నీమముతోడ భక్తిమెయి నిర్మితి చేసియు రామమందిరం బీమహి రామదాసు నతి పేర్మిని పూజలు చేయువానిన్ ప్రామిడి పాదుషా యతని బంధిగ జేసియు హింసపెట్టె శ్రీ రాముని గొల్చినంత కవి రాజుకు కన్పడె రాక్షసుండహో
కం:రాముని ధర్మాత్ము డనుచు ప్రేమగ తా రామకథను విరచించ,సుతుం డే మెచ్చె రావణుని, హా! రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్” (రామాయణం రాసిన కవి గారికి రావణుణ్ని మెచ్చే కొడుకు పుట్టాడు. ఆయన రాక్షసుణ్ని కన్నాడు.)
ఉ:రామకథన్ రచించి తన రాముని భక్తిని చాట బోవ, నా రాముడు శూద్రశంబుకుని ప్రాణము దీసెడు కాండ దల్చగా రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో రాముని లోన! రామకథ వ్రాసెడు యత్నము మానె నంతటన్. (రాముడు ధర్మాత్ము డని రామాయణం వ్రాయ బోయిన ఒక కవికి ఉత్తరకాండ లో తపస్సు చేస్తున్న శంబుకుణ్ని రాముడు సంహరించిన కథ మెదిలి రాముని లో రాక్షసత్వం కనిపించి రామాయణ రచన మాని వేసాడు.ఈ మధ్య చాలా మంది కవులు రామాయణాలు వ్రాసారు.నేను రాయక పోవటానికి ఈ శంబుక వృత్తాంతం ఒక కారణం.)
ఉ.
రిప్లయితొలగించండిరామకథామృత ప్రబల రావణ వైభవ వర్ణనంబులన్
రోమచయంబునం బులకలుట్టి పడెం జదువంగ కొంటెగా
వే మది లంక తాఁ గనగ వెర్రితనంబున లంకిణీ పురా
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభాగవత కావ్యారంభములో పోతన(రాముని సేవించిన కవి) ఉపపాండవ వధ తదనంతరం ఘట్టములో భీముని లో నావేశించిన రాక్షసుని చూశాడను భావముతో...
రిప్లయితొలగించండికందం
నీమములేవియు నెంచక
ధామమ్మునఁ గృష్ణ సుతుల ద్రౌణియె చంపన్
భీమునినావేశింపగ
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్!
ఉత్పలమాల
నీమము లన్నియున్ విడచి నీచము నెంచక కృష్ణ సూనులన్
ధామము నందు దూరి యతి దారుణ రీతిని ద్రౌణి చంపగన్
భీముని మానసంబునను భీకర రీతిని నావహింపగన్
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినీమముతోడ భక్తిమెయి నిర్మితి
చేసియు రామమందిరం
బీమహి రామదాసు నతి పేర్మిని
పూజలు చేయువానిన్
ప్రామిడి పాదుషా యతని బంధిగ
జేసియు హింసపెట్టె శ్రీ
రాముని గొల్చినంత కవి రాజుకు
కన్పడె రాక్షసుండహో
రిప్లయితొలగించండి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం చివర గణభంగం. సవరించండి.
రిప్లయితొలగించండికాముకుడగు రావణుడను
భీమరమున ద్రుంచనెంచి భీకర రూపం
బామహనీయుడు దాల్చగ
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్.
రాముని దివ్యగాథనట వ్రాయుచు నుండెడి వేళయందునన్
గాముకు డైన రావణుని కావర మాచగ భీకరాకృతిన్
భీమరమందు దాల్చె రఘు వీరుడటంచును తెల్పు నత్తరిన్
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో.
భామ కుజను విడిపించిన
రిప్లయితొలగించండిరాముని సేవించిన కవి , రాక్షసునిఁ గనెన్
బామము తోడ నాతనినొక
కామము నిండిన యతనిగ గణుతించెనుగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "తోడ"లో 'డ' తీస్తే సరి.
🙏
తొలగించండిరాముడు పంపగ పయనం
రిప్లయితొలగించండిబై మారుతి కనినమోము పౌలస్త్యునిదే
భూమిజ జాడ దొరుకునా
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్!
రాముడు సీత జాడఁగని రమ్మని పంపెను గాలిచూలినే
భూమిజ జాడకై వెదుక ముందుగ కన్పడె దీవిరాయడే
శేముషి వజ్రకంఠునికి శీఘ్రమె జానకి జాడ చిక్కునా?
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి(ఈకాలం రాక్షసులమయమయ్యింది. నేను భూమికి దిగిరాలేను. రాక్షసులను గుర్తించేందుకు నమూనాకొకని చూపుతున్నాను అని రాముడొక రాక్షసుని చూపించాడు అని అండి)
రిప్లయితొలగించండికం॥ ధామము దనుజుల కిదియని
క్షేమము వారలఁ గనుఁగొన శ్రేయముఁ గల్గున్
నీమమిదె యని యెరుగుటకొ
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్
ఉ॥ ఏమని తెల్పఁగన్ వలయు నీధర యందున రక్షనొందఁగన్
రామునిఁ దల్చఁ జాలదని రాక్షసు నెంచుచు దూరముంచఁగన్
క్షేమమటంచు నేర్పుటకొ! శ్రేయము భక్తుఁడుఁ గాంచ చూపెనో!
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో
కం:రాముని ధర్మాత్ము డనుచు
రిప్లయితొలగించండిప్రేమగ తా రామకథను విరచించ,సుతుం
డే మెచ్చె రావణుని, హా!
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్”
(రామాయణం రాసిన కవి గారికి రావణుణ్ని మెచ్చే కొడుకు పుట్టాడు. ఆయన రాక్షసుణ్ని కన్నాడు.)
కామితములు దీ రె ననీయె
రిప్లయితొలగించండిరాముని సేవించిన కవి :: రాక్షసుని గనె న్
కోమలి జానకి బిక్షను
తా ముని కిడ గను జూచి తా న య్యె డ లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో గణభంగం. సవరించండి.
చివరి పాదంలో తా మునికి నిడగను జూచి యని సవరణ చేయడమైనది
తొలగించండిఉ:రామకథన్ రచించి తన రాముని భక్తిని చాట బోవ, నా
రిప్లయితొలగించండిరాముడు శూద్రశంబుకుని ప్రాణము దీసెడు కాండ దల్చగా
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో
రాముని లోన! రామకథ వ్రాసెడు యత్నము మానె నంతటన్.
(రాముడు ధర్మాత్ము డని రామాయణం వ్రాయ బోయిన ఒక కవికి ఉత్తరకాండ లో తపస్సు చేస్తున్న శంబుకుణ్ని రాముడు సంహరించిన కథ మెదిలి రాముని లో రాక్షసత్వం కనిపించి రామాయణ రచన మాని వేసాడు.ఈ మధ్య చాలా మంది కవులు రామాయణాలు వ్రాసారు.నేను రాయక పోవటానికి ఈ శంబుక వృత్తాంతం ఒక కారణం.)
భీమ పరాక్రము లంకా
రిప్లయితొలగించండిధాముని దర్శించి భవ్య ధారా సరణిన్
స్తోమము పఠించి వంచిత
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్
[కనెన్ = బిడ్డను గనెను]
ఏమని చెప్ప నేర్తు విధి యీ విధి నెంచినఁ గాంచి యే పరం
ధాముఁడు దిక్కు నీ కని యదల్చుచు నత్తఱి రాక్షసేంద్రు నా
రామము నందు నిర్భయ మరాతినిఁ గొల్తువె నీ వటంచునున్
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుం డయో
[పాఠాంతరము: రామునిఁ గొల్చినట్టి కవిరాజున కాసురుఁ డయ్యొ కన్పడెన్]
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి(పురాణేతిహాస పాత్రలను వక్రీకర్తిస్తూ సినిమాలు తీయడం ఎక్కువయింది)
రిప్లయితొలగించండితామసబుద్ధి గల్గునొక దర్శకుఁ డెంతొ వ్యయమ్మొనర్చి ప్రే
మామృతమూర్తి రామకథ నాతని బుద్ధికిఁ దోఁచినట్లుగా
నేమియొ కల్పనమ్ముల ననేకముఁ జేర్చుచుఁ దీయఁ జిత్రమున్
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుం డయో!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
క్షేమంబొనగూడును శ్రీ
రాముని సేవించిన; కవి రాక్షసునిఁ గనెన్
కామితము తీరనందున
నీమమును మరచి చరించ నిద్దురలోనన్.