13, మార్చి 2025, గురువారం

సమస్య - 5061

14-3-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్”
(లేదా...)
“హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్”

25 కామెంట్‌లు:

  1. వరములనిచ్చెడు వేలుపు
    హరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్
    గిరిరాజ తనయ, యిరువురి
    నిరవుగ పూజింపనిత్తురిహపర సుఖముల్

    రిప్లయితొలగించండి
  2. ధరకార్ముకుడగు గంగా
    ధరుడైన పినాకపాణి త్ర్యక్షుడతండే
    స్మరుడా వలరాయుని సం
    హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్.


    గరళమ్మయ్యది కంఠమందుగల పింగాక్షుండు భద్రేశుడా
    కరిచర్మాంబరధారి కూటకృతు డుగ్రాక్షుండతండే కదా
    సురపూజ్యుండగుచున్ జెలంగు భవుడా సూనాస్త్రుడా మార సం
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్.

    రిప్లయితొలగించండి
  3. కరిముఖుడు దనివి నొందుచు
    పరమపదము సంగడముకు వడివడి జేరన్
    వరుసకు మాతులగ దలచు
    హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్

    రిప్లయితొలగించండి
  4. శరజన్మునకంబ యనగ
    పరమేశ్వరి శైలపుత్రి భర్గుని సతియే
    సురసుందరి మన్మథ సం
    హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్

    శరఘాతంబులతోడ నుప్పతిలగా స్వాంతమ్ములో ప్రేమ శం
    కరుడే పొందెను గౌరినే వధువుగా కందర్పుడే గెల్వగా
    శరజన్ముండను వేల్పు కంబ యనగా శర్వాణి కందర్ప సం
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ కరుణఁ గని సంపదలొసఁగు
    హరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్
    శిరసా నమస్కరించఁగ
    వరదాయని బ్రహ్మవిద్య భవమును బాపున్

    మ॥ వరదానంబిడి సంపదల్ గనుచు సద్భాగ్యంపు సంధాత్రియౌ
    హరికిం బట్టపురాణి, విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్
    గరుణన్ గాంచుచు సర్వదా ముదముతోఁ గాత్యాయణీ మాతయే!
    శిరమున్ వంచి నమస్కరించఁ దగు సుశ్రేయంబుతో నొప్పఁగన్

    రిప్లయితొలగించండి
  6. స్థిరమై పట్టెను పంతమంత శివునిన్ శీఘ్రమ్ము పెండ్లాడగన్
    వరమున్ బొందెను సేసి ఘోర తపమున్ ఫాలాక్షు మెప్పొందగన్
    మురిసెన్ దేహమనందు భాగమిడగన్ పుష్పాస్త్ర శోభాతనూ
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్!!

    రిప్లయితొలగించండి
  7. పరమానందము గూర్చు హైమవతి సంభావింప సద్భక్తితో
    పురుహూతిన్ భజియింప భక్తతతికిన్ పుణ్యమ్ములేదక్కు తా
    కరుణన్ దీర్చును కామితమ్ములను సంకాశమ్ముగా భావజా
    “హరికిం బట్టపురాణి, విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్”

    రిప్లయితొలగించండి
  8. కం:మురిపెముగ జూడ భార్యను
    పరిపరి విధములుగ నిన్ను బాగు పరచ దే?
    మురిసిన వేళల వాణియె,
    హరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్”
    (భార్యని సరిగా చూసుకుంటే ఆమె లక్ష్మియే,సరస్వతే,విఘ్నేశుని తల్లి ఐన పార్వతి యే.)

    రిప్లయితొలగించండి
  9. సురనారీమణి యా శచీరమణి మేల్ స్తోత్రమ్ములన్ సల్పగాఁ
    గరము ల్మోడ్చి విరించిపత్ని నతులన్ గావింప శర్వాణికిన్
    గరుణం ౙూపుౘు శంభు నాలి, తన ప్రక్క న్నిల్వ శోభాకృతిన్
    హరికింబట్టపురాణి, విఘ్నపతి కమ్మై ప్రోౘు లోకమ్ములన్ ॥

    రిప్లయితొలగించండి
  10. కందం
    మురిపెమున స్నాన మాడగ
    హరిద్రమును బొమ్మఁజేసి యాయువు పోయన్
    కరిముఖమిడిన నఘపు బే
    హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్

    మత్తేభవిక్రీడితము
    మురిపెమ్మెంచి హరిద్రమున్ మలచియున్ బోయంగఁ ప్రాణమ్ము, సం
    చరపున్ గాపరియౌచు నిల్పెనని శీర్షమ్మున్ విఖండింపఁగన్
    బరితాపించ గజాననంబిడిన కణ్వాలెల్ల లెక్కించు బే
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్

    రిప్లయితొలగించండి
  11. మ:వరముల్ తల్లులె జీవకోటి కెపుడున్ వాత్సల్యమున్ జూపుచున్
    స్మరియుంచున్ దన బిడ్డ సేమము,సిరిన్,శక్తిన్ సదా సిద్ధినిన్
    సరియౌ దృష్టిని జూడ జీవతతికిన్ సామీప్యమం దుండియే
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్”

    రిప్లయితొలగించండి
  12. తిరముగ గొలువగ గాచున్
    హరి పత్ని యె ::విఘ్న విభు న కమై ప్రోచున్
    నిరతము నిశ్చ ల భక్తిన్
    కరములు జోడించి మ్రొ క్క కరుణా మయి గా

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్!

    మత్తేభము:

    సిరికిం జెప్పక పర్వుతో కరిని రక్షింపన్ హరే బూనెగా
    అరుగంగా యరి మూకలన్ దునుమ యా యంబే రణంబేగగన్
    హరికిం బట్టపురాణి, విఘ్నపతి కమ్మై, ప్రోచు లోకమ్ములన్!
    మురిపెంబున్ సిరి, వాణి గౌరి మువురే ముల్లోకముల్ గాతురే
    దరికిం జేరరె భక్తినమ్మిగొలువన్ దాసానులై దైవముల్

    రిప్లయితొలగించండి
  14. హరి హరునకు బాణం బయి
    పురత్రయ వినాశ హేతు భూతుం డయ్యెన్
    నర విఘ్న విలయమునకై
    హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్

    [అమ్ము+ఐ = అమ్మై]


    సిరులం గుర్యుచుఁ దా దరిద్రమును నిశ్శేషంబుగాఁ బాపుచుం
    దరుణీ రత్నము వాపి మానవుల సంతాపమ్ము ఖండింపఁగా
    వర భక్తవ్రజ నాశ హేతు వగు నా పాపారి వర్గమ్మునున్
    హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్

    [అమ్ము+ఐ = అమ్మై]

    రిప్లయితొలగించండి
  15. ఒక వ్యాకరణ విశేషము గమనార్హ మిక్కడ. సమస్యాపాదముల లోని “అమ్మై” పదమునకు నమ్మ యను నర్థమును గ్రహింప వీలు పడదు. అట్లు గ్రహింప వలె నన్న నది “అమ్మయై” యని యుండవలెను. అత్తున కిక్కడ సంధి లేదు కనుక.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కరుణను వేడ సిరు లిడును
    హరి పత్నియె; విఘ్న విభున కమ్మై ప్రోచున్
    గిరి రాజు తనయ సతతము
    హరు మేనున సగముగానె యలరుచు నిల్చెన్

    రిప్లయితొలగించండి
  17. సిరులనుకురిపించుజనని
    *“హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్”*
    గిరిరాట్సుతతాననయము
    హరునకుసతిగా జగతిని హర్షము నింపున్


    .సిరులన్ బంచుగవచ్చునమ్మయునుతాచిత్తమ్మునందున్ సదా
    కరుణన్ చూపుచు నుండుతల్లియననీకాంతామణేయండ్రుతా
    *“హరికిం బట్టపురాణి, విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్”*
    కరిచర్మాంబరధారికిన్ సతిగ తాకాపాడులోకంబులన్

    రిప్లయితొలగించండి