంతముగ ముచ్చట లాడుచు దున్న వచ్చు నాఁ
గులుకుచు యంత్ర రాజముల గొప్పగఁ బట్టిరి కర్షణార్థమై
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిసులువగు యంత్రముల్ గనుటచొప్పును జూచెను గారణంబుగా
తొలగించండిహలములుమూలబెట్టిరటహాలికులెక్కువ పంటదీయగన్
బలువిధయంత్రరాజములు బారులుదీరిచియుండె యంగడిన్
హలములు మానిసేద్యమును హాలికులిప్పుడు జేయువీటితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండి"హలముల మూల బెట్టిరట
హాలికు లెక్కువ పంటదీయగన్."
కాలము మారి పోయినది క
ర్షకు లెల్లరు పాతపద్ధతుల్
మూలకు పెట్టి పంటలను
ముచ్చటగా తగు క్రొత్త పద్ధతే
మేలొన గూర్చుమాకనుచు మే
దిని టాక్టరుతోడ దున్నుచున్
హలముల మూల బెట్టిరట
హాలికు లెక్కువ పంటదీయగన్.
~~~~~~~~~~~~~~~~~
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ.వె//
రిప్లయితొలగించండిపైరు పెరుగకున్న నీరుపోసి తుదకు
పొలముదున్ని మరల కలుపుబీకి !
కమిలిన మొలకలకు క్రిములసంహర, హాల
హలము విడువఁ బంట లధికమగును !!
కలవిల పెక్కు యంత్రములు కర్షక మిత్రులు నూత్నమైన రీ
రిప్లయితొలగించండితుల వ్యవసాయమున్ సలుప తోషముతోడుత శీఘ్రమౌ గతిన్
కలుగును హెచ్చు పంటలును కాసులు హెచ్చుగ రాలు నందుచే
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్