16, నవంబర్ 2022, బుధవారం

సమస్య - 4251

17-11-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని వృత్రుండు మ్రింగెరా జనులు గనన్”
(లేదా...)
“రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా యంచు శ్లాఘింపఁగన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

14 కామెంట్‌లు:

  1. కందం
    శ్రీమహిమాన్విత'త్వష్ట' మ
    హామఖమొనరించనందు నావిర్భవమై
    శ్రీమంతుని సురపతి సు
    త్రాముని వృత్రుండు మ్రింగెరా జనులుగనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      శ్రీమత్త్వష్ట యొనర్చు యజ్ఞమహిమన్ శీఘ్రంబె జన్మించి,సు
      త్రామున్ వృత్రుఁడు మ్రింగె;శూరులౌరా!యంచు శ్లాఘింపగన్
      శ్రీమద్విష్ణు సుమంత్ర శక్తి గరిమన్ ఛేదించి తత్కుక్షి నే
      క్షేమంబొప్పగ వచ్చి వజ్రధరుఁడై చెండాడె నారక్కసున్.

      తొలగించండి
  2. దీమసముగజనకుని సుత
    యేమహితాత్మునకుపత్ని ?యెవ్వండవనిన్
    సోమపతినిఁ దా మ్రింగెను?
    రాముని, వృత్రుండు మ్రింగెరా జనులు గనన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    హోమ జనితుండు త్వష్టకుఁ
    దా మన్ననఁ జూపు కతన దండెత్తి పగన్
    భీమ బలుండనఁగన్ సు
    త్రాముని వృత్రుండు మ్రింగెరా జనులు గనన్

    శార్దూలవిక్రీడితము
    తామర్దించెను విశ్వరూపుననుచున్ దండింపగా నింద్రునిన్
    హోమంబందున నంది త్వష్ట సుతునిన్ యుద్రిక్తతన్ బూన్చినన్
    భీముండైరణభూమి జొచ్చి పగతో విధ్వంసమేపార సు
    త్రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా! యంచు శ్లాఘింపఁగన్!

    రిప్లయితొలగించండి

  4. రాముడు సద్గుణ శీలుడు
    భీముండే భండనమున వీరుడు శూరుం
    డాముని జనవంద్యుం డే
    రాముని వృత్రుండు మ్రింగెరా జనులు గనన్?


    నీమూర్ఖత్వము మానవైతివికదా నీచాత్ములౌ మిత్రులే
    యేమేమో వచియింపగా వినుచు నీవీరీతినిన్ బల్కుటే
    క్షేమంబయ్యది కాదు మెచ్చడెవడున్ శ్రీరామునిన్ దూర నే
    రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా యంచు శ్లాఘింపఁగన్?

    రిప్లయితొలగించండి
  5. శా.

    వ్యామోహమ్ము సదా సురాధిపతికిన్ స్వర్గాన సౌఖ్యంబులున్
    మోమోటమ్ము విడెన్, మురారి వరమున్ మోదంబు వజ్రాయుధం
    బే, మోచేయి దుగన్ దళించ నరచెన్, భీతిల్లె జేజేలు, సు
    *త్రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా యంచు శ్లాఘింపఁగన్*.

    రిప్లయితొలగించండి
  6. కామాంధుడు లంకేశుడు
    రాముని వృత్రుండు ; మ్రింగెరా జనులు గనన్
    బాము గనబడిన కప్పను ,
    బామమె కారణమెపుడును ప్రాణుల నడుమన్

    రిప్లయితొలగించండి
  7. శ్రీమన్నారాయణుడే
    ప్రామాణికుడై తెలుపగ వజ్రాయుధుడై
    ధీమా తోఁ దెరలిన సు
    త్రాముని వృత్రుండు మ్రింగెరా జనులు గనన్

    రిప్లయితొలగించండి
  8. హోమమువలనజనించిన
    యామనుజాశనుడు కనలి యావేశముతో
    భీమబలంబున నాసు
    త్రాముని వృత్రుండు మింగెరా జనులు గనన్

    రిప్లయితొలగించండి
  9. కామతురు డై యొక్కడు
    భామల వెంటన్ బడుచును బంతము తోడన్
    దామసుడగు వానిని పో
    రాముని వృత్రుండు మ్రింగె రా జనులు గనన్

    రిప్లయితొలగించండి
  10. ఆమర్షమ్మున విశ్వరూపునల నుగ్గాడంగ, నుగ్రాక్షుడై
    యామేషాండు జయించ, త్వష్ట కసితో నావిర్భమున్ జేయగా
    భీమమ్మైన బలమ్మునన్ దివములో విక్రాంతినిన్ జూపి సు
    త్రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా యంచు శ్లాఘింపఁగన్

    రిప్లయితొలగించండి
  11. భీమాకారుఁడు రావణుఁ
    డా మను జాశనుఁడు నద్దశాననుఁ డత్యం
    తామానుషమ్ము ధర్మము
    రాముని వృత్రుండు మ్రింగెరా జనులు గనన్
    [ వృత్రుఁడు = శత్రువు]

    క్షేమం బిచ్చిన విశ్వ రూపు ద్విజు సత్కీర్తిన్ వెసం జంపఁగా
    నామర్షమ్మునఁ ద్వష్ట జన్మ నిడఁగా నా పుత్ర శ్రేష్ఠుండు త
    ద్ధీమంతున్ సుర నాథు వజ్రధరునిన్ దేవేంద్రు నా పుష్క రా
    రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా యంచు శ్లాఘింపఁగన్

    రిప్లయితొలగించండి