కం:విరస మ్మిష్టమె కానీ విరసం లో వచన కవిత వెగటౌ నాకున్ విరసం లో నుండు నొక క వి రసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్” (విరసం=విప్లవరచయితల సంఘం.నాకు దాని భావాలు ఇష్టమే కానీ దానిలో వచనకవితలు నచ్చవు.దానిలో ఒక కవి పద్యం లో రసాన్ని ఒలికితే అది నచ్చింది.)
చం:"సిరిసిరి మువ్వ" యంచు ,దన చేతికి ఛందము గొప్ప కాదటం, చురుకగ జేసె బద్యము మహోన్నతశైలిని శ్రీనివాస రా వరుదుగ నొక్క మారు, తన హాస్యము నెల్లను విస్తుబోవగా విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై” (శ్రీరంగం శ్రీనివాస రావు సిరిసిల్ల మువ్వ పేరుతో అద్భుత మైన పద్యాలు వ్రాసి తనకు ఛందస్సులో వ్రాయటం గొప్ప విషయం కాదని నిరూపించాడు. ఆ హాస్య శైలికి విరసం అనగా విప్లవ రచయితల సంఘమే విస్తు పోగా పండితులకీ ప్రీతిపాత్ర మైంది.)
కందం
రిప్లయితొలగించండిసురమౌని కలహచింతను
మురహరి పై సత్య యలిగి పోరుకు దిగెడున్
వరుసను తిమ్మన కృతియౌ
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్
చంపకమాల
మురహరి రుక్మిణీ సతికి పువ్వునొసంగె నటన్న వార్తతో
సురముని సత్యకున్ హరికి చోద్యము గొల్పెడు కయ్యమెంచెడున్
వరుసన తిమ్మనార్యులొక భావన కావ్యము గూర్చినంతటన్
విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై
చ.
రిప్లయితొలగించండిపరమ కవిత్వ సిద్ధికర భాసిత శుక్ల శుభాంచితాగ్ర కుం
దరదన నా పయోజభవు దార్కొను భామ మదిం దలంప శ్రీ
వరమయి కావ్య లక్షణము వాలయి పారెను గూర్చె బుద్ధి ద్ర
వ్వి రసమె, పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై !
కరకుగ పలికితి వీరీతి
రిప్లయితొలగించండివిరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్” ?
అరయక పలుకకు , నిజముగ
సరసమె పద్యములకొసగు సౌరభమెపుడున్
రిప్లయితొలగించండివిరి రుక్మిణి కొసగె ననుచు
పరిచారిక తెల్ప సత్య భామయె కినుకన్
మురహరి పై తా జూపిన
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్.
మురహరి పారిజాతమును పూషణి రుక్మిణి కిచ్చె నంచు నా
వరవట జేరిచెప్పగనె భామయె కోపము వ్రేటు వడ్డ దీ
ర్ఘరసన మట్లు రేగుతరి కన్నులు నిప్పులు రాల్చు నత్తరిన్
విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై.
పరవశమిడు కావ్యములో
రిప్లయితొలగించండినిరసించెనుగద వరూధినిని బ్రవరుండే
మరియా మనుచరితంబున
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్
పరవశమొప్పగా గెలుచు పాఠకు లెల్లరి మానసంబులన్
సరసముగా వరూధినియె సంగముఁ గోరుచు తాను బల్కినన్
నిరసన చూపినాడకట! నిశ్చలుడై ప్రవరుండు భామపై
విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై
స్థిరమగు కొల్వు చిక్కినను చెంతన భార్యయు లేక నొక్కడున్
రిప్లయితొలగించండిమరిమరి బాధనొందుచును మన్మథ వేదన నాపలేక తా
విరహపు కైతలల్లి కడు వేదన తోడుత పాడుచుండ *తా
వి *రసమె పద్యమందొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతి పాత్రమై
సరస కవిత్వ పాండితికి చందనమద్దిన రీతి తేనలూ
రిప్లయితొలగించండిరి రసన పైన వాలు క్రియ రేగిన కోర్కెలె కావ్య రాజమై
సురుచిర పుష్ప బాణమగు సుందరి వర్ణనఁ జేయ నింతి మో
వి రసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై!!
పరిపూర్ణమౌను కైతలు
రిప్లయితొలగించండికరుణాది నవరసములను కలబోయంగన్
మరికొండొకచో పరిమిత
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్
కం:విరస మ్మిష్టమె కానీ
రిప్లయితొలగించండివిరసం లో వచన కవిత వెగటౌ నాకున్
విరసం లో నుండు నొక క
వి రసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్”
(విరసం=విప్లవరచయితల సంఘం.నాకు దాని భావాలు ఇష్టమే కానీ దానిలో వచనకవితలు నచ్చవు.దానిలో ఒక కవి పద్యం లో రసాన్ని ఒలికితే అది నచ్చింది.)
చం:"సిరిసిరి మువ్వ" యంచు ,దన చేతికి ఛందము గొప్ప కాదటం,
రిప్లయితొలగించండిచురుకగ జేసె బద్యము మహోన్నతశైలిని శ్రీనివాస రా
వరుదుగ నొక్క మారు, తన హాస్యము నెల్లను విస్తుబోవగా
విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై”
(శ్రీరంగం శ్రీనివాస రావు సిరిసిల్ల మువ్వ పేరుతో అద్భుత మైన పద్యాలు వ్రాసి తనకు ఛందస్సులో వ్రాయటం గొప్ప విషయం కాదని నిరూపించాడు. ఆ హాస్య శైలికి విరసం అనగా విప్లవ రచయితల సంఘమే విస్తు పోగా పండితులకీ ప్రీతిపాత్ర మైంది.)
సరసము మించగ విరసము
రిప్లయితొలగించండినిరవ ధి కము చేర్చి కవులు నేర్పరు లగుచున్
కర మను రాగము నిండగ
విరసము పద్యమున నొ లు క వేడుక గూర్చు న్
పరమాద్భుత రీతిని నా
రిప్లయితొలగించండిసరసపుఁ బద్యమ్ము నందు శబ్దములం దా
వరుసలు మార్చి చదివినన్
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్
నరవర యేమి చెప్పుదు వినంగ వలెన్ వచియింప శక్యమే
సురుచిర శబ్ద సంచయ సు శోభిత భంగినిఁ గావ్య లోక మం
దు రుచిరమై వెలుంగఁగ మనోహర రీతి రచింపఁ గావ్యమున్
సరసకుఁ జేరి కోమలికి సత్కవి తా నధరామృతమ్ము ద్రా
వి రసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను బ్రీతిపాత్రమై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సరసము లాడుచు తరుణుల
విరహమ్మును వెడలజేసి వేదన తొలగన్
మురియుచు తరుణులను గని క
వి రసమె పద్యమున నొలుక వేడుకగూర్చెన్.