8, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5207

9-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్”

(లేదా...)

“కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్”

19 కామెంట్‌లు:

  1. వెన్నునతగనని జడయనె
    చెన్నుగ వ్రేలాడెగాదె చెదిరిన జుట్టున్
    వన్నెల చెవులే లేవుగ
    కన్నెకు జూడంగ నేడు కన్నులు దోచెన్

    రిప్లయితొలగించండి

  2. వెన్నెల నీను శశాంకుని
    కన్నను సుందరుడ వంచు కాంచంగనె నీ
    చెన్నగు రూపము నచ్చట
    కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్.


    అన్యులపట్ట నెప్పుడు నహమ్మును చూపెడి యింతి మెచ్చెనే
    ధన్యుడవోయి మిత్రమ నితంబిని నిన్ గని నంత జూడుమా
    మాన్యులు చెప్పు రీతిగను మానిని కన్నులు కాంతులీనుచున్
    గన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    దన్నౌ లక్షల జీతము
    ఖిన్నమువడ మ్రింగె మేధ కృత్రిమ రీతిన్
    మున్నెన్నడు లేనట్లుగ
    కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్!

    ఉత్పలమాల
    అన్యుల మాటయే వినక యందెడు లక్షల జీతమొక్కటే
    ధన్యత జీవనమ్మునకు ధైర్యమునీయగ విర్రవీగ, కా
    ర్పణ్యము గొల్ప మేధయె నుపాధిని మ్రింగగ కృత్రిమంబుగన్
    కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్!

    రిప్లయితొలగించండి
  4. సూన్యము గల్గె నంత తన
    సూపును బూర్తిగ గోలిపోవగన్
    మాన్యుల పుణ్య తీర్థముల మానక
    తిర్గెను జేసె పూజ లా
    పుణ్య ఫలంబుచేత దన పూర్వపు
    దృష్టి లభించె జక్కగా
    కన్యకు నేడు , గన్నులవె కన్పడు
    చున్నవి చిత్రమౌ గతిన్.

    రిప్లయితొలగించండి
  5. అన్నులమిన్నకు దైవము
    కన్నులఁజీకటి పొరలను కలుగఁగ జేసెన్
    పన్నుగ వైద్యము సలుపఁగ
    కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్

    రిప్లయితొలగించండి
  6. కన్య పదారు పాయమున కన్నులు కానగరాక బెగ్గిలన్
    మాన్యుడొకండు జాలిపడి మానవతన్ ప్రకటించి చూపునన్
    శూన్యము నుత్తరించ పరిశోధన జేసి కృతార్థుడయ్యె నా
    కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్

    రిప్లయితొలగించండి
  7. చిన్ని ముడులతో పలుపును
    దున్న మెడకు కట్టీ పశుల దొడ్డిన నుంచన్ 
    తిన్నగ శోధించుచు నా
    కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్

    రిప్లయితొలగించండి
  8. ఉ.
    ధన్యత నొంది పుణ్యములు ధారుణ పండెను దివ్య లోకమం
    దన్యుల పోలు కాక చన హాటక వేదిని వార్ధిజాతయౌ
    కన్యకు రెండు, వేధసతి కాంచగ రెండును మూడు గ్రాహరా
    ట్కన్యకు, నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌ గతిన్ !

    రిప్లయితొలగించండి
  9. మన్నిక కలిగిన శిలయని
    కన్నెగఁ జెక్కెనొక శిల్పి కన్నుల యెదుటన్
    వన్నెలొలుకు కడు చక్కని
    కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్

    దైన్యముతో చెలంగు శిల ధన్యత నొందెను శిల్పి చేతిలో
    మాన్యుడు శిల్పకారుడట మల్చెను రాతిని మత్స్యకన్యగా
    నన్యులు చూచుచుండ నది యద్భుతమై తగు రీతిఁ బూర్తియై
    కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్

    రిప్లయితొలగించండి
  10. ఎన్నడు లేని వి ధ మ్ము గ
    కన్నెకు జూడంగ నేడు కన్నులు దోచె న్
    వెన్నుని సృష్టి యె కాదిది
    చెన్ను గ రూ పొంది నట్టి చేష్ట యె కదరా!

    రిప్లయితొలగించండి
  11. దుష్యంతుని చూచిన వెంటనే శకుంతల స్పందన అండి

    కం॥ మిన్నగ వనమున వర్థిలె
    నెన్నడు పురమలఁ గనకనె యెలమిని బ్రదికెన్
    దిన్నగ రాజునుఁ గాంచఁగఁ
    గన్నెకుఁ జూడంగ నేఁడు కన్నులు దోఁచెన్

    ఉ॥ అన్యులఁ గాంచ లేదెపుడు హాయిని జీవన మొప్పెనచ్చటన్
    వన్య మృగమ్ములే సఖులు భామిని కెప్పుడు నాశ్రమమ్మునన్
    మాన్యునిఁ జూచినంతఁ దన మానస వీణయె మ్రోగి మత్తునన్
    గన్యకు నేఁడు కన్నులవె కన్పడు చున్నవి చిత్రమౌగతిన్

    మరొక పూరణ
    (ఒక నారీమణి కొన్ని సం॥ క్రితం బహుశః 2022లోననుకుంటాను తప్పత్రాగి ఇంటిదారి మరచి వేరే దారిలో కారు నడిపి లాల్ బాగ్ వద్ద ఒకరిని గుద్ది చంపింది., బెంగుళూరులో)

    ఉ॥ ధన్యతఁ జెందు జీవితము త్రాగుచుఁ దూగుచు సంచరించఁగన్
    మాన్యతఁ దెచ్చు సంఘమున మన్నన నొందుట తథ్యమంచునో
    జన్యు పరమ్పరాగతమొ సంపద గర్వమొ మాధ్విఁ గ్రోలఁగన్
    గన్యకు నేఁడు కన్నులవె కన్పడు చున్నవి చిత్రమౌగతిన్

    మాధ్వి మద్యము (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  12. కం:సన్నని నవ్వులు కల్గెను
    చిన్నగ నును సిగ్గు వ్రాలె చెంపల పైనన్
    నన్నే వరునిగ జూచెడు
    కన్నెకుఁ, జూడంగ నేడు కన్నులుదోఁచెన్
    (నేడు=ఈ నాదు.తనని పెళ్లి చూపులలో అమ్మాయి అలా చూడగా ఈతని కన్నులు దోచుకొన్నాయి.)

    రిప్లయితొలగించండి
  13. ఉ:అన్యుని ప్రేమ గొప్ప దని యమ్మను,నాన్నను కాలదన్ని, యే
    మాన్యత లేని వాని దన మానస మందున గొల్వ, వాని మా
    లిన్యము నేడు కన్ బడెను లెక్కను మించగ బాధ లన్ని యా
    కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్”
    (అమ్మ,నాన్నలని కాదని ఒక నీచుణ్ని వివాహ మాడి వాడి తో బాధలు పడుతుంటే నేడు ఆమెకు కళ్లు కనిపిస్తున్నాయి.అనగా కను విప్పు కలిగింది.)

    రిప్లయితొలగించండి
  14. మిన్నున విహరించు సతం
    బెన్నదు మది నేరి నేని యెల్ల ధనమ్ముల్
    సన్నన్ గర్వాంధకు నా
    కన్నెకుఁ జూడంగ నేఁడు కన్నులు దోఁచెన్


    ధన్యత నందె నట్లు వనితామణి భారత యుద్ధ పాత రా
    జన్యులఁ గాంచ నొక్క పరి సద్గుణ రాశికి సంతతప్రజా
    మాన్యకు వ్యాస దత్త వర మాయను సౌబలి కిద్ధ వంశ రా
    ట్కన్యకు నేఁడు కన్ను లవె కన్పడుచున్నవి చిత్రమౌ గతిన్

    రిప్లయితొలగించండి
  15. అన్యులు చూసి చెప్పుదురె యామని శోభయు సుందరంబు, నే
    డన్యులుఁజెప్ప, యామని బడాయిని చూడగ, యాస పుట్టెనే !
    ధన్యత చెంద, చిక్కె మరి దానపు కన్నులమర్చ చిత్రమే
    “కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్”

    రిప్లయితొలగించండి
  16. చిన్నని పూసలు కట్టగ
    *“కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోఁచెన్”*
    తిన్నగ పొలమున కేగగ
    దున్నుట విడి చూచి రెల్లతోషము తోడన్


    మన్యము నందు సాగుతరి మంటలు చిమ్మిన వెంటనే యటన్
    కన్యయు నన్నతోడనట గారము చేయుచు సాగుచుండగా
    కన్యకు నిప్పురవ్వలవి కన్నుల చిందగ దాని సాయమున్
    కన్యకు నేడు కన్నులవె కన్పడుచున్నవి చిత్రమౌగతిన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఎన్నో కన్నులు గలిగిన
    వన్నెల చీరను ధరించి వనితయె రాగా
    కన్నుల పండుగ యయ్యెను
    కన్నెకుఁ జూడంగ నేడు కన్నులు దోచెన్.

    రిప్లయితొలగించండి