కం:అర్ధము దెలిసియు దెలియని యర్ధ విదుల వివరణమున హాస్యాస్పద మై యర్ధాంగీ ! నా వ్రాసిన అర్ధాంగీ కృతియె సభను వ్యర్థంబయ్యెన్” (అర్ధ విదులు=సగం సగం తెలిసిన వాళ్లు.ఈ కవి గారు అర్ధాంగీ అనే పేరుతో శతకమో కావ్యమో రాస్తే అర్ధం తెలిసీ తెలియని విశ్లేషకుల చేతిలో పడి అది వ్యర్ధ మైంది.)
శా:అర్ధాంగీ! వరలక్ష్మి! నీ త్రిశతి నే నాధ్యాత్మికావేశ,ని స్వార్ధప్రేమల వ్రాసినాడ ,నట నా భావమ్ము లేవేవియో అర్ధమ్మే గ్రహియించు వారి కెరుకా?ఆ తెల్వి నీ స్వంత మౌ, అర్ధాంగీకృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై” (విశ్వనాథ వారు మరణించిన భార్య స్మృతి లో వరలక్ష్మి త్రిశతి అనే కావ్యం రచించారు.దాన్ని ఆయన ఒక వేదిక పై చదివి తిరిగి అసంతృప్తి చెందినట్లు..వీళ్లంతా అర్ధాలు గ్రహించే పండితులు కానీ నా భావాలని గ్రహించగల తెలివి అర్ధాంగి వైన నీ ఒక్కదానికే ఉంది.ఆ సభలో నేను చదవటం కూడా వృధా అయిందే అని బాధ పడినట్లు కల్పన.ఇక్కడ విశ్వనాథ వారి భావవ్యక్తీకరణ పంథాలో,చమత్కృతి తో,శైలి లో వ్రాసే ప్రయత్నం లో ఎంత నెగ్గానో చెప్ప లేను.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశా.
రిప్లయితొలగించండిస్వర్ధామాస్పద సత్సుధా సదృశ మత్సంగీత మాధుర్యమున్
నిర్ధారించెను విద్వదాళి గరిమన్, నేనిచ్ఛతో పోతి నీ
వార్ధక్యంబున, నాస్తికుండు సని నే పాడంగ దండించె, రు
ద్రార్ధాంగీ కృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభా వేదిపై !
రిప్లయితొలగించండిఅర్థము నిచ్చును రాజని
స్వార్థము తో వ్రాసి కృతిని పఠియింపంగన్
వ్యర్థంబనెగద భూపతి
యర్ధాంగీ! కృతియె సభను వ్యర్థంబయ్యెన్.
అర్థంబిచ్చుచు మెచ్చు రాజనుచు నీవాశించి నావంచు నే
నర్థంబించుక లేని కావ్యమును నీవందమ్ముగా చెప్పగా
స్వార్థంబందున వ్రాయనేమి ఫలమే స్కంబుండు తాదూరగా
నర్ధాంగీ! కృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై.
స్పర్ధల నికపై నాపగ
రిప్లయితొలగించండినిర్ధారించి యొక సభను నెరవేర్చంగా
స్పర్ధాళువులట జూపిన
యర్ధాంగీకృతియె సభను వ్యర్థంబయ్యెన్
దుర్దర్షము మౌనంబగు
రిప్లయితొలగించండినర్ధాంగీకృతి యటంచు వ్యాఖ్యానముతో
నిర్ధారించిరి కొందరు
అర్ధాంగీ!కృతియె సభను వ్యర్థంబయ్యెన్
వ్యర్థారోపణ చేయువారి యెడలన్ స్పందింపకే నిల్చినన్
వ్యర్థంబాయెను స్థైర్యమే ప్రముఖులౌ వ్యాఖ్యాతలే మౌనమౌ
నర్ధాంగీకృత మంచు పల్కిరిగదా హాస్యంబు జోడించుచున్
అర్ధాంగీ! కృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై
కం:అర్ధము దెలిసియు దెలియని
రిప్లయితొలగించండియర్ధ విదుల వివరణమున హాస్యాస్పద మై
యర్ధాంగీ ! నా వ్రాసిన
అర్ధాంగీ కృతియె సభను వ్యర్థంబయ్యెన్”
(అర్ధ విదులు=సగం సగం తెలిసిన వాళ్లు.ఈ కవి గారు అర్ధాంగీ అనే పేరుతో శతకమో కావ్యమో రాస్తే అర్ధం తెలిసీ తెలియని విశ్లేషకుల చేతిలో పడి అది వ్యర్ధ మైంది.)
కం॥ వార్ధక్యమ్మున నెంచుచు
రిప్లయితొలగించండినిర్ధారించఁగ రచించ నెమ్మిని కవితల్
స్పర్ధను విడక నటులహో
అర్ధాంగీకృతియె సభను వ్యర్థంబయ్యెన్
శా॥ వార్థక్యమ్మున వ్రాయనెంచి యటులభ్యాసంపు నాధారతన్
స్పర్థన్ బూని గ్రహించి సూక్ష్మమును సద్భాగ్యమ్ముగా నెంచుచున్
నిర్ధారించుచుఁ గావ్య వస్తువు సదా నేమమ్ముతోఁ గూర్చఁగా
నర్ధాంగీ! కృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై
అర్థము గాని పదముల ని
రిప్లయితొలగించండిర ర్థ కముగ వాడి కవులు రచనలు సేయన్
వ్య ర్థ ము గా వచ్చి తి మని రి
యర్థాంగీ కృతి యె సభను వ్యర్థం బయ్యె న్
శా:అర్ధాంగీ! వరలక్ష్మి! నీ త్రిశతి నే నాధ్యాత్మికావేశ,ని
రిప్లయితొలగించండిస్వార్ధప్రేమల వ్రాసినాడ ,నట నా భావమ్ము లేవేవియో
అర్ధమ్మే గ్రహియించు వారి కెరుకా?ఆ తెల్వి నీ స్వంత మౌ,
అర్ధాంగీకృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై”
(విశ్వనాథ వారు మరణించిన భార్య స్మృతి లో వరలక్ష్మి త్రిశతి అనే కావ్యం రచించారు.దాన్ని ఆయన ఒక వేదిక పై చదివి తిరిగి అసంతృప్తి చెందినట్లు..వీళ్లంతా అర్ధాలు గ్రహించే పండితులు కానీ నా భావాలని గ్రహించగల తెలివి అర్ధాంగి వైన నీ ఒక్కదానికే ఉంది.ఆ సభలో నేను చదవటం కూడా వృధా అయిందే అని బాధ పడినట్లు కల్పన.ఇక్కడ విశ్వనాథ వారి భావవ్యక్తీకరణ పంథాలో,చమత్కృతి తో,శైలి లో వ్రాసే ప్రయత్నం లో ఎంత నెగ్గానో చెప్ప లేను.)
దుర్ధర్షుండు కదల్చుచు
రిప్లయితొలగించండిమూర్ధమ్ము నటు నిటు నడ్డముగ నట రేగన్
స్పర్ధ సభాపతి కాదన
నర్ధాంగీకృతియె సభను వ్యర్థం బయ్యెన్
స్పర్ధాదగ్ధ మనో వికారు జన రక్షా దక్షు సుజ్ఞాన మం
తర్ధానం బయి యుంట నొక్క క్రతు సన్నాహమ్ముఁ గావించుచో
నర్ధాంగ స్థిత భార్యుఁ డధ్వరము నందర్హుండ నాఁ దర్క మం
దర్ధాంగీకృతి వ్యర్థ మయ్యెను గదా యావత్సభావేదిపై
వార్ధక్యమ్మున కష్టముల్ సయిచి నేఁ వ్రాయంగనీ కావ్యమున్
రిప్లయితొలగించండిస్పర్ధన్ బూని మనంబునందునఁ గవుల్ పారమ్యమౌ సత్కృతిన్
వ్యర్థంబంచిటు గేలిపెట్టుదురె దుర్వ్యాపారులై వారలో
యర్ధాంగీ! కృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై
స్పర్ధను బూని మనమున ని
రిప్లయితొలగించండిరర్ధకమని నాదు కృతిని రట్టడి జేయన్
గార్ధభమొక్కఁడు దలఁచెను
యర్ధాంగీ! కృతియె సభను వ్యర్థంబయ్యెన్
అర్థంబొప్పగ వ్రాసితేనుమదిలో నాశించుచున్ పైకమున్
రిప్లయితొలగించండిస్వార్థమ్మూనినరేడుతానిడినయా బాసన్వడిన్ న్దప్పుచున్
అర్థంబున్నొసగంగనిచ్ఛపడకన్నాకావ్యమున్ ద్రోసెగా
అర్ధాంగీకృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై”*
కందం
రిప్లయితొలగించండిదుర్ధర్షుండనెడు కవియె
స్పర్ధన్ 'తిలకాష్టమహిషబంధన' ముల నా
మార్థాననోడె కవి గ్రం
థార్ధాంగీకృతియె సభను వ్యర్థంబయ్యెన్
శార్దూలవిక్రీడితము
దుర్ధర్షుండనటంచు పండితులు నాతో తూగ లేరంచనన్
స్పర్ధన్ తా 'తిలకాష్ట బంధనము' తో సంధించి గ్రంథంపు నా
మార్థంబెంచియె రామలింగ కవి తానంపంగ, నుద్దండు గ్రం
థార్ధాంగీకృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేది పై!
స్వార్ధంబించుకలేనివాడవుగదా!వారింపలేదెందుకో
రిప్లయితొలగించండిస్పర్ధాళుండగురాజరాజుదగుదుస్సాహం బుభావించియున్
స్వార్ధంబౌనని నీతిబాహ్యమనియుజెప్పంబూ నకన్మౌనియై
నర్ధాంగీకృతి వ్యర్థమయ్యెను గదా యావత్సభావేదిపై
కొరుప్రోలు రాధాకృష్ణ రావు