26-8-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”
(లేదా...)
“వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్”
కందంశీఘ్రమె వనంబు దాటగజిఘ్రుడు పరుగున నడచుచు చేరి, మలుపు నందాఘ్రాణించుచు దూకఁగవ్యాఘ్రంబొక జింకనుఁ గని, పాఱె భయమునన్ఉత్పలమాలవ్యాఘ్రభయంబునన్ జనుఁడు బాటను దప్పక జాగరూకతన్శీఘ్రమె దాట నయ్యడవిఁ జేరుచు సాగెడు వేళ మల్పునన్జిఘ్రుడు భీతితో నిలచి చేష్టలు మాని క్షణంబు, దూకగన్వ్యాఘ్రమొకండు జింకఁ గని, పాఱె భయంబునఁ దా వడంకుచున్
శీఘ్రముగ నడచు చుండగ అంఘ్రికడ నొక శిలినిగని యడుగు తడబడన్ శీఘ్రముగ గెంటుట గనగవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
వ్యాఘ్రాసనమే వ్యాఘ్రమువ్యాఘ్రమనగ పిల్లి యనుచు భావన తోడన్ వ్యాఘ్రేయము గ్రోలి పలికెవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్.వ్యాఘ్రము గాంచినన్ సకల ప్రాణులు భీతిలి పారు గాదుటే శీఘ్రగతిన్ నిజమ్మిదియె శీనుడు మాత్రమె పల్కు నిట్టులన్ వ్యాఘ్రమనన్ బిడాలకమటంచు దలంచి వచించె నివ్విధిన్ వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్.
వ్యాఘ్రమెదురైన తరుణముశీఘ్రమె పరువెత్తునల్ప జీవులు, మెడలోవ్యాఘ్రనఖము గల పురుషవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్వ్యాఘ్రము క్రూరజంతువని భద్రతకై తపియించు చుందురేశీఘ్రమె పర్వుదీయుదురు క్షేమముగాతమ యిల్లు జేరగావ్యాఘ్రనఖంబు కంఠమున భాసిల భీరుకమందు పూరుషవ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్
వ్యాఘ్రము జింకగ ,జింకనువ్యాఘ్రంబుగమార్చెమునులు వైచిత్ర్యముగావ్యాఘ్రము గతమెట్లుమరచు?వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వ్యాఘ్రమును గనిన హరిణముశీఘ్రముగా కర్దమమునఁ జిందాడుచు తానుగ్రఁపు రూపముఁ దాల్చఁగవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
ఉగ్రఁపు రూపు దాల్చెనొక యుబ్బలిలో పడి యేణమత్తరిన్వ్యాఘ్రమరణ్యమందు నడయాడుచు దానిని గాంచి నంతనేవ్యగ్రతనొందె క్రూరమృగమంచు మదిన్దలబోసి, చెచ్చెరన్వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్
కం:శీఘ్రముగ వెంబడించగవ్యాఘ్రంబొక జింకనుఁ గని , పాఱె భయమునన్వ్యాఘ్రము తినునని యన్నియువ్యాఘ్ర మ్మొక జింక తోనే యాకలి బాసెన్
కం॥ వ్యాఘ్రము హరిణమునుఁ గనఁగశీఘ్రమె చేరెను దునిమి భుజించఁగ నంతేశీఘ్రముగఁ చేర మందయెవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్ఉ॥ వ్యాఘ్రము మాంసమున్ దినెడి ప్రాణియె శాకములన్ భుజించదేవ్యాఘ్రము, జింక కన్పడఁగ భవ్యమటంచును దల్చుఁ జంపగన్శీఘ్రము మంద చేరఁగను జింకకు సాయముఁ గాంచ నెంచుచున్వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబున దా వడంకుచున్(మొదట ఒక జింకనే చూచిందండి, దానిని వెంబడించే లోపే చాల వచ్చి చేరినాయని అండి)
వ్యాఘ్రము మెస వియు కలుషిత మా ఘ్రా ణి o ప o గ దగని యాహా రంబు న్ వ్యా ఘ్ర ము మతి చలి యింపగవ్యాఘ్రo బొక జింకను గని పారె భయము నన్
ఈ ఘ్ర మతిఘ్నప్రాస నొక పృచ్ఛకుఁ డీయ, వధాని యొండు తాజిఘ్రదవార్యకావ్యవిదుషీపరిహాసపరాజితుండుగాన్శీఘ్రత వీడె నా సభను చిన్నసమస్యను ౙూచి తత్కవివ్యాఘ్ర మొకండు జింకఁ గని పారె భయంబునఁ దా వడంకుౘున్ !ఈ ఘ్ర ప్రాస తోడి సమస్య యే జింక. కవివ్యాఘ్రము అనుట ఎద్దేవ.
మోఘమ్ములు గాఁగ నుపాయౌఘమ్ములు నెల్ల నంత నభ్రము నందున్ మేఘములు గ్రమ్మఁగ శశవ్యాఘ్రం బొక జింకనుఁ గని పాఱె భయమునన్ శీఘ్రముగాఁ జరించి నరసింహుఁ డరణ్య తటమ్ము నందు వైయాఘ్ర విహార తత్పరత నారసి యచ్చట నొక్క మృత్తికోజ్జిఘ్ర మృగమ్మునుం జిఱుత చెన్ను దలంపఁగ నంత గోముఖవ్యాఘ్ర మొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్
కందం
రిప్లయితొలగించండిశీఘ్రమె వనంబు దాటగ
జిఘ్రుడు పరుగున నడచుచు చేరి, మలుపు నం
దాఘ్రాణించుచు దూకఁగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని, పాఱె భయమునన్
ఉత్పలమాల
వ్యాఘ్రభయంబునన్ జనుఁడు బాటను దప్పక జాగరూకతన్
శీఘ్రమె దాట నయ్యడవిఁ జేరుచు సాగెడు వేళ మల్పునన్
జిఘ్రుడు భీతితో నిలచి చేష్టలు మాని క్షణంబు, దూకగన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని, పాఱె భయంబునఁ దా వడంకుచున్
శీఘ్రముగ నడచు చుండగ
రిప్లయితొలగించండిఅంఘ్రికడ నొక శిలినిగని యడుగు తడబడన్
శీఘ్రముగ గెంటుట గనగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
రిప్లయితొలగించండివ్యాఘ్రాసనమే వ్యాఘ్రము
వ్యాఘ్రమనగ పిల్లి యనుచు భావన తోడన్
వ్యాఘ్రేయము గ్రోలి పలికె
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్.
వ్యాఘ్రము గాంచినన్ సకల ప్రాణులు భీతిలి పారు గాదుటే
శీఘ్రగతిన్ నిజమ్మిదియె శీనుడు మాత్రమె పల్కు నిట్టులన్
వ్యాఘ్రమనన్ బిడాలకమటంచు దలంచి వచించె నివ్విధిన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్.
వ్యాఘ్రమెదురైన తరుణము
రిప్లయితొలగించండిశీఘ్రమె పరువెత్తునల్ప జీవులు, మెడలో
వ్యాఘ్రనఖము గల పురుష
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
వ్యాఘ్రము క్రూరజంతువని భద్రతకై తపియించు చుందురే
శీఘ్రమె పర్వుదీయుదురు క్షేమముగాతమ యిల్లు జేరగా
వ్యాఘ్రనఖంబు కంఠమున భాసిల భీరుకమందు పూరుష
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్
వ్యాఘ్రము జింకగ ,జింకను
రిప్లయితొలగించండివ్యాఘ్రంబుగమార్చెమునులు వైచిత్ర్యముగా
వ్యాఘ్రము గతమెట్లుమరచు?
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివ్యాఘ్రమును గనిన హరిణము
రిప్లయితొలగించండిశీఘ్రముగా కర్దమమునఁ జిందాడుచు తా
నుగ్రఁపు రూపముఁ దాల్చఁగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
ఉగ్రఁపు రూపు దాల్చెనొక యుబ్బలిలో పడి యేణమత్తరిన్
రిప్లయితొలగించండివ్యాఘ్రమరణ్యమందు నడయాడుచు దానిని గాంచి నంతనే
వ్యగ్రతనొందె క్రూరమృగమంచు మదిన్దలబోసి, చెచ్చెరన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్
కం:శీఘ్రముగ వెంబడించగ
రిప్లయితొలగించండివ్యాఘ్రంబొక జింకనుఁ గని , పాఱె భయమునన్
వ్యాఘ్రము తినునని యన్నియు
వ్యాఘ్ర మ్మొక జింక తోనే యాకలి బాసెన్
కం॥ వ్యాఘ్రము హరిణమునుఁ గనఁగ
రిప్లయితొలగించండిశీఘ్రమె చేరెను దునిమి భుజించఁగ నంతే
శీఘ్రముగఁ చేర మందయె
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
ఉ॥ వ్యాఘ్రము మాంసమున్ దినెడి ప్రాణియె శాకములన్ భుజించదే
వ్యాఘ్రము, జింక కన్పడఁగ భవ్యమటంచును దల్చుఁ జంపగన్
శీఘ్రము మంద చేరఁగను జింకకు సాయముఁ గాంచ నెంచుచున్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబున దా వడంకుచున్
(మొదట ఒక జింకనే చూచిందండి, దానిని వెంబడించే లోపే చాల వచ్చి చేరినాయని అండి)
వ్యాఘ్రము మెస వియు కలుషిత
రిప్లయితొలగించండిమా ఘ్రా ణి o ప o గ దగని యాహా రంబు న్
వ్యా ఘ్ర ము మతి చలి యింపగ
వ్యాఘ్రo బొక జింకను గని పారె భయము నన్
ఈ ఘ్ర మతిఘ్నప్రాస నొక పృచ్ఛకుఁ డీయ, వధాని యొండు తా
రిప్లయితొలగించండిజిఘ్రదవార్యకావ్యవిదుషీపరిహాసపరాజితుండుగాన్
శీఘ్రత వీడె నా సభను చిన్నసమస్యను ౙూచి తత్కవి
వ్యాఘ్ర మొకండు జింకఁ గని పారె భయంబునఁ దా వడంకుౘున్ !
ఈ ఘ్ర ప్రాస తోడి సమస్య యే జింక. కవివ్యాఘ్రము అనుట ఎద్దేవ.
మోఘమ్ములు గాఁగ నుపా
రిప్లయితొలగించండియౌఘమ్ములు నెల్ల నంత నభ్రము నందున్
మేఘములు గ్రమ్మఁగ శశ
వ్యాఘ్రం బొక జింకనుఁ గని పాఱె భయమునన్
శీఘ్రముగాఁ జరించి నరసింహుఁ డరణ్య తటమ్ము నందు వై
యాఘ్ర విహార తత్పరత నారసి యచ్చట నొక్క మృత్తికో
జ్జిఘ్ర మృగమ్మునుం జిఱుత చెన్ను దలంపఁగ నంత గోముఖ
వ్యాఘ్ర మొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్