ఆ.వె:లలన నడక లోని లాలిత్యమును జూప క్లిష్ట మైన ప్రాస కిష్ట మేల? సులభ మైన ప్రాస కలుపుము,క్లిష్టమౌ ప్రాస లేక కందపద్య మలరు” (లలిత మైన భావం తెలిపెటప్పుడు పద్య శైలి కూడా లలితం గా ఉండాలి.అక్కడ అనవసరం గా క్లిష్ట ప్రాస వేసుకుంటే అది శుష్కపాండిత్యం అవుతుంది.)
ఉ:ప్రాసల క్లిష్టతన్ బరపి ప్రాశ్నికు లేవొ సమస్య లీయ నా ప్రాసల గూర్చ దప్పవిక పాట్లు వధానము నందు క్లిష్టమౌ ప్రాసల నేల యాశువున బట్టుచు నుందువు? క్లిష్ట మైన యా ప్రాసఁ దొఱంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్” (అవధానం లో క్లిష్ట ప్రాసల తో సమస్య ఇస్తే దాన్ని తీర్చే పాట్లు నీ కెలాగూ తప్పవు కానీ ఆశువులలో కూడా క్లిష్టప్రాసలు దేనికి వేసుకుంటావు? ఆ క్లిష్టప్రాసలు వేసుకోక చిన్న కందపద్యాలలో చెప్ప వచ్చు కదా!)
ఆటవెలది
రిప్లయితొలగించండిచిన్ని పాదములకు సిరిమువ్వ లొప్పార
బాలకృష్ణు నడక పరమ ప్రియము!
చిందువేయనటులె 'చంధమొప్పని భంగి
ప్రాస లేక' కందపద్య మలరు!
ఉత్పలమాల
భాసిలె నందగోకులము పర్వులు వెట్టగ బాలకృష్ణుఁడున్
వాసిగ చిన్ని పాదముల వర్తిలు నాదముమువ్వలాడగన్
బాసను చంధమొప్పగను భావము సెల్లగ, దోస పూర్ణమౌ
ప్రాస దొరంగి, కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్
పద్యమునకు ప్రాస ప్రాణమై విలసిల్లు
రిప్లయితొలగించండిప్రాసలేని నాడు వచన మగును
కందమదియె జూడ సుందరమందురు
ప్రాస లేక కందపద్య మలరు?
బాసకు ప్రాణమైనిలుచు పద్యముదీనికి కట్టుమట్టులే
వాసియటంచు చెప్పుటది వాస్తవమేకద, వృత్తమున్ యతుల్
ప్రాసలు నుండనొప్పునని ప్రాజ్ఞులు చెప్పిరి యట్టు కానిచో
ప్రాస దొరంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్?
కొత్తగ పదములను గూర్చి కందము వ్రాయ
రిప్లయితొలగించండిమదిని దలచె నొకడు మనసు పడుచు ,
ప్రాస కుదరకున్న పరిగణించె నిటుల
ప్రాస లేక కందపద్య మలరు
ఉ.
రిప్లయితొలగించండివాసిగ పోతనార్యుని విభామయ భాగవతంబులోన నే
భాసిలిభేంద్ర ఘట్టమున పద్దెములందు మునింగి చక్కగా
బాసను కొంత నేర్పు గొని వ్రాసితి కందము దుష్కరాక్షర
ప్రాస దొరంగి, కందమున పద్యము వ్రాసిన మెత్తురెల్లరున్ !
ప్రాస ప్రాణ మగుచు పరి ఢ విల్లు చు నుండ కంద పద్య మగును కమ్మ నగుచు
రిప్లయితొలగించండిపద్య మల్లు కవియు పాటింప క నెటు ల
ప్రాస లేక కంద పద్య మలరు?
మనసుదోచునట్టి మాకందమందురే
రిప్లయితొలగించండికవివరేణ్యులెపుదు సవివరముగ
ఛందమొప్పనట్టి శాస్త్ర విరుద్ధమౌ
ప్రాస లేక కందపద్య మలరు
భాసిలు కందమెన్నడును భావ సమర్పిత సాధనంబుగా
వ్రాసిరి పండితోత్తములు రమ్యముగా మకరంద మందగా
ప్రాసము కచ్చితంబనిరి ప్రాజ్ఞులు శాస్త్ర విరుద్ధమైనదౌ
ప్రాస దొరంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్
వ్రాసిన కంద పద్యమున బ్రాసయె గూర్చును సౌష్ఠవమ్మునా
రిప్లయితొలగించండిప్రాసయె శబ్దమాధురుల రంజిలజేయుచు మానసమ్మునున్
భాసిలజేయు నందమగు పద్యము కందము సావరమ్మునౌ
ప్రాస దొరంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్
కందపద్యమునకు నందము ప్రాసయే
రిప్లయితొలగించండిశబ్దమాధురులను సంతరించు
చక్కని గతి తోడ సాగుచు దుష్టమౌ
ప్రాస లేక కందపద్య మలరు
ఆ.వె:లలన నడక లోని లాలిత్యమును జూప
రిప్లయితొలగించండిక్లిష్ట మైన ప్రాస కిష్ట మేల?
సులభ మైన ప్రాస కలుపుము,క్లిష్టమౌ
ప్రాస లేక కందపద్య మలరు”
(లలిత మైన భావం తెలిపెటప్పుడు పద్య శైలి కూడా లలితం గా ఉండాలి.అక్కడ అనవసరం గా క్లిష్ట ప్రాస వేసుకుంటే అది శుష్కపాండిత్యం అవుతుంది.)
ఆటవెలది మాత్రము వ్యంగ్యంగానండి
రిప్లయితొలగించండిఆ॥ ఉప్పు లేని కూర యొప్పును రుచులకు
పప్పు లేని పులుసు బలము నొసఁగు
విద్య రాని వాఁడు విజ్ఞుడు ధరణినిఁ
బ్రాస లేని కందపద్య మలరు
ఉ॥ దోసము లేని భాషఁ గని తోషము నొందుచుఁ దీర్చి దిద్దుచున్
సేసలఁ జల్ల దైవమటు శ్రేయముఁ గూర్చఁగ మానవాళికిన్
బూసిన భక్తి భావమునఁ బోతన వోలెను నిండుగా నను
ప్రాసఁ దొఱంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్
ఉ:ప్రాసల క్లిష్టతన్ బరపి ప్రాశ్నికు లేవొ సమస్య లీయ నా
రిప్లయితొలగించండిప్రాసల గూర్చ దప్పవిక పాట్లు వధానము నందు క్లిష్టమౌ
ప్రాసల నేల యాశువున బట్టుచు నుందువు? క్లిష్ట మైన యా
ప్రాసఁ దొఱంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తురెల్లరున్”
(అవధానం లో క్లిష్ట ప్రాసల తో సమస్య ఇస్తే దాన్ని తీర్చే పాట్లు నీ కెలాగూ తప్పవు కానీ ఆశువులలో కూడా క్లిష్టప్రాసలు దేనికి వేసుకుంటావు? ఆ క్లిష్టప్రాసలు వేసుకోక చిన్న కందపద్యాలలో చెప్ప వచ్చు కదా!)
వేద్యము గద వృత్త పద్యము గాకున్న
రిప్లయితొలగించండినెల్ల కవుల కుర్వి నిద్ధ చరిత
పాద పాద మందు వాదింపకు గళిత
ప్రాస లేక కంద పద్య మలరు
వాసికి నెక్కితిం గవన పాటవ మందుఁ గరమ్ము నంచహో
ప్రాసఁ దొఱంగి కందమునఁ బద్యము వ్రాసిన నేరు మెత్తురే
భాసుర లీలఁ దోఁపఁ బ్రతి పాదము నందు మనోహరమ్ముగాఁ
బ్రాస దొరంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తు రెల్లరున్
[తొఱఁగు = విడుచు ; తొరఁగు = ప్రవహించు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రాణ సమము ప్రాస పద్యమునకెపుడు
ప్రాస లేక కందపద్య మలరు
ననెడు మాట వినగ నచ్చెరువొందితి
కందమునకు ప్రాస యందమిడును.