23, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5222

24-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె”

(లేదా...)

“దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే”

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఇంద్రపూజను మానియునింపుమీర
    జరుపమంచు గోవర్ధన గిరికటంచు
    బాలకృష్ణుఁడు దెలుపరాన్ భక్త హృదయ
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె!

    ఉత్పలమాల
    ముంగిట వెన్నదొంగలొగి ముచ్చటలాడుచు బాలకృష్ణ స
    త్సంగమనంగ గోగిరికి సల్పగ పూజలు పిల్వవచ్చినన్
    జెంగట దివ్యమూర్తిఁగని సేవలు జేయఁగ, శౌరిఁ దోడుగన్
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే!

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    చెంగట భూరి శౌర్యమయ చిత్త విశిష్టులు దోర్బలాఢ్యులై
    సింగములౌచు విక్రమము చిచ్చుర చందము జూపు నెప్డు వా
    రింగని రక్షణంబుకయి రిక్కల కాలము నింటి నుంచ నీ
    దొంగల గాంచి సంతసముతో దలుపుల్ తెరిచెన్ గృహస్థుడే !

    రిప్లయితొలగించండి

  3. వాడు సామాన్యుడా? కాదు వాస్తవమున
    హరియె నందునింటను బుట్టె నంచు విశ్వ
    సించెడి యొక గొల్లడటకున్ జేరు దధిజ
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె.


    సంగడి కారులన్ గొనుచు శ్యామిక వేళను నందనందుడే
    చెంగట నున్న పర్పములజేరుచు చోరిక జేయు వానినే
    సంగడటంచు నమ్మి వృధసానుడటన్ సరజమ్ము దోచెడిన్
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే.

    రిప్లయితొలగించండి
  4. పురమునందు దొంగతనము పొదలు చుండ
    నెందరో రక్షకుల నెంచి యేర్పరచగ
    ప్రహరి కాచువాని పొడన వచ్చినట్టి
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    రిప్లయితొలగించండి
  5. వెన్నదొంగిలించిన కొంటె పిల్లవాడు
    చీరలెత్తుకు పోయిన చిన్నవాడు
    గొల్లపిల్లల మనసులు కొల్లగొట్టు
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    రిప్లయితొలగించండి
  6. దొంగిలె గొల్ల కన్నియల దుస్తులు దొంగిలె వారి యుల్లముల్
    దొంగిలె గోపబాలకులతో నడయాడుచు వెన్నమీగడల్
    దొంగిలఁ బోయె యాదవుఁడు దుగ్ధము గోపులు తోడురాఁగ నా
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే

    రిప్లయితొలగించండి
  7. అందమొలికించు దేవకీ నందనుండు
    ప్రేమ హృదయాల నెలకొన్న వెన్నదొంగ
    చోరు డేతెంచి నాడనుచు నవనీత
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    దొంగల చేష్టలన్ గనె సుదూరము నున్న నిఘా విభాగమే
    చెంగట నున్నవారలకు చేర్చగ వార్తను తత్క్షణంబునే
    రంగము నందు కాలిడిన రక్షక సేనకు చిక్కి బద్ధులౌ
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే

    రిప్లయితొలగించండి
  8. వెన్న మీగడ పెరుగుల బ్రీతి తోడ
    మిత్ర బృందము తో తాను మెస వు కొఱకు
    గొల్ల యిండ్లకు జనియును గొల్ల గొట్టు
    తస్క రు o గాంచి గృహ మేది తలుపు దె ర చె

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:"కృష్ణు డెటు బోయె వెన్న కై గృహము వీడి?"
    యనుచు నందుడు వెదకి వేసారె తుదకు
    నిలువ నింటి ముందుగ కన్నని నవనీత
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె”

    రిప్లయితొలగించండి
  10. ఉ:దొంగల బట్టి సంతసము తో వచియించె భటుండు నేను వీ
    రిన్ గనుచుండ నట్ట నడి రేయి రహస్యపు జూపు తోడ నీ
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే
    దొంగల సొమ్ములన్ గొనెడు దుష్టుడు వాడని నాకు దోచెడిన్.
    (దొంగలని చూసి ఆ గృహస్థుడు రహస్యం గా తలుపు తీసాడు.వాడు దొంగ సొమ్ము కొనే వాడేమో అనిపించింది అని పోలీస్ అన్నాడు.దొంగ సొమ్ము కొనే వాడు కూడా నేరస్థుడే.)

    రిప్లయితొలగించండి
  11. తే॥ ఊరి జనుల దోఁచి పరఁగ నుచ్చు బిగియ
    రక్షక భటులు వ్యూహపు రచనఁ జేసి
    జనుల జాగరూకులఁ జేయ నొనరుఁ గాను
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    ఉ॥ భంగముఁ జేసి సౌఖ్యమును బాధలు వెట్టుచు దోఁచు చుండఁగన్
    రంగము పట్టి తస్కరుల రక్షణఁ బొంద నమర్చి రెల్లరున్
    జెంగున గోడ దూకుచును జేతుల నూపుచు వచ్చు చుండెడిన్
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే

    రిప్లయితొలగించండి
  12. భక్తి తోడ దిన దినము ముక్తి నెంచి
    యాచరించు విధమ్మున హర్ష మెసఁగ
    వందనమ్ము లొసఁగ వేగ భాస్కరు జల
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె


    దొంగలు నేఁడు నేర్పరులు తోరము వెంచిరి నైపుణమ్మునే
    దొంగతనమ్ము నందుఁ గడు దుష్టులు జంకరు చంప నేరినిన్
    దొంగల యం దొకండు మును దూఱి స భద్రము వేచి చూచుచున్
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే

    [గృహస్థుఁడు = గృహ మందు నున్న వాఁడు]

    రిప్లయితొలగించండి
  13. గొల్ల బాలల కెల్లను కూర్మి పంచి
    గిరిని పైకెత్తి లీలగా కేలు తోడ
    పాలు పెరుగుల తోడను పడతుల మది
    ,*"తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె”*

    సంగడికాండ్రతోడనటసందడిచేయుచు బాలకృష్ణుడే
    ముంగిట చేరియుట్టిపయి మూతనుపెట్టిన వెన్ననెల్లయున్
    మ్రింగగ నెంచివేగనట క్రీడగ మిత్రులతోడరాగనా
    *“దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే”*


    రిప్లయితొలగించండి
  14. సంగడి కాండ్ల గూడియును జానల
    నల్లరి పాలొనర్చు వా
    డంగన లెల్లగూడికొలనందున
    స్నానము జేయువేళ తా
    బొంగుచు వచ్చి కోకలను మోహన
    కృష్ణుడు మ్రుచ్చిలించు నా
    దొంగలగాంచి సంతసముతో తల
    పుల్ దెరచెన్ గృహస్థుడే .

    రిప్లయితొలగించండి