19-4-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రాముని శాపమున నాతి రాతిగ మారెన్”(లేదా...)“రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా”
కామముతోడుతనింద్రుఁడుఏమరిగౌతముసుదతినివేధింపంగాయామముదాటినతదుపరిరా, మునిశాపముననాతిరాతిగమారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
ఏమరిగౌతముసుదతినినెరుకనుగెలువన్
కామనదేవరాజునటగౌతముభార్యనుచెట్టబట్టనారామునిమానసంబునిడిరాజిలుబుద్ధినితాపసుండునాయామమునిత్యకృత్యములయజ్ఞముఁజేయనుపక్రమింపనౌరా, మునిఘోరశాపమునరాతిగమారెనహల్యయక్కటా
భామిని నహల్యతో సుత్రాముఁడు సుఖియించఁగోరి దగ్గఱఁజేరెన్ఏమని చెప్పుదు నౌరౌరా!మునిశాపమున నాతి రాతిగ మారెన్.
చక్కని పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంకామప్రకోపమునఁ దానీమమ్ము మఱచి సుఖింప నిర్భయముగ సుత్రామునితోఁ., బతి హృదయారాముని శాపమున నాతి రాతిగ మారెన్!ఉత్పలమాలకామమనర్థదాయకము గాంచ నుదాహరణమ్ములెన్నియో!నీమము వీడి మోహమున నిర్భయమై రమియింప వజ్రితోనేమరుపాటుగన్ విటుని నింటను గాంచిన భర్త మానసారాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
రాముని పాదము సోకగభామగ మారిన పడతియె పాషాణముగాతామారెనెట్లన కుమారా! ముని శాపమున నాతి రాతిగ మారెన్.రాముని పాదధూళియది రాతిని నాతిగ మార్చెనంచు నా స్వామియె చెప్పె మాకట, శుభాంగిని రాతిగ మార్చెనెవ్వడో ప్రేమగ తెల్పుమంచడగ బిడ్డడి కిట్టుల చెప్పెనే, కుమారా! ముని ఘోరశాపమున రాతిగ మారెనహల్య యక్కటా!
కామముతో సురపతి తా భామిని పోందంగ గోర పతి గమనించెన్ నీమము తప్పె నటo చౌ రా ' ముని శాపమున నాతి రాతిగ మారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాముకుడింద్రుడు గౌతమభూమిక మాటున నహల్య పొందికనొందెన్ఆమర్షము కడుకొన నౌరా! ముని శాపమున నాతి రాతిగ మారెన్
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: భామగ శిల మారంగను యేమిది? నన, గాధిజుడనె నిమ్ముగ నపుడున్ రామా! యేమని పల్కుదు రా? ముని శాపమున నాతి రాతిగ మారెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మారంగను నేమిది యన..." అనండి.
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: ప్రేమను జూపుచు యింద్రుడు భామిని చెంతకు కపటపు భర్తగ జేరన్ నీమ మహల్య కడచె నవు రా! ముని శాపమున నాతి రాతిగ మారెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...జూపుచు నింద్రుడు" అనండి.
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: తామసుడౌచు యింద్రుడట దారుణ బుద్ధిని మోసమెంచుచున్ కామముతోడ భామినిని గౌతముడింటను లేని వేళనన్ నీమముదప్పి కల్లరి మునీంద్రుని వేషము దాల్చి రాగ నౌ రా! ముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా!
(కర్ణుడు , అహల్య ల కథ)ఆమూలముగ మరచె భృగురాముని శాపమున ; నాతి రాతిగ మారెన్సామి యభిశాపమున శ్రీరాముని మృదుపా దములు దొ రయు దనుక మనన్
ఉ.మా.కాముని లీలలన్దగిలి కష్టము లంబడి చిక్కినంత నౌ*రా!ముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా*నీమము నెంచుచున్గొలిచి నెమ్మిని గాలము వెళ్లబుచ్చగన్రాముని పాదధూళికిని రాతియె నాతిగ మారె ధన్యయై!
ప్రేముని కాపట్యమ్మునభామిని గౌతమునిపత్ని భంగపడెనహోయేమని వర్ణించెద నౌరా! ముని శాపమున నాతి రాతిగ మారెన్
లేమలు నా శచీపతికి లేరటె?మన్మథబాణతప్తుడైకోమలిఁగూడగాఁదలచి కోడిగ మారియుకూయ,నేగెగాస్వామియు స్నానసంధ్యలకు బాపురె!దూరడె యింటిలోకి,నౌ*రా!మునిఘోరశాపమున రాయిగా మారె నహల్య యక్కటా!*
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కందంనీమము తదుపరి గాంచెన్రాముని, శాపమున నాతి ఱాతిగ మారెన్కామాంధుని బారిన పడి ,స్వామి కెదురు పడి నహల్య శాంతిని బొందెన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
భామా రత్న మహల్యా నామ విధి వశమునఁ గాననమ్మున నా నిష్కామ ముని తపోఽరణ్యారాముని శాపమున నాతి రాతిగ మారెన్ [అరణ్య + ఆరాముని = అర ణ్యారాముని ] కామ వశాత్ముఁడై యమర కాంతుఁడు కాంచఁడు మంచి చెడ్డలన్ భామిని శాప మిచ్చు నని వాసవు నాపదు భీత చిత్తయై కోమలి పాప కృత్యమునఁ గుందుచు గౌతము స్వీయ వక్ష యా రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా [వక్షస్ + ఆరాముని = వక్ష యారాముని]
ధీమతవైరమందుననుదెల్పెసమస్యలుపృచ్ఛకోత్తముల్కాముడుఁగంటిమంటలనుఁగాల్చెనుశంకరుబూదిసేయుచున్భీమునిఁజంపెఁగీచకుడుభీతిలజేయుచుఁబాకశాలనన్రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటాకొరుప్రోలు రాధాకృష్ణ రావు
కాముకుడై మహేంద్రుడల గౌతము పత్ని రమింప బూనగానీమము దప్పెనంచు గృహిణిన్ గని తాపసి క్రోధమూనె నౌరా ముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటారాముని పాదమే మరల రాతిని నాతిగ మార్చె ధన్యతన్
చేరియు భర్తలే నపుడు చెంతకు నింద్రుడుభర్త రూపుతోకోరె నహల్యతో సురతి కోమలి సమ్మతితెల్పె నంతలోచేరిన గౌతముండటకు చెచ్చెర నిచ్చెనుశాపమున్నదేరా ! ముని ఘోర శాపమున రాతిగమారె నహల్య యక్కటా
భామామణిసొగసునుగనికామము తోడదరి చేర కారువు వనిలోనీమముతప్పెనటంచౌరామునిశాపమున నాతి రాయిగ మారెన్
కామముతోడుతనింద్రుఁడు
రిప్లయితొలగించండిఏమరిగౌతముసుదతినివేధింపంగా
యామముదాటినతదుపరి
రా, మునిశాపముననాతిరాతిగమారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
ఏమరిగౌతముసుదతినినెరుకనుగెలువన్
తొలగించండికామనదేవరాజునటగౌతముభార్యనుచెట్టబట్టనా
తొలగించండిరామునిమానసంబునిడిరాజిలుబుద్ధినితాపసుండునా
యామమునిత్యకృత్యములయజ్ఞముఁజేయనుపక్రమింపనౌ
రా, మునిఘోరశాపమునరాతిగమారెనహల్యయక్కటా
భామిని నహల్యతో సు
రిప్లయితొలగించండిత్రాముఁడు సుఖియించఁగోరి దగ్గఱఁజేరెన్
ఏమని చెప్పుదు నౌరౌ
రా!మునిశాపమున నాతి రాతిగ మారెన్.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండికామప్రకోపమునఁ దా
నీమమ్ము మఱచి సుఖింప నిర్భయముగ సు
త్రామునితోఁ., బతి హృదయా
రాముని శాపమున నాతి రాతిగ మారెన్!
ఉత్పలమాల
కామమనర్థదాయకము గాంచ నుదాహరణమ్ములెన్నియో!
నీమము వీడి మోహమున నిర్భయమై రమియింప వజ్రితో
నేమరుపాటుగన్ విటుని నింటను గాంచిన భర్త మానసా
రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిరాముని పాదము సోకగ
భామగ మారిన పడతియె పాషాణముగా
తామారెనెట్లన కుమా
రా! ముని శాపమున నాతి రాతిగ మారెన్.
రాముని పాదధూళియది రాతిని నాతిగ మార్చెనంచు నా
స్వామియె చెప్పె మాకట, శుభాంగిని రాతిగ మార్చెనెవ్వడో
ప్రేమగ తెల్పుమంచడగ బిడ్డడి కిట్టుల చెప్పెనే, కుమా
రా! ముని ఘోరశాపమున రాతిగ మారెనహల్య యక్కటా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికామముతో సురపతి తా
రిప్లయితొలగించండిభామిని పోందంగ గోర పతి గమనించెన్
నీమము తప్పె నటo చౌ
రా ' ముని శాపమున నాతి రాతిగ మారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాముకుడింద్రుడు గౌతమ
రిప్లయితొలగించండిభూమిక మాటున నహల్య పొందికనొందెన్
ఆమర్షము కడుకొన నౌ
రా! ముని శాపమున నాతి రాతిగ మారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిభామగ శిల మారంగను
యేమిది? నన, గాధిజుడనె నిమ్ముగ నపుడున్
రామా! యేమని పల్కుదు
రా? ముని శాపమున నాతి రాతిగ మారెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మారంగను నేమిది యన..." అనండి.
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిప్రేమను జూపుచు యింద్రుడు
భామిని చెంతకు కపటపు భర్తగ జేరన్
నీమ మహల్య కడచె నవు
రా! ముని శాపమున నాతి రాతిగ మారెన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...జూపుచు నింద్రుడు" అనండి.
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండితామసుడౌచు యింద్రుడట దారుణ బుద్ధిని మోసమెంచుచున్
కామముతోడ భామినిని గౌతముడింటను లేని వేళనన్
నీమముదప్పి కల్లరి మునీంద్రుని వేషము దాల్చి రాగ నౌ
రా! ముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(కర్ణుడు , అహల్య ల కథ)
రిప్లయితొలగించండిఆమూలముగ మరచె భృగు
రాముని శాపమున ; నాతి రాతిగ మారెన్
సామి యభిశాపమున శ్రీ
రాముని మృదుపా దములు దొ రయు దనుక మనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ.మా.
తొలగించండికాముని లీలలన్దగిలి కష్టము లంబడి చిక్కినంత నౌ
*రా!ముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా*
నీమము నెంచుచున్గొలిచి నెమ్మిని గాలము వెళ్లబుచ్చగన్
రాముని పాదధూళికిని రాతియె నాతిగ మారె ధన్యయై!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేముని కాపట్యమ్మున
రిప్లయితొలగించండిభామిని గౌతమునిపత్ని భంగపడెనహో
యేమని వర్ణించెద నౌ
రా! ముని శాపమున నాతి రాతిగ మారెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలేమలు నా శచీపతికి లేరటె?మన్మథబాణతప్తుడై
రిప్లయితొలగించండికోమలిఁగూడగాఁదలచి కోడిగ మారియుకూయ,నేగెగా
స్వామియు స్నానసంధ్యలకు బాపురె!దూరడె యింటిలోకి,నౌ
*రా!మునిఘోరశాపమున రాయిగా మారె నహల్య యక్కటా!*
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండినీమము తదుపరి గాంచెన్
రాముని, శాపమున నాతి ఱాతిగ మారెన్
కామాంధుని బారిన పడి ,
స్వామి కెదురు పడి నహల్య శాంతిని బొందెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామా రత్న మహల్యా
రిప్లయితొలగించండినామ విధి వశమునఁ గాననమ్మున నా ని
ష్కామ ముని తపోఽరణ్యా
రాముని శాపమున నాతి రాతిగ మారెన్
[అరణ్య + ఆరాముని = అర ణ్యారాముని ]
కామ వశాత్ముఁడై యమర కాంతుఁడు కాంచఁడు మంచి చెడ్డలన్
భామిని శాప మిచ్చు నని వాసవు నాపదు భీత చిత్తయై
కోమలి పాప కృత్యమునఁ గుందుచు గౌతము స్వీయ వక్ష యా
రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా
[వక్షస్ + ఆరాముని = వక్ష యారాముని]
ధీమతవైరమందుననుదెల్పెసమస్యలుపృచ్ఛకోత్తముల్
రిప్లయితొలగించండికాముడుఁగంటిమంటలనుఁగాల్చెనుశంకరుబూదిసేయుచున్
భీమునిఁజంపెఁగీచకుడుభీతిలజేయుచుఁబాకశాలనన్
రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కాముకుడై మహేంద్రుడల గౌతము పత్ని రమింప బూనగా
రిప్లయితొలగించండినీమము దప్పెనంచు గృహిణిన్ గని తాపసి క్రోధమూనె నౌ
రా ముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా
రాముని పాదమే మరల రాతిని నాతిగ మార్చె ధన్యతన్
రిప్లయితొలగించండిచేరియు భర్తలే నపుడు చెంతకు నింద్రుడు
భర్త రూపుతో
కోరె నహల్యతో సురతి కోమలి సమ్మతి
తెల్పె నంతలో
చేరిన గౌతముండటకు చెచ్చెర నిచ్చెను
శాపమున్నదే
రా ! ముని ఘోర శాపమున రాతిగ
మారె నహల్య యక్కటా
భామామణిసొగసునుగని
రిప్లయితొలగించండికామము తోడదరి చేర కారువు వనిలో
నీమముతప్పెనటంచౌ
రామునిశాపమున నాతి రాయిగ మారెన్