13-8-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా”
(లేదా...)
“కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా”
మ.కలిత ప్రస్ఫురదాభ వైభవ సముత్కళ్యాణ యజ్ఞావళి స్థలియై, మౌనులు పాదధూళులను సంధానింప దివ్యంబుగా వెలిగెన్ భారత భూమి శాంతి వనమై, విధ్వంసముల్ రేపు మూకలతో వైరము తప్పదా మనకు సౌఖ్య ప్రాప్తికిన్ మిత్రమా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'సముత్కళ్యాణ' ?
అత్యంత శుభమయమైన యజ్ఞావళి అనే అర్థంతో "సముత్కళ్యాణ" అని వాడాను గురువు గారు 🙏🏻.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కురుక్షేత్రం సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ వ్యంగ్యముగా అర్జునునితో.. కందంవిలువీడుచు బంధువులనికలవరపడి మోహమొంది కాదన రణమున్గొలువందుదె? సకులుల మూకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా?మత్తేభవిక్రీడితముతలుపుల్ మూయుచు సంధికిన్ జెలఁగగన్ దాయాదులున్ యుద్ధమైపిలువన్ సాదిగ వచ్చితిన్, గెలువగన్ వేంచేసి మోహంబుతోవిలువీడన్ గొలువందుదే? సుఖమె నిర్వృత్తిన్ మనన్? దాయ మూకలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
వలదింద్రోత్సవమనిరనియలకను బూనుచు నిడుజడి యటకురిపింపన్ కలుచను బూనరె యదుమూ కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా.బరవంతుండ్రగు పాండుపుత్రులను సంభావింపకన్ మూర్ఖుడై కలనున్ గోరె సుయోధనుండచట నా కంసారియే చెప్పినన్ ఖలురౌ మిత్రులమాయలో మునిగె యుగ్రంపశ్యులౌ శత్రుమూ కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా.
మలమే భోజనమో మరేమి తినునో మాటల్ వివాదంబులౌపులిసెన్ వానికి, మత్తు జార మిగులున్ మున్నీరు కన్నీరుగన్!గెలుకన్ జావరె బుద్ధి హీనులిక! పాకిస్తాను కల్ముచ్చు మూ కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!!మున్నీరు = అసిం మున్నీరు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చెలిమి చెడె వారి నడుమనపొలమున కధిపతి యెవరని పోటీ పడగన్నెలవున జరిగెడు యీ యెనికలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఎన్నిక'ను 'ఎనిక' అనవచ్చునా అని సందేహం.
శబ్దరత్నాకరము చెపుతోంది 🙏
వలపులు రేపిన తలపులుకలతలు రేపిన తదుపరి కటుతర మగునాచెలిమిని విడనాడు కుశంకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడానిలువన్ జాలను నిన్నుచూడ కనుచున్ నిత్యంబు వాక్రుచ్చుచున్వలపుల్ రేపి వివాహమాడి పిదపన్ వంచించుటే న్యాయమాకలతల్ రేపుచు నుంటివేల పొగరా! కాకుండినన్ నీ కుశంకలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
కం॥ ఇలలో సంపదలఁ బడయవలయుననెడి తపన విరిసి భాగ్యముఁ గనఁగన్దలఁపఁగ మనుజాళికి రూకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడామ॥ కలతల్ హెచ్చెను సంపదల్ గనఁగ సౌకర్యమ్మదే సౌఖ్యమైయిలలో నాసక్తిఁ గాంచి మానవులు నేఁడీరీతిఁ పోటీ పడన్వలయున్ మిక్కిలి వస్తు సంచయపు సౌభాగ్యమ్మటంచొప్పి రూకలతో వైరము తప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా! వైరము literal గా కాకుండా figurative గా తీసుకోవాలండి. నేడిది నడుస్తున్న చరిత్ర. సౌకర్యానికి సౌఖ్యానికి తేడా యిప్పుడు లేదండి
హలపై బెర్గుచునుండె హింస లతిగానత్యంత వేగంబునన్ఖలులున్ జాతిమతాంధ మూర్ఖలవియున్గావించు చున్నార లాపలుగాకుల్ వడి యంతమొందువరకున్బాటించగా గడ్సు మూకలతో వైరము తప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
కం:చెలిమికి వెంపర లాడగఖలునకు హృదయము కరుగునె కాఠిన్యమ్మేఫలమిడు ,పాక్ తో నెయ్యపుకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
కం॥ ఇలలో సంపదలఁ బడయవలయుననెడి తపన విరిసి భాగ్యముఁ గనఁగన్దలఁపఁగ మనుజాళికి రూకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడామ॥ కలతల్ హెచ్చెను సంపదల్ గనఁగ సౌకర్యమ్మదే సౌఖ్యమైయిలలోఁ గాంచుచు మోహమున్ జనులు నేఁడీరీతిఁ పోటీ పడన్వలయున్ మిక్కిలి వస్తు సంచయపు సౌభాగ్యమ్మటంచిట్లు రూకలతో వైరము తప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!కంది శంకరయ్య గారు సూచించిన పిదప వృత్తము 2వ పాదములో గణదోషము సవరించి యండి
మ:చెలిమిన్ జూపుచు "బాంధవాళి" మనుచున్ జేరంగ వీ రెల్ల, మిత్రులు నీ యింటికి రాగనే వెరతు రెంతో, వీర లే ప్రొద్దు చుట్టల వెల్గించెడు కంపు జూడ మొగమాటమ్మేల ? నీ చుట్ట పీ కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా”(వీళ్ల మిత్రుడి యింటికి చుట్టా లొచ్చారు.వాళ్ల చుట్టల కంపు చూస్తే ఆ యింటికి స్నేహితులు రావటానికే భయ పడుతున్నారు.సుఖం గా ఉండా లంటే ఆ చుట్ట పీకలతో వైరం పెట్టుకోక తప్పదల్లే ఉంది అని.అంటే వాళ్కని వదిలించుకోవా లని.)
సమస్య:కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!మత్తేభము :చెలిమోమున్ గనవేలరా నరుడ నా చెంతన్ పరాకేలరా !మలిసంజన్ జన నెంతువే మరులకున్ మారుండవై నిల్చియే !కలనైనన్ లభియించదే సురత సౌఖ్యంబేను, నీ రాక పో కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!!(వరూధినీ ప్రవరాఖ్య)
పలువురు విమతులు రణమున సులువుగ గెలువంగ జూడ చోద్య ము గాదా నిలువ గ మన మి య్యె డ మూ కల తో వైరమ్ము దప్ప గలదా స ఖు డా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందము: ఇల రాజకీయమందున నిలబడి ప్రజ కొరకు నెంత నీతిగ నుండన్ కలహిం "చెడు" రౌడీ మూ కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుడా!---గోలి.
వలదీ పంతము తన తప్పుల నొప్పుకొని పరిహారమునకై యాతం డలవోక నొసంగిన రూకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా ఖలులే నేతలు గాఁగ దేశమునఁ దర్కంబేలనో మానసమ్ముల దూరం బగు శాంతి యెల్లరకు సంపూర్ణమ్ము సంసార మిక్కలి కాలమ్మున నెండమావి యగు వీఁకన్ దోచు పల్దొంగ మూఁకలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పలు విషయములందున మేమలఘులమంచును తలచుచు ననవరతము వారలు దాయాదులనెడి శంకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా.ఖలు దుర్యోధను డెంత దుర్మతియొ దుష్కార్యమ్ము లెన్నెన్నియోసలిపెన్ గాదె కనంగ బాండవుల లక్షావేశ్మమున్ గాల్చ మేగలసేసెన్ సతి కృష్ణ భంగపరచెన్ గాదందువే యిట్టి వంకలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా.
ఉలుకును పలుకును లేకిటులలుకవహించఁగ తగునొకొ యన్యాయముగావిలువగు చెలిమి నిలువ రూకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
కలలోనైన తలంపనైతి నిటు నిర్ఘాతమ్ము వోలెన్ ననున్వెలి వేయందగునే నిరంతరము నీవే నా విధేయజ్ఞుగాతలబోయన్, ధనమే ప్రధానమగునా? దస్యుండనా నీకు? రూకలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా
పలు నూళ్లన్ నడుగంగ లేదు సగమౌ భాగంబునే గోరుచున్ కొలువున్ శ్రీహరి బందిసేయ సబబే కోరంగ బంధమ్మునే సులువే కాదుగ జ్ఞాతులే కపటులై చూపింప స్వార్ధంబు, మూ కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.బలవంతముగా ద్రౌపదిఁకొలువుకు లాగుకొని వచ్చి కుటిలపు మతులైవలువలు లాగిన కురుమూకలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుడా!
మ.
రిప్లయితొలగించండికలిత ప్రస్ఫురదాభ వైభవ సముత్కళ్యాణ యజ్ఞావళి
స్థలియై, మౌనులు పాదధూళులను సంధానింప దివ్యంబుగా
వెలిగెన్ భారత భూమి శాంతి వనమై, విధ్వంసముల్ రేపు మూ
కలతో వైరము తప్పదా మనకు సౌఖ్య ప్రాప్తికిన్ మిత్రమా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'సముత్కళ్యాణ' ?
అత్యంత శుభమయమైన యజ్ఞావళి అనే అర్థంతో "సముత్కళ్యాణ" అని వాడాను గురువు గారు 🙏🏻.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికురుక్షేత్రం సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ వ్యంగ్యముగా అర్జునునితో..
తొలగించండికందం
విలువీడుచు బంధువులని
కలవరపడి మోహమొంది కాదన రణమున్
గొలువందుదె? సకులుల మూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా?
మత్తేభవిక్రీడితము
తలుపుల్ మూయుచు సంధికిన్ జెలఁగగన్ దాయాదులున్ యుద్ధమై
పిలువన్ సాదిగ వచ్చితిన్, గెలువగన్ వేంచేసి మోహంబుతో
విలువీడన్ గొలువందుదే? సుఖమె నిర్వృత్తిన్ మనన్? దాయ మూ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
రిప్లయితొలగించండివలదింద్రోత్సవమనిరని
యలకను బూనుచు నిడుజడి యటకురిపింపన్
కలుచను బూనరె యదుమూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా.
బరవంతుండ్రగు పాండుపుత్రులను సంభావింపకన్ మూర్ఖుడై
కలనున్ గోరె సుయోధనుండచట నా కంసారియే చెప్పినన్
ఖలురౌ మిత్రులమాయలో మునిగె యుగ్రంపశ్యులౌ శత్రుమూ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా.
మలమే భోజనమో మరేమి తినునో మాటల్ వివాదంబులౌ
రిప్లయితొలగించండిపులిసెన్ వానికి, మత్తు జార మిగులున్ మున్నీరు కన్నీరుగన్!
గెలుకన్ జావరె బుద్ధి హీనులిక! పాకిస్తాను కల్ముచ్చు మూ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!!
మున్నీరు = అసిం మున్నీరు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచెలిమి చెడె వారి నడుమన
రిప్లయితొలగించండిపొలమున కధిపతి యెవరని పోటీ పడగన్
నెలవున జరిగెడు యీ యెని
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎన్నిక'ను 'ఎనిక' అనవచ్చునా అని సందేహం.
శబ్దరత్నాకరము చెపుతోంది 🙏
తొలగించండివలపులు రేపిన తలపులు
రిప్లయితొలగించండికలతలు రేపిన తదుపరి కటుతర మగునా
చెలిమిని విడనాడు కుశం
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
నిలువన్ జాలను నిన్నుచూడ కనుచున్ నిత్యంబు వాక్రుచ్చుచున్
వలపుల్ రేపి వివాహమాడి పిదపన్ వంచించుటే న్యాయమా
కలతల్ రేపుచు నుంటివేల పొగరా! కాకుండినన్ నీ కుశం
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికం॥ ఇలలో సంపదలఁ బడయ
రిప్లయితొలగించండివలయుననెడి తపన విరిసి భాగ్యముఁ గనఁగన్
దలఁపఁగ మనుజాళికి రూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
మ॥ కలతల్ హెచ్చెను సంపదల్ గనఁగ సౌకర్యమ్మదే సౌఖ్యమై
యిలలో నాసక్తిఁ గాంచి మానవులు నేఁడీరీతిఁ పోటీ పడన్
వలయున్ మిక్కిలి వస్తు సంచయపు సౌభాగ్యమ్మటంచొప్పి రూ
కలతో వైరము తప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
వైరము literal గా కాకుండా figurative గా తీసుకోవాలండి. నేడిది నడుస్తున్న చరిత్ర. సౌకర్యానికి సౌఖ్యానికి తేడా యిప్పుడు లేదండి
హలపై బెర్గుచునుండె హింస లతిగా
రిప్లయితొలగించండినత్యంత వేగంబునన్
ఖలులున్ జాతిమతాంధ మూర్ఖలవియున్
గావించు చున్నార లా
పలుగాకుల్ వడి యంతమొందువరకున్
బాటించగా గడ్సు మూ
కలతో వైరము తప్పదా మనకు సౌఖ్య
ప్రాప్తికిన్ మిత్రమా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:చెలిమికి వెంపర లాడగ
రిప్లయితొలగించండిఖలునకు హృదయము కరుగునె కాఠిన్యమ్మే
ఫలమిడు ,పాక్ తో నెయ్యపు
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
కం॥ ఇలలో సంపదలఁ బడయ
రిప్లయితొలగించండివలయుననెడి తపన విరిసి భాగ్యముఁ గనఁగన్
దలఁపఁగ మనుజాళికి రూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
మ॥ కలతల్ హెచ్చెను సంపదల్ గనఁగ సౌకర్యమ్మదే సౌఖ్యమై
యిలలోఁ గాంచుచు మోహమున్ జనులు నేఁడీరీతిఁ పోటీ పడన్
వలయున్ మిక్కిలి వస్తు సంచయపు సౌభాగ్యమ్మటంచిట్లు రూ
కలతో వైరము తప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
కంది శంకరయ్య గారు సూచించిన పిదప వృత్తము 2వ పాదములో గణదోషము సవరించి యండి
మ:చెలిమిన్ జూపుచు "బాంధవాళి" మనుచున్ జేరంగ వీ రెల్ల, మి
రిప్లయితొలగించండిత్రులు నీ యింటికి రాగనే వెరతు రెంతో, వీర లే ప్రొద్దు చు
ట్టల వెల్గించెడు కంపు జూడ మొగమాటమ్మేల ? నీ చుట్ట పీ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా”
(వీళ్ల మిత్రుడి యింటికి చుట్టా లొచ్చారు.వాళ్ల చుట్టల కంపు చూస్తే ఆ యింటికి స్నేహితులు రావటానికే భయ పడుతున్నారు.సుఖం గా ఉండా లంటే ఆ చుట్ట పీకలతో వైరం పెట్టుకోక తప్పదల్లే ఉంది అని.అంటే వాళ్కని వదిలించుకోవా లని.)
సమస్య:
రిప్లయితొలగించండికలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
మత్తేభము :
చెలిమోమున్ గనవేలరా నరుడ నా చెంతన్ పరాకేలరా !
మలిసంజన్ జన నెంతువే మరులకున్ మారుండవై నిల్చియే !
కలనైనన్ లభియించదే సురత సౌఖ్యంబేను, నీ రాక పో
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!!
(వరూధినీ ప్రవరాఖ్య)
పలువురు విమతులు రణమున
రిప్లయితొలగించండిసులువుగ గెలువంగ జూడ చోద్య ము గాదా
నిలువ గ మన మి య్యె డ మూ
కల తో వైరమ్ము దప్ప గలదా స ఖు డా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందము:
రిప్లయితొలగించండిఇల రాజకీయమందున
నిలబడి ప్రజ కొరకు నెంత నీతిగ నుండన్
కలహిం "చెడు" రౌడీ మూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుడా!
---గోలి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలదీ పంతము తన త
రిప్లయితొలగించండిప్పుల నొప్పుకొని పరిహారమునకై యాతం
డలవోక నొసంగిన రూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
ఖలులే నేతలు గాఁగ దేశమునఁ దర్కంబేలనో మానస
మ్ముల దూరం బగు శాంతి యెల్లరకు సంపూర్ణమ్ము సంసార మి
క్కలి కాలమ్మున నెండమావి యగు వీఁకన్ దోచు పల్దొంగ మూఁ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపలు విషయములందున మే
మలఘులమంచును తలచుచు ననవరతము వా
రలు దాయాదులనెడి శం
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా.
ఖలు దుర్యోధను డెంత దుర్మతియొ దుష్కార్యమ్ము లెన్నెన్నియో
సలిపెన్ గాదె కనంగ బాండవుల లక్షావేశ్మమున్ గాల్చ మే
గలసేసెన్ సతి కృష్ణ భంగపరచెన్ గాదందువే యిట్టి వం
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా.
ఉలుకును పలుకును లేకిటు
రిప్లయితొలగించండిలలుకవహించఁగ తగునొకొ యన్యాయముగా
విలువగు చెలిమి నిలువ రూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలలోనైన తలంపనైతి నిటు నిర్ఘాతమ్ము వోలెన్ ననున్
రిప్లయితొలగించండివెలి వేయందగునే నిరంతరము నీవే నా విధేయజ్ఞుగా
తలబోయన్, ధనమే ప్రధానమగునా? దస్యుండనా నీకు? రూ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలు నూళ్లన్ నడుగంగ లేదు సగమౌ భాగంబునే గోరుచున్
రిప్లయితొలగించండికొలువున్ శ్రీహరి బందిసేయ సబబే కోరంగ బంధమ్మునే
సులువే కాదుగ జ్ఞాతులే కపటులై చూపింప స్వార్ధంబు, మూ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బలవంతముగా ద్రౌపదిఁ
కొలువుకు లాగుకొని వచ్చి కుటిలపు మతులై
వలువలు లాగిన కురుమూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుడా!