25-8-2022 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ”(లేదా...)“లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్”
07382563308. భమిడిపాటి కాళిదాసు.కం.కరమున మధుపాత్రను గొని,హరి నామము దల్చి కృష్ణ యమపాశంబై!ధరమురియగ కీచక నీమరణమ్మును గోరి వచ్చె మానిని గంటే!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
±917382563308. భమిడిపాటి కాళిదాసు.భరువుని గూర్చి ఘోరముగ భక్తి తపంబును చేయ భస్మునిన్,కరణను జూచితానొసగ కాంక్షిత కాంక్షను కాలకాలునిన్,వరఫల మెంచిచూతునని వంచన సేయగ బూన రక్కసున్,మరణము గోరివచ్చినది మానిని చూడగ ముచ్చటాయెరా!!
లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌలయమును సృష్టియు మనుపను లయకారునిదే విలయము బాగుల నాయనె సలిపెడు సామర్ధ్య యుతుఁడు సైయని యందున్
తికమకగా ఉన్నది. గణాలు సరి చూడండి.
నయనాయుధుడన నెవ్వడు?నియతిగ శలుడేమి జేసె? నెలయల్లుండౌయయుగశరు రూపమెటులన? లయకారుఁడు, సేయ సృష్టి, లావణ్యంబౌ.
లయమగు లోకము లన్నియులాయకారుడు సేయ :సృష్టి లావణ్యంబౌనియతిగ జీవించి జనులుదయ గల వారుగ మెలగఁగ ధారుణి యందున్
మ.వియమంబబ్జజుడే సహస్రకవచున్ స్వేదంబుచే నిల్పగన్భయమున్ బొంది శివుండు విష్ణు శరణున్ వాంఛల్ నరుండబ్బగన్*"లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్”*దయతోఁ బద్మ పురాణమందు గల వృత్తాంతంబు నిర్మాణమున్.
లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్లయకారుండదె వప్పగించెఁ గద వాలాయంబు గాబ్రహ్మకున్ లయముంజేయుట శంభుడున్ మనుప యాలక్ష్మీశుగా నాఙ్ఞలన్ సులభంజేయఁగఁ బంపకాలటులు భాసోమాన వ్యక్తంబుగా.
సందేహం : 'య' 'ల' లకు ప్రాస చెల్లుతుందా ?
లయకారుండెవడన్న నీశ్వరుడె సర్వార్థంబు లందింపడే ప్రియభక్తాళిని బ్రోచువాడెకదరా భీష్ముండతండేకదా దయతో స్కందుని రక్షకోసమనుచున్ తా కృత్తికాలోకమున్ లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్.
నయముండదెందు లోననులయకారుఁడు సేయ ; సృష్టి లావణ్యంబౌచెయిదము లన్నిట , దప్పకనియమము పాటిం చు చుండు నేర్పర చేతన్
లయకారుడు = మోసగాడు
కందము అయయో!జగముల నాశము *లయకారుఁడు సేయ;సృష్టి లావణ్యంబౌ రయమున సేయగ బ్రహ్మయె జయమగు స్థితి కల్గఁజేయు చక్రధరుండే. మత్తేభము అయయో!లోకములెల్ల నొక్కపరిగా నంతంబయే రీతిగన్ *లయకారుండొనరింప;సృష్టిని గడున్ లావణ్యయుక్తంబుగన్ *రయముంజేయడె తమ్మిచూలి,యటుపై రక్షింపగాఁబూనడేదయతో విష్ణువు,నా త్రిమూర్తుల సదా ధ్యానించరే భక్తితోన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
నయమగు తాండవ నృత్యములయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌనియమానుసారముగ విశ్వయోని సౌందర్య దృష్టి సారింపంగన్
అయబెట్లుండును లోకత్రయముల పాలించువాడు దయగలవాడున్నయనానందముగా కువలయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
శంకరాభరణం సమస్య:“లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ”పూరణ:నయమున నలువయె సృజనముఅయ గా పోషణ భరమును నా విష్ణుండేపయనము చివరన నిహనములయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌకడయింటికృష్ణమూర్తి...గోవా..25-8-22
ప్రియముగ జీవులనెల్లరదయతో రక్షించును హరి, తనకృత్యంబౌలయమొనరించుట నిరతములయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
లయబద్ధముగా నాట్యములయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ”నియమానుసారముగవిధిస్వయముగ యొనరించుచుండజగములవెల్లన్
మరొక పూరణనయముగ భక్తులనెల్లనుదయతో రక్షించగ హరి ధరణీతలమున్లయకార్యంబును క్రమముగలయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ”
👏
కందంనియతిన్ దనకా సృష్టిక్రియ సహకారమ్మొసంగు ప్రియసతిఁ గమలాలయుడెంచి, తమికొనఁగఁ బాలయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌ!మత్తేభవిక్రీడితమునియతిన్ దోడొకరుండ మేలనుచుఁ దా నేర్పెంచి సృష్టిక్రియన్నయమౌ నైపుణి రంగరించి యరవిందాక్షిన్ బ్రవాళాధరన్ప్రియమారన్ సతిఁగాగొనన్ నలువయే, వీక్షింప శ్రీశుండు పాలయకారుం డొ, నరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్!
నయగారపు నగజ సుతునిదయలేకయె సంహరించి తదనంతరమున్ప్రియమార కుంజరముఖునిలయకారుడు సేయసృష్టి లావణ్యంబౌ వ్యయమైనట్టి ప్రపంచమున్ మరల నవ్యాజంపు బ్రేమమ్మునన్ నయగారంబున సృష్టిజేసె నరునిన్ నారీమణిన్జంటగాహయమున్ సింహము నేన్గులన్ మృగములన్హంసాదులన్ పక్షులన్ స్వయమున్ దానెయె తండ్రియై జనని శ్రీశర్వాణి సాహాయమున్ లయకారుం డొనరింప సృష్టిని గడున్ లావణ్యయుక్తం బగున్
ప్రియ జనకుఁడు శ్రీనాథుఁ డభయప్రదుఁ డొసంగ మహిమ ప్రావీణ్యముతో నియతి నలువ, సమయింపఁగలయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌప్రియ మారంగ సురక్షణం బొసఁగు నా విష్ణుండు లోకవ్రజక్షయకారుండు శివుండు ముక్తి నిడు బ్రచ్ఛన్నుండునై చక్కఁగన్ దయ వీక్షించి ధరా చ రాచర సమస్త ప్రాణి నిత్యస్థి రాలయ కారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్య యుక్తం బగున్
ప్రియమున్ కూర్చుచు గౌరి గంగలకు నావిశ్వేశ్వ రుండౌ గదానియతిన్చేయుచు నుండుగా నలువతానీ విశ్వమం దెల్లరన్దయతో భక్తజనాళినెల్ల గనుచా దామోద రుండుండగా. *లయకారుండొ,నరింప సృష్టిని గడున్ లావణ్య యుక్తంబగున్*
+917382563308. భమిడిపాటి కాళిదాసు.కం.వ్రాయుచు కర్మఫలంబులపూయుచు సుఖశాంతులవని పుణ్యాత్ములకున్!డాయుచు తన భక్తాళుల,లయకారుడు సేయు సృష్టి లావణ్యంబౌ!!
+917382563308. భమిడిపాటి కాళిదాసు.క్రియయున్ గర్తయు కర్మలెవ్వరనినన్ కేదార నాథుండెగా,నయమున్ పెంపును నాశనంబు లెనగా నాగాంతకున్ లీలలే!జయహానంబులు సత్ఫలంబులవనిన్ సర్వేశు సత్క్రీడలే,లయకారుండొనరింప సృష్టిని గఁడున్ లావణ్య యుక్తంబుగన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భయ భీతిన్ సహజంబుగా గలుగులే బాధల్ భువీబుట్టుకన్ పయనంబే జరుగున్ సదా నొసట యా పద్మోద్భవున్ రేఖలన్ నయగారంబున పద్ధతిన్ హరియు నీ-నా లేక పోషించులే ప్రియమారంగను మూడుమూర్తులు బహున్ బ్రీతిన్ గనంగా పరన్ లయకారుండొనరింప, సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తంబగున్!!
+917382563308. భమిడిపాటి కాళిదాసు.కం.నవవరుడా వధువునుగని,జవరాలా! రమ్మిటంచు సైగను సేయన్!శివశివ తెలవారెనుగద,రవి కనువిప్పెడి తఱినిటు రమ్మన దగునా!!
+917382563308. భమిడిపాటి కాళిదాసు.శశిధరుడా విధాతయును సాచియు నచ్యుతు డెల్ల వేల్పులున్!వశులుగనుండి గాచెగద బాలకుఁ గశ్యపు నందనాత్మజున్!నశము శరీరమంచతడు నమ్మెను శ్రీహరి పాదపద్మముల్!శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుగుల్!!
07382563308. భమిడిపాటి కాళిదాసు.
రిప్లయితొలగించండికం.
కరమున మధుపాత్రను గొని,
హరి నామము దల్చి కృష్ణ యమపాశంబై!
ధరమురియగ కీచక నీ
మరణమ్మును గోరి వచ్చె మానిని గంటే!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి±917382563308. భమిడిపాటి కాళిదాసు.
రిప్లయితొలగించండిభరువుని గూర్చి ఘోరముగ భక్తి తపంబును చేయ భస్మునిన్,
కరణను జూచితానొసగ కాంక్షిత కాంక్షను కాలకాలునిన్,
వరఫల మెంచిచూతునని వంచన సేయగ బూన రక్కసున్,
మరణము గోరివచ్చినది మానిని చూడగ ముచ్చటాయెరా!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
రిప్లయితొలగించండిలయమును సృష్టియు మనుపను లయకారునిదే
విలయము బాగుల నాయనె
సలిపెడు సామర్ధ్య యుతుఁడు సైయని యందున్
తికమకగా ఉన్నది. గణాలు సరి చూడండి.
తొలగించండి
రిప్లయితొలగించండినయనాయుధుడన నెవ్వడు?
నియతిగ శలుడేమి జేసె? నెలయల్లుండౌ
యయుగశరు రూపమెటులన?
లయకారుఁడు, సేయ సృష్టి, లావణ్యంబౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలయమగు లోకము లన్నియు
రిప్లయితొలగించండిలాయకారుడు సేయ :సృష్టి లావణ్యంబౌ
నియతిగ జీవించి జనులు
దయ గల వారుగ మెలగఁగ ధారుణి యందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ.
రిప్లయితొలగించండివియమంబబ్జజుడే సహస్రకవచున్ స్వేదంబుచే నిల్పగన్
భయమున్ బొంది శివుండు విష్ణు శరణున్ వాంఛల్ నరుండబ్బగన్
*"లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్”*
దయతోఁ బద్మ పురాణమందు గల వృత్తాంతంబు నిర్మాణమున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్
రిప్లయితొలగించండిలయకారుండదె వప్పగించెఁ గద వాలాయంబు గాబ్రహ్మకున్
లయముంజేయుట శంభుడున్ మనుప యాలక్ష్మీశుగా నాఙ్ఞలన్
సులభంజేయఁగఁ బంపకాలటులు భాసోమాన వ్యక్తంబుగా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందేహం : 'య' 'ల' లకు ప్రాస చెల్లుతుందా ?
తొలగించండి
రిప్లయితొలగించండిలయకారుండెవడన్న నీశ్వరుడె సర్వార్థంబు లందింపడే
ప్రియభక్తాళిని బ్రోచువాడెకదరా భీష్ముండతండేకదా
దయతో స్కందుని రక్షకోసమనుచున్ తా కృత్తికాలోకమున్
లయకారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినయముండదెందు లోనను
రిప్లయితొలగించండిలయకారుఁడు సేయ ; సృష్టి లావణ్యంబౌ
చెయిదము లన్నిట , దప్పక
నియమము పాటిం చు చుండు నేర్పర చేతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలయకారుడు = మోసగాడు
రిప్లయితొలగించండికందము
రిప్లయితొలగించండిఅయయో!జగముల నాశము
*లయకారుఁడు సేయ;సృష్టి లావణ్యంబౌ
రయమున సేయగ బ్రహ్మయె
జయమగు స్థితి కల్గఁజేయు చక్రధరుండే.
మత్తేభము
అయయో!లోకములెల్ల నొక్కపరిగా నంతంబయే రీతిగన్
*లయకారుండొనరింప;సృష్టిని గడున్ లావణ్యయుక్తంబుగన్ *
రయముంజేయడె తమ్మిచూలి,యటుపై రక్షింపగాఁబూనడే
దయతో విష్ణువు,నా త్రిమూర్తుల సదా ధ్యానించరే భక్తితోన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండినయమగు తాండవ నృత్యము
రిప్లయితొలగించండిలయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ
నియమానుసారముగ వి
శ్వయోని సౌందర్య దృష్టి సారింపంగన్
అయబెట్లుండును లోక
రిప్లయితొలగించండిత్రయముల పాలించువాడు దయగలవాడున్
నయనానందముగా కువ
లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
శంకరాభరణం సమస్య:“లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ”
రిప్లయితొలగించండిపూరణ:
నయమున నలువయె సృజనము
అయ గా పోషణ భరమును నా విష్ణుండే
పయనము చివరన నిహనము
లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
కడయింటికృష్ణమూర్తి...గోవా..25-8-22
ప్రియముగ జీవులనెల్లర
రిప్లయితొలగించండిదయతో రక్షించును హరి, తనకృత్యంబౌ
లయమొనరించుట నిరతము
లయకారుఁడు సేయ సృష్టి లావణ్యంబౌ
లయబద్ధముగా నాట్యము
రిప్లయితొలగించండిలయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ”
నియమానుసారముగవిధి
స్వయముగ యొనరించుచుండజగములవెల్లన్
మరొక పూరణ
రిప్లయితొలగించండినయముగ భక్తులనెల్లను
దయతో రక్షించగ హరి ధరణీతలమున్
లయకార్యంబును క్రమముగ
లయకారుఁడు సేయ, సృష్టి లావణ్యంబౌ”
👏
తొలగించండికందం
రిప్లయితొలగించండినియతిన్ దనకా సృష్టి
క్రియ సహకారమ్మొసంగు ప్రియసతిఁ గమలా
లయుడెంచి, తమికొనఁగఁ బా
లయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌ!
మత్తేభవిక్రీడితము
నియతిన్ దోడొకరుండ మేలనుచుఁ దా నేర్పెంచి సృష్టిక్రియన్
నయమౌ నైపుణి రంగరించి యరవిందాక్షిన్ బ్రవాళాధరన్
ప్రియమారన్ సతిఁగాగొనన్ నలువయే, వీక్షింప శ్రీశుండు పా
లయకారుం డొ, నరింప సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తం బగున్!
నయగారపు నగజ సుతుని
రిప్లయితొలగించండిదయలేకయె సంహరించి తదనంతరమున్
ప్రియమార కుంజరముఖుని
లయకారుడు సేయసృష్టి లావణ్యంబౌ
వ్యయమైనట్టి ప్రపంచమున్ మరల నవ్యాజంపు బ్రేమమ్మునన్
నయగారంబున సృష్టిజేసె నరునిన్ నారీమణిన్
జంటగా
హయమున్ సింహము నేన్గులన్ మృగములన్
హంసాదులన్ పక్షులన్
స్వయమున్ దానెయె తండ్రియై జనని శ్రీశర్వాణి సాహాయమున్
లయకారుం డొనరింప సృష్టిని గడున్ లావణ్యయుక్తం బగున్
ప్రియ జనకుఁడు శ్రీనాథుఁ డ
రిప్లయితొలగించండిభయప్రదుఁ డొసంగ మహిమ ప్రావీణ్యముతో
నియతి నలువ, సమయింపఁగ
లయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌ
ప్రియ మారంగ సురక్షణం బొసఁగు నా విష్ణుండు లోకవ్రజ
క్షయకారుండు శివుండు ముక్తి నిడు బ్రచ్ఛన్నుండునై చక్కఁగన్
దయ వీక్షించి ధరా చ రాచర సమస్త ప్రాణి నిత్యస్థి రా
లయ కారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్య యుక్తం బగున్
ప్రియమున్ కూర్చుచు గౌరి గంగలకు నావిశ్వేశ్వ రుండౌ గదా
రిప్లయితొలగించండినియతిన్చేయుచు నుండుగా నలువతానీ విశ్వమం దెల్లరన్
దయతో భక్తజనాళినెల్ల గనుచా దామోద రుండుండగా.
*లయకారుండొ,నరింప సృష్టిని గడున్ లావణ్య యుక్తంబగున్*
+917382563308. భమిడిపాటి కాళిదాసు.
రిప్లయితొలగించండికం.
వ్రాయుచు కర్మఫలంబుల
పూయుచు సుఖశాంతులవని పుణ్యాత్ములకున్!
డాయుచు తన భక్తాళుల,
లయకారుడు సేయు సృష్టి లావణ్యంబౌ!!
రిప్లయితొలగించండి+917382563308. భమిడిపాటి కాళిదాసు.
క్రియయున్ గర్తయు కర్మలెవ్వరనినన్ కేదార నాథుండెగా,
నయమున్ పెంపును నాశనంబు లెనగా నాగాంతకున్ లీలలే!
జయహానంబులు సత్ఫలంబులవనిన్ సర్వేశు సత్క్రీడలే,
లయకారుండొనరింప సృష్టిని గఁడున్ లావణ్య యుక్తంబుగన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభయ భీతిన్ సహజంబుగా గలుగులే బాధల్ భువీబుట్టుకన్
రిప్లయితొలగించండిపయనంబే జరుగున్ సదా నొసట యా పద్మోద్భవున్ రేఖలన్
నయగారంబున పద్ధతిన్ హరియు నీ-నా లేక పోషించులే
ప్రియమారంగను మూడుమూర్తులు బహున్ బ్రీతిన్ గనంగా పరన్
లయకారుండొనరింప, సృష్టినిఁ గడున్ లావణ్యయుక్తంబగున్!!
+917382563308. భమిడిపాటి కాళిదాసు.
రిప్లయితొలగించండికం.
నవవరుడా వధువునుగని,
జవరాలా! రమ్మిటంచు సైగను సేయన్!
శివశివ తెలవారెనుగద,
రవి కనువిప్పెడి తఱినిటు రమ్మన దగునా!!
+917382563308. భమిడిపాటి కాళిదాసు.
రిప్లయితొలగించండిశశిధరుడా విధాతయును సాచియు నచ్యుతు డెల్ల వేల్పులున్!
వశులుగనుండి గాచెగద బాలకుఁ గశ్యపు నందనాత్మజున్!
నశము శరీరమంచతడు నమ్మెను శ్రీహరి పాదపద్మముల్!
శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుగుల్!!